Jump to content

Neeru Chettu


Recommended Posts

  • Replies 283
  • Created
  • Last Reply

Top Posters In This Topic

నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే మాధవనాయుడు
13-07-2016 09:44:31
636039998725718972.jpg
ప.గో: జిల్లాలోని నర్సాపురంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవనాయుడు, సబ్‌కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, తదితరులు పాల్గోన్నారు. కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ పర్యవరణ పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

మహోద్యమంలా మొక్కలు నాటుదాం

కోడెల

సత్తెనపల్లి: మనకోసం, మన భావితరాల కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో గురువారం ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి శ్రీకారం చుట్టారు. సుగాలీకాలనీ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో సామూహిక వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడెల మాట్లాడుతూ... పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రమంతటా భారీగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలను కన్న బిడ్డల్లా చూసుకుంటే అవి పండ్లు, ఫలాలు మంచి వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. హరిత సత్తెనపల్లి సాకారానికి ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కరూ 10 మొక్కల చొప్పున 50కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ఇతర నియోజకవర్గాలకు సత్తెనపల్లి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. త్వరలో చిలుకలూరిపేటలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం ఛైర్మన్‌ కోటేశ్వరావు, జిల్లా అటవీశాఖ అధికారి రాంమ్మోహన్‌రావు, డ్వామా పీడీ శ్రీనివాస్‌, నియోజకవర్గ తెదేపా నేత శివరాం, డీఎస్పీ మధుసూదన్‌రావు , పురపాలక సంఘం ఛైర్మన్‌ రామస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు సత్తెనపల్లి తాలూకా సెంటర్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Link to comment
Share on other sites

మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు: చంద్రబాబు
 
విజయవాడ: కోటి మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రజలను సంసిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కోటి మొక్కల పెంపకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ట్రీ బ్యాంక్ ఏర్పాటు వంటి వినూత్న ఆలోచనలు అవసరమని చంద్రబాబు అన్నారు. ఏడాది పొడవునా చెట్ల పెంపకం కార్యక్రమం కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...