Jump to content

Neeru Chettu


Recommended Posts

  • Replies 283
  • Created
  • Last Reply

Top Posters In This Topic

9 hours ago, Hello26 said:

ye vidham ga blackmail chestunnaro naku inka artham kaledu. inkastha detailed ga cheppandi brother @surapaneni1

RTI CULTURE NI CHALA WOREST CHESARU.... DAY LO SAGAM TIME EE RTI APPLICATIONS REPLY IVVADANIKI SARIPOTUNDI..... PRATIVODU PHONE CHESI NAKU DETAILS KAVALANTADU.. MATLADINA PHONES ANNI RECORDING MALLI.. IF U WORK FOR A TANK EDO OKA CHINNA MOOLALO PHOTO TEESI TANK MOTTHAM SARIGGA CHEYYALEDU ANI COMPLAINTS.. I HAVE DONE WORKS IN PEDAKURAPADU AND BELLAMKONDA MANDAL ON ADDITIONAL WORK... BOCHHEDU COMPLAINTS ICHHARU.. 2-3 YRS KRITAM VATIKI KUDA IPPUDU COMPLAINT ANTARU... PIKEDI EM LEDULE GANI TOO MUCH TIME WASTE ANTE..

Link to comment
Share on other sites

11 hours ago, surapaneni1 said:

RTI CULTURE NI CHALA WOREST CHESARU.... DAY LO SAGAM TIME EE RTI APPLICATIONS REPLY IVVADANIKI SARIPOTUNDI..... PRATIVODU PHONE CHESI NAKU DETAILS KAVALANTADU.. MATLADINA PHONES ANNI RECORDING MALLI.. IF U WORK FOR A TANK EDO OKA CHINNA MOOLALO PHOTO TEESI TANK MOTTHAM SARIGGA CHEYYALEDU ANI COMPLAINTS.. I HAVE DONE WORKS IN PEDAKURAPADU AND BELLAMKONDA MANDAL ON ADDITIONAL WORK... BOCHHEDU COMPLAINTS ICHHARU.. 2-3 YRS KRITAM VATIKI KUDA IPPUDU COMPLAINT ANTARU... PIKEDI EM LEDULE GANI TOO MUCH TIME WASTE ANTE..

So...kind of fake RTIs tho Sakshi journalists blackmail chestunnaru ayithe @surapaneni1

Link to comment
Share on other sites

నీరు-చెట్టు నిలిచింది.. మూడో పంట పండింది
knl-gen5a.jpg

సంజామల, న్యూస్‌టుడే : భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం ఆ గ్రామంలోని రైతులకు వరంగా మారింది. చెరువుల్లో, కుంటల్లో తీసిన పూడికతీత పనులు సత్ఫలితాలను ఇవ్వటంతో నేడు జలం నిండుగా ఉంది. మొదటిసారి మూడోకారు పంటను రైతులు సాగుచేసి మంచి దిగుబడులను సాధిస్తున్నారు.

మండలంలోని సంజామల కుంట, రామభద్రుని పల్లె, ముక్కమల్ల, కానాల చెరువులతో పాటు ముదిగేడు, ఆకుమల్ల కుంటల్లో నేటికీ పుష్కలంగా నీరు ఉంది.  సాగునీటికి, తాగునీటికి మండలంలో ఇబ్బందులు లేకుండాపోయాయి. రామభద్రునిపల్లె చెరువులో రెండు దఫాలుగా ప్రభుత్వం పూడికతీత పనులు చేపట్టడంతో చెరువులో నీటినిల్వ శాతం పెరిగింది. చెరువు కింద 650 ఎకరాలు సాగుభూమి ఉంది. చెరువుకు ప్రధాన నీటివనరు పేరుసోముల వాగు. ఈ వాగునీరు చెరువుకు చేరుకునేందుకు వీలులేకుండా గాలేరునగరి కాలువను అడ్డుగా నిర్మించారు. ఐతే వాగునీరు పారేందుకు వీలుగా వంతెనను నిర్మించకపోవటంతో గాలేరు నగరిలో కలిసిపోయి కడప జిల్లా గండికోట జలశయంలో చేరేది. ఎమ్మెల్యే బీసీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో గాలేరు నగరి కాలువలో వాగునీరు పారేందుకు వీలుగా దాదాపు రూ.25 కోట్లతో వంతెనను నిర్మించారు. 2017 జూన్‌ నాటికి నిర్మాణం పూర్తికావడంతో వాగునీరు పారేందుకు వీలు ఏర్పడింది. జూన్‌లో, అక్టోబరులో కురిసిన వర్షాలకు పేరుసోముల వాగునీరు రామభద్రునిపల్లె చెరువుకు సకాలంలో చెరుకుంది. కర్షకులు ఖరీఫ్‌, రబీ పంటతో పాటు మూడో పంటను సాగుచేశారు. వరి, కర్బూజ, కలింగర, వేరుసెనగ, నూగు వంటి వంటలు సాగుచేశారు. పదేళ్ల తర్వాత మూడో పంట సాగుచేసి మంచి దిగుబడులను సాధించటంతో సాగుకు చేసిన అప్పులను తీర్చేందుకు అవకాశం ఏర్పడిందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయం లాభసాటిగా బత్తుల ప్రతాప్‌రెడ్డి, గిద్దలూరు
పదేళ్ల తర్వాత చెరువు నిండింది. ఇదే సమయంలో నీరుచెట్టు కింద పూడకతీత పనులు చేపట్టడంతో చెరువు నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఖరీఫ్‌, రబీతో పాటు మూడోపంటను సాగు చేసేందుకు అవకాశం ఏర్పడింది. నీరుచెట్టు సత్ఫలితాలను ఇవ్వటంతో ఇబ్బందులు తొలగాయి. సాగుకు చేసిన అప్పులు తీర్చివేయటంతో పాటు వ్యవసాయం లాభసాటిగా మారింది.

ఇబ్బందుల నుంచి గట్టెక్కాం
మద్దిలేటి, గిద్దలూరు
రామభద్రునిపల్లె చెరువు కింద 650 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గాలేరు నగరి వంతెన నిర్మాణంతో పాటు నీరు చెట్టు సత్ఫలితాలను ఇవ్వటంతో చెరువు సాగునీటితో కళకళలాడుతోంది. రైతులు మూడుకార్లు పంటలను సాగు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఏటా వర్షాధారంపై ఆధారపడటంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ప్రస్తుతం సాగునీరు సమృద్ధిగా ఉండటంతో దిగుబడి పెరిగింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కర్షకులం అందరం గట్టెక్కాం. ప్రభుత్వానికి రైతులందరం రుణపడి ఉంటాం.

Link to comment
Share on other sites

రైతన్నా.. సంజీవని వదులుకోవద్దు
జిల్లాలో అందుకోలేకపోతున్న లక్ష్యాలు
ఒక్క కుంటతో 9,68,000 లీటర్ల నిల్వకు అవకాశం
ఈ ఏడాది 20,418 నిర్మాణాలకు అవకాశం
knl-gen4a.jpg

డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే : నీటికుంటలు సత్ఫలితాలను ఇస్తుండటంతో ఈ ఏడాది మరింతమంది రైతులకు ఆ ఫలాలు అందించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. 2018-19లో 21,378 నీటికుంటలకు ప్రతిపాదనలు పంపగా 20,418 నీటికుంటల తవ్వకానికి అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది లక్ష్యాల్లో 70,82 పంట సంజీవినులు వివిధ దశల్లో ఉండగా ఈ ఏడాది ఇప్పటికే 209 పూర్తయ్యాయి. వీటితో భూగర్భజలాల పెరుగుదలతోపాటు పశువులకు తాగునీరు లభిస్తుంది. పంట బెట్టకాలంలో సంజీవిగా ఉపయోగపడుతుంది. గుంతలో చేరిన ఒండ్రుమట్టి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. పంటలకు పట్టిన చీడపీడల నివారణకు, మందు పిచికారి చేయడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఆయా విస్తీర్ణంలో వీటి తవ్వకం చేపట్టవచ్చు. ఆసక్తి ఉంటే 3 మీ లోతువరకు తవ్వుకోవచ్చు. వ్యవసాయ అధికారుల సహకారంతో ప్లాస్టిక్‌ లైనింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

డోన్‌కు చెందిన రంగస్వామి తన పొలంలో 1551052 విస్తీర్ణంలో పంటసంజీవని తవ్వుకున్నారు. తనకున్న రెండెకరాల్లో కంది పంటకు, పొలంలో సాగుచేసిన మామిడి తోటలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. గతేడాది 30,427 పంట సంజీవనిల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా 27,232 మంజూరయ్యాయి. ఇందులో మొత్తం 8,698 కుంటలు పూర్తికాగా రూ.3215 లక్షలు ఖర్చుచేశారు. 6,277 వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...