Jump to content
sonykongara

APSRTC Parcel Service

Recommended Posts

 

పార్శిల్స్‌ ఇంటికే చేర్చాలి

 

 

 

 

  • డిపో వరకే పరిమితమైతే కష్టం
  • ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర రవాణ సంస్థ (ఏపీఎస్పార్టీసీ)ను నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు ప్రారంభించిన పార్శిల్‌ సేవలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం డిపోల వరకే పరిమితమైన సేవలను వినియోగదారుడి ఇంటి వరకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. మూడు నెలల క్రితం ఆర్టీసీలో ప్రవేశ పెట్టిన కొరియర్‌, పార్శిల్‌ సేవలు సామాన్యుడి చెంతకు ఎలా చేరుతున్నాయన్న అంశంపై బుధవారం ఆయన విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో సమీక్షించారు. ‘‘మన పార్శిల్‌ సేవలు డిపో వరకే పరిమితం అవుతున్నాయి. ఇలా అయితే వినియోగదారులను ఆకర్షించడం కష్టం. సరుకులను నేరుగా వినియోగదారుడి ఇంటికే చేర్చగలిగినప్పుడే సామాన్యుడి నుంచి మంచి స్పందన వస్తుంది’’ అని అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, జీపీఎస్‌ వ్యవస్థ ద్వారాకార్గో వాహనాలను ట్రాక్‌ చేయాలని ఆదేశించారు. విశాఖప ట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ప్ర యోగాత్మకంగా త్వరలో ట్రాకింగ్‌ విధానాన్ని ప్రారంభించాలన్నారు. </p>

Eeyana Dgp ga

Share this post


Link to post
Share on other sites

ప్రజలందరికీ పార్శిల్‌ సేవలు

ఆర్టీసీ ఆర్‌ఎం ఆదాంసాహెబ్‌

pks-gen6a.jpg

కర్నూలురోడ్డు, న్యూస్‌టుడే: ఏపీఎస్‌ ఆర్టీసీ కొరియర్‌, పార్శిల్‌ సేవలు ప్రజలందరికీ చేరువయ్యేందుకు అన్నీ చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌.ఎం. ఆదాంసాహెబ్‌ అన్నారు. చౌకగా, వేగంగా అన్న నినాదంతో ఏపీఎస్‌ ఆర్టీసీ తరపున మూడు నెలల కిందట పార్శిల్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. బుధవారం ఒంగోలుతోపాటు జిల్లాలోని పర్చూరు, కందుకూరు, కనిగిరి తదితర ప్రాంతాల ఏటీబీ (ఆంధ్రప్రదేశ్‌ టిక్కెట్‌ బుకింగ్‌)ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరియర్‌ కవర్లు, ఇతర పార్శిళ్లను తక్కువ ఛార్జీతో ఆర్టీసీ బస్సుల ద్వారా వాటి గమ్యాలకు చేరవేయడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేమని వివరించారు. ప్రైవేటు పార్శిల్‌ సంస్థలతో పోల్చితే అతి తక్కువ ఛార్జీతో కవర్లు, ఇతర వస్తువులను ఆర్టీసీ 24 గంటల్లోనే చేరవేస్తుందని.. ఏజెంట్లంతా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తమవంతు సహకారం అందించాలని కోరారు. విజయవాడ పరిధిలో హోమ్‌ డెలివరీ పథకం ద్వారా పార్శిళ్లను నేరుగా ఇంటికే చేరవేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోనూత్వరలోనే హోమ్‌ డెలివరీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉదాహరణకు 50 కి.మీ. దూరానికి 20 కిలోల పార్శిల్‌కు రూ.30, 50 కిలోలపు రూ.50 చొప్పున వసూలు చేస్తామన్నారు. దూరం, పార్శిల్‌ బరువు ఆధారంగా ఛార్జీలు ఉంటాయని వివరించారు. పార్శిళ్లే కాకుండా బస్సు డిక్కీలపైనా 750 కిలోల పరిమితి మేరకు లగేజీలు వేసుకోవచ్చన్నారు.

నేడు వ్యాపారులతో సమావేశం

పథకంలో అందరినీ మమేకం చేసే ఉద్దేశంతో గురువారం ఉదయం వ్యాపారులతోనూ సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అన్ని రకాల వ్యాపారులు పాల్గొనవచ్చన్నారు.

Share this post


Link to post
Share on other sites
తక్కువ ఛార్జీలకు పార్శిల్‌, కొరియర్‌ సర్వీస్‌
13-08-2017 09:13:05
 
636382123835562066.jpg
  • ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఈడీ వెంకటేశ్వరరావు
 
విజయవాడ : ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు, ప్రజలకు తక్కువ ఛార్జీలతో వివిధ రకాల సరుకులు, కవర్లను ఆర్టీసీ పార్శిల్‌ కొరియర్‌ సర్వీస్‌ ద్వారా రవాణా చేస్తుందని ఆ సంస్థ విజయవాడ జోన్‌ ఈడీ ఎన్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలో రాజీవ్‌గాంధి హోల్‌సేల్‌ మార్కెట్‌లో రెండు బ్రాంచ్‌లు, ఆటోనగర్‌లో ఒక బ్రాంచ్‌, విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఆవరణంలో ఒక నూతన కార్యాలయాన్ని ఇడి ఎన్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం పి.వి.రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీఎన్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా రవాణాలో అగ్రగామి సంస్థయైున ఎపిఎస్‌ ఆర్టీసీ ఇప్పుడు తక్కువ చార్జిలకు సరుకులు, కొరియర్‌ రవాణాతో ప్రముఖ పాత్ర వహించబోతోందని అన్నారు. పార్శిల్స్‌, కవర్లు, వివిధ రకములైన సరుకులను అత్యంత పదిలంగా అతితక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుందని తెలిపారు. పార్శిల్‌ రవాణాకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఉచిత బీమా సౌకర్యము కూడా కలదని, కాంట్రాక్ట్‌ పద్ధతిపై సూపర్‌ లగ్జరీ బస్సుల డిక్కీలు ఎసి బస్సులలో దిగువన గల లగేజి కంపార్ట్‌మెంట్లు, హైర్‌బస్సులు, తెలుగు, వెలుగు బస్సుల టాపులు సరుకురవాణాకు లీజుకు ఇవ్వనున్నట్టు ఈడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపివి.రామారావుతో పాటు ఇడి (కమర్షియల్‌) ఆర్‌.శశిధర్‌, సీటీఎం (కార్గో), గోపినాథ్‌రెడ్డి, డీసీటీఎంలు నాగేంద్రప్రసాద్‌, మూర్తి, శ్రీరాములు, కార్గో ఏటీఎం అనగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites
పార్శిల్స్‌ ద్వారా ఆర్టీసీకి రూ.25 కోట్ల ఆదాయం
15-08-2017 03:39:09
 
రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 14: ఏపీఎ్‌సఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన పార్శిల్స్‌ వ్యవస్థ ద్వారా ఏడాదిలోనే రూ.25కోట్ల ఆదాయం ఆర్జించిందని ఆర్టీసీ కమర్షియల్‌ అండ్‌ ప్రాజెక్ట్సు ఈడీ శశిధర్‌ వెల్లడించారు. ఏఎన్‌ఎల్‌ పార్శిల్‌ సర్వీసు పదివేల బస్సులతో ఏడాదికి రూ.9 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తే, ఆర్టీసీ కేవలం 2వేల బస్సులతోనే రూ.25కోట్లు ఆదాయం రాబట్టి ఘనత సాధించిందన్నారు. తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోని పార్శిల్స్‌ విభాగాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పార్శిల్స్‌ వ్యవస్థను కార్పొరేట్‌ స్థాయిలో మరింత అభివృద్థి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Share this post


Link to post
Share on other sites
కారు చౌక కొరియర్‌!
 
 
  • రాష్ట్రం బయటికి విస్తరించిన ఆర్టీసీ పార్శిల్‌
  • కవర్‌ రూ.20, కిలో పార్శిల్‌ రూ.60.. 25 కిలోలు రూ.160
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘కాకినాడ కాజా కర్నూలుకు పంపాలా?.. అనంతపురం ఓళిగ అనకాపల్లికి చేర్చాలా?.. దీపావళి పండగకు బంధువులు, ఆత్మీయులకు స్వీట్లు పంపాలంటే ఆర్టీసీ పార్శిల్‌కు ఇవ్వండి. రాష్ట్రంలో ఎక్కడికైనా కిలో బరువు కేవలం రూ.60కే అందజేస్తాం’ అని ఏపీఎస్ ఆర్టీసీ పార్శిల్‌ సర్వీస్‌ ఆఫర్‌ ఇస్తోంది. ప్రైవేటు కొరియర్‌ కన్నా తక్కువ చార్జీ వసూలు చేస్తూ పార్శిల్‌ను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుస్తామని చెబుతోంది. నష్టాల బాటలో నడవలేక ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ... గత ఏడాది జూన్‌లో పార్శిల్‌ అండ్‌ కొరియర్‌ సర్వీస్ ను ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ టర్నోవర్‌ రూ.కోట్లలోకి చేరుకుంది. ఎండీ మాలకొండయ్య ఇటీవల వరుస సమీక్షలు చేపట్టారు. గత నెల వరకూ ఉన్న సేవల పరిధిని విస్తరించి స్వల్పంగా రేట్లను సర్దుబాటు చేసింది. గత ఏడాది జూన్‌లో నిర్ణయించిన రేట్ల ప్రకారం 25 కిలోల బరువున్న పార్శిల్‌ 50 కిలోమీటర్లకు రూ.30... 100 కిలోమీటర్ల వరకూ రూ.35 వసూలు చేసేవారు.
 
అదే బరువున్న పార్శిల్‌ను 300 కిలోమీటర్ల వరకూ రూ.65 వసూలు చేస్తే ఆపైన ఎంత దూరమైనా రూ.80 చార్జి చేసేవారు. తాజాగా సవరించిన ధరల ప్రకారం 301 నుంచి 400 కిలోమీటర్ల వరకూ రూ.80... ఆపై ప్రతి వంద కిలోమీటర్ల దూరం పెరిగే కొద్దీ రూ.10చొప్పన పెంచారు. చివరికి ఎంత దూరమైనా రూ.160 గరిష్టంగా నిర్ణయించారు.
 
ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. అదే యాభై కిలోల బరువుంటే ప్రారంభ ధర రూ.50, 300 కిలోమీటర్ల వరకూ రూ.120, గరిష్ఠంగా రూ.220 వరకూ వసూలు చేయాలని నిర్ణయించారు. పాత ధరల ప్రకారం 25 కిలోల పార్శిల్‌ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి చేర్చాలన్నా రూ.80 మాత్ర మే వసూలు చేసే ఆర్టీసీ... ఇప్పుడు రెండింతలు చేసింది.
 
యాభై కిలోల పార్శిల్‌ను రూ.150కే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ తీసుకెళ్లే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీస్‌... ఇప్పుడు రూ.220 చెల్లించాలంటోంది. అయితే 100గ్రామలు లోపు బరువున్న కవర్‌ను రాష్ట్రంలో ఎక్కడికైనా కేవలం రూ.20తో చేరుస్తామని, ఈ ధర ఇతర ఏ కొరియర్‌లోనూ లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు ధీమాగా చెబుతున్నారు. కిలో బరువున్న కొరియర్‌ను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ కేవలం రూ.60తో చేర్చేది తమ ఆర్టీసీ మాత్రమేనని చెబుతున్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.
 
అందుకోవాలిగా...
ఆర్టీసీలో ధరలు తక్కువగా ఉన్నా ఎవరి పేరుతో పార్శిల్‌ వస్తుందో వారే బస్టాండుకు వెళ్లి అందుకోవడం ఇబ్బందికరంగా ఉందని ఇప్పటికే పార్శిల్‌ పంపిన వారు చెబుతున్నారు. ప్రైవేటు కొరియర్‌ రేటు ఎక్కువైనా... ఇంటికి లేదా ఆఫీసుకు తెచ్చి ఇస్తారని, సంబంధిత వ్యక్తి లేకుంటే ఫోన్‌ చేసి అందజేస్తారని చెబుతున్నారు. కానీ, ఆర్టీసీలో సకాలంలో కవర్లు చేతికి చేరడంలేదని, ఎక్కడుందో చెప్పాలని ఫోన్‌ చేస్తే సరైన సమాధానం రావడం లేదంటున్నారు. ఈ విషయాల్లో పనితీరును మెరుగుపర్చుకోవాలని కస్టమర్లు సూచిస్తున్నారు.

Share this post


Link to post
Share on other sites
ఆర్టీసీకి పార్శిల్‌ ఆదాయం రోజుకు రూ.లక్ష
15-01-2018 10:59:47
 
636516107875925154.jpg
కడప మారుతీనగర్‌, జనవరి 14: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థకు పార్శిల్‌ రవాణా ఆదాయపరంగా ఊతమిస్తోంది. జిల్లాలో పార్శిల్‌ రవాణా ద్వారా రోజుకు లక్ష రూపాయల మేరకు ఆదాయం సమకూరుతోంది. ఆర్టీసీ మనుగడకు మూలస్తంభాల్లాంటి కార్మికులు ఎంత కష్టపడి సేవలందిస్తున్నా కూడా నష్టాల ఊబి నుంచి బయట పడడంలేదు. కడప రీజియన్‌ పరిధిలో మిగతా అన్ని డిపోలు నష్టాల్లో నడుస్తున్నా ఒక్క కడప డిపో మాత్రమే లాభాల దిశగా పయనిస్తూ ఇతర డిపోలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు పార్శిల్‌ రవాణా ఆదాయవనరుగా నిలుస్తోంది. ఏవైనా వస్తువులు, కాయగూరలు, పండ్లు పూలు తదితర అనుమతి ఉన్న సరుకులు త్వరితగతిన జిల్లాలోని ఇతర మండలాలకే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, రాష్ట్రేతర ప్రాంతాలకు కూడా బస్సుల ద్వారా పార్శిల్‌ చేసుకునే సౌలభ్యాన్ని సంస్థ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా పార్శిల్స్‌ సేవలు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అందేవి. ఆదాయాన్ని గుర్తించిన ఆర్టీసీ 2016 జూన్‌ నుంచి స్వయంగా తమంతట తామే కార్గో సర్వీస్‌ పేరుతో పార్శిల్స్‌ వివిధ ప్రాంతాలకు పంపిస్తూ సేవలందిస్తోంది. పార్శిల్స్‌ ద్వారా రవాణా అయ్యే ప్రతి వస్తువును ముందస్తుగా రిజిస్టరులో రాసిపెడతారు. అలాగే అది ఏ బస్సులో రవాణా అవుతున్నదీ, ఏ సమయంలో చేరనున్నదీ, ప్రస్తుతం ఆ బస్సు ఎక్కడ నడుస్తుందనే విషయాలను జీపీఎస్‌ విధానం ద్వారా సరుకు పార్శిల్‌ చేసిన వ్యక్తి, దాన్ని తీసుకోబోయే వ్యక్తికి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంది.
 
రోజుకు లక్ష పై చిలుకు రాబడి
ఏదిఏమైనా నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి పార్శిల్స్‌ రవాణా ద్వారా వచ్చే రాబడి ఊరట కలిగిస్తోంది. కడప రీజియన్‌ పరిధిలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, బద్వేలు డిపోల పరిధిలో గల పార్శిల్స్‌ విభాగాల నుంచి రోజుకు లక్ష పైచిలుకు రాబడి వస్తోంది. దీన్ని మరింత విస్తరింపజేసే క్రమంలో ప్రతి మండలాల వద్ద కూడా పార్శిల్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రెట్టింపు రాబడిని గడించేందుకు ఆర్టీసీ సన్నాహాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. సంస్థకు ముందస్తుగా ఐదు వేల రూపాయలను డిపాజిట్‌ చేసిన వారిని ప్రైవేటు ఏజంట్లుగా ఆర్టీసీ అధికారులు చేర్చుకుంటున్నట్లు తెలిసింది. ఈనెల చివరి నాటికి అన్ని మండలాల్లో పార్శిల్స్‌ సేవలు విస్తరింపజేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.
 
 
బస్సు డిక్కీలు సైతం రవాణాకు సిద్ధ్దం
సీజనల్‌ వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు తాము పంపించే పండ్లు, పూలు, కూరగాయలను ఆర్టీసీ బస్సుల డిక్కీలలో కూడా పంపించాలనేకునే వెసులుబాటు అధికారులు కల్పిస్తున్నారు. కిలోమీటరుకు 3.50 రూపాయలు చొప్పున కడప నుంచి జిల్లాకే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలైన హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు కూడా పంపించాలనుకునే వెసులుబాటు ఉంది. నెలవారీగా రెండు నెలలు మూడు నెలలకు కూడా డిక్కీల్లో పంపించాలనుకునే అవకాశాలు కల్పిస్తోంది.
 
ఇప్పటికే రూ. 1.40 కోట్లు
కార్గో పేరుతో ఆర్టీసీ స్వయంగా పార్శిల్స్‌ రవాణా చేయడం ద్వారా 2017 ఏప్రిల్‌ నెల నుంచి డిసెంబరు వరి నాటికి కోటీ 40 లక్షల రూపాయలు ఆదాయం పొందినట్టు అధికారుల ద్వారా సమాచారం అందింది. ఏది ఏమైనా బస్సుల ద్వారా వస్తువుల పార్శిల్స్‌ రవాణాపై అధికారులు మరింత శ్రద్ధ చూపితే సంస్థ ఆదాయం గణనీయంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. మరి ఆ దిశగా అధికారులు వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలరని ఆశిద్దాం.
 
పారదర్శకంగా పార్శిల్స్‌ సేవలు
వినియోగదారుడికి నాణ్యమైన సేవలను అందించి తద్వారా ఆర్టీసీ రవాణా పట్ల మరింతగా ఆకర్షితులయ్యేలా పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అంకితబావంతో పనిచేస్తాం.
కృష్ణమూర్తి, పార్శిల్‌ విభాగం ఏటీఎం

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×