Jump to content

Recommended Posts

భోగాపురం వాస్తవాలు
11-09-2018 01:01:43
 
636722245034769602.jpg
వైఎస్‌ హయాంలో కడపజిల్లాలో విమానాశ్రయం ఉన్నప్పటికీ.. 50కి.మీల దూరంలోని జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్‌ ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు నిర్మించుకోవడానికి ఎకరానికి రూ.25 వేలు చొప్పున 3164 ఎకరాలు కేటాయించారన్న విషయం మరిచిపోయారు. ఆనాడు ఏ ఉద్దేశంతో బ్రహ్మణి స్టీల్స్‌కు అంత స్థలం కేటాయించారో ఇప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రపంచంలోని టాప్‌టెన్‌లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో తలపెట్టిన భోగాపురం విమానాశ్రయానికి సహకరించి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
 
ఒక ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. అభివృద్ధి చెందిన రాష్ట్రం, దేశాలలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆసియా పసిఫిక్‌ గేట్‌వేగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణ చేస్తూ అడుగడుగునా అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి.
 
కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాదని ప్రైవేట్‌ సంస్థలకు భోగాపురం విమానాశ్రయ పనులు అప్పగించారన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇంత వరకు విమానాశ్రయ పనుల టెండర్లు ఖరారు కాలేదు. 2016 జూన్‌లో టెండర్లు పిలిచి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు 2017 జులై 31 వరకు గడువు ప్రకటించటం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను అన్ని జాతీయ పత్రికలకు ఇవ్వటం జరిగింది. విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు.. జీఎంఆర్‌, జీవీకే, అంబానీ, ఆదానీ, టాటా, రాంకీ, డూఇట్‌, ఎస్సెల్‌, ఎన్‌ఐఐఎఫ్‌, ఒబెరాయ్‌, రిలయన్స్‌ వంటి దేశీయ సంస్థలతో పాటు పలు విదేశీ కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొన్నాయి. 2017 ఆగస్ట్‌ 21న బిడ్స్‌ తెరవగా అందులో.. లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 32శాతం వాటా ఇస్తామని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోట్‌ చేసింది. 22శాతం మాత్రమే వాటాలిచ్చేందుకు జీఎంఆర్‌ కోట్‌ చేయటంతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు టెండర్లు ఖరారు చేశారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు మెయింటెనెన్స్‌ రిపేర్‌ ఆపరేషన్స్‌ (ఎంఆర్‌వో) నిర్వహణ సామర్ధ్యం లేకపోవటంతో కొత్త నిబంధనలతో టెండర్లు పిలవాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సూచనలు ఇవ్వటం జరిగింది. నాగ్‌పూర్‌లో ఏఏఐ నిర్వహిస్తున్న విమానాశ్రయానికి ఎంఆర్‌వో ఉన్నప్పటికీ.. అనుభవం లేక అక్కడి ప్రభుత్వానికి అప్పజెప్పారు. భారత దేశంలోని ఎయిర్‌ ఇండియాతో పాటు ప్రైవేట్‌ విమానయాన సంస్థలు కూడా విమానాల మరమ్మతుల కోసం ఇతర దేశాలకు పంపాల్సి వస్తోంది. ఇందుకోసం ఏటా రూ.5వేల కోట్లకుపైగా చెల్లిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో సేవలందించటం ద్వారా సింగపూర్‌, మలేషియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల నుంచి విమానాలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. భోగాపురం విమానాశ్రయంలో ఎంఆర్‌వో ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఆదాయం ప్రభుత్వానికే లభిస్తుంది.
 
2018 జులైలో నూతన టెండర్లు కూడా పిలవటం జరిగింది. గతంలో కేవలం విమానాశ్రయ నిర్మాణానికి టెండర్లు పిలవగా.. ఈ సారి విమానాశ్రయంతో పాటు వాణిజ్య సముదాయాలు, పర్యాటకం, విమానయాన సంబంధ శిక్షణా సంస్థలతో కూడిన ఏరోసిటీ, ఎంఆర్‌వో కేంద్రంతో కలిపి నిర్మాణాలు చేపట్టేలా పీపీపీ విధానంలో టెండర్లు పిలిచింది. భోగాపురం విమానాశ్రయంలో ఎంఆర్‌వో, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయటం వలన ఉపాధి అవకాశాలతో పాటు విదేశాల నుంచి కూడా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు పిలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు ఏవియేషన్‌ పాలసీలో మార్పులు చేయటం జరిగింది. ఇప్పుడు ఆ సూచనలను నూతన టెండర్లలో చేర్చటం జరిగింది.
 
ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గురించి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఏఏఐ ఆధ్వర్యంలో చేపట్టిన 102 విమానాశ్రయాల్లో 90 శాతం నష్టాల్లో ఉన్నాయి. కేవలం ఎనిమిది విమానాశ్రయాలు మాత్రమే 2016-17లో లాభాలు నమోదు చేయటం జరిగింది. దేశంలో ఉన్న ప్రముఖ పది విమానాశ్రయాల్లో ఒక్కటి కూడా ఏఏఐ నిర్మించినవి లేకపోవటం గమనార్హం. చెన్నై విమానాశ్రయంలో రన్‌వే నిర్మించటంలో కూడా ఏఏఐ విఫలమైంది. దీని పరిధిలో ఉన్న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రూ.92కోట్లు, అమృత్‌సర్‌ రూ.50కోట్లు, భోపాల్‌ రూ.49కోట్లు, పాట్నా రూ.5కోట్లు, భువనేశ్వర్‌ రూ.15కోట్లు, మంగుళూరు రూ.8కోట్లు నష్టాల్లో ఉన్నాయి. ఏఏఐ నిర్వహణ సరిగా లేకపోవటం వలన ఢిల్లీలో రూ.70కోట్లు, కోల్‌కతాలో రూ.41కోట్లు నష్టపోయినట్లు కాగ్‌ పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అత్యధిక లాభాలు గడిస్తున్నాయని సర్వేలో కూడా వెల్లడైంది.బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రలో విమానాశ్రయాలను ప్రైవేట్‌ సంస్థలకే అప్పగించారు. ఎయిర్‌ ఇండియాను నడపలేక ప్రైవేట్‌ పరం చేసిన కేంద్రం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే విమనాశ్రయాన్ని ఏ విధంగా సమర్థంగా నిర్వహించగలదు అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
 
విమానయాన రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న వాదన సత్యదూరం. చంద్రబాబు నాయుడి దూరదృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన శంషాబాద్‌ విమానాశ్రయం పదేళ్ల కాలంలో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. విమాన సర్వీసులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో విమాన ఇంధనాలపై రాయితీ ఇస్తున్నారు. కడప, తిరుపతి, గన్నవరం, విశాఖ నుంచి అన్ని ప్రాంతాలకు సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో ఏడాదికి 11లక్షల మంది విమాన సేవలు ఉపయోగిస్తే.. 2018 నాటికి 41 లక్షల మంది ఉపయోగించుకోవటం జరిగింది.
 
2020 నాటికి రాష్ట్రంలోని 12 విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో ఆక్యుపెన్సీ రేట్‌ 90 నుంచి 95శాతం వరకు ఉంది. ప్రభుత్వం చేస్తున్న ప్రోత్సాహానికి కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు పలు విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇంధనంపై వ్యాట్‌ను 16శాతానికి పెంచటం వలన శంషాబాద్‌ దేశ ఏరోనాటికల్‌గా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ప్రభుత్వం రాయితీలిస్తూ విమానయానాన్ని ప్రోత్సహిస్తోంది.
 
విమానాశ్రయానికి 2700 ఎకరాల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే 20 వేల ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం రైతుల్లో అపోహలు సృష్టించి భూసేకరణకు అడ్డుపడింది. ప్రతిపక్ష పార్టీ స్థానిక నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ కేసులు వేయించి.. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేసి భోగాపురంకు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి. ఇప్పటి వరకు 82 శాతం భూ సేకరణ పూర్తయింది.
 
భోగాపురం విమానాశ్రయ పనులు ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న వాదనలో వాస్తవం లేదు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతులు రావటానికి 9 సంవత్సరాలు పట్టింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని 2015 ఆగస్టులో భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి..60 రోజుల పాటు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించటం జరిగింది. భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.28లక్షల నుంచి రూ.33లక్షల పరిహారంగా నిర్ణయించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అవసరమైన పర్యావరణ, రక్షణ అనుమతులను కూడా తీసుకురావటం జరిగింది. భోగాపురం విమానాశ్రయానికి 4కి.మీ. దూరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉన్న 125 ఎకరాల భూములను 2013 ఫిబ్రవరిలో ఈడీ అటాచ్‌ చేయడమైంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు వందల ఎకరాల్లో అక్కడ భూములు ఉన్నందునే విమానాశ్రయానికి అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. రైతులకు సంబంధించిన భూములకు రూ.24లక్షలు, డీ పట్టాలకు రూ.12లక్షలు చెల్లించడమే కాకుండా ఇంకా రైతులను సంతృప్తిపరిచే అన్ని చర్యలను టీడీపీ ప్రభుత్వం తీసుకొంటోంది.2016 జనవరిలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సైట్‌ క్లియరెన్స్‌ ఇవ్వగా.., అక్టోబరులో మున్సిపల్‌ అప్రూవల్‌ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో బిడ్ల జారీకి అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జాప్యం లేదు.
 
ఉత్తరాంధ్రలో పరిశ్రమలు లేవు. అభివృద్ధిలో వెనుకబడి ఉంది. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే రైతుల భూములకు రేట్లు పెరుగుతాయి. దసరా, వేసవి సెలవుల్లో ఒడిశా, బెంగాల్‌, ఉత్తర దేశ ప్రాంతాల నుండి అక్కడికి టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నం బీచ్‌, అరకు వ్యాలీ, ఆస్పత్రులు మొదలైన వాటి కోసం ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి దోహదం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురం విమానాశ్రయానికి శ్రీకారం చుడితే.. బినామీ భూములు కాపాడుకోవటం కోసం నిర్మాణ పనులకు అడ్డుపడుతున్నారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు 980 ఎకరాలు, చెన్నై ఎయిర్‌పోర్టుకు 1200 ఎకరాలు మాత్రమే ఉంది. భోగాపురానికి 2720 ఎకరాలు ఎందుకు.? భోగాపురం నుండి వైజాగ్‌ల మధ్యదూరం 40 కిలోమీటర్లు మాత్రమేనని అంటున్నారు. వైఎస్‌ హయాంలో కడపజిల్లాలో విమానాశ్రయం ఉన్నప్పటికీ.. 50కి.మీల దూరంలోని జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్‌ ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు నిర్మించుకోవడానికి ఎకరానికి రూ.25 వేలు చొప్పున 3164 ఎకరాలు కేటాయించారన్న విషయం మరిచిపోయారు. ఆనాడు ఏ ఉద్దేశంతో బ్రహ్మణి స్టీల్స్‌కు అంత స్థలం కేటాయించారో ఇప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రపంచంలోని టాప్‌టెన్‌లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో తలపెట్టిన భోగాపురం విమానాశ్రయానికి సహకరించి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
 సంతోష్‌ పండూరు 

Share this post


Link to post
Share on other sites
రూ.3 వేలకే బ్యాంకాక్‌ ప్రయాణం... హైదరాబాద్‌ కంటే రేటు తక్కువ !
09-10-2018 10:17:06
 
636746770268240836.jpg
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే కేవలం గంట విమాన ప్రయాణం. విమాన సంస్థలు రూ.3,500 మొదలుకొని రూ.18వేల వరకు సమయాన్ని బట్టి చార్జీలు డిమాండ్‌ చేస్తున్నాయి. రోజుకు ఐదు విమానాలున్నా ఇదే డిమాండ్‌. విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకాక్‌ విమానం అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరకు విమానాలకు నడిపే ఎయిర్‌ ఏసియా డిసెంబరు 7న బ్యాంకాక్‌ నుంచి విమానం నడుపుతోంది. 8న విశాఖ నుంచి బయల్దేరుతుంది.
 
వారానికి నాలుగు రోజులు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఒకవైపు టిక్కెట్‌ ధర రూ.2,999గా నిర్ణయించారు. అంటే హైదరాబాద్‌ టిక్కెట్‌ కంటే తక్కువ. విశాఖ నుంచి నడిచే విమానాలన్నింటిలో(జగదల్‌పూర్‌ తప్ప) ఇదే తక్కువ ధరగా చెప్పుకోవచ్చు. అంటే దేశీయ ధర కంటే తక్కువకే విదేశీ యానం చేసే అవకాశం. దీనికి వీసా కూడా అవసరం లేదు. ఆరు నెలల గడువు కలిగిన పాస్‌పోర్టు, అందులో రెండు పేజీలు ఖాళీ వుంటే చాలు. ఎంచక్కా బ్యాంకాక్‌ ఎగిరిపోవచ్చు. మూడు గంటల ప్రయాణం. టిక్కెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

Share this post


Link to post
Share on other sites

Alliance Air to introduce Bi-Weekly flight on every Tuesday and Thursday from 30 October 2018.

This will take Weekly services between Visakhapatnam and Vijayawada to 16 services.

Schedule

AI 9529 VTZ(15:00) VGA(16:00)

AI 9530 VGA(19:25) VTZ(20:50)

https://pbs.twimg.com/media/DpET3FbU8AAAOAU.jpg

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×