Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

 

  • పవిత్ర సంగమం దగ్గర వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం
  • పవిత్ర సంగమం దగ్గర శాశ్వతంగా పవిత్ర హారతి అంగీకారం

 

Good decision.. This makes it another popular pilgrimage in AP..

Link to comment
Share on other sites

Gateway.jpg

అమరావతిలో రోడ్లు, మెట్రో నిర్మిస్తాం
 
  • చైనా, బ్రిటన కంపెనీల ఆసక్తి 
  • సీఎం చంద్రబాబుకు లేఖ 
 
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో అంతర్గత రోడ్లు, విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు నిర్మాణానికి చైనా, బ్రిటన కంపెనీలు సంయుక్తంగా ఆసక్తి చూపించాయి. చైనాకు చెందిన సీఆర్‌-3 కంపెనీ, బ్రిటనకు చెందిన సైనోఫోర్టోన కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్టులు చేపడతామని ప్రతిపాదించాయి. త్వరలోనే తమ బృందాన్ని అమరావతికి పంపించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబు కొన్ని నెలల క్రితం చైనా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద 500 కంపెనీల్లో 71వ స్థానంలో ఉన్న చైనా రైల్వేనెంబర్‌-3(సీఆర్‌-3) ఇంజనీరింగ్‌ కంపెనీని సందర్శించారు.
 
ఏపీలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. అనంతరం సీఆర్‌-3 కంపెనీ.. బ్రిటనకు చెందిన సైనోఫోర్టోన కంపెనీలు సంయుక్తంగా సీఎం చంద్రబాబుకు ఇటీవల ఒక లేఖ రాశాయి. ఏపీకి సంబంధించి రెండు ప్రాజెక్టులపై తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నాయి. అమరావతిలో అంతర్గత రోడ్లు, ఇబ్రహీంపట్నం దగ్గరి నుంచి రాజధానికి కృష్ణానదిపై నిర్మించే వంతెన.. విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో ప్రాజెక్టులపై ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాయి. సైనోఫోర్టోన కంపె నీ బ్రిటనతో పాటు చైనాలోను పలు ప్రభు త్వ పనులను చేస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం విజయవాడ మెట్రోను కేంద్ర ప్రభుత్వ నిధులతోను, విశాఖపట్నం మెట్రోను పీపీపీ పద్ధతిలోను నిర్మించే ఆలోచనలో ఉంది. మరోవైపు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి నుంచి కొత్త రాజధాని అమరావతికి నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఈ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.
 
అంతర్గత రోడ్ల నిర్మాణంపైనా తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. ఈ కంపెనీల ప్రతిపాదనపై పరిశీలించాలని సీఎం చంద్రబాబు మెట్రో కార్పొరేషన, సీసీడీఎంసీలకు సూచించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు అమరావతికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీల ప్రతినిధులను కోరింది. త్వరలోనే తమ కంపెనీల తరఫున నిపుణుల బృందాన్ని పంపిస్తామని సదరు కంపెనీలు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 5 weeks later...
పవిత్ర సంగమ స్థలం..సుందరీకరణ
 
636205768733495945.jpg
(ఆంధ్రజ్యోతి, అమరావతి) 
ఇబ్రహీంపట్నం పరిధిలోని పవిత్ర సంగమ ప్రదేశంలో వచ్చేనెలలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సును పురస్కరించుకుని చేపట్టిన సుందరీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ పనులను శుక్రవారం ఆంధ్రప్రదేశ అమరావతి అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీ) ఎండీ, చైర్‌పర్సన లక్ష్మీపార్థసారధి పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని ల్యాంకో కూడలి, అక్కడి నుంచి పవిత్ర సంగమస్థలికి వెళ్లే వివిధ ప్రధాన రహదారులతోపాటు ఆ ప్రదేశంలోని వివిధ ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఏపీ ఏడీసీ అధికారులతో కలసి చూసిన ఆమె ఈ సందర్భంగా వారికి పలుసూచనలు చేశారు. అనుకున్న ప్రకారం ఈ నెలాఖరుకల్లా పనులన్నింటినీ ముగించి, సదస్సుకు దేశవిదేశాల నుంచి హాజరు కానున్న ప్రతినిధులకు ఈ ప్రాంతం నేత్రపర్వం కలిగించేలా చూడాలన్నారు. అదే సమయంలో పనులన్నీ నిర్ణీత నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ప్రధానంగా సదస్సు వేదిక ప్రదేశాన్ని ఆకర్షణీయమైన పూలమొక్కలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఆమె వెంట ఏపీ ఏడీసీ అటవీ, నగర పచ్చదన అభివృద్ధి విభాగాధిపతి బి.మురళీకృష్ణ, అటవీ విభాగాధికారులు ఎం.ఓబుల్‌రెడ్డి, పి.మారుతీప్రసాదరావు, సీఆర్డీయే ల్యాండ్‌స్కేప్‌, పర్యావరణ విభాగపు డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...