Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

Water sports to be developed at Pavitra Sangamam

THE HANS INDIA |  
 

grabon.jpg

col_9747.jpg
District Collector B Lakshmikantham inspecting the high speed boats and aquarium at Punnami Ghat in Ibrahimpatnam on Thursday
 
 

Vijayawada: Denizens bored of visiting Punnami Ghat for boating and recreation will have one more destination to get entertainment and relaxation. The district administration is developing Pavitra Sangamam as a tourist hub by signing an MoU with a private water sports company.

 

The company is arranging high speed boats, floating restaurant, beautiful chairs and tables on the banks of Krishna river. The Andhra Pradesh Tourism Development Corporation is operating boating for many years at Punnami Ghat. Now, the recreation facilities will be extended to Ibrahimpatnam mandal also with the development of infrastructure in Pavitra Sangamam which is the confluence of Krishna and Godavari rivers.

 

District Collector B Lakshmikantham on Thursday inspected the new high speed boats and infrastructure being developed at Pavitrasangamam on the banks of Krishna river. These development works were taken up after signing an MoU with a private water sports company to promote tourism and develop water sports in Krishna river.  

 

Candle light dinner and aquarium will be additional attractions at Pavitra Sangamam. Pavitra Sangamam junction is well connected by four lane highway from Vijayawada city and just 20 minutes’ drive in car. The State government is also planning to construct mega bridge in Ibrahimpatnam to connect the mandal to the new capital Amaravati at a cost of Rs 800 crore

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
చంద్రబాబుతో బోయపాటి భేటీ
 
 
636427524946063581.jpg
అమరావతి: విజయవాడ పవిత్ర సంగమం వద్ద శ్రీ వెంకటేశ్వర ఆలయ శిఖర నిర్మాణానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సీఆర్డీఏ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలేశుని మూడు నామాలు, దానిపైన ఆలయ గోపురం ఉండేలా, వీటి కింది నుంచి నది ప్రవాహం సాగేలా ఈ నిర్మాణం ఉంటుంది.దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రికి వివరించారు..గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి పడుతున్నామని, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేయడానికి పూనుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. బోయపాటి సమర్పించిన ఆకృతులపై ఆగమ శాస్త్ర నిపుణులు, టీటీడీ పండితులతో చర్చించి పదిరోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అమరావతిలోనే తిరుమలేశుని ఆలయాన్ని తిరుమల తరహాలో దేదీప్యంగా వుండేలా నిర్మించాలన్నది తన ఆలోచనగా తెలిపారు. రాజధానిలోని పర్వత ప్రాంతంలో వున్న వైకుంఠపురం అందుకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్టు తెలిపారు
Link to comment
Share on other sites

లాహిరి.. లాహిరి.. లాహిరిలో..
 
 
636430331264139896.jpg
  • అమరావతిలో పడవ ప్రయాణం
  • దుర్గాఘాట్‌ టు పవిత్రసంగమం
  • 8 ప్రాంతాలు, 20 కిలోమీటర్లు
  • ప్రకృతిలో 2 గంటల బోటుషికారు
  • ఉత్సాహంగా టూరిస్టుల విహారం
  • వారాంతాల్లో మరిన్ని ఆకర్షణలు
  • లాహిరి.. లాహిరి.. లాహిరిలో..
  • అమరావతిలో పడవ ప్రయాణం
  • దుర్గాఘాట్‌ టు పవిత్రసంగమం
  • 8 ప్రాంతాలు, 20 కిలోమీటర్లు
  • 2గంటలపాటు ప్రకృతిలో బోటుషికారు
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంత ప్రతిష్ఠ వచ్చిందో... అంతే స్థాయిలో ‘భవానీ ఐల్యాండ్‌’కీ మంచి గుర్తింపు లభించింది. అది ఎంతగా అంటే, విజయవాడకు వచ్చిన పర్యాటకులు కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత.. చూడాలని ఇష్టపడే రెండో ప్రదేశం ‘భవానీ ఐల్యాండ్‌’. దీన్ని దృష్టిలో ఉంచుకొని, మరింత ఆహ్లాదకరమైన అనుభవాన్ని పర్యాటకులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులోభాగంగానే శుక్రవారం నుంచి ‘9boat1.jpgఅద్భుత బోటు షికారు’కి శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనం చేసుకొన్న తరువాత.. ఆలయం ఎదురుగానే ఉన్న దుర్గాఘాట్‌లో బోట్లు పర్యాటకులను ఆహ్వానిస్తాయి. రెండు గంటలపాటు సాగే నదీయానంలో తొలుత పున్నమి ఘాట్‌కి బోటు చేరుకొంటుంది. అక్కడ నుంచి భవానీ ఐల్యాండ్‌కి, అటునుంచి మడ అడవుల మీదగా నడుస్తుంది. ఈ దారిలో రకరకాల పక్షులను, నీటి కుక్కలు తదితర జంతువులను చూస్తుండగానే.. గొల్లపూడి అంజనేయ స్వామి ఆలయానికి చేరిపోతారు. అక్కడ దర్శనాలు అయినతరువాత నేరుగా.. పవిత్ర సంగమం చేరుకొంటారు. ఇది కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రదేశం. టూరిజం కోణంతో పాటు.. ఈ సంగమ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ చూసేలా బోటు మార్గాన్ని నిర్ణయించారు. అక్కడున్న శివాలయాన్ని దర్శించుకొని.. వెనుదిరుగుతారు. ఇలా ఎనిమిది ప్రాంతాలను 20 కిలోమీటర్ల మేర చుట్టుకొంటూ.. బోటు షికారు సాగుతుంది.
 
అడుగు అడుగున ఉత్కంఠ
బోటు ప్రయాణం మొదలయిన తొలిక్షణం నుంచీ అనిర్వచనీయ దృశ్యాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. చుట్టూ కొండలు, పచ్చని ప్రదేశాలు, వన్య జీవన హొయలు, భక్తిభావం నింపే కోవెలలు.. ఒక్కసారిగా మనల్ని ప్రకృతిలోకి తీసుకెళతాయి. మనం కృష్ణానదిలో ఉన్నామా.. లేక గోదారి పాపికొండలను దర్శిస్తున్నామా అన్న సంభ్రమాశ్చర్యాలు కల్గిస్తూ, అడుగు అడుగునా ఉత్కంఠని ఈ షికారు పెంచుతోంది. ప్రతి గంటకు ఒక బోటు దుర్గాఘాట్‌లో సిద్ధంగా ఉంటుంది. ఒక ట్రిప్‌లో వందమంది ప్రయాణించే వీలుంది. తలకు రూ.300ని అమరావతి బోటింగ్‌ క్లబ్‌(ఏబీసీ) యాజమాన్యం 9boat5.jpgవసూలు చేస్తుంది. వారాంతార్లో మ్యూజిక్‌తో పాటు బుర్రకథ తదితర వినోద కాలక్షేపం ఉంటుంది. పర్యాటకులు కోరుకొన్న ఆహారం అందిస్తున్నామని, వారి ఆనందమే పరమావధిగా ట్రిప్‌లు వేస్తున్నామని ఏబీసీ ఎండీ పవిత్ర తెలిపారు. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్న 20 రోజుల్లోపే ‘బోటు షికారు’ ప్రాజెక్టుని అందుబాటులోకి తెచ్చామని ఏబీసీ సీఈవో తరుణ్‌ కాకాని తెలిపారు.
 
అద్భుత అనుభవం
బోటు షికారు చేయడం అద్భుత అనుభవం. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన పడవ ప్రయాణాన్ని నేను మరవలేను. పర్యాటకులకు మరింత ఆనందానుభూతులను అందించేలా.. భవానీ ఐల్యాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. - లక్ష్మీకాంతం, కృష్ణాజిల్లా కలెక్టర్‌
 
పవిత్ర భావన కలిగింది
కృష్ణా - గోదావరి నదుల అనుసంధాన ప్రాంతం.. పవిత్ర సంగమాన్ని చూడాలన్న ఆసక్తితో కుటుంబమంతా వచ్చాం. చుట్టూ పచ్చని ప్రాంతం, కొండలతో అద్భుతమైన వాతావరణంలో మా ప్రయాణం సాగింది. పవిత్ర అనుభూతిని మిగిల్చింది. - వీరరాఘవరావు, మదురై కలెక్టర్‌
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...