Jump to content

pattiseema

Recommended Posts

పర్యాటక కేంద్రంగా పట్టిసీమ
10-06-2018 02:28:49
 
636641945384169304.jpg
  • ఐదు జోన్లుగా అభివృద్ధి చేయాలి
  • లక్ష హోటల్‌ గదుల నిర్మాణమే లక్ష్యం: సీఎం
అమరావతి, ఏలూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మార్చాలని పర్యాటకశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం ఆథారిటీ బోర్డు సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పట్టిసీమ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా ఐదు జోన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిత్రపటాలు, బొమ్మలు, ఆట స్థలం, ఫుడ్‌ జోన్‌, గోల్ఫ్‌ కోర్టుల వంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటకుల కోసం రిసార్ట్స్‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం సేవారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం లక్ష హోటల్‌ గదుల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. 2017లో రాష్ట్రంలో 16.54 కోట్ల మంది టూరిస్టులు పర్యటించారని, 2016తో పోల్చితే గత ఏడాది 1.2 కోట్ల మంది అధికంగా పర్యటించారని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా వివరించారు
Link to comment
Share on other sites

గోదావరికి జలకళ
11-06-2018 08:47:18
 
636643036501138631.jpg
వాజేడు(జయశంకర్ భూపాలపల్లి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి జలకళను సంతరించుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. మూడు నెలలుగా వెలవెలబోయిన గోదావరి ఇప్పుడు కళకళలాడుతోంది. మండలంలోని పూసూరు వంతెన వద్ద గోదావరి నీటి మట్టం కొంతమేర పెరిగింది.
 
Link to comment
Share on other sites

ఎత్తిపోతలకు జలస్పర్శ 
గోదావరిలో పెరుగుతున్న నీటి ప్రవాహం 
పురుషోత్తపట్నం పథకం వద్దకు చేరిన వైనం 
- మట్టికట్టను తొలగించిన అధికారులు- నీటి విడుదలపై అమరావతిలో సమావేశం నేడు 
eag-top1a.jpg

సీతానగరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతం నుంచి గోదావరికి నీటి ప్రవాహం పెరగడంతో జిల్లాలో ఎత్తిపోతల పథకాల వద్ద క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. సీతానగరం మండలం 
పురుషోత్తపట్నం వద్ద రూ.1,638 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల వద్దకు గోదావరి నీటి ప్రవాహం చేరడంతో అక్కడ వేసిన మట్టికట్టను జలవనరుల శాఖ అధికారులు బుధవారం తొలగించారు. 
ఎత్తిపోతల పథకం పనులకు గోదావరి నీటివల్ల ఆటంకం కలగకుండా గతంలో ప్రవాహానికి అడ్డుగా మట్టికట్టను వేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం వల్ల ఈ మట్ట్టికట్ట కొట్టుకొచ్చి పంపుల్లోకి చేరితే ఎత్తిపోతలకు సాంకేతికపరమైన అవరోధాలు ఏర్పడతాయి. దీంతో యంత్రాలతో దీన్ని తొలగించినట్లు జలవనరుల శాఖ డీఈ వెంకట్రావు తెలిపారు. దీంతో ఎత్తిపోతల పంపుల వద్దకు గోదావరి నీరు సవ్యంగా  చేరిందని చెప్పారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు తగ్గకుండా ఉంటేనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి 10 పంపుల ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయగలమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద 13.6 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీకి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు. ఖరీఫ్‌లో గోదావరి కుడిగట్టున పట్టిసీమ, ఎడమ గట్టున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని సరఫరా చేయడంపై గురువారం అమరావతిలో జరిగే జలవనరుల శాఖ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చేరిందని చెప్పారు. 

Link to comment
Share on other sites

గోదారికి ప్రవాహ ఉద్ధృతి 
ప్రాణహితలోకీ భారీగా వరద 
  కాళేశ్వరం వద్ద  4.6 మీటర్ల నీటిమట్టం 
  మేడిగడ్డ వద్ద 80 వేల క్యూసెక్కుల ప్రవాహం 
13ts-main9a.jpg

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: తెలంగాణ రైతాంగానికి శుభవార్త. మహారాష్ట్ర సహా పై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాణహిత నదిలోకీ వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద బుధవారం  గోదావరి నీటిమట్టం 4.6 మీటర్లకు చేరుకుంది.  మరోవైపు కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద ప్రవాహం పెరిగింది. బుధవారం 80 వేల క్యూసెక్కులకుపైగా ఉంది. ప్రాణహితకు వరద అంతకంతకు పెరుగుతుండటంతో.. మేడిగడ్డ వద్ద నిర్మిస్తోన్న బ్యారేజి పనులకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పట్నుంచి ప్రాణహిత నుంచి వరద కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గోదావరిలో ప్రస్తుతం శ్రీరామసాగర్‌ వద్ద 13 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా...కృష్ణా నదిలో నామమాత్రంగానే ఉంది. జూరాలకు సుమారు నాలుగువేల క్యూసెక్కుల నీరు వస్తుండగా..తుంగభద్రకు క్రమంగా వరద పెరుగుతోంది. తుంగభద్రలో బుధవారం ఉదయం 19 వేల క్యూసెక్కులున్న ప్రవాహం..సాయంత్రానికి 29 వేలకు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా మానేరులోనూ వరద తాకిడి పెరిగింది. ఈ కారణంగా ఖమ్మంపల్లి-తాడిచెర్ల మానేరు వంతెన వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు తెగిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఓడెడ్‌ మానేరు నుంచి వేసిన మట్టి రోడ్డు కూడా తెగడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో చీకుపల్లి వాగుపై ఉన్న బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

13ts-main9b.jpg
Link to comment
Share on other sites

పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి విడుదల
16-06-2018 17:44:25
 
అమరావతి: పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంప్‌లను జలవనరుల శాఖ ఆన్‌ చేసింది. 4 పంప్‌లను ఆన్‌ చేసి 700 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో నారుమళ్లు, చెరువులు నింపుకునేందుకు తాగు నీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. నీటి విడుదలను చీఫ్‌ ఇంజినీర్‌ రమేష్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.
Link to comment
Share on other sites

55 minutes ago, sonykongara said:

Super news 

Link to comment
Share on other sites

why not all pumps? more water is coming.

slow ga delta lo anni kalva gatlu nanthayi ga

peak season lo anni areas ki fast ga water velthayi

గోదావరికి కొత్తనీరు! 
అర్ధరాత్రి వరద పెరగడంతో నీట మునిగిన జాలర్ల గుడిసెలు

కుక్కునూరు, న్యూస్‌టుడే: గోదావరికి కొత్త నీరు చేరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో వారం రోజుల కిందట భారీ వర్షాలు కురవటంతో.. ఆ నీరు ఇప్పుడు దిగువకు చేరుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగాయి. ఈ ప్రభావంతో గురువారం రాత్రి వరద అకస్మికంగా పెరగటంతో వింజరం రేవులో ఉన్న మత్స్యకారుల గుడిసెలు నీటమునిగాయి. చేపల కోసం నదిలో వేసిన వలలు కొట్టుకుపోయాయని జాలర్లు వాపోయారు.

డయాఫ్రం వాల్‌ మీదుగా ప్రవహిస్తున్న నీరు 
16weg-9.jpg

పోలవరం: నదీ పరివాహక ప్రాంతాల్లో కురసిన వర్షాలకు గోదావరి లోకి నీరు వచ్చి చేరింది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని డాయాఫ్రం వాల్‌ నిర్మాణం మీదుగా ప్రవహిస్తోంది. దానికి ఎగువన పడుతున్న కాపర్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. గోదావరిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్నటి వరకూ డయాఫ్రం వాల్‌ నిర్మాణం కోసం గోదావరి మధ్యలో ఉన్న భారీ యంత్రాలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతున్నారు.

గోదావరిలో నీట మునిగిన ట్రాక్టర్లు

నిడదవోలు: మండలంలోని పందపర్రులో ఇసుక ర్యాంపు వద్ద గోదావరి ఉద్ధృతికి ఐదు ట్రాక్టర్లు శనివారం నీట మునిగాయి. ధవళేశ్వరం ఆర్ధర్‌ కాటన్‌ బ్యారేజీ నుంచి 3వేల క్యూసెక్కుల అదనపు జలాలను దిగువకు సముద్రంలోకి విడుదల చేశారు. అదే సమయంలో ఇసుక ర్యాంపునకు పలు వాహనాలు ఇసుక కోసం వెళ్లాయి. ఈ నీరు ఒక్కసారిగా ర్యాంపు వద్దకు చేరడంతో కొన్ని వాహనాలు బయటకు రాగా మరో 5 ట్రాక్టర్లు నది మధ్యలోనే ఉండిపోయాయి. వెంటనే సంఘటన స్థలానికి తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ డి. ఈశ్వరరావు అక్కడికి చేరుకొని వాటిని బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Link to comment
Share on other sites

9 hours ago, rk09 said:

3000 cuesecs already drained to sea ?

Link to comment
Share on other sites

Happy to see the Godavari water utilization and interlinking of Godavari with Krishna. Wouldn't it be more lucrative from price point of view to have different crops than Vari? Wouldn't it be good for soil fertilization to avoid Vari in a row? I wonder whether Agriculture Department and farmers are thinking about these 2 things?

Link to comment
Share on other sites

9 minutes ago, Hello26 said:

2 things brother.... cultivation goes as clusters. Mee pakka madi lo tegulu meeku kuda vastundi..... generally speaking farmers depend on the money they gain from harvest and it is a huge risk to shift crops. Majority of them are small/medium/kavulu raitulu.... if something goes wrong, they sometimes have to sell their lands. Even if they try new things and if there is no market, it’s a gone case. There are many ifs and buts at ground level when it comes to farming and business.

Youtube lo videos chusi annaru ala cheyyali ani ledu.... there is a difference between guys who travel in a luxury boat and others who travel on “teppa “

Edited by sskmaestro
Link to comment
Share on other sites

59 minutes ago, sskmaestro said:

Hmmm, okay. At least pappu dinusulu sambandhinchina crops veste anna better yemo ga

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

2 things brother.... cultivation goes as clusters. Mee pakka madi lo tegulu meeku kuda vastundi..... generally speaking farmers depend on the money they gain from harvest and it is a huge risk to shift crops. Majority of them are small/medium/kavulu raitulu.... if something goes wrong, they sometimes have to sell their lands. Even if they try new things and if there is no market, it’s a gone case. There are many ifs and buts at ground level when it comes to farming and business.

Youtube lo videos chusi annaru ala cheyyali ani ledu.... there is a difference between guys who travel in a luxury boat and others who travel on “teppa “

as a farmer its very difficult to go for different crops

govt. needs to plan and educate the farmers - like areas and crops. Mainly subsidies, insurance, fare price

ivi back fire ayye chances kuda vunnayi. edanna panta ki manchi rate vatchi inko panta ki rakapothe farmers andaru reverse avutharu

sahakara vyavasayam type lo okati teesukuni ravali ani 2007-2008 time lo govt. plan chesindi - but yenduko munduku vellala

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

Aparalu sagu rendo pantaga vestaru bro.... 6 tadulu anukunta 

vari and cheruku - first crop

depends on cheruku - aparalu/minumulu - second crop

but cheruku ki pakka polam vallu kuda vesthe advantage otherwise sometimes kulli pothundi

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...