Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బెజవాడలో ఈ-రిక్షాలు.. తప్పనిసరి చేయాలని నిర్ణయం
04-07-2018 08:31:52
 
636662899131849593.jpg
  • ఆటో యూనియన్లతో సమావేశం..
  • నిర్వహించాక తుది నిర్ణయం
  • నగరంలో ఇప్పటికే ఈ-రిక్షా షోరూమ్‌
 
విజయవాడ: బెజవాడ నగరంలోకి ఈ-రిక్షాలు ప్రవేశిస్తున్నాయి. వీటికి కూడా ఇక రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా వీటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ ఆటోల మాదిరిగానే వాటికి కూడా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఈ-రిక్షాలకు అనుమతులు ఇవ్వటంతో పాటు నగరంలో వీటిని తప్పనిసరి చేసే అంశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది. నగరంలో ఈ-రిక్షాలను తప్పనిచేసే ముందు ఆటో యూనియన్ల అభిప్రాయం కూడా తీసుకుని, వారి అంగీకారంతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో రవాణా శాఖ ఉంది.
 
రవాణా రంగ రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఆటోల వ్యవస్థను సంస్కరించి, ఈ-రిక్షాలను ప్రవేశ పెట్టాలన్న ఆలోచనను జిల్లా రవాణా శాఖ చేస్తోంది. ఈ-రిక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో, రాజధాని ప్రాంతంలో కీలకమైన విజయవాడ నగరంలో కాలుష్య రహిత సరికొత్త ఆటో వ్యవస్థను తీసుకు రావటానికి ఈ-రిక్షాలను రవాణా శాఖ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.
 
విజయవాడ నగరంలో తిరుగాడే ఆటోల స్థానంలో ఈ-రిక్షాలను ప్రవేశపెట్టడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధ్యయనం చేస్తోంది. నగరంలో 30 వేల ఆటోలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ-రిక్షాలుగా మార్చమని ప్రభుత్వమేమీ నిర్దేశించలేదు. ఉత్తర్వులూ ఇవ్వలేదు. అలాగని రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించలేదు. అయినప్పటికీ నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించటానికి ఈ-రిక్షాలను తప్పనిసరి చేయాలన్న ఆలోచనతో జిల్లా రవాణా శాఖ ఉంది. ఆటోవాలాల అభిప్రాయం తీసుకుని, వారి నుంచి వచ్చిన స్పందనను రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకు వెళ్ళి, అమలుకు శ్రీకారం చుట్టాలని డీటీసీ మీరాప్రసాద్‌ భావిస్తున్నారు.
 
 
పాత ఆటోలపై దృష్టి
నగరంలో 30 వేల ఆటోలున్నాయి. వీటిలో సీఎన్‌జీ ఆటోలు ఆరు వేలు ఉన్నాయి. 24 వేల ఆటోలు డీజిల్‌, పెట్రోల్‌తో నడిచేవే. విజయవాడకు అతి సమీపంలో ఉన్న గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఉన్న పాత ఆటోల స్థానంలో కొత్తగా సీఎన్‌జీ ఆటోలకు అనుమతులు ఇచ్చారు. వీటిని వెంటనే ఈ-రిక్షాలుగా మార్చడం భావ్యం కాదని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. సీఎన్‌జీ ఆటోలతో కాలుష్యం ఉండదు కాబట్టి వీటిని మినహాయించాలని భావిస్తున్నారు. 24 వేల పాత ఆటోలను ఈ-రిక్షాలుగా మార్చడం అవసరమని భావిస్తున్నారు.
 
 
ఈ-రిక్షా అంటే..
ఎలక్ర్టానిక్‌ రిక్షానే ఈ-రిక్షా. బ్యాటరీ చార్జింగ్‌ ప్రాతిపదికన నడిచే త్రీ ఇన్‌ ఆల్‌ ఆటోలు ఇవి. నూరు శాతం కర్బన రహిత ప్రయాణం అందించే వ్యవస్థ. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వినియోగించాల్సిన అవసరం లేదు. ఇందులో బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల పాటు చార్జింగ్‌ చేస్తే ఏకబిగిన 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీటి వేగం గంటకు 25 కిలోమీటర్లే. కాబట్టి దూకుడుగా పోవటానికి ఉండదు. ప్రమాదాలను నివారించటానికి ఎంతగానో దోహదపడుతుంది. వేగపరిమితి వల్ల ఇవి నగర పరిధిలోనే తిరుగుతాయి.
 
 
ఆటో యూనియన్లతో సమావేశం
ఈ-రిక్షాలను ప్రయోగాత్మకంగా అమలు చేయటానికి ఆటోయూనియన్ల అభిప్రాయం తెలుసుకోవాలని రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పాత ఆటోల యూనియన్లతో చర్చించి, వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతారు. తర్వాత అమలుపై ప్రకటన చే స్తారు.
 
నగరంలో అమలు చేసే దిశగా..
ఈ-రిక్షాలకు రిజిస్ర్టేషన్‌ సదుపాయం కల్పించాం. వీటికి ఇక మీదట ఇబ్బందులేమీ ఉండవు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించటానికి ఈ-రిక్షాలను ఉపయోగించుకోవచ్చు. నగరంలో వీటిని తప్పనిసరి చేసే అంశంపై దృష్టి సారిస్తున్నాం. - మీరాప్రసాద్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌
Link to comment
Share on other sites

రాజధాని ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రతిపాదన
05-07-2018 10:26:49
 
636663832106257926.jpg
  • ఆర్టీసీకి పవర్‌!
  • రాజధాని ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రతిపాదన
  • గోల్డ్‌స్టోన్‌, అశోక్‌ లేల్యాండ్‌ సంస్థల ఆసక్తి
  • కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సబ్సిడీకి చర్యలు
  • కేంద్ర సబ్సిడీ తేలితే.. బస్సుల కొనుగోలుకు మార్గం సుగమం
  • తిరుపతిలో విజయవంతమైతే.. ఆర్టీసీకి నాలుగు నెలల్లో 30 ఎలక్ట్రిక్‌ బస్సులు
 (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాజధాని ప్రాంతంలో ‘పవర్‌’ బస్సులు రోడ్ల మీద తిరగనున్నాయ్‌. బ్యాటరీ ఆధారిత బస్సులను నడపాలన్న ప్రతిపాదనలను రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చింది. ఆర్టీసీ ప్రతిపాదనలకు సంబంధించి ఢిల్లీలో ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకువచ్చిన గోల్డ్‌స్టోన్‌ కంపెనీతో పాటు అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ కూడా బస్సులను తిప్పటానికి ఆసక్తి చూపుతోంది. ఎలక్ర్టిక్‌ బస్సు రూ.3 కోట్ల భారీ వ్యయం అవుతుంటంతో ఆర్టీసీ ధర తగ్గించాలని కోరుతోంది. ఎలక్ర్టిక్‌ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకు రానున్న నేపథ్యంలో, కొంత రాయితీ సమకూరే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీలు పొందగలిగితే ఆర్టీసీకి ఈ బస్సు రూ.1 కోటి, కోటిన్నర ధరకు రావచ్చు. రాజధాని ప్రాంతంలో ఎలక్ర్టిక్‌ బస్సులను తిప్పటానికి ఆసక్తి చూపిస్తున్న గోల్డ్‌స్టోన్‌, అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీలు రాయితీ పొందే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉన్నాయి.
 
ఆర్టీసీ సాంకేతిక విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు ఎలక్ర్టిక్‌ బస్సులకు సంబంధించి విస్తృత అధ్యయనం చేస్తున్నారు. సంస్థకు భవిష్యత్తులో ఎంతో దోహదపడే ఎలక్ర్టిక్‌ బస్సులకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నడిపే బస్సులు పన్నెండు మీటర్ల పొడవు ఉండాలని ఆయన గోల్డ్‌స్టోన్‌, అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీలకు నిర్దేశించారు. ఈ బస్సుల పొడవు పన్నెండు మీటర్లు. అంటే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల కంటే పొడవుగా ఉంటాయి. ప్రస్తుత ఆర్టీసీ బస్సుల పొడవు 10 - 11 మీటర్ల నిడివి ఉంటాయి. మినీ బస్సులు 8- 9 మీటర్ల నిడివిలో ఉంటాయి.
 
బస్సులు పొడవుగా ఉండటం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆకర్షణీయంగాను, లోపల విశాలంగా ఉండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయన ఈ పొడవును సూచించినట్టు తెలుస్తోంది. రెండు కంపెనీలు తమ బస్సులకు సంబంధించి స్పెసిఫికేషన్స్‌ అందించాయి. గోల్డ్‌స్టోన్‌ సంస్థ తన బస్సును ఒకదానిని ఇటీవల విజయవాడ నగరానికి తీసుకు వచ్చింది. విజయవాడ డిపో గ్యారేజీలో దీనిని ఉంచింది. ఈ బస్సులోని బ్యాటరీకి నాలుగు గంటలు చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఎలక్ర్టిక్‌ బస్సును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్లు కూడా కొందరు ఈ బస్సు మీద శిక్షణ పొందారు. ఈ బస్సును ప్రయోగాత్మకంగా నడిపే విషయంలో ఆర్టీసీ, గోల్డ్‌స్టోన్‌ కంపెనీ మధ్య అగ్రిమెంట్‌ కుదరలేదు. దీంతో ఆ బస్సు వెనక్కి వెళ్ళిపోయింది. అగ్రిమెంట్‌ కుదుర్చుకోకపోయినా ఎలక్ర్టిక్‌ బస్సులను నడపటానికి మాత్రం గోల్డ్‌స్టోన్‌ సంస్థ సుముఖంగా ఉంది. ఇదిలా ఉంటే తొలి ఎలక్ర్టిక్‌ బస్సును అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తిరుపతిలో ప్రవేశపెట్టింది. తిరుపతి ఘాట్‌ రోడ్డులో ఈ బస్సును ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. తిరుమల మార్గంలో ఈ బస్సు విజయవంతంగానే నడుస్తోంది. నెల రోజుల పాటు ఈ బస్సును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. ఈ బస్సులు విజయవంతం అయితే మరో 40 బస్సుల వరకు ఆర్టీసీ ఆ సంస్థ నుంచి తీసుకోనుంది. ఈ బస్సులను లాంగ్‌డిస్టెన్స్‌ సర్వీసులుగా ఉపయోగించనున్నారు.
 
రాజధాని ప్రాంతంలో 500కు పైగా బస్సులు!
అన్నీ అనుకూలిస్తే రాజధాని ప్రాంతంలో దశల వారీగా ఐదు వందల ఎలక్ర్టిక్‌ బస్సులు నడిచే అవకాశం ఉంటుంది. విజయవాడ నగరంలో ప్రస్తుతం 400 సిటీ బస్సులు నడుస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో 100 సిటీ బస్సులు నడుస్తున్నాయి. గుంటూరు వరకు వెళితే ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది. ఈ బస్సుల స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకు రావాల్సి ఉంటుంది.
 
కేంద్రం సహకరిస్తే త్వరలోనే.
రాజధాని ప్రాంతంలో ఎలక్ర్టిక్‌ బస్సులను త్వరగా తీసుకురావాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమవుతోంది. రూ.30-50 లక్షల బస్సుల స్థానంలో రూ.3 కోట్ల ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలంటే ఆర్టీసీ సొంతగా భరించే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీ ఎలాగూ సంస్థలో ఉంది కాబట్టి ఈ రెండూ సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎంతగా వస్తే.. అంతగా ఆర్టీసీకి అదనపు భారం తగ్గుతుంది.
 
పాత బస్సుల మార్పు ప్రయోగం విఫలం..
సీఎన్‌జీ బస్సులను డీజిల్‌ బస్సులుగా మార్పు చేసిన ఆర్టీసీ సాంకేతిక సిబ్బందికి వీటిని బ్యాటరీతో నడిచే విధంగా తయారు చేయటం కష్టసాధ్యంగా మారింది. ఇంజన్‌ దగ్గర నుంచి యాక్సిల్‌ వరకు అన్నింటినీ మార్చితేనే అది సాధ్యమని, ఇదంతా చేయడం కంటే కొత్త బస్సును కొనటమే అత్యుత్తమం అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇందు కోసం ప్రయత్నించి, తరువాత విరమించుకున్నారు.
 
 
ఎలక్ర్టిక్‌ బస్సులు అవసరం
సంస్థకు ఎలక్ర్టిక్‌ బస్సులు అవసరం. ఆర్టీసీకి ప్రధాన వ్యయంగా మారుతున్న డీజిల్‌కు ఈ బస్సులు ప్రత్యామ్నాయమే. ఈ దిశగా యాజమాన్యం కూడా అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలో ఎలక్ర్టిక్‌ బస్సులు తిప్పటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఖరీదైన బస్సులను ప్రవేశపెట్టే స్థోమత ఆర్టీసీకి లేదు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే అవకాశాలు మెరుగవుతాయి. తిరుపతిలో నడుపుతున్న ఎలక్ర్టిక్‌ బస్సు విజయవంతమైతే నాలుగు నెలల్లో 40 బస్సులు వరకు ఆర్టీసీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఏడాదిలో ఆర్టీసీలోకి ఎలక్ర్టిక్‌ బస్సులు వచ్చే అవకాశం ఉంది.
కోటేశ్వరరావు, ఈడీ (ఈ అండ్‌ ఐటీ), ఆర్టీసీ
Link to comment
Share on other sites

విజయవాడ గాంధీహిల్ కు నూతన శోభ..

   
gandhi-hill-07072018.jpg
share.png

మ‌హాత్ముడు న‌డ‌యాడిన గాంధీ కొండ కొత్త రూపును సంత‌రించుకోనుంది. నాడు విజ‌య‌వాడ‌కు శాస్త్ర సాంకేతిక ప‌ర్యాట‌క ప్రాంతంగా విరాజిల్లిన ఈ కొండ కాల‌క్ర‌మంలో ఆధునీక‌ర‌ణ‌కు నోచుకోక‌, గ‌త కొంతకాలంగా ప‌ర్యాట‌క ఆద‌ర‌ణ‌కు దూర‌మైంది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. గాంధీ హిల్ పౌండేష‌న్ ఆధీనంలో ఈ కొండ ఉండ‌గా, ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఈ ప‌ర్యాట‌క ప్రాంతాన్ని అభివృధ్ది చేయ‌నున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అమ‌రావ‌తి ప్రాంత ప‌ర్యాట‌క అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోగా, శుక్ర‌వారం జ‌రిగిన ఎపిటిఎ పాల‌క‌మండ‌లి స‌మావేశం కొండ ఆధునీక‌ర‌ణ‌కు రూ.5 కోట్లు వ్య‌యం చేయాల‌ని నిర్ణ‌యించింది. పాల‌క మండ‌లి ఛైర్మ‌న్, ప‌ర్యాట‌క భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశం ఈ మేర‌కు ప్రాధ‌మికంగా నిర్ణ‌యం తీసుకుంది.

 

ఈ మొత్తంతో గాంధీ కొండ రూపురేఖ‌లు మార్చాలని, విజ‌య‌వాడ‌లో భ‌వానీ ద్వీపం మాత్ర‌మే ప‌ర్యాట‌క అవ‌స‌రాల‌ను తీర్చుతున్న‌త‌రుణంలో దీనికి కూడా పూర్తి స్ధాయిలో కొత్త రూపు తీసుకు రావాల‌ని మీనా సూచించారు. భ‌వానీ ఐలండ్ టూరిజం కార్పోరేష‌న్ ఈ ప‌నుల‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నుండ‌గా, గాంధీ హిల్ పౌండేష‌న్ పెద్ద‌ల‌తో ప‌ర్యాట‌క శాఖ అధికారులు ఇప్ప‌టికే ప‌లు మార్లు భేటీ అయ్యారు. తొలుత రూ.3.15 కోట్ల‌తో ఒక్క న‌క్ష‌త్రశాల‌ను మాత్ర‌మే ఆధునీక‌రించాల‌ని తొలుత భావించినా, పాల‌క మండ‌లి స‌మావేశం నిధుల స‌మ‌స్య రాకుండా చూస్తామ‌ని, అన్నివిభాగాల‌ను ఆధునీక‌రించి ప‌ర్యాట‌క భ‌రితంగా తీర్చి దిద్దాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌ధ్యంలో మీనా మాట్లాడుతూ అక్క‌డి పిల్ల‌ల రైలును తిరిగి న‌డ‌పాల‌ని, అదే క్ర‌మంలో గ్రంధాల‌య భ‌వ‌నానికి మెరుగులు దిద్ది ప్ర‌తి ఒక్క‌రూ వినియోగించుకునేలా చూడాల‌ని అన్నారు. స‌ర్వాంగ సుంద‌రంగా కొండ ప్రాంతం ఉండాల‌ని ల్యాండ్ స్కేపింగ్‌ మంచి ఆర్కిటెక్చ‌ర్‌కు అప్ప‌గించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది.

మ‌రోవైపు భ‌వానీ ద్వీపంలో వెలుగుల ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. దేశంలోనే తొలిసారిగా ప‌దిల‌క్ష‌ల‌కు పైగా ఎల్ఇడిల‌తో వెలుగుల ఉద్యాన‌వ‌నం తీర్చిదిద్ద‌నున్నారు. ఈ వెలుగులు కృష్ణాన‌దిలో ప్ర‌తిబింబించ‌నుండ‌గా, అమ‌రావ‌తి ప్రాంతానికి కొత్త అందాల‌ను స‌మ‌కూర్చుతాయి. సాధార‌ణంగా మొక్క‌ల‌తో జంతువులు, ప‌క్షుల ఆకారాల‌ను తీర్చిదిద్ద‌టం మ‌నం చూస్తుంటాం, ఈ వెలుగుల ఉద్యాన‌వ‌నంలో అవ‌న్ని ఎల్ఇడి వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. ఈ నేప‌ధ్యంలో టూరిజం అధారిటీ సిఇఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యాన‌వ‌నం ప్ర‌పంచ శ్రేణి ప‌ర్యాట‌క కేంద్రాల‌లో ఒక‌టిగా ఉండ‌నుంద‌ని, స‌మావేశం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఉద్యోగుల పున‌ర్ నిర్మాణంకు సంబంధించి అంశాలు పాల‌క మండ‌లి ఎజండా అంశాలుగా ఉండ‌గా వాటిని ప్ర‌భుత్వ ప‌రిశీల‌నకు పంపాల‌ని మీనా నిర్ణ‌యించారు. ఈ స‌మావేశంలో సంస్ధ పాల‌నా వ్య‌వ‌హారాల సంచాల‌కులు డాక్ట‌ర్ సాంబ‌శివ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

విజయవాడలో మరో స్ర్కాప్‌ స్కల్ప్చర్‌ పార్కు
09-07-2018 07:49:22
 
636667193608618011.jpg
  • రామవరప్పాడు నుంచి రమేశ్‌ హాస్పిటల్‌ వరకు ప్రణాళిక
  • సాధారణ శిల్పాల ఏర్పాటుకూ యత్నాలు
  • 28 మంది కళాకారులతో ఏర్పాట్లు
 
ఇనుప డ్రాగన్లు నగరంలో సందడి చేయనున్నాయి. వెల్డింగ్‌ చేసిన నెమళ్లు అలరించబోతున్నాయి. ఎగరని రాబందులు విజయవాడ సెంట్రల్‌ డివైడర్లలో కనువిందు కావించనున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా! అవును.. నగరంలోని రామవరప్పాడు రింగు మొదలుకుని రమేశ్‌ హాస్పిటల్‌ వరకు ఉన్న సెంట్రల్‌ డివైడర్లలో స్ర్కాప్‌ స్కల్ప్చర్‌ పార్కును ఏర్పాటుచేయడానికి విజయవాడ నగర పాలక సంస్థ రంగం సిద్ధం చేస్తోంది.
 
విజయవాడ: నగరంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదుట ఉన్న స్ర్కాప్‌ స్కల్ప్చర్‌ పార్కులోని ఇనుప శిల్పాలు ఇప్పటికే నగర వాసులను చూపరులను కట్టి పడేస్తున్న విషయం తెలిసిందే. నగరానికి మరో వైపున కూడా ఈ పార్కును ఏర్పాటుచేయాలని వీఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. కార్యాచరణ ఇప్పటికే సిద్ధం కాగా.. త్వరలో శిల్పకారులు నగరానికి విచ్చేయనున్నారు.
 
స్ర్కాప్‌ స్కల్ప్చర్లను నగరానికి పరిచయం చేసిన కళాకారులే ఈ సారి కూడా శిల్పాలను తయారుచే యనున్నారు. రామవరప్పాడు నుంచి రమేశ్‌ హాస్పిటల్‌ వైపునకు వెళ్లే సర్వీసు రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రీనరీలో ఈ శిల్పాలను ఏర్పాటుచేడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏఎన్‌యూ, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ విద్యార్థులు, బరోడా, కర్ణాటక, కోల్‌కతా, ఢిల్లీ, ఒరిస్సాలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సును అభ్యసించిన, అభ్యసిస్తోన్న దాదాపు 23 మంది విద్యార్థులతో పాత బస్టాండు పక్కనే ఉన్న స్ర్కాప్‌ స్కల్ప్చర్‌ పార్కును అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇపుడు అదే కళాకారులతోపాటు మరికొంత మంది నూతన కళాకారులతో ఈ శిల్పాలను ఏర్పాటు చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రమేశ్‌ హాస్పిటల్‌ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ పనులు ఓ కొలిక్కి రాగానే పనులను ప్రారంభించేందుకు కార్పొరేషన్‌ కార్యాచరణ రూపొందిస్తోంది. స్ర్కాప్‌ స్కల్ప్చర్స్‌తో పాటు రాతి శిల్పాలను కూడా ఏర్పాటుచేయాలని నగర కమిషనర్‌ జె.నివాస్‌ యోచిస్తున్నారు.
 
స్ర్కాప్‌ స్కల్ప్చర్స్‌ అంటే?
నిరుపయోగంగా మారిన చెత్తను బయోమైనింగ్‌ ద్వారా ఉపయోగంలోకి తీసుకువస్తున్నట్లుగానే, పనికిరావని మూలన పడేసిన యంత్రాలు, ఇనుప ముక్కలను ఉపయోగించి పలు కళాకృతులను తయారుచేయడమే ఈ స్ర్కాప్‌ స్కల్ప్చర్‌. ఇలా మిగిలిపోయిన ఇనుపముక్కలను కూడా అందంగా తయారుచేయడంలో రాష్ట్రానికి చెందిన పలువురు కళా కారులు శిక్షణ తీసుకోవడంతోపాటు పలు రాష్ట్రా ల్లోనూ ఈ శిల్పాలను ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్‌ ఆ కళాకారులందరినీ ఒక చోటికి చేర్చి నగరంలో ఈ శిల్పాల ఏర్పాటుకు నాంది పలికారు.
 
టన్నుల కొద్దీ పనికిరాని స్ర్కాప్‌
కార్పొరేషన్‌కు చెందిన పలు భారీ వాహనాలు మూలనపడి నిరుపయోగంగా మారాయి. వాటిలో ఎక్స్‌ కవేటర్లు, ఆటోలు, డంపరు వాహనాలు ఇలా సుమారు పదికి పైగా వాహనాలే తుప్పు పట్టిన స్థితిలో నగ రంలోని హనుమాన్‌పేటలో గల వెహికల్‌ డిపోలో ఉన్నాయి. వాటిలో పునరుద్ధరణకు పనికిరాని స్థితిలో ఉన్న వాహనాలను కూడా ఈ స్ర్కాప్‌ స్కల్ప్చర్స్‌గా తీ ర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

మరో 4 నెలల్లో..
kri-brk1a.jpg
బందరు రహదారి సిద్ధం..‌
సకాలంలో పూర్తి చేసిన గుత్త సంస్థ

బందరు రహదారి పైన ప్రయాణమా.. వాహన చోదకుల వెన్నులో వణుకే.. గమ్యస్థానం చేరేవరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ  వెళతారు. ద్విచక్ర, ప్రైవేటు వాహనాలే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఈ మార్గంలో విధులు నిర్వహించాలంటే భయమే..  తరచూ ప్రమాదాలు  వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎక్కువగా చోటుచేసుకునేవి.  గత పదేళ్లలో దాదాపు 900 మంది వరకు మరణించారు. వందల మంది గాయాల పాలయ్యారు.

ఇలా ఎందుకో..
కేవలం రెండు వరసలే ఉండటం, మధ్యలో డివైడర్‌ లేకపోవడం, మలుపులు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం.. చీకటి మయమవ్వడం..  సూచికలు లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురయ్యేవి. ఈ మార్గంలో కొత్తవారైతే మరీ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 64 కిలోమీటర్లకు దాదాపు 88 ప్రాంతాల్లో వేగ నిరోధకాలను ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయవచ్చు. జాతీయ రహదారిపై వేగనిరోధకాల ఏర్పాటు నిషేధం ఉంది. అయినా ఉన్నతాధికారులు వీటిని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారంటే కారణం ప్రమాదాలే! అలాంటి బందరు జాతీయ  రహదారి చరిత్ర మారింది. విస్తరణ పనులు పూర్తి కావచ్చాయి. మరో నాలుగు నెలలో దీన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 24 నెలల్లో  దీని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నారు.

ఈనాడు, విజయవాడ

బందరు రహదారి పనులు దాదాపు 90 శాతం  పూర్తయ్యాయి. బెంజి సర్కిల్‌ పైవంతెన, బందరు రహదారి ఒకేసారి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ రహదారిపై ప్రమాదాలు తగ్గాయి. పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తే ఇక భారీ వాహనాలు దూసుకెళ్లనున్నాయి. మచిలీపట్నం పోర్టు, లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటు కానున్నాయి. దీంతో భారీ వాహనాల రద్దీ పెరగనుంది.

శరవేగంగా పనులు..!
ఈ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ పనులు సకాలంలో పూర్తి కానున్నాయి. గత కొన్ని నెలలుగా  నిరాటంకంగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. న్యాయపరమైన కేసులు, చిక్కులు ఎదురుకావడంతో కొంతకాలం జాప్యం అయింది. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేశారు. కానూరు నుంచి పెనమలూరు వరకు ఉన్న న్యాయస్థానం కేసులు ఇటీవల ఉపసంహరించడంతో పనులు వేగవంతం చేసి పూర్తి చేశారు.

‌* బెంజి సర్కిల్‌ పైవంతెన పనులు కూడా నవంబరు నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు.

‌* బందరు-విజయవాడ రోడ్డు  విస్తరణకు రెండేళ్ల కిందట కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాల్సిన ఈ రోడ్డు ఏడాది వరకు నత్తనడకన సాగింది.

* విజయవాడ నగరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పమిడిముక్కల, పామర్రు, గూడూరు, బందరు మండలాలను కలుపుతూ జాతీయ రహదారి వెళుతోంది. మొత్తం 64 కిలోమీటర్ల రోడ్డు నాలుగు వరసలుగా విస్తరించి నిర్మాణం చేయాల్సి ఉంది. గతంలో ఉన్న రెండు వరసల రోడ్డును ఆధునికీకరణ  చేస్తున్నారు. దీనికి కిలోమీటరుకు వ్యయం రూ.14.36 కోట్లు ఖర్చు అంచనా వేశారు. బెంజి సర్కిల్‌ పైవంతెన సహా మొత్తం 4 మేజర్‌ వంతెనలు, 5 మధ్యతరహా వంతెనలు, 5 అండర్‌పాస్‌లు నిర్మాణం చేయాల్సి ఉంది. వీటిలో బెంజి సర్కిల్‌ మినహా అన్ని పూర్తయ్యాయి. 22 కిలోమీటర్లు సర్వీసు రోడ్డు వస్తుంది. 107 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మాణం చేయాల్సి ఉంది. బస్‌బేలు 34 ప్రాంతాల్లో ఉంటాయి. కంకిపాడు దాటిన తర్వాత టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తాన్‌బాద్‌ గ్రామాల్లో 15.85 కిలోమీటర్ల వరకు బైపాస్‌ నిర్మాణం చేశారు. బైపాస్‌ మొత్తం సీసీ రోడ్డుగా నిర్మించారు. ఈ నిర్మాణానికి రూ.740 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు భారీగా వ్యయం అవుతోంది.

విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న నాలుగు వరసలను అలాగే ఉంచుతారు. పోరంకి వరకు 8.4 కిలోమీటర్లు 45 మీటర్ల (150 అడుగులు) వెడల్పు, ఆ తర్వాత 60 మీటర్ల (200 అడుగులు) వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేశారు. నవంబరు 2016న గుత్త సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. 2018 నవంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మొదట జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని నవనిర్మాణ దీక్ష సందర్భంగా ప్రారంభించాలని సంకల్పించారు. సాంకేతిక కారణాలు న్యాయ సంబంధ కేసుల వల్ల కొంతజాప్యం చోటుచేసుకుంది. వారానికి కిలోమీటరు చొప్పున నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం  సమీక్ష సమావేశంలో లక్ష్యం నిర్దేశించారు.  రోజుకు 1500 టిప్పర్లు చొప్పున పనిచేశాయి. భూసేకరణ, భవనాల తొలగింపు వివాదంగా మారి ఉద్రిక్తతలకు దారి తీసింది. రాత్రికి రాత్రే నిర్మాణాలు తొలగించారు.  మండల స్థాయిలో గ్రామాల వారీగా భూసేకరణకు అవార్డు ప్రకటించారు. గజానికి రూ.35 వేల నుంచి రూ.45 వేలకు ధరలు నిర్ణయించారు. కొంతమంది గజానికి రూ.60 వేలు కావాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు దాదాపు రూ.16.50 కోట్లు పరిహారం చెల్లిస్తున్నారు. కానూరు పంచాయతీ పరిధిలో 50 మంది నిర్వాసితులు ఉన్నారు. పోరంకిలో 293 మంది నష్టపోతున్నారు. వీరికి రూ.40 వేలు చొప్పున అవార్డు నిర్ణయించారు. కంకిపాడు మండలంలోనూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇంకా 20 శాతం భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. కంకిపాడు వద్ద ఒక భవనం ఇంకా తొలగించలేదు. దీనికి కారణం పరిహారం అందించలేదు. ఆర్బిట్రేషన్‌ పద్ధతిలో సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దాదాపు భూసేకరణ పూర్తి చేశారు. పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

తూములు ఏర్పాటు..! అది జాతీయ రహదారి. పలు ప్రాంతాల్లో కాలువల కోసం తూములు ఏర్పాటు చేయడం వివాదంగా మారుతోంది. పంట కాలువలు రోడ్డును దాటాల్సి ఉంది. సాంకేతికంగా అక్కడ కల్వర్టులు (వంతెనలు) ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రీట్‌ దిమ్మలతో ఈ వంతెనలు ఉంటాయి. తూములు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహాన్ని బట్టి తూములు సామర్థ్యం సరిపోతుందని చెబుతున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాలు వెళుతుంటాయి. 10 టన్నుల నుంచి 50 టన్నులు వరకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తూములు ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారికి మధ్యన డివైడర్‌ ఏర్పాటు చేశారు. దీనిలో మొక్కలు పెంచాల్సి ఉంది. మొక్కలు పెంచేందుకు ఎర్రమన్ను పోయాల్సి ఉంది. అయితే రాళ్లు పోశారు. దీనివల్ల మొక్కలు పెరిగే అవకాశం లేదని అంటున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో సూచికల ఫలకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి సర్వీసు రహదారి లేకపోవడం గమనార్హం. సర్వే సమయంలో డీపీఆర్‌ అలాగే తయారు చేశారని అంచనాలు ఆవిధంగానే రూపొందించారని పీడీ చెబుతున్నారు.
టోల్‌ ఏర్పాటు..! కంకిపాడు ప్రాంతంలో టోల్‌ ఏర్పాటు చేస్తున్నారు. నవంబరు తర్వాత టోల్‌ రుసుము వసూలు చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో (ఎన్‌హెచ్‌ఏఐ) దీన్ని నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్‌ ఏర్పాటు చేయవచ్చు. 64 కిలోమీటర్లకు కలిపి ఒకటే ఏర్పాటు చేయనున్నారు. రుసుములు మాత్రం 64 కిలోమీటర్లకు నిర్ణయిస్తారు. ఈ రహదారిని గుత్త సంస్థ బీఓటీ కాకుండా ఈపీసీ పద్ధతిలోనే నిర్వహించినందున టోల్‌ వసూలు ఎన్‌హెచ్‌ఏఐ తీసుకుంది. నవంబరులో రహదారిని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

Link to comment
Share on other sites

బందరు రోడ్డు విస్తరణకు మార్కింగ్‌
11-07-2018 07:00:32
 
636668892318645148.jpg
అమరావతి: విజయవాడలోని బందరు రోడ్డు విస్తరణ ప్రక్రియలో మరొక అంకానికి అధికారులు మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. విడతలవారీగా ఈ రహదారిని విస్తరించడం ద్వారా విజయవాడ, పరిసర గ్రామాల వారు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఇప్పటికే కంకిపాడు నుంచి కానూరు సెంటర్‌ వరకు 4 వరుసల రోడ్డును నిర్మిస్తున్న సంగతి విదితమే. తాజా గా కానూరు సెంటర్‌ నుంచి విజయవాడలోని ఆటోనగర్‌ పోస్టాఫీసు సెంటర్‌ వరకు బందరు రోడ్డును జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం 120 అడుగులమేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఆర్డీయే అధికారులు మంగళవారంనాడు రోడ్డు మార్కింగ్‌ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రదేశాల మధ్య ప్రస్తుతం బందరు రోడ్డు 94 నుంచి 96 అడుగుల వెడల్పుతో ఉంది. దీనిని మరొక 24 నుంచి 26 అడుగుల మేర, ఇరువైపులా సమంగా విస్తరించేలా మార్కింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థలాలు కోల్పోయే వారికి కొత్త జీవో 223 ప్రకారం 1:4 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్లను జారీ చేయనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీయే జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుమ్మడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...