Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply

బైక్ అంబులెన్స్: రాదారిలేని కొండ కోనల్లో ఆపద్బంధువు

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/2D4D/production/_102679511_96d80ab1-82ad-40af-b4eb-f2148cfc8164.jpg

కొండ మీద ఓ పల్లెలోని పూరిల్లు. ఆ ఇంట్లో ఓ నిండు చూలాలు. ఆమె పేరు ప్రమీల పాయికో. నెలలు నిండాయి. పురిటి నెప్పులు మొదలయ్యాయి. భరించలేని బాధతో ఆమె కేకలు పెడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కానీ ఎలా?

మారుమూల ప్రాంతంలోని ఆ కొండ మీద నుంచి ఆ గర్భిణిని కిందికి తీసుకెళ్లడమెలా? అంబులెన్స్ ఆ కొండెక్కి వచ్చే దారిలేదు. ఇంతలో ఎవరో 108కి ఫోన్‌ చేశారు. గంట లోపే ఒక అంబులెన్స్ కొండ మీదకి దూసుకొచ్చింది. అది 'బైక్‌ అంబులెన్స్‌'.

ఆ అంబులెన్స్‌లో ఆమెను జాగ్రత్తగా ఎక్కించుకొని కొండ కిందికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. సోంపేట పొలిమేరల్లో ఆమె ఆ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అందులోనే ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/108D5/production/_102679776_5bb444bf-5c86-4d41-b08b-00c9adca47e1.jpg

ఒక బైక్ అంబులెన్స్ తమ ఊర్లోని తల్లీబిడ్డల ప్రాణాలను ఎలా కాపాడిందో.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పొంకాల గ్రామస్తులు వివరించారు.

వైద్యుడు అందుబాటులో లేని ప్రాంతాల్లో.. అంబులెన్సుల వంటి వాహనాలు వెళ్లటానికి రహదారులు లేని చోట.. ఈ బైక్ అంబులెన్సులు ఇప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.

కొండాకోనల మధ్యనున్న మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు లేని చోట నివసిస్తున్న ప్రజలకు.. ఆపత్కాలంలో వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు చేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌‌లో 'బైక్‌ అంబులెన్స్‌'లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా ఇలాంటిదే 'ప్రాజెక్ట్‌ రెక్కలు' అనే పథకం అమలవుతోంది.

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/545D/production/_102679512_5896da0c-42f9-4c6b-8f65-57ace9bfaffa.jpg

 

బైక్‌ అంబులెన్స్‌లు ఎక్కడ తిరుగుతున్నాయి?

''ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ గిరిజన ప్రాంతాలలో గత మార్చి నెల నుండి 122 బైక్‌ అంబులెన్స్‌లు తిరగడం ప్రారంభమైంది. సీతంపేటలో 15, పార్వతీపురంలో 24, పాడేరులో 42, రంపచోడవరంలో21, చింటూరులో 6, కె.ఆర్‌పురంలో 8, శ్రీశైలంలో 6 బైక్‌ అంబులెన్స్‌లు ప్రస్తుతం తిరుగుతున్నాయి'' అని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

‘‘శ్రీకాకుళంలో 15 వాహనాలు మార్చి నెల నుండి తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 389 కేసులకు సాయం అందించాయి. అయితే ఈ కొత్త అంబులెన్స్‌ల గురించి చాలామందికి తెలియదు. అందుకే డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌తో సహా పోస్టర్లు, కరపత్రాలుతో ప్రచారం చేయబోతున్నాం'' అని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు.

  • ఒక్క బైక్‌ అంబులెన్స్‌ నిర్వహణకు వాహన డ్రైవర్‌, వేతనంతో పాటు మందులకు రోజుకు రూ. 2,100 ఖర్చు అవుతుంది.
  • ఈ ద్విచక్ర వాహనాల్లో 12 రకాల వైద్యపరికరాలు, 5 రకాల అత్యవసర మందులు, ప్రథమ చికిత్సకు అవసరమైన సరంజామా ఉంటాయి.
  • 108 నంబర్‌‌కి కాల్‌ చేస్తే అంబులెన్స్‌ వెళ్లలేని చోటుకు బైక్‌ అంబులెన్స్‌ వచ్చి రోగిని తీసుకుని అంబులెన్స్‌ ఉన్న పాయింట్‌ దగ్గరకు చేరుస్తుంది.
  • ఈ వాహనాలు నడిపే డ్రైవర్లకు 108 అత్యవసర సర్వీసుల సెంటర్లలో శిక్షణ ఇచ్చిన తరువాతే ఫీల్డ్‌కి పంపుతున్నారు.

 

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/7B6D/production/_102679513_b6671bbe-9538-451e-9baa-23be2985bde5.jpg

 

''ఇప్పటివరకు బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా 1,637 మంది రోగులు సకాలంలో ఆసుపత్రులకు చేరారు. ఎక్కువ కేసులు గర్భిణిలకు సంబంధించినవే. గత మార్చి నుంచి ఇప్పటి వరకు బైక్‌లు 28,061 కిలోమీటర్లు ప్రయాణించాయి’’ అని ఆరోగ్య ఆంధ్ర ప్రతినిధి అంకిత పురోహిత్‌ వివరించారు.

‘‘మా ఇళ్ల మధ్యకు అంబులెన్స్‌లు రావడానికి సరైన దారి లేదు. రోగమెచ్చినా, పాములు కాటేసినా, ఆసుపత్రికి మంచాల మీద మోసుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ చిన్న అంబులెన్స్‌లు వచ్చాక కొన్ని ప్రాణాలు దక్కుతున్నాయి'' అని చెప్తున్నారు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామస్తులు.

అయితే.. కొన్ని కొండ ప్రాంతాల్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ లేక పోవడం వల్ల ఈ సౌకర్యం పొందలేక పోతున్నామంటున్నారు కొందరు గిరిజనులు.

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/A27D/production/_102679514_a429c1e1-0238-4eb5-a0bb-937fabbd1441.jpg

ఈ ఆలోచన ఎవరిది?

''మారుమూల కుగ్రామాల్లో ఆనారోగ్యంతో ఉన్న వారిని కాపాడడానికి బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యది. ఆమె చొరవతోనే గిరిజన ప్రాంతాల్లో ఈ సేవలు మొదలయ్యాయి’’ అని తెలిపారు ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌ ఒ.రాజ్యలక్ష్మి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో 8,137 కుగ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 122 బైక్‌ అంబులెన్స్‌లు అందరికీ సేవలు అందించడం ఆసాధ్యం. వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''అసలు రహదారులు సరిగా లేక మామూలు అంబులెన్స్‌లు కూడా సకాలంలో రాలేకపోతున్నాయి. ముందు ప్రభుత్వం ఉన్న రోడ్లకు రిపేర్లు చేసి బాగు చేయాల్సిన అవసరం ఉంది. అపుడే మారుమూల ప్రాంతంలోని ప్రజలకు మేలు కలుగుతుంది. 1,239 ఆవాసాలున్న గిరిజన ప్రాంతాల్లో 15 బైక్‌లు ఎంతమందిని కాపాడుతాయి? వీటిని పెంచాల్సిన అవసరం ఉంది'' అంటారు శ్రీకాకుళం జిల్లా, కవిటి గ్రామానికి చెందిన డాక్టర్‌ పూడి రామారావు.

https://ichef.bbci.co.uk/news/624/cpsprodpb/12FE5/production/_102679777_45d746e7-e30a-4fbc-b821-ee9d52e317bc.jpg

Link to comment
Share on other sites

సూపర్ ఫాస్ట్ గా, విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు...

Super User
28 July 2018
Hits: 18
 
super-28072018-1.jpg
share.png

కోస్తా ప్రజల చిరకాల స్వప్నం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్ సంస్థలను తలదన్నే వైద్య సేవలను అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శరవేగంగా సిదమవుతోంది. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పనులు, ఫినిషింగ్ పూర్తి చేసి త్వరలోనే ఇది ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కాంట్రాక్టు సంస్థ కేఎంవీ గ్రూప్ పనులును పూర్తి చేస్తుంది.

 

super 28072018 1

ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 293 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. రూ.150 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.120 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా రూ.30 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో మొత్తం ఎనిమిది విభాగాల వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.

super 28072018 1

గుండె, మెదడు, న్యూరాలజీ, నెప్రాలజీ, నవజాత శిశువు, మూత్రశయం వంటి విభాగాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విభాగాలకు సంబంధించిన రోగులు గుంటూరు, హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే విజయవాడలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

 
Advertisements
 

Add comment

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...