Jump to content

AP health department


Recommended Posts

వైద్యరంగంలో ప్రపంచబ్యాంకు సాయం
03-10-2018 02:45:39
 
  • ఎలక్ట్రానిక్‌ ఆస్పత్రులుగా 7500 సబ్‌ సెంటర్లు
  • సీఎంతో వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధుల భేటీ
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న సమస్యలు అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రపంచబ్యాంకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ప్రపంచంలో ఉన్న నిపుణులు సహకరించేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రపంచబ్యాంకు హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ లీడర్‌ జార్డ్‌ కొరసా, సీనియర్‌ ఆపరేషన్స్‌ అధికారి కరి హర్ట్‌, హెల్త్‌ స్పెషలిస్ట్‌ మోహిని కక్‌ తదితరులతో కూడిన ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి ఉండవల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. వీరిని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న పథకాలు, ఐటీ ఆధారిత నైపుణ్యాన్ని సీఎం వారికి వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ అనే విధానాన్ని కొత్తగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. బహుముఖంగా అందిస్తున్న సేవలను సమన్వయం చేసుకొని మెరుగైన సేవలు అందించడమే తమ ముందు ఉన్న బాధ్యత అని సీఎం వివరించారు. మాతా శిశు మరణాల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గించడం తాము సాధించిన మరో విజయంగా తెలిపారు. రాష్ట్రంలో 7500 సబ్‌ సెంటర్లను ఎలకా్ట్రనిక్‌ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
 
ఇకపై అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోగులకు సంబంధించిన హెల్త్‌కార్డులను ఇ-హెల్త్‌ రికార్డుల పేరుతో భద్రపరుస్తారు. టెలిమెడిసిన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. 1147 పీహెచ్‌సీలు, 192 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 31 ఏరియా ఆస్పత్రులు, 13 జిల్లా, 23 బోధనాస్పత్రులు ఎలకా్ట్రనిక్‌ సబ్‌ సెంటర్లుగా మారతాయి. ఈ ప్రాజెక్టు కింద త్వరలో 7500 ఆస్పత్రుల్లో టెలిమెడిసిన్‌ సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం 3 కార్యక్రమాలను ప్రారంభించారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి, టీబీ వ్యాధి నిర్మూలనకు, గ్రీన్‌ హాస్పిటల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 23 ఏరియా, 22 బోధన ఆస్పత్రుల్లో సోలార్‌ రూఫ్‌ టాప్‌ ద్వారా 8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ సహా ముగ్గురు సర్వీసు ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ సీఎం సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది.
Link to comment
Share on other sites

  • Replies 517
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
తల్లీబిడ్డకు రక్ష!
31-12-2018 03:12:13
 
636818227299179916.jpg
  • ప్రసవాలన్నీ ఉచితమే.. ఎన్టీఆర్‌ వైద్య సేవలో చేర్పు
  • సురక్షిత కాన్పునకు ‘తల్లి సురక్ష’
  • ప్రైవేట్‌లోనూ ఉచిత గైనిక్‌ సేవలు
  • జనవరి నుంచి అందుబాటులోకి
  • సాధారణమైనా, సర్జరీ అయినా ఫ్రీ
  • 3 సార్లు రక్తపరీక్షలు, ఒకసారి స్కానింగ్‌
  • ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా అమలు
  • మాతాశిశు మరణాలు తగ్గించే ప్రణాళిక
  • రాష్ట్ర ప్రభుత్వంపై రూ.500కోట్ల భారం
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మాతాశిశు మరణాలను తగ్గించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సురక్షిత ప్రసవమే లక్ష్యంగా నూతన విధానం ప్రవేశపెట్టనుంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంలో గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కేరళ వంటి రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిని తగ్గించడానికి ఆరోగ్యశాఖ అనేక మార్గాలను అన్వేషించినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వమే కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దీనిప్రకారం ఇప్పటి వరకూ శస్త్రచికిత్సలకే పరిమితమైన ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంలో ఇకపై గర్భిణులకు ఉచిత సేవలందనున్నాయి.
 
 
రాష్ట్రంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డు ఉన్న ప్రతి గర్భిణి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా గైనిక్‌ సేవలు పొందవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా ట్రస్ట్‌ సిద్ధం చేసింది. ఈ విధానంతో ప్రభుత్వంపై రూ.500కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ఇందులో ‘ఆయుష్మాన్‌భారత్‌’ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు వస్తాయి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. 2019 జనవరి నుంచి అమలులోకి తీసుకురావాలని భావిస్తున్న ఈ పథకానికి ‘తల్లి సురక్ష’గా నామకరణం చేశారు.
 
 
‘ప్రైవేట్‌’ ప్రసవాలు పెంచేందుకే
ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా దాదాపు 6.40లక్షల కాన్పులు జరుగుతుండగా వీటిలో సుమారు 3.40లక్షలు (53ు)వరకూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తున్నారు. 47శాతం మంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. మరోవైపు కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
 
 
సదుపాయాల కల్పనకు వెసులుబాటు
గైనిక్‌ సేవలను ట్రస్ట్‌ పరిధిలోకి తీసుకురావడంతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం ట్రస్ట్‌ ద్వారా ఆర్థో, కార్డియాక్‌, న్యూరాలజీ సమస్యలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాస్పత్రులకు నిధులు సమకూరడంతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులో సుమారు 35శాతం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్స్‌ రూపంలో ట్రస్ట్‌ నుంచి అందుతాయి. కొత్త విధానంలో గర్భిణి సేవలకు కూడా ఇన్సెంటివ్స్‌ వస్తాయి కాబట్టి ప్రభుత్వాస్పత్రుల్లోని గైనిక్‌ వైద్యులు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది.
 
 
మరోవైపు ఆస్పత్రుల్లో వైద్యసేవ నిధులు కూడా పెరిగి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా ప్రజలకు ప్రభుత్వం 1044సేవలను ఉచితంగా అందిస్తోంది. గర్భిణులకు డెలివరీలు, సర్జరీలను అదనంగా పొందుపరచడంతో తాజాగా ఈసంఖ్య 1046కు పెరిగింది. గతంలో ఉన్న సేవలకు ట్రస్ట్‌ రూ.1,200కోట్లు ఖర్చు చేస్తుండగా కొత్తగా ప్రవేశపెట్టిన సేవలకు అదనంగా మరో రూ.500కోట్లు అవసరం అవుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం వచ్చే ఏడాదికి 60శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...