Jump to content

pattiseema

Recommended Posts

పట్టిసీమ చెంత... ప్రజాప్రతినిధుల పులకింత
పోలవరం సందర్శనలో   64 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఈనాడు, ఏలూరు, అమరావతి

    ఎప్పుడో స్కూల్లోనో, కాలేజీలోనో చదివే రోజుల్లో బస్సు వేసుకుని వినోద యాత్రకో, విజ్ఞాన యాత్రకో వెళ్లుంటారు..! మళ్లీ ఇన్నేళ్లకు వారికి అలాంటి అవకాశం వచ్చింది. చట్ట సభల సభ్యులు మరోసారి చిన్న నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ... గురువారం ఉదయం విజయవాడ నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో పోలవరం, పట్టిసీమ యాత్రకు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు శాసనసభ, శాసన మండలి సభ్యులు మొత్తం 64 మంది ఇందులో పాలుపంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దుగ్గిరాల దగ్గర, ఏలూరు ఎంపీ మాగంటి బాబు కొయ్యలగూడెంలో వీరికి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. బయల్దేరేటప్పుడే అల్పాహారం తీసుకున్నామని ప్రజా ప్రతినిధులు చెప్పినా... తమ  ఆతిథ్యం తప్పక స్వీకరించాల్సిందేనని సాదరంగా ఆహ్వానించారు. హిందుపురం ఎమ్మెల్యే,  సినీనటుడు బాలకృష్ణ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి లోకేష్‌లు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రాయలసీమ నేతల్లో అమితానందం
ఈ పర్యటనలో రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమితానందభరితులయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల డెలివరీ పాయింట్‌ నుంచి పోలవరం కుడికాలువలోకి 24 పంపులు ద్వారా నీరు ప్రవహిస్తున్న తీరును చూసి పరవశులయ్యారు. కృష్ణా డెల్టాకు ఇక్కడి పట్టిసీమ జలాలు అందుబాటులోకి రావడంతో శ్రీశైలం నుంచి తమ రాయలసీమకు లబ్ధి కలుగుతోందని పేర్కొన్నారు. మంత్రి పరిటాల సునీత మరింత భావోద్వేగానికి గురయ్యారు.

నాన్నగారితో షూటింగ్‌కి వచ్చా: బాలకృష్ణ
శ్రీనివాస కల్యాణం, సీతారామ కల్యాణం సినిమాల కోసం తాను పట్టిసీమ ప్రాంతానికి వచ్చిన రోజుల్ని సినీ నటుడు బాలకృష్ణ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ‘‘శ్రీనివాస కల్యాణం షూటింగ్‌ కోసం నేను నాన్నగారు ఎన్టీఆర్‌తో కలసి ఇక్కడకి వచ్చా. ఆ సినిమాలో నారదుడిగా నటించా’’ అని అన్నారు. తాను హీరోగా నటించిన సీతారామకల్యాణం సినిమా చిత్రీకరణ నాటి జ్ఞాపకాల్ని ఆయన సహచర సభ్యులతో పంచుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెదేపా ప్రభుత్వం కేవలం సంవత్సర కాలంలో పూర్తిచేయడం నిజంగా రికార్డన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టుని చూసి తామంతా పో‘లవర్స్‌’గా మారిపోయామని మంత్రి కాలవ శ్రీనివాసులు చమత్కరించారు.
రాయలసీమకు ఊరట: మంత్రి లోకేష్‌
రాయలసీమ పంటల పరంగా అభివృద్ధి చెందడానికి పట్టిసీమ కారణమని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి నారా లోకేష్‌ అన్నారు. దీన్ని పూర్తి చేయడంలో సీఎంతోపాటు జలవనరుల మంత్రి దేవినేని ఉమా ఎంతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

స్పిల్‌వే నిర్మాణంపై ప్రశంసలు...
పట్టిసీమ ఎత్తిపోతల పథకం చూసిన అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. స్పిల్‌వే నిర్మాణ పనులు, హిల్‌వ్యూ కొండ నుంచి ఎర్త్‌కంర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులను పరిశీలించారు. స్పిల్‌వే పనులు వేగాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. పర్యటనను కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ కోటేశ్వర్రావు, ఎస్పీ రవిప్రకాష్‌లు పర్యవేక్షించారు.

Link to comment
Share on other sites

పట్టిసీమపంట
కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం కోతల పనుల్లో తీరికలేకుండా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నెలరోజుల ముందుగానే గోదావరి నీళ్లు తరలించడంతో.. గతంలో కంటే 3వారాల ముందే వరి చేతికందింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రామాల్లో.. పూర్తిగా సిద్ధమై బంగారు వర్ణంలో కళకళలాడుతున్న వరి పొలాలు ఒకవైపు.. యంత్రాల సాయంతో జోరుగా కోతలు సాగుతున్న దృశ్యాలు మరోవైపు కనిపిస్తున్నాయి. గతంలో శ్రీశైలం నుంచి నీరు ఆలస్యంగా రావడం.. పంట చేతికొచ్చే సమయంలో తుపానుల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లేంది. ఈ దఫా ముందస్తుగానే వరి కోతలు పూర్తవుతుండటంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
    - ఈనాడు, అమరావతి

Link to comment
Share on other sites

Eenadu - 28 Nov 2017 , Amaravti Dt Edition

ఒడ్డునపడ్డ డెల్టా రైతాంగం 
ఆదుకున్న పట్టిసీమ మొదలైన వరి కోతలు 
రబీపైనే అన్నదాతల బెంగ సాగునీటికి లభించని భరోసా 
ఈనాడు - విజయవాడ 

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతులు ఒడ్డున పడ్డారు. గత ఐదు నెలల నుంచి నిరాఘాటంగా గోదావరి జలాలు ఇస్తుండడంతో సాగునీటి కొరత తీరింది. దీంతో తూర్పు కాలువ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పొలాల్లో అప్పుడే కోతలు మొదలయ్యాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోవడంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం తొణికిసలాడుతోంది. తర్వాతి పంటపై ఆందోళన నెలకొంది. రబీలో ఏ పంట వేయాలన్న దానిపై అస్పష్టత నెలకొంది. రబీలోనూ వరి వేసుకోవడానికి సాగునీరు ఇవ్వాలని కోరుతున్నారు. సాగునీటి కొరత దృష్ట్యా దీనిపై అధికారులు హామీ ఇవ్వడం లేదు. వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అపరాల విత్తనాల సరఫరాను ప్రారంభించారు. మినుములు ధర పతనమవడంతో దీనిని వేసేందుకు రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. పట్టిసీమ నుంచి నీరు తగ్గిపోవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చివరి ఆయకట్టు భూములలో పంట చేతికొచ్చే వరకు నీటిని అందించే దానిపైనే అధికారులు దృష్టి సారించారు. గత ఏడాది ఖరీఫ్‌లో దిగుబడి బాగా వచ్చిందన్న ఆనందం రబీలో ఆవిరైంది. అపరాల పంట తెగుళ్లతో నాశనమైంది. దీంతో నష్టాలు మూటగట్టుకున్నారు.

127.26 టీఎంసీల నీరు 
కృష్ణా డెల్టాకు ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే సాగునీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి డెల్టాలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో 11.31 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. తూర్పు కాలువ పరిధిలో 5.60 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలలో పంటలు వేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్దగా నీరు లేకపోయినా పట్టిసీమ నుంచి ఎత్తిపోసి కాలువలకు ఇచ్చారు. దీంతో గత ఏడాదిలా నీటికి ఆటంకాలు లేకుండా ఇచ్చారు. ఫలితంగా నాలుగు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. 99 శాతం పొలాల్లో నాట్లు పడ్డాయి. తూర్పు కాలువ కింద ఉన్న బందరు కాలువ, కేఈబీ కింద వంద శాతం, రైవస్‌, ఏలూరు కాలువ కింద 99 శాతం వరి వేశారు. పశ్చిమ కాలువ కింద వివిధ కాలువల పరిధిలో 98 శాతం నాట్లు పడ్డాయి. తాజా గణాంకాల ప్రకారం ఇంకా 14,990 ఎకరాలలో నాట్లు పడాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 127.26 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎక్కువ నీటిని పట్టిసీమ నుంచే ఇచ్చారు. దాదాపు 88.5 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోశారు.

ఆరుతడి పంటలపై అవగాహన 
రబీలో సాగునీటి కొరత దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభమై ముమ్మరంగా సాగుతున్నాయి. పంట దాదాపు చివరి దశకు వచ్చింది. గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్‌లో ఇప్పుడే మొదలయ్యాయి. తర్వాత అపరాలు సాగుచేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. నీరు తగినంత లేదని వరి వేయొద్దని సూచిస్తున్నారు. రెండు జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలో సుమారు 9 లక్షల ఎకరాలలో రబీలో పంటలపై సందిగ్ధత నెలకొంది. ఇంకా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టుకు నీటిని సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో ఈ సీజన్‌కు నీరు ఇవ్వలేని పరిస్థితి. రెండో పంటకు కూడా వరి వేసుకోవడానికి వీలుగా నీటిని ఇవ్వాలని డెల్టా రైతాంగం గట్టిగా కోరుతోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అధికారులు అపరాల విత్తనాలను తెప్పించారు. వీటి పంపిణీని ప్రారంభించనున్నారు. గత ఏడాది అపరాలు వేసి తీవ్రంగా నష్టపోయారు.

భయపెడుతున్న గత అనుభవాలు 
గత ఏడాది రబీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి తర్వాత మినుము వేశారు. రెండు జిల్లాల్లో దాదాపు 2.50 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ మార్పుల, తుపాన్ల కారణంగా పంటకు తెగుళ్లు సోకాయి. ఫలితంగా చాలా వరకు పంట పాడైంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 39,544 హెక్టార్లలో సోకింది. అత్యధికంగా బాపులపాడు మండలంలో 5,562 హెక్టార్లు, ఉంగుటూరులో 5,280 హె., ముదినేపల్లి మండలంలో 4,800 హెక్టార్లు, పమిడిముక్కలలో 4,408 హెక్టార్లలో దెబ్బతిన్నది. దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించే సరికే బాగా వ్యాప్తి చెందింది. దీని వల్ల పంటే చేతికందే అవకాశం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌లో ఇదే తరహా అనుభవాలు ఎదురవుతున్నాయి. నష్టపరిహారం విషయంలోనూ అన్నదాతలకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. గణన మొదలయ్యే నాటికే రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని రైతులు పంటను పీకేశారు. అప్పటికి పంట ఉన్న రైతుల పేర్లనే అధికారులు నమోదు చేశారు. దీంతో అటు పంట పోయి.. ఇటు పరిహారం అందక ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు మినుముల ధర భయపెడుతోంది. ఇటీవల అమాంతం పడిపోయింది. క్వింటాలు ధర రూ. 4,700 పలుకుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రూ. 5,400 కు కొంటున్నారు. గత ఏడాది రూ. 16,000 పలికిన ధర ఈ ఏడాది బాగా పడిపోయింది.

ఇంకా 25 టీఎంసీలు అవసరం 
ఇప్పటి వరకు డెల్టాకు ఇచ్చిన 127.26 టీఎంసీలు కాకుండా ఇంకా చేతికందని పంటకు 25 టీఎంసీలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొమ్మమూరు కాలువ కింద, కృష్ణా జిల్లా దివిసీమలోని అవనిగడ్డ ప్రాంతంలోని చివరి భూముల్లో వరిని ఆలస్యంగా వేశారు. పంట తుది దశలో ఉండడంతో తడులకు నీరు అవసరం ఉంది. ఏలూరు కాలువ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబరు, 15వ తేదీ వరకు రైవస్‌, కేఈబీ, బందరు కాలువలకు జనవరి, 10 వరకు ఇవ్వనున్నారు. పశ్చిమ కాలువకు జనవరి చివరి వరకు నీరు అందనుంది. గోదావరి నదిలో నీటిమట్టం తగ్గడంతో పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయడం తగ్గించారు. ప్రస్తుతం రోజుకు 3వేల క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. డెల్టాలోని సాగునీటికి, తాగునీటికి కలిపి 31 టీఎంసీలు అవసరం ఉంది. ఇందులో తాగునీటికి 6 టీఎంసీలు కావాలి. పట్టిసీమ నుంచి 1.81 టీఎంసీలు మించి వచ్చే అవకాశం లేదు. మిగిలింది సాగర్‌ నుంచి తీసుకోవాల్సి ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 248 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతలలో నాలుగు టీఎంసీలు ఉంది. గోదావరి జలాలు తగ్గడంతో సాగర్‌ నుంచి పులిచింతలకు తరలించి అక్కడి నుంచి ఇస్తున్నారు. రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల మేర పులిచింతల నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నీటితో నాలుగు జిల్లాల్లోని 567 చెరువులను నింపారు. తాగునీటికి ఉద్దేశించిన నీటిని మార్చి నుంచి మే నెలల మధ్య అవసరాన్ని బట్టి విడుదల చేస్తారు.

Link to comment
Share on other sites

ఆదుకొంది.. గోదావరి
పట్టిసీమ జలాలతో గట్టెక్కిన డెల్టా రైతులు
రికార్డు స్థాయిలో దిగుబడులు
gnt-top1a.jpg

అమరావతి: పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతులు ఒడ్డున పడ్డారు. గత ఐదు నెలల నుంచి నిరాఘాటంగా గోదావరి జలాలు ఇస్తుండడంతో సాగునీటి కొరత తీరింది. దీంతో తూర్పు కాలువ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పొలాల్లో అప్పుడే కోతలు మొదలయ్యాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోవడంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం తొణికిసలాడుతోంది. తర్వాతి పంటపై ఆందోళన నెలకొంది. రబీలో ఏ పంట వేయాలన్న దానిపై అస్పష్టత నెలకొంది. రబీలోనూ వరి వేసుకోవడానికి సాగునీరు ఇవ్వాలని కోరుతున్నారు. సాగునీటి కొరత దృష్ట్యా దీనిపై అధికారులు హామీ ఇవ్వడం లేదు. వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అపరాల విత్తనాల సరఫరాను ప్రారంభించారు. మినుములు ధర పతనమవడంతో దీనిని వేసేందుకు రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. పట్టిసీమ నుంచి నీరు తగ్గిపోవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చివరి ఆయకట్టు భూములలో పంట చేతికొచ్చే వరకు నీటిని అందించే దానిపైనే అధికారులు దృష్టి సారించారు. గత ఏడాది ఖరీఫ్‌లో దిగుబడి బాగా వచ్చిందన్న ఆనందం రబీలో ఆవిరైంది. అపరాల పంట తెగుళ్లతో నాశనమైంది. దీంతో నష్టాలు మూటగట్టుకున్నారు.

127.26 టీఎంసీల నీరు :
కృష్ణా డెల్టాకు ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే సాగునీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి డెల్టాలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో 11.31 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. తూర్పు కాలువ పరిధిలో 5.60 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలలో పంటలు వేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్దగా నీరు లేకపోయినా పట్టిసీమ నుంచి ఎత్తిపోసి కాలువలకు ఇచ్చారు. దీంతో గత ఏడాదిలా నీటికి ఆటంకాలు లేకుండా ఇచ్చారు. ఫలితంగా నాలుగు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. 99 శాతం పొలాల్లో నాట్లు పడ్డాయి. తూర్పు కాలువ కింద ఉన్న బందరు కాలువ, కేఈబీ కింద వంద శాతం, రైవస్‌, ఏలూరు కాలువ కింద 99 శాతం వరి వేశారు. పశ్చిమ కాలువ కింద వివిధ కాలువల పరిధిలో 98 శాతం నాట్లు పడ్డాయి. తాజా గణాంకాల ప్రకారం ఇంకా 14,990 ఎకరాలలో నాట్లు పడాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 127.26 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎక్కువ నీటిని పట్టిసీమ నుంచే ఇచ్చారు. దాదాపు 88.5 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోశారు.

ఆరుతడి పంటలపై అవగాహన
రబీలో సాగునీటి కొరత దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభమై ముమ్మరంగా సాగుతున్నాయి. పంట దాదాపు చివరి దశకు వచ్చింది. గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్‌లో ఇప్పుడే మొదలయ్యాయి. తర్వాత అపరాలు సాగుచేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. నీరు తగినంత లేదని వరి వేయొద్దని సూచిస్తున్నారు. రెండు జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలో సుమారు 9 లక్షల ఎకరాలలో రబీలో పంటలపై సందిగ్ధత నెలకొంది. ఇంకా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టుకు నీటిని సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో ఈ సీజన్‌కు నీరు ఇవ్వలేని పరిస్థితి. రెండో పంటకు కూడా వరి వేసుకోవడానికి వీలుగా నీటిని ఇవ్వాలని డెల్టా రైతాంగం గట్టిగా కోరుతోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అధికారులు అపరాల విత్తనాలను తెప్పించారు. వీటి పంపిణీని ప్రారంభించనున్నారు. గత ఏడాది అపరాలు వేసి తీవ్రంగా నష్టపోయారు.

భయపెడుతున్న గత అనుభవాలు
గత ఏడాది రబీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి తర్వాత మినుము వేశారు. రెండు జిల్లాల్లో దాదాపు 2.50 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ మార్పుల, తుపాన్ల కారణంగా పంటకు తెగుళ్లు సోకాయి. ఫలితంగా చాలా వరకు పంట పాడైంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 39,544 హెక్టార్లలో సోకింది. అత్యధికంగా బాపులపాడు మండలంలో 5,562 హెక్టార్లు, ఉంగుటూరులో 5,280 హె., ముదినేపల్లి మండలంలో 4,800 హెక్టార్లు, పమిడిముక్కలలో 4,408 హెక్టార్లలో దెబ్బతిన్నది. దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించే సరికే బాగా వ్యాప్తి చెందింది. దీని వల్ల పంటే చేతికందే అవకాశం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌లో ఇదే తరహా అనుభవాలు ఎదురవుతున్నాయి. నష్టపరిహారం విషయంలోనూ అన్నదాతలకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. గణన మొదలయ్యే నాటికే రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని రైతులు పంటను పీకేశారు. అప్పటికి పంట ఉన్న రైతుల పేర్లనే అధికారులు నమోదు చేశారు. దీంతో అటు పంట పోయి.. ఇటు పరిహారం అందక ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు మినుముల ధర భయపెడుతోంది. ఇటీవల అమాంతం పడిపోయింది. క్వింటాలు ధర రూ. 4,700 పలుకుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రూ. 5,400 కు కొంటున్నారు. గత ఏడాది రూ. 16,000 పలికిన ధర ఈ ఏడాది బాగా పడిపోయింది.

ఇంకా 25 టీఎంసీలు అవసరం
ఇప్పటి వరకు డెల్టాకు ఇచ్చిన 127.26 టీఎంసీలు కాకుండా ఇంకా చేతికందని పంటకు 25 టీఎంసీలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొమ్మమూరు కాలువ కింద, కృష్ణా జిల్లా దివిసీమలోని అవనిగడ్డ ప్రాంతంలోని చివరి భూముల్లో వరిని ఆలస్యంగా వేశారు. పంట తుది దశలో ఉండడంతో తడులకు నీరు అవసరం ఉంది. ఏలూరు కాలువ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబరు, 15వ తేదీ వరకు రైవస్‌, కేఈబీ, బందరు కాలువలకు జనవరి, 10 వరకు ఇవ్వనున్నారు. పశ్చిమ కాలువకు జనవరి చివరి వరకు నీరు అందనుంది. గోదావరి నదిలో నీటిమట్టం తగ్గడంతో పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయడం తగ్గించారు. ప్రస్తుతం రోజుకు 3వేల క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. డెల్టాలోని సాగునీటికి, తాగునీటికి కలిపి 31 టీఎంసీలు అవసరం ఉంది. ఇందులో తాగునీటికి 6 టీఎంసీలు కావాలి. పట్టిసీమ నుంచి 1.81 టీఎంసీలు మించి వచ్చే అవకాశం లేదు. మిగిలింది సాగర్‌ నుంచి తీసుకోవాల్సి ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 248 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతలలో నాలుగు టీఎంసీలు ఉంది. గోదావరి జలాలు తగ్గడంతో సాగర్‌ నుంచి పులిచింతలకు తరలించి అక్కడి నుంచి ఇస్తున్నారు. రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల మేర పులిచింతల నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నీటితో నాలుగు జిల్లాల్లోని 567 చెరువులను నింపారు. తాగునీటికి ఉద్దేశించిన నీటిని మార్చి నుంచి మే నెలల మధ్య అవసరాన్ని బట్టి విడుదల చేస్తారు.

Link to comment
Share on other sites

పట్టిసీమ నుంచి నీటి విడుదల నిలిపివేత
29ap-state10a.jpg
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల మంగళవారం సాయంత్రం నిలిపివేశారు. ఈ ఏడాది జూన్‌ 19న నీటి విడుదలను ప్రారంభించినట్లు ఎత్తిపోతల పథకం పర్యవేక్షణ చీఫ్‌ ఇంజినీరు ఎన్‌.రమేష్‌బాబు చెప్పారు. మొత్తం 24 పంపులు ద్వారా కృష్ణా నదికి  105.80 టీఎంసీల నీరు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. 163 రోజులకు 161 రోజులు పంపులు తిరిగాయని, మిగిలిన రెండు రోజులు కృష్ణా జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా నిలిపివేసినట్లు సీఈ తెలిపారు. విద్యుత్తు బిల్లు సుమారు రూ.167 కోట్ల వరకూ రావొచ్చని, బిల్లు రావాల్సి ఉందన్నారు.
 
రాష్ట్ర వార్తలు

Link to comment
Share on other sites

వ్యవసాయ రంగంలో.. 45శాతం రికార్డు స్థాయి వృద్ధిరేటు

Published Tuesday, 5 December 2017

మచిలీపట్నం, డిసెంబర్ 4: జిల్లాలో వ్యవసాయ రంగం దేశంలోనే అత్యధికంగా 45శాతం వృద్ధిరేటు సాధించినట్లు జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో జిల్లా 22.9 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. 45శాతం వృద్ధిరేటుతో వ్యవసాయ రంగం రికార్డు సృష్టించిందన్నారు. దేశం మొత్తం మీద వ్యవసాయ రంగంలో 6 శాతం కూడా వృద్ధిరేటు లేదని, మన జిల్లాలో మాత్రం 45శాతం వృద్ధిరేటు సాధించడం హర్షణీయమన్నారు. ముందస్తు సాగు కారణంగానే ఈ వృద్ధిరేటు సాధ్యమైందని తెలిపారు. దీనివల్ల తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతు పండించిన దిగుబడులు అమ్మితే తలసరి ఆదాయం భారీగా పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడంలో విఫలమైన వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పంట రుణాల మంజూరు విషయంలో వెనుకబాటు తగదన్నారు. రూ. 3వేల 500 కోట్లు పంట రుణాలు అందించాల్సి ఉండగా కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇవ్వడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉయ్యూరు, పమిడిముక్కల, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం మండలాల్లో నిర్వహించే ‘మీ కోసం’కు గైర్హాజరయ్యే అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 1.39 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని, వీరిలో అర్హులైన వారందరికీ ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గొల్లపూడిలో జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజయవాడ ఆర్డీవోను ఆదేశించారు. మచిలీపట్నంలో కాపు భవన్, బీసీ భవన్‌ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జేసీ-2 పి బాబూరావు, డీఆర్వో బీఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...