Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply
Guest Urban Legend
3 months back 79 New Ambulance Services Flaged Off by CM Chandrababu at Secretariat
 
and today
 
గన్నవరం: గన్నవరంలో 13అంబులెన్స్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లను కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు ఎంపీ ల్యాండ్స్‌ నిధులతో కొనుగోలు చేశారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు, అమిత్‌షాలకు ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు.

25brk49a.jpg

Thank u suresh prabhu ..one each to all districts of #andhrapradesh
railway zone isthey political ga huge mileage vasthadhi
Link to comment
Share on other sites

నచ్చిన డాక్టర్‌ వద్ద వైద్యం!
25-05-2017 03:08:17
636312812135214432.jpg
  •  త్వరలో పేదలకూ అవకాశం
  •  వైద్యులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ
  •  ‘స్వచ్ఛ సప్త వర్ణ దుప్పట్ల’ కార్యక్రమం ప్రారంభంలో సీఎం
అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): పేదలూ తమకు నచ్చిన వైద్యుడితో వైద్యం చేయించుకొనే వెసులుబాటు కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు.. వైద్యులు, సిబ్బంది పనితీరుపై రోగుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఆస్పత్రుల్లో ఎగ్జిట్‌ ఇంటర్య్వూలను తీసుకొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ‘స్వచ్ఛ సప్త వర్ణ దుప్పట్ల’ కార్యక్రమాన్ని బుధవారం వెలగపూడిలోని తన కార్యాలయం నుంచి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా 13 జిల్లాల ప్రధాన ఆస్పత్రుల్లోని రోగులు, అక్కడి వైద్య సిబ్బందితో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వైద్యులందరికీ సాప్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. వృత్తి నైపుణ్యమే కాకుండా ప్రవృత్తి నైపుణ్యం కూడా అవసరమని గుర్తించి ఆ దిశగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమూల మార్పులు చేస్తున్నామని అన్నారు. ఆస్పత్రుల్లో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా వైద్యులు, సిబ్బందిలో కూడా పరివర్తన చాలా అవసరమన్నారు. అందుకే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికాలోని 150 ఏళ్ల నాటి ప్రఖ్యాత మయో ఆస్పత్రి మనకు ఆదర్శం కావాలని సీఎం చెప్పారు. ‘ఫస్ట్‌ పేషంట్‌’ నినాదాన్నే తమ విధానంగా మార్చుకొన్న మయో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు రోగులను పలకరించే విధానం, పనిచేసే పద్ధతి మన అందరికీ మార్గదర్శకమని అన్నారు. ముఖ్యంగా వైద్యులు పలకరించే తీరుతోనే రోగులకు సగం రోగం నయం అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
 
పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడానికి ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ... ఆస్పత్రుల్లో ఏడు రోజులు ఏడు రంగులతో కూడిన ద్పుట్లను మార్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోగికీ రెండు దుప్పట్లు చొప్పున అందుబాటులో ఉంచుతామన్నారు. తొలివిడతగా 13,200 పడకలకు దుప్పట్లు అందిస్తున్నామని, దీనికి రూ.10 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. రెండో దశలో మరో 12 వేల పడకలకు దుప్పట్లు అందజేస్తామన్నారు. ఏ రోజు దుప్పటి మార్చకపోయినా రోగులు అక్కడ సిబ్బందిని ప్రశ్నించవచ్చునన్నారు. నేరుగా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఏడు రంగుల దుప్పట్ల విధానాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అమలు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. ఎయిమ్స్‌ ఆసుపత్రికి సంబంధించి డిజైన్లు ఇప్పటికే సిద్దం చేశామని, నెల రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశాఖలో బదిలీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదని మంత్రి తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా 218 మంది డాక్టర్ల నియామకం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్ట్‌ టెక్నాలజీ, బెస్ట్‌ ప్రాక్టీసులపై సహకారం అందించడానికి బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఏపీ ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. కాగా, గన్నవరం విమానాశ్రయంలో గురువారం లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సులను సీఎం ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

మండల కేంద్రాల్లో ‘అన్నా జనరిక్‌’
25-05-2017 03:07:04
  •  రాష్ట్రమంతా చౌక ధరలకే మందులు: మంత్రి సునీత
గుంటూరు, మే 24: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చౌక ధరలకే ఔషధాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మండల కేంద్రంలో ‘అన్నా సంజీవిని జనరిక్‌ మెడికల్‌ షాపు’లను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ‘రోజుకో రంగు దుప్పట్ల పథకం’ ప్రారంభించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లైవ్‌లో రాష్ట్ర మంత్రులు సునీత, నక్కా ఆనంద్‌బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఓపీ విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా సంజీవిని జనరిక్‌ మందుల దుకాణంలో మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత విలేకర్లతో మాట్లాడుతూ బ్రాండెడ్‌ మందులకు ధీటుగా జనరిక్‌ మందుల నాణ్యత ఉంటుందని, అయితే ధరలు మాత్రం 30 నుంచి 70 శాతం తక్కువకే లభిస్తాయని తెలిపారు. వీటిని పేద రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Sidda Raghava Rao @RaghavaraoSidda 11m11 minutes ago

Participated in the “Swaccha Saptavarna Dupatla” programme launched at the Ongole GH and interacted with Hon'ble CM @ncbn

Garu

Colour-coded bed sheets at RIMS Hospital
Albums
Colour-coded bed sheets at RIMS Hospital
16 photos · Updated 21 hours ago
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషంట్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా పడకలపైని దుప్పట్లను మార్చి ఎప్పటికప్పుడు శుభ్రపరచిన దుప్పట్లను పరచాల్సి ఉంటుంది. అయితే ఇదివరకు తెలుపు దుప్పట్లు మాత్రమే ఉండటంవల్ల వాటిని మార్చిందీ లేనిదీ గుర్తుపట్టడం కష్టంగా ఉండేది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో రంగు దుప్పటి చొప్పున ఏడురోజులూ ఏడు రంగుల దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని నూతనంగా చేపట్టింది. ఈరోజు ఒంగోలు రిమ్స్ ప్రసూతి వార్డులో ప్రారంభించిన 'స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల పంపిణీ' కార్యక్రమంలో పాల్గొన్నాను. జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ చంద్ గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారు,కొండెపి శాసన సభ్యులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత గారు, రిమ్స్ డైరెక్టర్ శ్రీమతి వల్లీశ్వరి గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి శ్రీమతి యాస్మిన్ గారు, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారు, ఒంగోలు ఆర్.డి.ఓ కమ్మ శ్రీనివాసరావు మరియు ఇతర వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు వీడియో కాన్ఫరెన్సు ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రసూతి వార్డులో ఉన్న మహిళా పేషంట్స్ తో మాట్లాడుతూ ప్రతిరోజు ఒక్కో రంగుతో దుప్పట్లు అందచేస్తున్నట్లు తెలియచేసారు. ఆసుపత్రి పరిస్థితులపై ప్రత్యేకంగా నాతో మాట్లాడి తెలుసుకున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ సప్తవర్ణాల దుప్పట్లను అందచేయటం పై మహిళా పేషంట్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారని ముఖ్యమంత్రితో చెప్పడం జరిగింది. అనంతరం కలెక్టర్ వినయ్ చంద్ గారితో కలిసి 'సప్త వర్ణాల దుప్పట్ల పంపిణీ' పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

DAqWwReXgAAxuyf.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

Nod for procuring Rupees 5.59 crore for medical equipment

1330_07.jpg

Visakhapatnam: King George Hospital Development Society has given its approval for the purchase of necessary medical equipment and furniture, totaling a worth Rs 5.59 crore in the current fiscal, at a meeting held here on Monday under the presidentship of Society Chairman and Collector Pravin Kumar.

 

Municipal Commissioner M Harinarayanan, KGH Superintendent Dr G Arjuna, Andhra Medical College Principal Dr P V Sudhakar and District Medical and Health Officer Dr  N Umasundari and HoDs of various medical departments who participated in the meeting along with the Society members underscored the need to provide better medicare to the poor after developing the hospital in all respects. 

 

Initiating the discussion, hospital Superintendent Dr Arjuna gave a power point presentation presenting details of last year’s income and expenditure besides progress of the developmental works taken up and the proposed development works in the current fiscal. 

 

Society Chairman Pravin Kumar gave approval for purchase of a Laparoscopic Unit with Rs 2.99 crore, stretchers and cots with Rs. 54.49 lakh, surgical disposals with Rs 96 lakh, to set up two lifts and its maintenance for three years with Rs 98 lakh and an intercom phone set up with Rs 12 lakh at the Super Speciality Block in the current fiscal 2017-18.

 

 Along with this, the Chairman also approved to spend Rs 33.90 lakh for civil and electrical works, Rs 64.59 lakh for other equipment and to purchase 300 ceiling fans with Rs 6.36 lakh. Similarly, the Society also approved the expenditure of Rs 7.94 crore incurred on various developmental works last year.

 

Responding to the appeal made by Dr Arjuna, Society Chairman Pravin Kumar asked the officials to send proposals with estimates immediately to get necessary funds from the government for laying internal roads, LED Street lighting through underground cabling and for other basic needs. Municipal engineering officials were asked to focus on Sewage Treatment Plant as already Under Ground Drainage system came into being. 

 

The KGH authorities were asked to request the HPCL authorities for arranging two dumper bins with its CSR funds and to speed up the construction work of Super Speciality Block. The Chairman said that he would review the work in progress in the first week of June and directed the Civic Chief to pay for the site being used for constructing the reservoir inside the KGH to the Superintendent immediately. Among others, KGH Deputy Superintendent Dr N V Vijay Kumar, Society member K Nagaraju, RMOs Dr Vijaygopal, Dr Bangaraiah and Dr Sastry and HoDs were present.

 

Link to comment
Share on other sites

శరవేగంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు


636319066904039222.jpg



  • సెప్టెంబర్‌ 27 నాటికి ప్రారంభించాలని లక్ష్యం
  • మొత్తం ఎనిమిది విభాగాల ఏర్పాటు

కోస్తా జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కల మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్‌ వైద్య సేవలను అందించేందుకు ‘సూపర్‌ ’ వేగంతో పనులు సాగుతున్నాయి. దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి హాస్పిటల్‌ ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.విజయవాడ (ప్రభుత్వాసుపత్రి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నూతన ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 293 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. రూ.150 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.120 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా రూ.30 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో మొత్తం ఎనిమిది విభాగాల వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి. గుండె, మెదడు, న్యూరాలజీ, నెప్రాలజీ, నవజాత శిశువు, మూత్రశయం వంటి విభాగాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విభాగాలకు సంబంధించిన రోగులు గుంటూరు, హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే విజయవాడలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

పెరగనున్న పీజీ సీట్లు

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటుతో పీజీ సీట్లు కూడా పెరగనున్నాయి. సంవత్సరానికి ఒకొక్క విభాగానికి రెండు పీజీ సీట్ల చొప్పున మొత్తం 16 సీట్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.70 శాతం పనులు పూర్తయ్యాయి..

ఆసుపత్రి నిర్మాణం పనులు సెప్టెంబర్‌ 27 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు సెప్టెంబర్‌ ఆఖరుకు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తాం.

- చంద్రయ్య, కేఎంవీ గ్రూప్‌ ఆఫ్‌

కంపెనీ మేనేజర్‌రూ.60 కోట్లతో వైద్య పరికరాలు ..

ప్రధానమంత్రి స్వాస్ధ్య సురక్ష యోజన కింద సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి మంజూరైంది. నాలుగు నెలల తరువాత రూ.60 కోట్ల విలువ గల అత్యాధునికమైన వైద్య పరికరాలు రానున్నాయి. జూలై నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తి చేస్తాం.

- డాక్టర్‌ శశాంక్‌, ప్రిన్సిపాల్‌,


Link to comment
Share on other sites

విజయవాడ: జిల్లాలోని పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ ఆవరణలో 30 పడకల ఆస్పత్రి ప్రారంభమైంది. గురువారం ఉదయం మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మేయర్‌ శ్రీధర్‌, ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్‌ ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు ప్రమాదాల నివారణకు చర్య తీసుకుంటామని తెలిపారు.

Link to comment
Share on other sites

స్విమ్స్‌లో ‘సీ ఫర్‌’
 
 
636320552557925432.jpg
  •   వైద్యరంగంలో ఆధునిక అధ్యయనం
  •  రూ.12 కోట్ల విరాళమిచ్చిన వైటల్‌ సంస్థ
తిరుపతి అర్బన్‌, జూన్ 2: అంతుచిక్కని వైరస్‌, అరుదైన బ్యాక్టీరియాల మూలాలు తెలుసుకునేందుకు ఇకపై ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోని ప్రయోగశాలలకు పరుగులు తీయక్కర్లేదు. మధుమేహ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడే అరుదైన పాంక్రియాటిక్‌ ఐస్‌లెట్‌ సెల్‌ ల్యాబ్‌కోసం మరో చోటికి పోనక్కర్లేదు. తరచూ ఇన్ ఫెక్షన్లను కలిగిస్తూ మొండిగా మారుతున్న బ్యాక్టీరియాల పనిపెట్టే ప్రత్యామ్నాయ మార్గాల కోసం మరో రాష్ట్రం వైపు చూడనక్కర్లేదు. ఇలాంటి మరెన్నో అధ్యయనాలు, పరిశోధనలకు తిరుపతిలోని ‘స్విమ్స్‌’లో ఏర్పాటు కానున్న ‘సీ ఫర్‌’ (సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌)వేదిక కానుంది. స్విమ్స్‌ ఆవరణలో భవన నిర్మాణ దశలో ఉన్న సీఫర్‌ మరో ఏడాదిలో పూర్తికానుంది. తొలుత మూడంతస్తుల్లో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆపై మరో రెండు అంతస్తులను నిర్మిస్తారు. తొలి దశలో... డ్రై-ల్యాబ్స్‌, పాపులేషన్‌ రీసెర్చ్‌, అవుట్‌కం రీసెర్చ్‌, హెల్త్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌, బయో స్టాటిటిక్స్‌, డేటా మేనేజ్‌మెంట్‌తో పాటు క్లినికల్‌ రీసెర్చ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. హాస్పిటల్‌ అక్వైర్డ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (హాయ్‌)పై ప్రత్యేక పరిశోధన చేసి ఇన్‌ఫెక్షన ఫ్రీ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు సీఫర్‌లోని మొదటి అంతస్థును వినియోగించనున్నారు. ఇన్‌ఫెక్షన్‌, ఇన్‌ఫ్లమేషన్‌, ఇమ్యూనిటీలపై ఇక్కడ పరిశోధన చేయనున్నారు. ఇందులో వైరల్‌ రీసెర్చ్‌ డయాగ్నోస్టిక్‌ లాబొరేటరీస్‌, మైక్రోబ్స్‌పై విస్తృత పరిశోధన జరగనుంది. క్యాన్సర్‌కు సంబంధించిన మాలిక్యులర్‌ వైరాలజీపై కూడా అధ్యయనం చేస్తారు. రెండో అంతస్థులో ప్రతిష్ఠాత్మకమైన స్టెమ్‌సెల్‌ బయాలజీ, రీజెనరేటివ్‌ మెడిసిన్‌, మధుమేహవ్యాధి నిరోధానికి సంబంధించి ప్యాంక్రియాటిక్‌ ఐస్‌లెట్‌ సెల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో అనేక పరిశోధనలకు సీఫర్‌ కేంద్రం కానుందని స్విమ్స్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌ తెలిపారు. నానోమెడిసిన్‌, బయోటెక్నాలజీ, బయో ఇన్‌ఫర్‌మాటిక్స్‌, జన్వులు, పర్యావరణం, గాయాలు, ప్రవర్తన, మహిళా-శిశు ఆరోగ్యం వంటి పరిశోధన విభాగాలు సీఫర్‌కు రానున్నాయన్నారు. దీనికోసం వైటల్‌ ల్యాబొరేటరీస్‌ (ముంబై) సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ గోపాల్‌ బజాజ్‌ రూ.12 కోట్లను ఇటీవల విరాళంగా అందజేశారు. శుక్రవారం రాజీవ్‌ గోపాల్‌ బజాజ్‌ దంపతులను అధికారులు సత్కరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...