Jump to content

Amaravati heart project


Recommended Posts

సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్‌ మ్యూజియం ఏర్పాటు కోసం రెండు ప్రాంతాల పరిశీలన. అందులో ఒక దానిని ఎంపిక చేశాక త్వరితగతిన పనులు.

Link to comment
Share on other sites

  • 4 months later...
ఎన్టీఆర్‌ స్మారక డిజైన్ల పరిశీలన, మార్పుచేర్పులకు సూచనలు..
కాగా.. రాజధానిలోని నీరుకొండ వద్ద ఉన్న కొండపై ఎన్టీఆర్‌ స్మారకార్ధం భారీఎత్తున ఏర్పాటు చేయదలచిన మెమోరియల్‌ డిజైన్లను ముఖ్యమంత్రి ఈ భేటీలో మరొకసారి పరిశీలించారు. కొన్ని నెలల క్రితమే జెనెసిస్‌ అనే సంస్థ ఈ స్మారక స్థలి కోసం 4 ఆకృతులను సిద్ధంచేయగా చంద్రబాబు చూశారు. స్వాతిముత్యం, స్వాతిముత్యం (పెర్ల్‌), పరిక్రమ, కమలం అనే పేర్లతో రూపొందించిన ఆ డిజైన్లలో ఆప్పట్లో ఆయన కొన్ని మార్పుచేర్పులు సూచించగా, జెనెసిస్‌ చేసి బుధవారం నాటి సమావేశంలో ప్రదర్శించింది. వీటిల్లోనూ ఇంకొన్ని మార్పుచేర్పులను సూచించిన చంద్రబాబు ఆ మేరకు సవరించిన డిజైన్లను వచ్చే వారం జరిగే సీఆర్డీయే సమీక్షా సమావేశంలో చూపించాలని ఆదేశించినట్లు భోగట్టా. సమావేశంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి ప్రభృతులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 months later...

పర్యాటక ఆకర్షణీయంగా ఎన్టీఆర్ మెమోరియల్..
అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పరిశీలించారు. మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధికి సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని సమావేశంలో అత్యధికులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. కాంక్రీట్ విగ్రహం కంటే ఇది 30 శాతం ఎక్కువ ఖర్చు అవుతుందని, కానీ, దీర్ఘకాలం మన్నికలో ఉంటుందని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవుతుందని, 0 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. విగ్రహం లోపలిభాగంలోపైవరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా వాటర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయరును అభివృద్ధి చేస్తారు. ఆడిటోరియమ్, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ ధియెటర్, ఆహ్లాదాన్ని అందించే రైలు వంటి సదుపాయాలను ఏర్పాటుచేస్తారు. అక్కడే స్టార్ హోటల్, షాపింగ్ సెంటర్లు, రెస్టరెంట్, రిసార్టులు నెలకొల్పుతారు. ఇంతవరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తయిన విగ్రహంగా ఉందని, ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో దాన్ని మించిపోనుందని అధికారులు చెప్పారు. కొండపై ఏర్పాటు చేసే విగ్రహం కనుక ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు వాటికి మించిన ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 46మాసాలలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని నిర్మాణదారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నీరుకొండను ద్వీపం తరహాలో అభివృద్ధి చేయాలని, విగ్రహం కోసం 14 ఎకరాలు, రిజర్వాయర్ అభివృద్ధికి మరో 70, 80 ఎకరాలే కాకుండామొత్తం 200 ఎకరాలలో ఆ ప్రాంతం మొత్తాన్ని గొప్ప పర్యాటక ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Link to comment
Share on other sites

నీరుకొండపై నిలువెత్తు రూపం
13-12-2018 03:44:41
 
636802839967415539.jpg
  • అమరావతిలో భారీ ఎన్టీఆర్‌ విగ్రహం.. 32 మీటర్ల ఎత్తు.. లోపల లిఫ్ట్‌
  • 200 ఎకరాల్లో.. 406 కోట్లతో ఏర్పాటు.. మ్యూజియం, స్టార్‌ హోటల్స్‌
  • ద్వీపం మాదిరి తయారు చేయాలన్న సీఎం
అమరావతి(ఆంధ్రజ్యోతి): తెలుగువారి గుండెచప్పుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెమోరియల్‌ను అద్భుతంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్‌ అసోసియేట్స్‌ రూపొందించిన ఆకృతులను చూశారు. 32 మీటర్ల ఎత్తయిన అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పా టు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవసరమని తేల్చారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే మెమోరియల్‌కు మరో రూ.112.50 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. ఈ మొత్తం లో చాలా వరకూ విరాళాల రూపంలో సేకరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
 
ప్రస్తుతం గుజరాత్‌లో పటేల్‌ విగ్రహమే ఎత్తయినది, దీనిని ముంబైలో ఏర్పాటు చేసే ఛత్రపతి శివాజీ విగ్రహం అధిగమిస్తుందని అధికారులు తెలిపారు. అయితే కొండపై ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు వాటికి మించిన ప్రత్యేకతతో ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విగ్రహం లోపల అమ ర్చే లిఫ్ట్‌ల ద్వారా సందర్శకులు పైవరకూ వెళ్లి, అక్క డ నుంచి రాజధానిని వీక్షించవచ్చన్నారు. విగ్రహం లోపలే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చుట్టూ వాటర్‌ఫ్రంట్‌, ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్‌, కేఫ్‌, యాంఫీ థియేటర్‌, మినీ ట్రైన్లతోపాటు స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, రిసార్టులను కూడా నెలకొల్పుతామని తెలిపారు. 46 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంకు చెప్పారు.
 
ఇలా చేద్దాం!
నీరుకొండను ఒక ద్వీపం మాదిరి అభివృద్ధి పరచాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. విగ్రహం కోసం 14 ఎకరాలు, రిజర్వాయర్‌ కోసం 70-80 ఎకరాలు కాకుండా మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అద్భుత పర్యాటక ప్రాంతంగా మలచాలని సూచించారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంక్రీట్‌తో కాకుండా కాంస్యంతో రూపొందించాలని సమావేశంలో పాల్గొన్నవారిలో అత్యధికులు సూచించారు.
 
హ్యాపీనెస్ట్‌-2కు ఓకే
రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌కు రెండు విడతలుగా నిర్వహించిన బుకింగ్‌కు అద్భుత స్పందన లభించిందని శ్రీధర్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులోని 1200 ఫ్లాట్లను ప్రజలు కేవలం కొన్ని గంటల్లోనే బుక్‌ చేసుకున్నారన్నారు. వీరిలో దేశవ్యాప్తంగా 659మంది, అమెరికా నుంచి 175మంది, సింగపూర్‌ నుంచి 13 మంది, గల్ఫ్‌ దేశాల నుంచి 12మంది, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల నుంచి ఏడుగురు చొప్పున ఉన్నారన్నారు. మొత్తం 19,351 మంది ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారని, ఇప్పటికీ వందలాది ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. వెంటనే మరొక ప్రాజెక్ట్‌ను చేపడితే బుక్‌ చేసుకునేందుకు 3,394 మంది ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నారన్నారు. దీనికి స్పందించిన సీఎం హ్యాపీనె్‌స్ట-2కు ఆమోదం తెలిపారు.
 
19న భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ విశిష్టతలను మరోసారి ఘనంగా చాటేలా.. అందులోని సచివాలయ టవర్ల కోసం అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ఈ నెల 19న సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ ఫౌండేషన్‌ను 13అడుగుల లోతున, 12వేల క్యూబిక్‌ మీటర్ల మేరా వేయనున్నారు. నార్మన్‌ ఫోస్టర్స్‌ రూపొందించిన డిజైన్ల ప్రకారం నిర్మించే 5భారీ టవర్లకు కలిపి ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేస్తారు. ఇందుకోసం వేల మంది కార్మికులను, వందలాది యంత్ర పరికరాలను, వేల టన్నుల నిర్మాణ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఏకధాటిగా 3 రోజుల్లోనే దీనిని పూర్తి చేయబోతున్నారు. బుధవారం సాయంత్రం రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సీఆర్డీయే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ గురించి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు.
Link to comment
Share on other sites

నీరుకొండపై ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం   

 

60 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు 
200 ఎకరాల్లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు 
ప్రత్యేక ట్రస్టు ద్వారా విరాళాల సేకరణ 
ఈనాడు - అమరావతి 
12ap-main4a_1.jpg

రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ స్మారక(మెమోరియల్‌) ప్రాజెక్టు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పర్యాటక ఆకర్షక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేసే కొండ చుట్టూ జలాశయాన్ని నిర్మించి ప్రాజెక్టు ప్రాంతాలను దీవిలా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టు ఆకృతులను ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్‌ అసోసియేట్స్‌’ సంస్థ రూపొందించింది. 46నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. బుధవారం సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో ఈ ఆకృతుల్ని, ప్రాజెక్టు ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా, వాణిజ్య కూడలిగాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఆదాయాన్ని సొంతంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని చాలావరకు విరాళాల ద్వారా సేకరిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటుచేస్తారు.

ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ముఖ్యాంశాలివి.. 
నీరుకొండలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం లోపలి భాగంలో పైవరకు వెళ్లి అక్కడినుంచి నగరాన్ని వీక్షించవచ్చు. సందర్శకులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లుంటాయి. 
జలాశయం దాటి కొండ వద్దకు చేరుకోడానికి బోట్లు ఏర్పాటుచేస్తారు. వాహనాలలో వెళ్లేందుకు కాజ్‌వే కూడా ఉంటుంది. ప్రాజెక్టులో ప్రధానంగా పది విభాగాలుంటాయి. 
కొండ దిగువ ప్రాంతంలో ఒక ప్రధాన జెట్టీ ఉంటుంది. అక్కడే ఒక ఫనిక్యులర్‌ రైల్వేస్టేషన్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, రెస్ట్‌రూమ్‌లు, ఫుడ్‌కోర్టు, సెల్ఫీపాయింట్‌ ఉంటాయి. 
కొండ దిగువ నుంచి కొండపైకి చేరుకోడానికి ఫనిక్యులర్‌ రైలు ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలపైకి వెళ్లేందుకు ట్రాక్‌పై నడిచే కారునే ఫనిక్యులర్‌ ట్రైన్‌ అంటారు. 
ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసే భవనంలో.. మ్యూజియం, ఆడిటోరియం, కేఫ్‌, ఫనిక్యులర్‌ స్టేషన్‌ ఉంటాయి. 
భవనం పక్కనే ఒక యాంఫీ థియేటర్‌ ఉంటుంది. 
కాజ్‌వే నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసిన భవనం వరకు వాహనాల్లో చేరుకోడానికి రోడ్డు మార్గం ఉంటుంది. 
కొండపైకి వెళ్లేందుకు నడక మార్గం, రెండో జెట్టీ వంటివి ఏర్పాటుచేస్తారు. 
కొండపై అరుదైన వృక్షజాతులతో ఉద్యానవనం ఏర్పాటుచేస్తారు.


ప్రాజెక్టు ప్రత్యేకతలు

విగ్రహం ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయిస్తారు. నీరు కొండ చుట్టూ 70,80 ఎకరాల్లో జలాశయం నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టును 200 ఎకరాల్లో చేపడతారు. 
ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా. విగ్రహం నిర్మాణానికి రూ.155 కోట్లు, విగ్రహం ఏర్పాటుచేయడానికి నిర్మించే భవనానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చవుతాయి. 
42 మీటర్ల ఎత్తైన, 9700 చ.మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాన్ని నిర్మిస్తారు. జీ+3 విధానంలో నిర్మించే ఈ భవనంపై టెర్రాస్‌ ఉంటుంది. దానిపై పోడియం వస్తుంది. భవనం సెంట్రల్‌ కోర్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేస్తారు. టెర్రాస్‌ ఓపెన్‌గా ఉంటుంది.

 

Link to comment
Share on other sites

Neerukonda reservoir maste plan lo unnadi,

Three reservoirs planned to supply drinking water in Amaravati

The Rs 680-crore CRDA project will take care of the need of potable water of the capital city’s population, expected to be 35 lakh by 2050.

Published: 16th February 2018 05:37 AM  |   Last Updated: 16th February 2018 05:37 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA : In order to cater to the drinking water needs of the population of Amaravati, which is expected to  be 35 lakh by 2050, the CRDA is finalising the plans to setup three reservoirs in the capital region. The reservoirs, besides storing water, will also help in the management of Kondaveedu flood water. According to the officials, the reservoirs will be coming up in Neerukonda, Sakhamuru and Krishnayapalem villages. The estimated cost of the projects is about Rs 680 crore. “The plan is to use the water from the proposed Vykuntapuram Barrage that would be constructed 23 km upstream the Prakasam Barrage. Water will be brought through gravity to these reservoirs in Amaravati,” an official of the planning department said.3_reservoirs_planned.jpg

 

It maybe noted that WAPCOS (earlier called Water and Power Consultancy Services) had submitted the detailed project report for the Vykuntapuram Barrage, to be built at an estimated cost of `1960 crore, to the State government. The water resources department plans to store at least 10 tmcft of water there. “We are also chalking out plans for the integration of the proposed reservoirs to the Vykuntapuram project through canals and other means,” the official said. 

The reservoir at Neerukonda will be the biggest of the three with a capacity of close to 0.5 tmcft. The CRDA has already earmarked about 450 acres of land in Neerukonda village, called Neerukonda Reservoir Zone, for the purpose. “The land for the other projects has also been earmarked. Since we also have plans to develop the Neerukonda Reservoir Zone for tourism purposes, we are finalising the plans, keeping the tourist development in mind,” the official said.

Link to comment
Share on other sites

@ ANNA GARU bro, cbn manchi palan chesinattu unadu ga, Neerukonda hill height 122 metres +building height 32metres + statue height 60 metres total ga 214 metres height ga untundi, patel  statue kanna ekkuva  height,  shivaji statue height 211meters , NTR di   height 214meters untundi hill tho kalipithe..

Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...