Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బెజవాడ రైల్వేస్టేషన్‌ రూపుమారబోతోంది!
 
636219718216387810.jpg
  • రైల్వేస్టేషన్‌కు కార్పొరేట్‌ లుక్‌
  • మల్టీప్లెక్స్‌లు.. సైబర్‌ కేఫ్‌లు
  • అందరికీ అందుబాటులో బడ్జెట్‌ హోటళ్లు
  • ఎనిమిది గ్లోబల్‌ టెండర్లకు ఆహ్వానం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 25 స్టేషన్లను ఆధునికీకరణ చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వేలో తెలంగాణలోని సికింద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్టేషన్లు అతి పెద్ద జంక్షన్లుగా ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, సౌకర్యాలకు అదనంగా కార్పొరేట్‌ హంగులను అద్దబోతున్నారు. ఈ పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ప్రక్రియను ఎనిమిదో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్నారు. అధికారికంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి టెండర్‌ దరఖాస్తులను అందుబాటులో ఉంచుతారు. తర్వాత మిగిలిన ప్రక్రియ నిర్వహిస్తారు.
 
10 ఎకరాల్లో పనుల పరుగు
సుమారు పదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. మిగిలిన మూడు ఫ్లాట్‌ఫారాలను గూడ్స్‌ రైళ్ల కోసం ఉపయోగిస్తున్నారు. రోజూ 250 రైళ్ళు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. లక్షమందికి పైగా ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ 70లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. వాటిలో ఏడు ప్లాట్‌ఫారాల్లో మాత్రమే రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నారు. నవ్యాంధ్రకు రాజధానికి పరిపాలనా కేంద్రంగా మారిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల అభివృద్ధి, ఇతరత్రా పనులు సాగుతున్నాయి. అలాగే విజయవాడకు అనుసంధానంగా ఉన్న మార్గాలను అభివృద్ధి జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ఈ స్టేషన్‌ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. ఏటా కేంద్ర ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే విజయవాడపై అభివృద్ధి పరంగా చిన్నచూపే కొనసాగుతుందని ఇక్కడి వాసుల భావన.
 
 
 
అదిరిపోయే హంగులు
ప్రస్తుతం ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్న ఏడు ప్లాట్‌ఫారాలపై విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఒకటో, ఆరు నంబర్‌ ప్లాట్‌ఫారాలపై మాత్రమే విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. త్వరలో ప్రతి ప్లాట్‌ఫారంపైనా ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించబోతున్నారు. ‘స్మార్ట్‌’గా ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సైబర్‌ కేఫ్‌లను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నానాటికి పెరుగుతోంది. రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఇస్తున్న ఫ్రీ వైఫై కొంత సమయానికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులందరికీ ఇంటర్నెట్‌ను 24/7 అందుబాటులో ఉండేలా చేయడానికి సైబర్‌ కేఫ్‌లను నెలకొల్పుతారు. హైఫై ప్రయాణికుడి దగ్గర నుంచి సాధారణ ప్రయాణికుడి వరకు అడుగుపెట్టేలా బడ్జెట్‌ హోటళ్లను ఏర్పాటు చేస్తారు. అలాగే బేకరీలు, షాపింగ్‌మాల్స్‌ రానున్నాయి.
 
 
భారతదేశంలో రైళ్లు సమయానికి ప్లాట్‌ఫారాలపైకి రావన్న నమ్మకం ఎక్కువమంది ప్రయణికుల్లో ఉన్నది. ఒకవేళ రైలు రెండు, మూడు గంటలు ఆలస్యమైతే, ప్రయాణికులకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించడానికి మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తారు. ఇప్పటికే పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వై స్కీన్స్‌ పేరుతో రెండు మల్టీప్లెక్స్‌ స్ర్కీన్స్‌ ఉన్నాయి. త్వరలో ఈ మల్టీస్ర్కీన్స్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టబోతున్నాయి. మొత్తం ఈ సౌకర్యాలన్నీ కల్పించడానికి సుమారుగా 2,300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ సౌకర్యాన్నీ కల్పించిన కాంట్రాక్టర్‌కు 30-50 ఏళ్ల వరకు రైల్వేస్ఠలాలను లీజుకిస్తారు. కాంట్రాక్టర్‌ దీనికి సంబంధించి ప్రతి ఏటా కొంత మొత్తాన్ని రైల్వే శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...