Jump to content

pattiseema


Recommended Posts

Ento ee calculations water leka pothe this year Krishna delta Ela undedo adi vadi lesi edo businessman laga counting

power charges <>profit ani chustunaru

 

Ee year water ledu kabatti pattiseema value telavali ante you need to see end to end costs.

 

Antha Pedda direct effect ki ee cost is nothing ani anipinchibdi tana statement choosina taruvatha.

Link to comment
Share on other sites

Ento ee calculations water leka pothe this year Krishna delta Ela undedo adi vadi lesi edo businessman laga counting

power charges <>profit ani chustunaru

 

this is not the only benefit of Pattiseema bro. This one and the other benefits were discussed numerous times on this thread already. @Jaitra and @rk09 were right.  I was trying to contrast pattiseema with KCR's lift schemes. it did not come out well...

Link to comment
Share on other sites

పట్టిసీమ ప్రవాహానికి వందనాలు 
నిరాటంకంగా 100 రోజులు 

ఈ ఏడాది అరుదైన ఘనత 
హనుమాన్‌జంక్షన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే

Link to comment
Share on other sites

2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టిసీమను తెరపైకి తెచ్చింది. ఓవైపు ఎత్తిపోతల పథకం, మరోవైపు పోలవరం కుడికాల్వ నిర్మాణాలను ఏకకాలంలో చేపట్టి శరవేగంతో పూర్తి చేసింది. ఈ క్రమంలో గత మూడేళ్ల నుంచి కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాల్ని తరలిస్తూ, సాగు, తాగు అవసరాలకు ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపట్టారు. ఈ ఏడాది ముందస్తుగానే నీరు విడుదల చేయడంతో రికార్డు స్థాయిలో సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణాడెల్టాలో జూన్‌ నెలలోనే ఖరీఫ్‌ సాగు మొదలైంది. మంగళవారం నాటికి పట్టిసీమ నుంచి వంద రోజుల పాటు నిరాటంకంగా నీరు ప్రవహించడం ఓ మైలురాయిగా నిలిచింది. పట్టిసీమ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆటంకాల్లేకుండా పూర్తి స్థాయిలో అక్కరకు రావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. దీనిని పురస్కరించుకుని రైతాంగం పలుచోట్ల సంబరాలు సైతం నిర్వహించింది.

మొదటి ఏడాది 
2015 ఖరీఫ్‌ నాటికి పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరందించాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా పోలవరం కుడికాల్వ అందుబాటులోకి రాకపోవడంతో సెప్టెంబర్‌ నాటికి గానీ ఇది సాకారం కాలేదు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 8న నీరు విడుదల చేశారు. మొత్తంగా 89 రోజుల పాటు 8.3 టీఎంసీల నీటిని కృష్ణా నదికి మళ్లించి, పంటల్ని కాపాడుకోవడం, తాగు అవసరాలకు వీలుగా చెరువుల్ని నింపేందుకు ఆదరువుగా నిలిపారు.

రెండో ఏడాది 
2016లో పోలవరం కాల్వను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి జులై 15న పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు. మొత్తం 138 రోజుల పాటు కృష్ణానదికి నీరు ప్రవహింపజేశారు. మధ్యలో 10 రోజులు ఆగిపోయింది. ఈ సీజన్‌లో 55.65 టీఎంసీల నీరు మళ్లించడం ద్వారా సాగు, తాగు అవసరాలకు ఇబ్బందిలేకుండా కార్యాచరణ చేపట్టారు.

మూడో ఏడాది 
2017లో జూన్‌19న పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వకు నీరు విడుదల చేశారు. మంగళవారం నాటికి వంద రోజులకు చేరుకుంటుంది. ఇప్పటివరకు 64 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి చేరింది. నవంబర్‌ వరకు నీటి మళ్లింపు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 100 టీఎంసీల మార్కు చేరుకునే అవకాశముంది.

ఆటంకాల్లేవు.. 
పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి చేర్చే క్రమంలో ఈ ఏడాది ఓ అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. మొదటి ఏడాది తమ్మిలేరు అక్విడెక్టు దెబ్బతినడంతో రోజుల వ్యవధిలోనే పట్టిసీమ ప్రవాహం ఆగిపోయింది. పునర్నిర్మాణం తర్వాత తిరిగి నీరు విడుదల చేశారు. రెండో ఏడాది నీరు వదిలిన రెండు వారాల తర్వాత రామిలేరు యూటీకి గండిపడింది. దీనిని పునరుద్ధరించేందుకు పదిరోజులు పట్టింది. ఈ ఏడాది మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా వంద రోజుల పాటు గోదావరి ప్రవాహం గలగలమంటూ కృష్ణానదికి చేరడం విశేషం. ప్రస్తుతం 24 పంపుల ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టా అవసరాల కోసం తరలిస్తున్నారు.

అన్నదాత ఆనందహేల 
గత రెండు సార్లు ఖరీఫ్‌ సాగు గందరగోళంలో పడిన తరుణంలో ఈ ఏడాది జూన్‌లోనే పట్టిసీమ నీరు రావడంతో రైతాంగంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నెలాఖరుకు 10.80 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తవుతాయని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. గోదావరి నీరే కావడంతో పైరు ఏపుగా పెరిగిందని, మరోవైపు ఆక్వాకు నీటి సమస్య లేకుండా పోయింది.

నెలకు 20 టీఎంసీలు 
- శ్రీనివాస్‌యాదవ్‌, పోలవరం కుడికాల్వ ఎస్‌ఈ 
మూడు సీజన్‌లలో కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు దాదాపు 128 టీఎంసీల నీరు మళ్లించాం. ఈ ఏడాది సగటున నెలకు 20 టీఎంసీలకు తక్కువ గాకుండా పట్టిసీమ నుంచి కృష్ణానదికి నీరు చేరుతుంది. గోదావరిలో ప్రస్తుతం 16.1 అడుగుల మేర నీటిమట్టం ఉండటం, రానున్న రోజుల్లో వరదల కారణంగా మరింతగా నీరు చేరే అవకాశముంది. కాబట్టి నవంబర్‌ వరకు పట్టిసీమ ప్రవాహం కొనసాగుతుందని భావిస్తున్నాం.

రైతుల నమ్మకం నిలబెట్టుకున్నాం 
- దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల మంత్రి 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో పట్టిసీమను అందుబాటులోకి తెచ్చారు. దీనిపై ప్రతిపక్షం ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నా, రైతులు మాపై నమ్మకముంచారు. ఇందుకు తగ్గట్లుగానే వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈ మూడేళ్లలో రూ.ఎనిమిది వేల కోట్ల పంటను పట్టిసీమ ద్వారా కాపాడగలిగాం. ఆక్వా రంగానికి నీటి కొరత లేకుండా చేశాం. రాయలసీమకు నీరు తరలించాం. వంద రోజులు నిరాటంకంగా నీరివ్వడం ఘనతగానే చెప్పుకోవాలి. ఇదే స్ఫూర్తితో పోలవరాన్ని పూర్తి చేస్తాం.

ప్రత్యక్షంగా చూస్తున్నాం 
- కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం ఎంపీ 
పట్టిసీమపై అపొహలు సృష్టించి నానా రాద్దాంతం చేసేందుకు ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. కానీ ముఖ్యమంత్రి డెల్టాకు విపత్తు రాకూడదు, రాయలసీమలో కరవు పారదోలాలనే ఏకైక సంకల్పంతో పట్టిసీమను పూర్తి చేయించారు. రెండ్రోజుల కిందట అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించినపుడు, పట్టిసీమ లేకుంటే ఈ ఏడాది పంట లేదని రైతులు ఎంతో ఆనందంగా చెబుతుండటం గర్వంగా అన్పించింది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

ప్రకాశంజిల్లాలో త్రాగునీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగర్ కుడికాల్వకు నీరు విడుదల చేయటం జరిగింది.

DK0oMpWV4AAp1Bo.jpgDK0oMpUUQAAtJUt.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Jaffas&mundavalli ni sakshit to kottadu telikundane.....

 

Pattiseema 75 TMC icharu e year ani cheptu dani valla Godavari ki edo ayipoindi ani edupa?  asalu GOdavari delta ki sambandam enti adi e rain season lo?

 

innallu asalu river interlink ledu ani edchi gipettina jaffas ni shit lo munchesadu vere eduputo

 

DECOIT gaad u Hyderabad power kosam sileru water vaadi crop holiday ippinchadu ekamga..adi marchipote etla?

 

DL6g6A8VQAEcSBM.jpg

Link to comment
Share on other sites

Thoo veedi brathuku, intha maree digajaaruda? 

 

Samudram lo kalisipoye water ni divert chesi Krishna delta lo 13L+ Acres ni save chesthe kooda edupa, ee 75 TMCs Krishna delta ki pattiseema dwara ivvakapothe all 75 TMCs would have gone to sea (Wasted). Asalu Godavari meeda storage ee ledu avi anni samudram kalusthaayi anna ingitha gnanam leda ee Sakshi & YSRCP vaallki.

 

Need to circulate it & expose these Jaffas.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
తూర్పు ‘ప్రకాశం’... ధాన్య ప్రసాదం... 
పట్టిసీమతో కరవు సీమకు గోదావరి జలాలు 
పర్చూరు, చీరాల రైతుల్లో పెరిగిన సాగు ఉత్సాహం 
ఎకరాకు 50 బస్తాలు పండిస్తున్న రైతులు 
ఈనాడు డిజిటల్‌- ఒంగోలు 
pks-top2a.jpg

కృష్ణమ్మ నుదుటన గోదారమ్మ పచ్చబొట్టు పెట్టింది... పట్టిసీమ రూపంలో రెండు నదుల కలయికతో కరవు సీమకు కొత్త కళ వచ్చింది... ఫలితంగా కరవు జిల్లాలో వరికి వూపిరి వచ్చింది... కృష్ణా జలాలే ఆధారంగా ఉన్న కొమ్మమూరు కాలువకు నీళ్లు వస్తుండడంతో ప్రకాశాన ధాన్యాగారం నిండుతోంది.

తెలుగునాట అన్నపూర్ణగా పేరొందినవి గోదావరి జిల్లాలు... ఎకరానికి 50 నుంచి 60 బస్తాల దిగుబడితో ఏటా 25 లక్షల టన్నుల వరిని ఆ రెండు జిల్లాలే అందిస్తాయి. దీనికి కారణం గోదారమ్మ చెంతన ఉండడమే. సిరులనిచ్చే భూములున్నా ప్రకాశాన జలధారలే కరవయ్యాయి. అందుకే ఏటా సేద్యంపై నిరాసక్తతో రైతులు కమతాన్ని వీడుతున్నారు. కానీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కొత్త ఆశలు మొలకెత్తాయి. నిరుడు సాగు మధ్యలో పట్టిసీమ నీళ్లు అందడంతో పర్చూరు, చినగంజాం, చీరాల, కారంచేడు ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు వేశారు. వేసిన కొద్దిచోట్ల కూడా మంచి ఫలితాన్ని రాబట్టారు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది ఈ కాలువ పరిధిలో 45 వేల ఎకరాల మేర సాగుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ చేలు కీలకదశకు చేరుకున్నాయి.

గత ఫలితాలు ఇలా...! 
గత మూడేళ్లుగా కరవు కారణంగా కృష్ణా జలాలు అందలేదు. ఫలితంగా వరి వేయాల్సిన పొలాలను రైతులు బీడుగా వదిలేశారు. అందుకే జిల్లాలో 2015-16, 2016-17లో వరి సాగు 75 శాతం లోపే ఉంది. దీంతో వరి ఉత్పత్తి కూడా తగ్గింది. ఖరీఫ్‌ చివరి సమయానికి పట్టిసీమ నీరు అందడంతో అక్కడక్కడా సాగు పెరిగి ఫలితాలు మెరుగయ్యాయి. గత ఏడాది ఖరీఫ్‌, రబీల్లో వరికి ఆ నీరు వూపిరి పోసింది.

వరికి వూపిరి అదే...! 
జిల్లాలో వరికి వూపిరి పోసేది కృష్ణా డెల్టా ప్రాంతమే. ఈ ఏడాది సకాలంలో పట్టిసీమ నీరు అందే పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో శతశాతం నాట్లు పడ్డాయి. సెప్టెంబరు రెండో వారంలో నాట్లు ప్రారంభమవడంతో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పైరు ఏపుగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టా పరిధిలో శత శాతం నాట్లు పడడం ఇదే తొలిసారి. జిల్లాలో వరికి వూపిరి పోసే చినగంజాం, చీరాల, పర్చూరు, వేటపాలెం, కారంచేడు మండలాల్లో సాగు ఆశాజనకంగా ఉండడంతో రైతులు, అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. గత ఏడాది ఈ ప్రాంతాల్లో పట్టిసీమ నీరు కారణంగా 45 బస్తాలు పండింది. జిల్లాలో సగటున ఎకరాకు 35 నుంచి 40 బస్తాలే దిగుబడి వచ్చేది. కానీ గోదారి జలాల ప్రభావం, రైతుల నిరంతర శ్రమతో గత ఏడాది 40 బస్తాలు సాధించారు. ఈ ఏడాది ఈ 24 వేల హెక్టార్లలోనూ ఎకరాకు సగటున 47 బస్తాలు పండుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చినగంజాంతో పాటు, అక్కడక్కడా నీటి లభ్యతకు ఇబ్బంది లేకుండా ఎత్తిపోతల ద్వారా కూడా నీటిని మళ్లిస్తున్నారు. కేవలం కాలువలనే నమ్ముకోకుండా రైతులు ప్రధాన కాలువ నుంచి నీటిని మోటార్లతో తోడుకుంటున్నారు.

తొలిసారిగా సకాలంలో...! 
మూడు దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్నాను. గడిచిన కొన్నేళ్లలో కరవు కారణంగా నీటి కోసం తీవ్రంగా శ్రమించాం, ఇక సాగు చేయలేం అనుకునే సమయానికి పట్టిసీమ నీరు అందింది. గత ఏడాది మంచి దిగుబడులు సాధించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సకాలంలో పూర్తిస్థాయిలో నాట్లు వేశాం. ఇప్పుడు చేలు కీలక దశలో ఉన్నాయి.

- కె. బాలకోటయ్య, రైతు, చినగంజాం

50 బస్తాలు వస్తాయి...! 
మా ప్రాంతంలో 2013 నుంచి 2015 వరకు వ్యవసాయాన్ని పక్కన పెట్టాం. ఇక సేద్యం కష్టమే అనుకున్న సమయంలో గత ఏడాది పట్టిసీమ జలాల కారణంగా 40, 45 బస్తాలు పండాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి పట్టిసీమ ద్వారా నీరు అందడంతో సెప్టెంబరు రెండోవారానికి నాట్లు వేసేశాం. నీటి కోసం ఎదురు చూడాల్సిన పని తప్పింది. ఇప్పుడు 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.

- వెంకట ప్రసాద్‌, రైతు, పెదగంజాం
Link to comment
Share on other sites

పట్టిసీమ వృథా అని చెప్పే ధైర్యముందా? 
జగన్‌కు మంత్రి సోమిరెడ్డి సవాల్‌

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లోని పత్తి పంటలను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి , ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, ఆ శాఖ కమిషనర్‌ జవహర్‌, శాస్త్రవేత్త ఎస్‌. రత్నకుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలో 1.82 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేశారన్నారు. రాష్ట్రంలోని 13 లక్షల ఎకరాలకు పట్టిసీమ ద్వారా నీరందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి పట్టిసీమపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే కృష్ణా డెల్టా పొలాల్లో నిలబడి పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. వ్యవసాయంలో సాంకేతికతను జోడించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి నలభై టీఎంసీల సాగునీటిని పంటలకు కేటాయిస్తున్నామన్నారు. రైతుల కోసం ప్రత్తిపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గులాబీ రంగు పురుగు వల్ల రైతులు ఆందోళన చెందొద్దనీ, నివారణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

రాష్ట్రంలో రైతులకు రూ.1900 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చామన్నారు. విశాఖ పట్నంలో 15, 16, 17 తేదీల్లో ‘మిల్లిండా గేట్స్‌’ సమావేశం జరగనుందనీ, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేడీఏ ఎం. విజయభారతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వి. సత్యనారాయణ, పీడీ సీహెచ్‌. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...