Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply

ఉచిత వైద్య సేవలకు రారండోయ్‌!

ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి

పట్టణ ఆరోగ్య కేంద్రాలు

పైసా చెల్లించకుండానే 27 వైద్య పరీక్షలు

ఆధార్‌ చూపితే చాలు చికిత్స

ఆసుపత్రిలో వైద్యుడు, నిపుణుల ద్వారా టెలిమెడిసన్‌ సేవలు

ఈనాడు - అమరావతి

11ap-main7a.jpg

‘అమ్మో... ప్రభుత్వాసుపత్రా?.. అక్కడికెళితే అంతే...’’ ఎక్కువమంది ప్రజల్లో గూడుకట్టుకున్న గట్టి అభిప్రాయమిది. సదుపాయాలుండవని, వైద్యులుండరని, తగిన చికిత్స అందదని చాలామంది భావన. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు కానీ... ‘ప్రభుత్వ...’ అనగానే వెనకడుగు వేయాల్సిన పనిలేదు. రోగుల సేవ కోసమే ఎదురుచూసే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అవే ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ఇక్కడ రోగికి కావలసిన ప్రాథమిక చికిత్స సదుపాయాలు ఉన్నా, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నా ప్రజలు వాటిని అంతగా వినియోగించుకోలేని పరిస్థితి. ఆరోగ్య కేంద్రాల గురించి ప్రభుత్వపరంగా సరైన ప్రచారం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మురికివాడల సమీపంలో 222 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎంబీబీఎసీ వైద్యుడు ఉంటారు. టెలి మెడిసిన్‌ సౌకర్యం లభిస్తోంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రాల్లో ఉచితంగా షుగర్‌, బీపీ సహా 27 రకాల రక్త పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే వ్యాక్సినేషన్ల సౌకర్యం ఇక్కడా అందుబాటులో ఉంది. మందులూ ఉచితంగా ఇస్తారు. సాధారణ ఆస్పత్రుల మాదిరిగా కాకుండా ఇవి శుభ్రంగానే ఉన్నాయి. ఆధార్‌ కార్డు చూపించి ఇక్కడ వైద్య సేవల్ని పొందొచ్చు. నిర్వాహకులు ఇచ్చే ఐడీ నెంబరుతో రాష్ట్రంలోని ఏ కేంద్రం నుంచయినా రోగులు సేవలు పొందవచ్చు. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.8.80 కోట్లు చొప్పున ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది.

టెలీమెడిసిన్‌ ద్వారా సలహాలు...

రోగుల అవసరాలను అనుసరించి ఈ కేంద్రంలోని ఎంబీబీఎస్‌ వైద్యుడు... హైదరాబాదులోని ఆర్థోఫెడిక్‌, కార్డియాలజిస్ట్‌, జనరల్‌ మెడిసిన్‌, ఎండోక్రానాలజీ వైద్యులను టెలీమెడిసిన్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. రోగులు, వైద్య నిపుణుల మధ్య ఆరోగ్య కేంద్ర వైద్యుడు సమన్వయం చేస్తుంటారు. నిపుణులను ఇచ్చే సలహాల్ని అనుసరించి మందులను రాసిస్తున్నారు. నిపుణులు తీరికలేకుండా ఉంటే మాత్రం రోగులకు నిరీక్షణ తప్పటంలేదు. సాధారణంగా ప్రతి రోగికి సుమారు 20 నుంచి 30 నిమిషాల వరకు సమయం పడుతుంది.

2000లో మొదలై...

మురికివాడల్లోని పేదలకు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2000 సంవత్సరంలో అన్ని పురపాలక సంఘాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్ని ఏర్పాటుచేసింది. వీటి నిర్వాహణ బాధత్యల్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పి 2016 ఆగస్టు వరకు నిర్వహించింది. ఇటీవల వీటిని ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు టెండర్ల ద్వారా ఎంపికచేసిన అపోలోకు 9 జిల్లాల్లో కలిపి 166, ఈవైద్య ధనుష్‌ సంస్థకు 58 కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు దశల వారీగా 222 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి. వీటి నిర్వహణ కోసం అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. సుమారు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులోనే రోగుల వెయిటింగ్‌ హాలుకు ఏసీ సౌకర్యాన్ని నిర్వాహకులు కల్పించాలి.

వైద్యసేవలపై పర్యవేక్షణ ఉండాలి...

ఒక్కో ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వం నెలకు రూ.4లక్షల వరకు వెచ్చిస్తోంది. రోగులకు ఉచిత మందుల కోసం మూడునెలలకు కలిపి ప్రభుత్వం అదనంగా రూ.1.5 లక్షల వరకు వ్యయంచేస్తోంది. ఇందులో ఎంబీబీఎస్‌ వైద్యుడు, ఇద్దరు ఎ.ఎన్‌.ఎం.లు, ఒక టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పనిచేస్తుంటారు. ఖర్చుకు తగ్గట్లు ప్రజలకు ఆరోగ్య కేంద్రాల సేవలు అందుతున్నాయా? ఎంతమంది రోగులకు ఉచిత రక్త పరీక్షలను నిర్వహిస్తున్నారు? ఎంతమంది టెలీమెడిసిన్‌ విధానం ద్వారా వైద్య సేవలు పొందుతున్నారన్న దానిపైనా ప్రభుత్వపరంగా నిశిత పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

రోజుకు ఎంతమంది రోగుల్ని చూస్తున్నారు..

కొన్ని కేంద్రాల్లో రోజుకి 30 మంది రోగులు రావడం కష్టమైపోతోంది. విజయవాడ నగర బొడ్డున గిరిపురం కేంద్రంలో మాత్రం 50 నుంచి ఆరవై మంది రోగులు మాత్రమే వైద్య సేవలు పొందుతున్నారు. మరికొన్ని కేంద్రాల్లో సాయంత్రం పూట వచ్చేరోగుల సంఖ్య మరీ తక్కువగా ఉంది. 30 మంది రోగులు వస్తే వైద్యుల సలహాల్ని అనుసరించి కనీసం పది, 15 మందికి రక్త పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 27 రకాల రక్త పరీక్షలను చేస్తే మాత్రం రోగికి రూ.3000 ఆర్థికభారం తగ్గినట్లే. దీనిపై అపోలో ముఖ్య ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ఆరోగ్య కేంద్రాలకు 50 మంది వరకు రోగులు వస్తే ప్రయోజనం ఉంటుంది. టెలీమెడిసిన్‌ ద్వారా వైద్యసేవలను అందించేందుకు స్పెషలిస్టులను హైదరాబాదులో అందుబాటులో ఉంచుతున్నాం. టెలీమెడిసిన్‌ వైద్యుల సేవలను అందించే విధానాన్ని రికార్డుచేసి, ఏడేళ్లపాటు అందుబాటులో ఉంచుతాం. ఈ పథకంలో పాల్గొనే వైద్యులకు నెలకు రూ.2 లక్షల వరకు వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని పేర్కొన్నారు.

11ap-main7b.jpg లోపాలు లేక పోలేదు 

* ఈ కేంద్రాలను తొలుత ఎన్జీఓలు నిర్వహించినప్పుడు సరైన వైద్యసేవలు అందలేదు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయన్న భావన రోగుల్లో ఉంది.

* కేంద్రాల గురించి తెలిపే బోర్డులు చిన్నవిగా ఉన్నాయి. ఆరోగ్య కేంద్రం అని కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా లేవు. ముఖ్యమైన కూడళ్లల్లో వీటి ప్రాధాన్యం తెలిపే బోర్డులు ఏమీ కనిపించడంలేదు.

* ప్రభుత్వపరంగా సరైన ప్రచారం లేదు. ఆశా కార్యకర్తల ద్వారా వీటిగురించి ప్రచారం బాగా జరిగినచోట కొంత స్పందన ఉంది.

* ఇంట్లో పనులు చూసుకుని రోగులు 11 గంటల సమయంలో కేంద్రాలకు వస్తున్నారు. ఇవి 12 గంటలకే మూతబడుతున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభం అవుతున్నాయి.

రోగికి తోడ్పాటు.. ఎంబీబీఎస్‌ వైద్యులు రోగి పక్కనే ఉన్నందున మేము చెప్పే వివరాలను వారు సులువుగా రోగులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. రోగుల సమస్యల్ని మేము నేరుగా వింటున్నాం. రోగుల వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు పంపిస్తున్నారు.
- డాక్టర్‌ రాజశేఖర్‌, ఎముకల వైద్య నిపుణుడు (టెలిమెడిసిన్‌ ద్వారా రోగికి సలహా ఇస్తుంటారు.)
ఉచిత వైద్య పరీక్షల వివరాలు.. క్లినికల్‌ హెమెటాలజీ: హీమోగ్లోబిన్‌ ఎస్టిమేషన్‌, మొత్తం ల్యూకోసైట్‌ కౌంట్‌, ఢిపరెన్షియల్‌ ల్యూకోసైట్‌ కౌంట్‌ (డీఎల్‌సీ), ప్లేట్‌లెట్‌ కౌంట, ఎంపీ (స్లయిడ్‌ పద్ధతి), ఇఎస్‌ఆర్‌, గడ్డ కట్టించే సమయం 9సీటీ), బ్లడ్‌ గ్రూప్‌ (ఏబీఓ-ఆర్‌హెచ్‌ టైపింగ్‌).

బయో కెమిస్ట్రీ: బ్లడ్‌ షుగర్‌, బ్లడ్‌ యూరియా, సీరం క్రియాటినిన్‌, సీరం బిలిరుబిన్‌ (టోటల్‌), సీరం బిలిరుబిన్‌ (డైరెక్ట్‌), సీరం బిలిరుబిన్‌ (ఇన్‌-డైరెక్ట్‌), ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ, ఆల్కలైన్‌ ఫాస్పేట్స్‌, టోటల్‌ ప్రొటీన, సీరం అల్బుమిన్‌, సీరం టోటల్‌ కొలెస్ట్రాల్‌, సీరం ట్రైగ్లిజరైడ్‌, సీరం వీఎల్‌డీఎల్‌, సీరం హెచ్‌డీఎల్‌, సీరం అమైలేస్‌.

* సెరో మైక్రోబయోలజీ: కఫం ఎఫ్‌బీ కోసం

* మలం విశ్లేషణ: మలం ఓవీఏ, సీవైఎస్టీ కోసం

* మూత్రం ద్వారా గర్భ పరీక్ష.

11ap-main7c.jpg పూర్వ ప్రభావంవల్లే 11ap-main7d.jpgగతంలో ఈ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ వైద్యుల్లేకుండానే జరిగింది. ప్రస్తుతం వైద్యుల్ని అందుబాటులో ఉంచి, ఉచితంగా రక్త పరీక్షల్ని చేస్తున్నా రోగుల స్పందన తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం గతంలో వాటిపై విశ్వసనీయత లేకపోవడమే. అవసరమైతే ఉదయంపూట గంట సమయాన్ని పొడిగించి... సాయంత్రం వేళల్ని తగ్గిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచిస్తున్నాం. కనీసం ఒక్కో కేంద్రానికి రోజుకి 70 నుంచి వంద మంది రోగులు వస్తే బాగుంటుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి కోసం ఈ నడుపుతోన్న ఈ కేంద్రాల ద్వారా చిన్నచిన్న వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రులకు పోకుండానే పొందొచ్చు. ఈ కేంద్రాలకు రోగులు వెళ్తే అక్కడ పనిభారం తగ్గి వైద్య సేవలు మెరుగుపడతాయి. రోగులకు బాగుంటుంది. నిర్వాహకులకు కేంద్రాల ప్రాధాన్యంపై ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని సూచిస్తున్నాం. త్వరలో దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తాం.
-కామినేని శ్రీనివాస్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
కొన్ని చోట్ల ఇలా... ‘ఈనాడు’ ప్రతినిధులు రాష్ట్రంలోని కొన్ని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వాటి స్థితిగతులను పరిశీలించారు. విజయవాడ నగరంలోని మూడు ఆరోగ్య కేంద్రాలను పరిశీలించగా శుభ్రంగానే కనిపించాయి. నగరంలో ఉన్న కండ్రిగ ఆరోగ్య కేంద్రంలో రోగుల సంఖ్యనే తక్కువగా ఉంది. సిబ్బంది రోగులపట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు శ్రీనివాసరావుతోటలో ఔషధాల కొరత ఉంది. ఆసుపత్రి మాత్రం కార్పొరేట్‌ స్థాయిలో ఉంది.

* కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మూడు నెలల కిందట ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించినప్పటికీ 140 మంది రోగులే టెలీ మెడిసిన్‌ సౌకర్యం వినియోగించుకున్నారు.

* తిరుపతిలో భైరాగిపట్టెడ, పోస్టల కాలనీ, నాలుగుకాళ్ల మండపం, ఎర్రమిట్ట, మరొకొన్ని ప్రాంతాల్లో 8 కేంద్రాలు పనిచేస్తున్నాయి.

* రాజమండ్రిలో నడిచే కేంద్రంలో సాయంత్రం వేళల్లోనూ వైద్యుడు అందుబాటులో ఉన్న విషయం స్థానికులకు తెలియడం లేదు. ఉదయం సాయంత్రం ఒకే వైద్యుడు ఓపీ చూడాల్సి రావడంతో వైద్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు.

* విజయనగరం జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ఎనిమిది కేంద్రాలు ఉండగా అన్నిచోట్లా ఓపీ తక్కువగానే నమోదవుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నప్పుడు ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సేవలు అందించేవారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాకా ఏఎన్‌ఎంలను క్షేత్రస్థాయికి పంపించడం లేదు. దీంతో గర్భిణులు చాలామంది ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు.

* కర్నూలు జిల్లా శంకర్‌నగర్‌ కేంద్రంలో మందుల కొరత ఉండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

- ఈనాడు యంత్రాంగం.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Maha Prastanam scheme to be introduced in King George Hospital

 

Visakhapatnam: Efforts are on to introduce Maha Prastanam scheme (for shifting of Modies) from the King George Hospital (KGH) soon after getting approval from the Cabinet, according to Medical and Health Minister Kamineni Srinivas.

 

After inaugurating the emergency medicine and blood change Block constructed at a cost of Rs 5.3 crore here on Wednesday, the Minister held a review meeting with hospital superintendent Dr G Arjuna, RMOs and HoDs to assess the functioning of the hospital and steps to be taken to redress the pending problems. 

 

Initiating the discussion, he assured that the government would soon appoint medical officers and the staff to serve the emergency medicine and the blood change wings and also announced granting 50 beds to each wing.  He said these two wings would be helpful to perform emergency surgeries to those met with road accidents or other mishaps and directed the medical officers to provide best medicare to the injured until they recover fully. 

 

“The government has already provided necessary infrastructure and other facilities to the KGH and is still ready to provide more if necessary. But the government wanted the medical staff to serve the poor by keeping all required medicines ready. Furthermore, modalities will also be framed for the maintenance of Maha Prastanam scheme,” he added.

 

Hospital superintendent Dr Arjuna appealed to the Minister to initiate necessary steps to fill up the vacant posts of medical officers and staff in the emergency and out-patient wings to serve the poor better. Hospital deputy superintendent Dr N V Vijay Kumar, RMOs Dr Vijay Gopal, Dr Bangaraiah and Dr Sastry were also present.

http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-06-15/Maha-Prastanam-scheme-to-be-introduced-in-King-George-Hospital-/306489

Link to comment
Share on other sites

Guest Urban Legend

Plan to make VIMS a teaching hospital on the cards: Kamineni

image.jpg

‘Cabinet will finalise scheme to develop it on the lines of SVIMS’

The State Government is toying with the idea to convert Visakha Institute of Medical Sciences (VIMS) into a premier healthcare and research centre by converting it into a teaching hospital.

Asked to comment on whether they were considering granting autonomous status to VIMS, Health Minister Kaminent Srinivas, who visited King Goerge Hospital on Wednesday told The Hindu that they had a lot of ideas to develop VIMS. He indicated that the Cabinet would shortly finalise a scheme to develop VIMS on the lines of Sri Venkateswara Institute of Medical Sciences in Tirupati.

VIMS was developed in 110 acres at Health City abutting the National Highway here to serve the patients long ago.

It was thrown open to public last September after a lot of delay as the proposal to privatise it at one point of time had triggered widespread protests.

“Now we are getting 500 out-patients. Once the in-patient strength goes up we may consider appointing doctors on a permanent basis,” he said in reply to a specific query on the status of proposal pending before the government for recruiting own doctors by VIMS.

He said once VIMS was converted into teaching hospital for Dr. NTR Health University, it would get lot of funds to become a premier referral hospital. Mr. Srinivas said already they had launched advanced diagnostic facilities under public private partnership programme.

Stating that VIMS was a big boon for the people of North Andhra in mitigating their ailments, he said it was also set to become a world-class research centre. The hospital had excellent infrastructure and had the scope to become one of the top teaching hospitals in the country.

At present, VIMS has all the super-specialities except cardiac care and surgeries. King George Hospital has specialist care for cardiac care. Now plans are afoot to declare VIMS as a super-speciality by introducing cardiac treatment and surgeries.

Chief Minister N. Chandrababu Naidu during his address at the TDP Mahanadu held here recently stated that they are considering giving autonomy to VIMS and they had already allotted ₹200 crore for development of the hospital.

Link to comment
Share on other sites

Guest Urban Legend

DCbMDinUIAQ5snU.jpg


Kakinada Talkies
@KkdTalkies

The Services provided for both GODAVARI district's by @ KKD government hospital are listed below.

Link to comment
Share on other sites

రక్తపు బొట్టుతో రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపు

సీఎంకు వివరించిన డాక్టర్‌ రఘురాం బృందం

20ap-state2a.jpg

ఈనాడు, అమరావతి: ఒక రక్తపు బొట్టుతో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు వీలుందని ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సీఈఓ డాక్టర్‌ రఘురాం.. సీఎం చంద్రబాబుకు వివరించారు. పీవోసీ మెడికల్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్‌ రమణ తాడేపల్లితో కలిసి సచివాలయంలో మంగళవారం సీఎంను కలుసుకున్నారు. ‘పీవోసీ’ అందుబాటులోనికి తెచ్చిన ‘పండోర సీడీఎక్స్‌’ యంత్రం ద్వారా ఒకే ఒక రక్తపు బొట్టుతో పావు గంటలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించొచ్చని వివరించారు. ఇందుకు రూ.120లోపే ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం సహకరిస్తే గ్రామీణ మహిళలకు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్రంలో ‘మమోఅలర్ట్‌’ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుపై ఆలోచించాలని కోరినట్లు డాక్టర్‌ రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.

Link to comment
Share on other sites

వైద్య సేవల్లో కడపకు తొలి స్థానం

గుంటూరు, న్యూస్‌టుడే: సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) సేవలు, సౌకర్యాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకుల్లో కడప జిల్లా 2016-17 సంవత్సరానికి తొలి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12 సీహెచ్‌సీలు ఉండగా.. అన్నీ స్టార్‌ హోదా సాధించి జిల్లాను తొలి స్థానంలో నిలిపాయి. కర్నూలు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో 196 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గానూ 159 స్టార్‌ హోదా పొందాయి. 37 ఆసుపత్రులు ఈ హోదాను సాధించలేకపోయాయి. సీహెచ్‌సీలు పంపిన నివేదికల ఆధారంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ ర్యాంకులు వెల్లడించింది. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో గుంటూరు, అనంతపురం జిల్లాలున్నాయి. తూర్పుగోదావరి-4, కృష్ణా-5, శ్రీకాకుళం-6, పశ్చిమగోదావరి-7, విశాఖపట్నం-8, విజయనగరం-9, చిత్తూరు-10, నెల్లూరు-11, ప్రకాశం-12 స్థానాల్లో నిలిచాయి. ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలు, నాణ్యత ప్రమాణాలు, అందుబాటులో ఔషధాలు, 24 గంటలూ ప్రసూతి సేవలు, మౌలిక వసతులు పరిశీలించి ఈ ర్యాంకులు ప్రకటించారు.

నిధులపై ప్రభావం: ఆసుపత్రులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా జాతీయ ఆరోగ్య పథకం నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత సాధించని ఆసుపత్రులకు నిధుల్లో 5 శాతం కోతపెట్టే అవకాశం ఉంది. పనితీరు బాగున్న వాటికి 5శాతం అధికంగా కేటాయించే వీలుంది.

Link to comment
Share on other sites

197 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి ఆమోదం

ఈనాడు, అమరావతి: ప్రజారోగ్యశాఖ పరిధిలో 197 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను ఒప్పంద విధానంలో నియామకంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వుల్ని జారీచేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు మూడేళ్లపాటు కొనసాగుతారు.

ఆయుష్‌లోనూ ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు!

ఆయుష్‌ (ఆయుర్వేద, యునాని, హోమియో) శాఖ పరిధిలోనూ పీజీ అర్హత కలిగిన వైద్యుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వుల్ని జారీచేశారు. ఇదే నిర్ణయాన్ని మే 31 నుంచి వైద్య విద్య సంచాలక, ప్రజారోగ్యం, ఏపీవీవీపీ పరిధిలో అమలుచేస్తున్నారు. ఆయుష్‌లో మంగళవారం నుంచి వర్తింపచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Sri NCBN launched the newly renovated 150 bedded government hospital at Kuppam today. The hospital will serve the healthcare needs of the local populace and deliver enhanced medical care.

DFRBVU7VwAEIv1n.jpg

20156023_1754759637870953_44943374394272

DFRBVU8VYAUpqBG.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...