Jump to content

pattiseema


Recommended Posts

తూర్పు డెల్టా’కు నీరు విడుదల
 

 
636341496716020337.jpg
  • ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం
  • స్లూయిజ్‌ చెంతన ఇరువైపులా అభివృద్ధి
  • షాపింగ్‌, హోటళ్లు, రిక్రియేషన్‌
  • సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: సరిగ్గా పదేళ్ల తర్వాత కృష్ణా డెల్టాకు జూన్‌లో సాగునీరును విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపశాసన సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, జలవనరుల శాఖ సీఈ వైఎస్‌ సుధాకర్‌, ఎస్‌ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పొలానికి నీరు పెట్టి, నారు పోసి, పంట చేతికి అందుకునే వరకు రైతాంగానికి 130 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దశల వారీగా ప్రాధాన్యతలను బట్టి నీరు ఇవ్వడానికి జనవనరుల శాఖ, వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించాయి.
 
ఏయే కాలువకు ఎంతెంత
పట్టిసీమ నుంచి రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని 15 పంపుల ద్వారా కృష్ణా నదిలోకి తీసుకొస్తున్నారు.
 
దీనివల్ల ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం 11 అడుగులకు పెరిగింది.
 
తూర్పు డెల్టా ప్రధాన కాలువపై నిర్మించిన హెడ్‌ స్లూయిజ్‌ ఆరు తూముల ద్వారా కిందికి నీటిని విడుదల చేస్తున్నారు.
 
రైవస్‌ కాలువకు 1000 క్యూసెక్కులు, ఏలూరు కాలువకు 500, బందరు కాలువకు 500, కృష్ణా తూర్పు కాలువకు 500 క్యూసెక్కులుగా విభజించి నీరిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ నాలుగు కాలువకు 1500 క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి పెంచుతామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

నదుల అనుసంధానం..ఫలితాలు అద్భుతం

పదేళ్ల తర్వాత డెల్టాకు జూన్‌లోనే నీరు

రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

కృష్ణా డెల్టాకు నీటి విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి

26ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని.. దీన్ని రైతులు అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం ప్రకటించారు. సోమవారం విజయవాడ ప్రకాశం బ్యారేజిలోని తూర్పు కాలువ ప్రధాన స్లూయిస్‌ ద్వారా సాగునీటిని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాతో కలసి ముఖ్యమంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏటా జూన్‌లో కృష్ణా డెల్టాకు నీరు వదిలేవారని, తర్వాత ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల తదితర ప్రాజెక్టుల వల్ల ఎగువ 26ap-main3b.jpgనుంచి నీరు రావడమే గగనమైందన్నారు. ఫలితంగా 13లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ క్రమంలో సకాలంలో సాగునీరు ఇవ్వగలమా? పంటలు వేసుకోగలుగుతారా? అన్న సందేహాల మధ్య పట్టిసీమ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి నీటిని అందిస్తున్నామన్నారు. లోగడ నీటి విడుదలలో ఆలస్యం వల్ల తుపాన్ల సమయంలో పంట మొత్తం నష్టపోయేవారన్నారు. గోదావరి నుంచి ఏటా 2,500 నుంచి 3వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఇందులో 80టీఎంసీలను ఇపుడు పట్టిసీమ ద్వారా కృష్ణాలోకి మళ్లిస్తున్నామన్నారు. దీనివల్ల డెల్టా రైతాంగానికి ఖరీఫ్‌ సాగుకు బాగా అక్కరకొస్తోందన్నారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో చాలామంది ఇది అసాధ్యమన్నారని, మరికొందరు పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తామన్నారని.. ఆ సవాళ్లన్నిటినీ పటాపంచలు చేస్తూ ఏడాదిలో పూర్తిచేశామన్నారు. ఈ ఏడాది గోదావరిలో 14అడుగుల పైన ఉన్న నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇస్తున్నామన్నారు. గోదావరి డెల్టాకు జూన్‌ మొదటి వారంలో, కృష్ణా డెల్టాకు నాలుగో వారంలోనే నీటిని విడుదల చేశామన్నారు. ప్రత్యేకించి పదేళ్ల తర్వాత కృష్ణాడెల్టాకు జూన్‌లోనే నీరివ్వగలిగామన్నారు. ఫలితంగా రైతులు పంటలు ముందే వేసుకుని, తుపానుల బారిన పడకుండా త్వరగా దిగుబడులను ఇంటికి తీసుకెళ్తారన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి కూడా రైతులు వచ్చి గతేడాది రెండింతల దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారన్నారు. భూగర్భ నీటిమట్టం మీటరు పెరిగితే 90టీఎంసీల మేర నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. గతేడాది తక్కువ నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్ల వ్యవసాయంలో 14శాతం మేర అధిక వృద్ధిరేటు సాధించగలిగామని సీఎం వివరించారు. కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన స్లూయిస్‌ సేవలను ఈ ఏడాదితో ముగింపు పలకనున్నట్లు చెప్పారు. ఇది 112 సంవత్సరాలు అమోఘ సేవలు అందించిందన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త రెగ్యులేటర్‌ ద్వారా నీరివ్వనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో వర్షపు నీటిని కూడా ఒడిసిపట్టుకోగలిగితే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో 27.70శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. దీనివల్ల 0.6మీటర్ల మేర భూగర్భ నీటిమట్టం పెరిగిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా జీడిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లు పూర్తిచేశామన్నారు. వచ్చే నెలలో మడకశిర.. అక్కడి నుంచి చిత్తూరు, కుప్పం వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. దీనివల్ల అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని మెట్టభూములకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల తాజా పరిస్థితినీ ఆయన వివరించారు. అన్నింటినీ పూర్తిచేస్తామని చెప్పారు.

ముస్లిం సోదరులకు అండ

రంజాన్‌ సందర్భంగా ముస్లింలు ఆనందంగా ఉండేందుకు తోఫా(కానుక) ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మతసామరస్యం కాపాడుతున్నామన్నారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించామన్నారు. ఇమామ్‌, మౌసమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు. త్వరలో విజయవాడ, కడప, కర్నూలులో హజ్‌హౌస్‌లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ఏడాది దుల్హాన్‌ పథకం కింద 20వేల మంది మైనార్టీ యువతులకు వి వాహాల కోసం రూ.వంద కోట్లు కేటాయించామన్నారు.

Link to comment
Share on other sites

పట్టిసీమ ద్వారా నీటి విడుదల
 
 
విజయవాడ: పట్టిసీమ ద్వారా నీటి విడుదలను పెంచారు. 20 పంపుల ద్వారా 7,080 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరో రెండ్రోజుల్లో 24 పంపులను ఆన్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. మూడ్రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరివ్వాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
Link to comment
Share on other sites

అనుసంధాన ఫలం
26ap-story2a.jpg

పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా విడుదలచేసిన గోదావరి జలాలు పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలవడంతో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఎరుపు రంగులో ఉన్నవన్నీ గోదావరి జలాలు కాగా, నలుపు రంగులో ఉన్నవి కృష్ణా జలాలు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు రావడంతో కృష్ణా డెల్టాకు పదేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్‌లో నీళ్లు విడుదలయ్యాయి.

 

 

పట్టిసీమ ద్వారా 7080 క్యూసెక్కుల నీరు విడుదల

పోలవరం, న్యూస్‌టుడే: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీరు పెరగడంతో... మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాకు 7,080 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లకు 20 మోటార్లు ద్వారా పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలోకి నీరు ఎత్తిపోస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉండటం, సముద్రంలోకి వృథాగా పోతున్న నేపథ్యంలో కృష్ణాకు నీటిని తరలిస్తున్నామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు. వరద మరింత పెరిగితే మొత్తం 24 మోటార్లు ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

పట్టిసీమ నుంచి రేపు పూర్తిస్థాయి నీటి విడుదల
పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గురువారం పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. పట్టిసీమలోని మొత్తం 24 పంపులను పనిచేయించి 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నామని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం 20 పంపులతో 7,788 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా అది ప్రకాశం బ్యారేజికి చేరుతోంది. ఈ పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టా కాలువలకు నీటిని ఇవ్వగలుగుతున్నారు. పశ్చిమ కాలువ ద్వారా కూడా బుధవారం నీటిని విడుదల చేశారు. గోదావరిలో ప్రవాహాలు పెరగడంతో పాటు పూర్తిస్థాయి నీటిని ఇచ్చేందుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలకు మించి కృష్ణమ్మకు తరలించేలానే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

Link to comment
Share on other sites

పశ్చిమ డెల్టాకు గోదావరి జలాలు
 
 
636343202700264481.jpg
  • గోదారి గలగలలు
  • పశ్చిమ డెల్టాకు గోదావరి జలాలు
  • కాలువలకు సాగునీటిని విడుదల చేసిన మంత్రులు
  • రైతులు సాగుకు సిద్ధం కావాలని పిలుపు
 
తాడేపల్లి టౌన్‌(గుంటూరు జిల్లా): పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి జలాలను డెల్టా కాలువలకు ఈ ఏడాది ముందుగానే విడుదల చేస్తున్నామని, రైతులు సాగుకు సిద్ధం కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. తాడేపల్లి మండలంలోని సీతానగరం వద్ద పశ్చిమ డెల్టా కాలువకు జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులతో కలిసి ఆయన బుధవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ గడిచిన 20 ఏళ్లలో జూన్‌ నెలలోనే సాగునీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారని, ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ సారి సీజనులో తుపాను బారిన పడకుండా ఖరీఫ్‌ పంటలు రైతుల చేతికి అందుతాయని తెలిపారు. గోదావరిలో నీటి మట్టం పుష్కలంగా ఉందని, రైతులు ధైర్యంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు.
 
ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, అవసరాన్ని బట్టి నీటి సరఫరా పెంచుతామని తెలిపారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీటివాగు ముంపు నివారణకు ఎత్తిపోతల పథకం నిర్మించడానికి ముఖ్యమంత్రి రూ.270 కోట్లను కేటాయించారని తెలిపారు. రైతులను సాగుకు సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కృష్ణా జలాలు రావడంలో జాప్యం జరిగినా పట్టిసీమ ద్వారా ఖరీఫ్‌ పంటలకు నీటి సమస్య తలెత్తకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మంగళగిరి టీడీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, స్థానిక నాయకులు కళ్లం పానకాలరెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కృష్ణమ్మ వైపు గోదారమ్మ ఉరకలు

29ap-state2a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మొత్తం 24 పంపుల ద్వారా గోదావరి నీటిని పోలవరం కుడికాల్వలోకి ఎత్తిపోస్తున్నట్లు పట్టిసీమ పనులను పర్యవేక్షిస్తున్న సీఈ వీఎస్‌.రమేష్‌బాబు గురువారం చెప్పారు. ఈ నెల 20న గోదావరిలో నీటిమట్టం 14వ మీటరుకు చేరడంతో 9 పంపుల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా నీటి సరఫరా పెంచుతూ వచ్చారు. గురువారం గోదావరిలో నీటి మట్టం 14.60 మీటర్లకు పెరగడంతో 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణాకు వదిలినట్లు రమేష్‌బాబు తెలిపారు. మరోవైపు ఇటుకలకోట వద్ద గోదారమ్మ పరవళ్లు చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...