Jump to content

Vizag Airport


Recommended Posts

భోగాపురం విమానాశ్రయంలో కదలిక
నిర్మాణానికి ముందుకొచ్చిన ఏడు సంస్థలు

ఈనాడు, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం తాజాగా  ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. అర్హమైన సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) మరో రెండు వారాల్లో ఎంపిక చేసి ప్రతిపాదనలు ఆహ్వానించనున్నది. ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఇదివరకే పిలిచిన టెండర్లను ప్రభుత్వం వివిధ కారణాలతో రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో మరోసారి టెండర్లు పిలవాలని భావించి విశాఖపట్నంలో ఆగస్టులో ముందస్తు (ప్రీ బిడ్‌) సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 13 అంతర్జాతీయ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తర్వాత ఆరు సంస్థలు వెనక్కి వెళ్లాయి.
ముందుకొచ్చిన సంస్థల్లో
బిడ్‌ల దాఖలు ఇలా..
* జీఎంఆర్‌, జీవీకే సంస్థలకు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాల్లో అనుభవం ఉంది. అందుకే నేరుగా బిడ్లు దాఖలు చేశాయి. తక్కిన సంస్థలు ఇతరులతో కలిసి రంగంలోకి వచ్చాయి.
* దక్షిణ కొరియాకు చెందిన ఇంచియాన్‌ విమానాశ్రయంతో కలిసి రిలియన్స్‌ ఇన్‌ఫ్రా, జర్మనీకి చెందిన మూనిచ్‌ విమానాశ్రయంతో కలిపి ఎస్సెల్‌ గ్రూపు, స్విడ్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్‌ విమానాశ్రయంతో కలిసి డూఇట్‌, బెంగళూరు విమానాశ్రయంతో కలిసి ఐ ఇన్వెస్ట్‌మెంట్‌, జర్మనీ విమానాశ్రయం-ఏవీఐతో కలిసి ఎన్‌ఐఐఎఫ్‌ బిడ్లు వేశాయి.
మొదలైన మదింపు
బిడ్లు వేసిన సంస్థల్లో అర్హమైనవాటిని గుర్తించే ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఏపీఏడీసీఎల్‌ అధికారుల బృందం వీటిని మదించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నాయి. ఈపాటికే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఇతర అధికారులు తిత్లీ తుపాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నందున జాప్యమైంది. వచ్చే రెండు వారాల్లో అర్హమైన సంస్థలను ఎంపిక చేసి వీటి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తామని అజయ్‌జైన్‌ ‘ఈనాడు’కి తెలిపారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందించే సంస్థను విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

‘భోగాపురం’ నిర్మాణానికి పోటాపోటీ
28-10-2018 04:03:55
 
  • నాలుగు రోజుల్లో బిడ్‌ ఖరారు
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 7 ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ సంస్థలు దాఖలు చేసిన బిడ్‌ల మేరకు విమానాశ్రయ నిర్మాణానికి రూ.4200 కోట్లు ఖర్చు కావచ్చని ఏపీ విమానయాన అభివృద్ధి సంస్థ(ఏపీడీసీఎల్‌) భావిస్తోంది. బిడ్‌లను దాఖలు చేసిన సంస్థలలో జూరిచ్‌ ఎయిర్‌పోర్టుతో స్థానిక బ్యాంకు భాగస్వామ్యమైంది. మునిచ్‌ ఎయిర్‌పోర్టుతో కలసి ఎస్సెల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బిడ్‌ దాఖలు చేసింది. అదేవిధంగా దక్షిణ కొరియాకు చెందిన ఇంచెయన్‌ ఎయిర్‌పోర్టుతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా భాగస్వామ్యమై బిడ్‌ వేసింది. వీటితో పాటు జీవీకే, జీఎంఆర్‌, ఏవీ అలయెన్స్‌తో కలసి నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌), మారిష్‌సకు చెందిన ప్రముఖ సంస్థతో కలసి బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(బీఏఐఎల్‌) బిడ్‌ను దాఖలు చేసింది. ఈ బిడ్లపై మరో నాలుగు రోజుల్లో ఏపీడీసీఎల్‌ నిర్ణయం తీసుకోనుంది.
Link to comment
Share on other sites

ఎకరాకు 28 లక్షలు ఇవ్వండి
04-11-2018 03:09:53
 
  • పట్టాదారుతో సమానంగా అసైన్డ్‌కు పరిహారం
  • ఖర్చుల కింద పిటిషనర్లకు వెయ్యి చెల్లించండి
  • ‘భోగాపురం’ భూసేకరణపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం సేకరిస్తున్న భూములకు సంబంధించి పట్టాదారులకు ఇస్తున్న పరిహారంతో సమానంగా అసైన్డ్‌ పట్టాదారులకు పరిహారం ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మేకల పాండు కేసులో పట్టాదారులతో సమానంగా అనైన్డ్‌ పట్టాదారులకు పరిహారం ఇవ్వాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసి న విషయాన్ని ఉటంకించింది. అలాగే.. పట్టాదారులతో సమానంగా పరిహారం ఇస్తామంటూ ఏపీ ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసిందని పేర్కొం ది. పరిహారాన్ని 2017లో అసైన్డ్‌ పట్టాదారుల అ కౌంట్లలో డిపాజిట్‌ చేసిన ప్రభుత్వం.. జీవో 259 జారీ కంటే ముందే అసైన్డ్‌ పట్టాదారుల అకౌంట్ల లో పరిహారం డిపాజిట్‌ చేశామనడం సరికాదని పేర్కొంది.
 
పరిహారం డిపాజిట్‌ చేసిన ఏడాదిన్నర తర్వాత పిటిషనర్లు హైకోర్టుకు రావడం చెల్లదం టూ రెవెన్యూ అధికారులు చేసిన వాదనను న్యా యమూర్తి తోసిపుచ్చారు. భోగాపురం మండలం కంచెరువు గ్రామంలో పట్టారైతులకు ఇచ్చినట్లుగా ఎకరాకు రూ.28 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిన తర్వాతే ఆ భూముల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. అలాగే పిటిషనర్లకు రూ.వెయ్యి చొప్పున కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచందర్‌రావు తీర్పునిచ్చారు. పట్టాదారులతో సమానంగా తమకూ పరిహారం ఇప్పించాలని కోరుతూ భోగాపురానికి చెందిన అప్పల నర్సయ్యతోపాటు మరో 89 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
Link to comment
Share on other sites

భోగాపురం విమానాశ్రయ 

 

బిడ్లపై 12న నిర్ణయం

ఈనాడు, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణం కోసం వచ్చిన ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌’(ఆర్‌ఎఫ్‌క్యూ) బిడ్లలో తదుపరి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’(ఆర్‌ఎఫ్‌పీ)కి అర్హత సాధించే సంస్థలను ఈ నెల 12న ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించే ఈ విమానాశ్రయానికి సంబంధించి రెండోసారి ప్రభుత్వం టెండర్లు పిలిచినపుడు ఏడు సంస్థలు ఆర్‌ఎఫ్‌క్యూ బిడ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఆర్‌ఎఫ్‌పీ దశకు వెళ్లే సంస్థలను ఇప్పటికే ఎంపిక చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యమైంది. భోగాపురం విమానాశ్రయానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న కేపీఎంజీ వర్గాలు బిడ్ల మదింపు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశాయని తెలుస్తోంది. 12న నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ సమావేశంలో మదించిన బిడ్లను అధికారులు పరిశీలించి ఆర్‌ఎఫ్‌పీకు అర్హత సాధించే సంస్థలను ఖరారు చేయనున్నారు.

 

Link to comment
Share on other sites

మరోవారంలో ‘భోగాపురం’ పనుల అప్పగింత
13-11-2018 04:01:49
 
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పనుల బాధ్యతను మరో వారం రోజులలో అర్హత సాధించిన సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో ప్రభుత్వానికి అధికవాటాను ఇచ్చే సంస్థకే ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను కట్టబెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. విజయవాడ గుణదలలోని విద్యుత్‌ సౌధలో సోమవారం ఇంధన, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ అధ్యక్షతన భోగాపురం ఎయిర్‌పోర్టుపై జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

భోగాపురానికి 7 సంస్థల అర్హత

ఈనాడు, అమరావతి: భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ముందుకొచ్చిన ఏడు సంస్థలూ తదుపరి బిడ్లు వేసేందుకు అర్హత సాధించాయని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ తెలిపింది. మూడు నెలల్లో ప్రతిపాదనలు (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌- ఆర్‌ఎఫ్‌పీ) దాఖలు చేయాలని ఈ సంస్థలకు సమాచారం పంపింది. రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఏడు సంస్థలు తమకున్న అర్హతలపై బిడ్లు వేసిన విషయం తెలిసిందే. వీటిని మదించిన ప్రత్యేక నిపుణుల బృందం.. ఏడు సంస్థలూ విమానాశ్రయ నిర్మాణానికి అర్హమైనవిగా నిర్ధరించింది. ఈ నేపథ్యంలో తదుపరి బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ సమాచారం ఇచ్చింది.

Link to comment
Share on other sites

భోగాపురం విమానాశ్రయంపై జీఎంఆర్‌, జీవీకే ఆసక్తి!

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌, జీవీకే గ్రూపులతో పాటు మరో నాలుగు సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం వద్ద భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఆసక్తి కనబరచినట్లు తెలిసింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం భవిష్యత్తు అవసరాలకు సరిపోదనే ఉద్దేశంతో అక్కడికి సమీపంలోని భోగాపురం వద్ద నూతన విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. దీనికి స్థలసేకరణ చాలా వరకూ పూర్తయింది. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఆసక్తి కల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించగా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో ఆరు సంస్థల బిడ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జీఎంఆర్‌, జీవీకే గ్రూపుతో పాటు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌      (ఎన్‌ఐఐఎఫ్‌), డోయిట్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా, ఎస్సెల్‌ గ్రూపు, ఫెయిర్‌ఫాక్స్‌ ఇండియా హోల్డింగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు వచ్చే మూడు నెలల వ్యవధిలో పూర్తిస్థాయి ప్రతిపాదనలు (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) అందజేయాల్సి ఉంటుంది. అన్ని  దశలను అధిగమించి ఈ ప్రాజెక్టును దక్కించుకునే సంస్థ విమానాశ్రయ నిర్మాణాన్ని రెండేళ్లలోగా పూర్తిచేయాలి. భోగాపురం విమానాశ్రయానికి రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడి అవసరమని అంచనా. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ముంబయి, దిల్లీ విమానాశ్రయాలతో పోల్చితే భోగాపురం నిబంధనలు భిన్నంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్లో ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉండకపోవచ్చు. నూరుశాతం వరకూ ప్రైవేటు సంస్థలకు వాటా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

Thai budget airline set to fly from Vizag

https://www.thehindu.com/news/national/andhra-pradesh/9rxcqo/article25677381.ece/ALTERNATES/FREE_300/06-vj-thailandcol

Spurt in demand after visa fee waiver for Indian tourists

The demand for travel to Bangkok, Phuket, Pattaya and other places in Thailand has gone up all of a sudden with the decision of Thailand government to waive off visa fee of Baht 2,000 (equivalent to ₹4,000) for Indian tourists.

The Tourism Authority of Thailand has sent a circular in which it welcomed the decision, which is applicable for tourists from 20 countries, including India, for a travel of not more than 15 days up to January 13. Thai AirAsia, a low-cost carrier, is introducing a flight from Visakhapatnam International Airport from December 8.

The 180-seater Airbus 320 will reach the airport with passengers from Thailand at 11.45 p.m. on December 7 and leave for Don Mueang International Airport in Bangkok next day at 0.15 a.m. The total duration of travel is three hours, considered the shortest from any city. in India. Authorities in Thailand are confident of increase in Indian tourists with the latest introduction of connectivity to Visakhapatnam after air-linking Bangkok to Bhubaneswar and Hyderabad. The city at present has flights to international destinations of Singapore, Dubai and Kuala Lumpur. Earlier, Malindo and SriLankan Airlines withdrew their services to Kuala Lumpur and Colombo respectively due to low occupancy.

“Because of availability of many value packages, the demand for Thailand has always been more in India compared to other countries. The demand for travel to Thailand is increasing manifold due to excellent tourist locales as well as low air fare, accommodation and food,” an official of AirAsia told The Hindu.

The flight to Bangkok leaves from Visakhapatnam on Monday, Tuesday, Thursday and Saturday and return flight is operated from Bangkok on Monday, Wednesday, Friday and Sunday.

TTAA team

A group of 20 members from Tours and Travels Association of Andhra (TTAA) will take the inaugural flight to study the tourism potential to be explored in Thailand with 12 from Visakhapatnam, five from Vijayawada and three from Rajamahendravaram.

Secretary Srinivas Padhi, when contacted, said that tickets for flights in the near future were almost sold out.

The team will visit various hotels, hold meetings with travel agents on how to showcase Buddhist sites, lovely beaches and hill ranges in Andhra Pradesh as tourism destination for Thai citizens.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...