Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply

గుండె మార్పిడికి సిద్ధం
amr-panel3a.jpg

గుంటూరు: గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ శస్త్రచికిత్స ప్రారంభిస్తే మన దేశంలో ఈ ఘనత సాధించిన ప్రభుత్వాసుపత్రుల్లో జీజీహెచ్‌ నాలుగోదిగా గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఆసుపత్రిగా పేరు తెచ్చుకోనుంది. గుండె మార్పిడి అవసరమైన తొమ్మిది మందిని గుర్తించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని జీవన్‌దాన్‌ కేంద్రంలో ఒకరి పేరు ఇప్పటికే నమోదు చేశారు. ఆ విధంగా నమోదు చేసుకున్న తర్వాత ఎవరైన బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు సమాచారం వస్తే వారి గుండె అమర్చడానికి వీలవుతుంది. ఈనెల 18 లోపు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్‌ గోఖలే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గుండె శస్త్రచికిత్సలు మరో రెండు రోజుల్లో 150 పూర్తికానున్నాయి. గత సంవత్సరం మార్చి 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రోగికి పైసా ఖర్చు లేకుండా ఈ సర్జరీలు నిర్వహిస్తుండటం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతున్నది. అదేవిధంగా గుండె శస్త్రచికిత్సల వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఇటీవల ప్రకటించారు.

Link to comment
Share on other sites

ఏపీలో ఎయిర్‌ అంబులెన్సులు
 
కామినేని విజ్ఞప్తికి అశోక్‌ గజపతి ఆమోదం
న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో ఎయిర్‌ అంబులెన్సులు ప్రవేశపెట్టేందుకు కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సూత్రప్రాయంగా అంగీకరించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన బుధవారం భేటీ అయ్యారు. అవయవ మార్పిడికి దాతల నుంచి స్వీకర్తలకు వాటిని చేరవేసే సమయాల్లో రోడ్లపై వాహనాల రద్దీ అడ్డంకిగా మారుతోందని, దీనిని అధిగమించేందుకు ఎయిర్‌ అంబులెన్సుల్ని ప్రవేశపెట్టాలని అశోక్‌ గజపతిరాజుకు సూచించగా.. వీలైనంత త్వరలోనే చర్యలు చేపడతామన్నారని కామినేని తెలిపారు. కాగా, ఏపీలోని ఒక్కో జిల్లాకు అత్యుధునిక సదుపాయాలతో కూడిన ఒక్కో అంబులెన్సును ఇస్తామని రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు హామీ ఇచ్చారు. ఒక్కో అంబులెన్సుకు రూ.40 లక్షలు ఖర్చవుతుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. తన ఎంపీల్యాడ్స్‌ నిధుల్ని ఏపీకి ఖర్చు చేస్తానని సురేశ్‌ ప్రభు తెలిపారు. విశాఖలో ట్రామాకేర్‌ సెంటర్‌ను కూడా ఈ నిధులతో ఏర్పాటుచేస్తామన్నారు. కాగా, ధర్మవరంలో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరగా, జూలై 5న ఢిల్లీ నుంచే దానిని ప్రారంభిస్తానని సురేశ్‌ ప్రభు హామీ ఇచ్చారన్నారు. కాగా, విశాఖలో మెడ్‌టెక్‌ పార్కు ఏర్పాటుకు నిధులిచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని కామినేని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, ఫార్మా శాఖ మంత్రి అనంతకుమార్‌లతో ఆయన భేటీ అయ్యారు. ్‌ష
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Congratulations to all doctors, staff, admin officials and minister kamineni...finally to CBN to encourage GGH with money...GGH institute should become premier institute like AIIMS.

 

Excellent initiatives involving medical experts. Interest unna vallu participate chestaru. Govt hospitals meeda prajallo unna stigma ni dooram cheyali. Prabutva asupatri ki povatam kante chavatam melu ane type lo undevallu janalu ... ippudela undo teleedu.

Link to comment
Share on other sites

Excellent initiatives involving medical experts. Interest unna vallu participate chestaru. Govt hospitals meeda prajallo unna stigma ni dooram cheyali. Prabutva asupatri ki povatam kante chavatam melu ane type lo undevallu janalu ... ippudela undo teleedu.

 

Saraina leadership and motivation from govt. unte thappakunda andaru change avutharani anukunutunna bro. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...