Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

భావితరాలకు సంగమ ప్రాధాన్యం తెలియాలి
image.jpg 

పవిత్రసంగమం (ఇబ్రహీంపట్నం), న్యూస్‌టుడే: నదుల అనుసంధానం, రెండు జీవనదుల చరిత్ర, వాటి జన్మస్థలంల గురించి తెలిసేలా పవిత్ర సంగమ ప్రాంతంలో ఓ మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలగజేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి పవిత్ర సంగమ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఇందులో భాగంగానే పవిత్ర సంగమం వద్ద కృష్ణాగోదావరి నదుల అనుసంధానానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తామన్నారు. దీంతో పాటు జీవ నదుల పుట్టుకతో పాటు అవి ఎక్కడ వరకు ఎలా వెళతాయి అనే అంశాలను ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్పష్టంగా తెలిసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రివర్‌ఫంట్‌ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సంగమ ప్రాంతంలో అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ సంస్థ పెంచుతున్న చెట్లను, మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ ప్రసూన, జడ్పీటీసీ రాధ, మండల ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, సర్పంచి స్వర్ణా, జంపాల సీతారామయ్య, రాజా, నారాయణలతో పాటు అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

రూ.250 కోట్లతో పవిత్ర సంగమానికి హంగులు!

కూచిపూడి నాట్యారామ నిర్మాణం అమలుపై ప్రత్యేక దృష్టి

రూ.116 కోట్లతో హేవలాక్‌ వంతెన అభివృద్ధి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కమిటీ భేటీలో తీర్మానం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి తలమానికంగా నిలుస్తున్న పవిత్ర సంగమ(కృష్ణా, గోదావరి నదుల సంగమం) ప్రాంతాన్ని సుమారు రూ.250కోట్లతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 10వేల మంది సామర్థ్యంతో బహుళార్థ ప్రయోజక మందిరం, గ్రాండ్‌ థియేటర్‌/ఆడిటోరియం, హోటల్‌ తదితర సౌకర్యాలనూ కల్పించాలని శుక్రవారం జరిగిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కమిటీ సమావేశంలో తీర్మానించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కమిటీ భేటీలో ఇతర పర్యాటక ప్రాజెక్టుల పురోగతి, నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనలను సమీక్షించారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో నాట్యారామం నిర్మాణం పురోగతిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. నాట్యారామాన్ని ప్రకటించి ఏడాది అవుతున్నా పురోగతి లేకపోవడంపై చర్చ జరిగింది. అక్కడ కూచిపూడి అంతర్జాతీయ శిక్షణ కేంద్రం, మ్యూజియం, కళా ప్రదర్శన కేంద్రం, కూచిపూడి నాట్యపితామహుడు సిద్ధేంద్రయోగి విగ్రహం, డిజిటల్‌, భౌతిక గ్రంథాలయం, ఆరుబయలు వేదిక తదితర సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. కొండపల్లి కోట అభివృద్ధిపైనా చర్చించారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో వేయి మంది కూర్చునేలా రూ.10కోట్లతో మరో కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు సిద్ధంచేసిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది.

రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై వినియోగంలో లేని హేవలాక్‌ వంతెనను రూ.116కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా కమిటీకి వివరించారు. వంతెనకు ఉన్న 57 స్తంభాల్లో తొలిదశలో రాజమహేంద్రవరం వైపు 14, కొవ్వూరు వైపు మరో 14 స్తంభాల వరకు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాణిజ్య, వినోద, ఆహార, పానీయ జోన్ల వంటివి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర నూతన పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని పర్యాటక సౌకర్యాలకు అద్దంపట్టేలా ప్రత్యేక మ్యాగజైన్‌ను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా తెలిపారు. సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కన్సెల్టెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పవిత్ర సంగమానికి సరికొత్త శోభ
 
 
636374314100349885.jpg
  • పర్యాటకులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయోగం
  • విదేశీతరహాలో నదిలో లగ్జరీ బోటింగ్‌-స్పీడ్‌ బోట్‌ రైడింగ్‌
  • నీటిపై తేలియాడే రెస్టారెంట్లు
  • నది మధ్యలో క్యాండిల్‌ డిన్నర్‌లు
 
పవిత్రసంగమం(ఇబ్రహీంపట్నం): పవిత్ర సంగమం సరికొత్త శోభ సంతరించుకుంటుంది. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహాంతో ఎన్‌ఆర్‌ఐ గుమ్మడపు పాపారావు చేపట్టిన వినూత్న ప్రయోగానికి పవిత్ర సంగమం వేదికగా మారింది. వాటర్‌ స్ఫోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలసి చేపట్టిన లగ్జరీ బోటింగ్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇలాంటి లగ్జరీ బోటింగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఉన్నప్పటికి ఇంకా పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. ఇటీవల జరిగిన సమావేశాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ గుమ్మడపు పాపారావు విదేశాల్లో నదీతీర ప్రాంతాల్లో పర్యాటకులు లగ్జరీ బోటింగ్‌, బైక్‌ రైడింగ్‌ వాటిపై ఆసక్తిని గమనించి ఇక్కడ కూడ ప్రారంభించాలని తలచి ప్రభుత్వాన్ని సంప్రదించటంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీనికోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా లగ్జరీ బోట్స్‌, కియాస్కి బోట్స్‌, బంపర్‌ బోట్స్‌ను దిగుమతి చేసుకుని పవిత్ర సంగమంనకు తీసుకువచ్చారు. ఈనెల రెండవ వారంలో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రిచే ప్రారంభించే విధంగా నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
 
లగ్జరీ, స్పీడ్‌ బోటింగ్‌
పర్యాటకులు హాయిగా నదిలో విహారించేందుకు సుమారు నాలుగు లగ్జరీ బోట్లను నిర్వహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క బోటులో సుమారు 8మంది కుటుంబసభ్యులు వాటిపై విహరించనున్నారు. యువతీ యువకులు స్పీడ్‌ బోటింగ్‌ చేసేందుకు అనువైన కియాస్కి బోట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
 
ప్రత్యేకతలు ఇవీ..
  • పర్యాటకులను ఆకర్షించేందుకు నది మద్య రెస్టారెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొన్ని ప్లోటింగ్‌ రెస్టారెంట్లు, క్యాండిల్‌ డిన్నర్‌ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు.
  • ఉదయం టికెట్‌ తీసుకుని నదిలోకి వెళ్లిన జంట రాత్రి కూడ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్ఫాహారం, వివిధ రకాల చైనీస్‌ ఐటెమ్స్‌, స్నాక్స్‌ బార్‌, నూతన దంపతులు ఏకాంతంగా గడిపే విధంగా నీటిపైనే అన్ని వసతులతో కూడిన గదులు నిర్మాణం చేస్తున్నారు.
  • నది ఒడ్డున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెరినా పిష్‌ అక్వేరియంను ఏర్పాటు చేస్తున్నారు. నిన్న పిల్లలను ఆకర్షించే విధంగా క్వాడ్‌ బైక్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం..
జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం
జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. పవిత్ర సంగమంలో వాటర్స్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఐ గుమ్మడపు పాపారావు నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న లగ్జరీ బోటింగ్‌ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాలువుల సుందరీకరణ, రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌లలో పుడ్‌ ప్లాజాలు, షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పవిత్ర సంగమంనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు లగ్జరీ బోటింగ్‌, చిన్న పిల్లలకు ట్రంప్‌ పోలింగ్‌, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంగమంను మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపోందించనున్నట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...