Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
అద్భుత వనంగా కేఎల్‌రావు పార్కు
21-05-2018 09:33:45
 
636624920267253234.jpg
  • రా... రమ్మని.. ఆహ్వానిస్తున్న ఆహ్లాదం
  • చెట్ల కొమ్మలపై చిత్రకళ
  • బోటింగ్‌, జిమ్‌, స్కేటింగ్‌తో చిన్నారుల సందడి
 
విజయవాడ: అద్భుతం, నయనానందకరం.. ఆ ఉద్యానవనం.. అడుగిడితే ఆహ్లాద వీచికలు హాయ్‌ అని పలకరిస్తాయి. ప్రధాన ద్వారం దాటితే వివిధ వర్ణాలతో గోడలపై అద్దిన చిత్రాలంకరణ కనువిందు చేస్తోంది. అటు ఈత కొలను, ఇటు షటిల్‌ కోర్టు.. మరోవైపు వ్యాయామ శాల.. చిన్నారులకు చక్కని ఆట పరి కరాలతో అబ్బురు పరుస్తోంది కె.ఎల్‌. రావు పార్కు.
 
ఇటీవల నగర పరిధిలోని పార్కులకు కొత్త కళ వచ్చింది. ఈమధ్య కాలం వరకు కళావిహీనంగా ఉన్న ఈ పార్కుకు మహర్దశ పట్టింది. సుమారు రూ. 70 లక్షలతో అభివృద్ధి చేసి అదనపు హంగులు అమర్చారు. గోడలు, చెట్ల కొమ్మలపై వేసిన చిత్రాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. సండే వచ్చిందంటే పార్కులో సందడే..సందండి...! ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులతో కళకళలాడుతోంది. చిన్నారులకు ఆహ్లాదాన్ని అందించే ఆట పరికరాలు, బోటింగ్‌ కెనాల్‌తోపాటు చిన్న పెద్ద అందరు వినయోగించుకునేలా పార్కులో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేశారు. చిన్నారులు బోట్‌ షికారు చేస్తూ నీళ్లపై తేలియాడుతున్నారు. జారుడు బల్లలపై జారుతూ, బ్యాలెన్స్‌ రాడ్‌లపై ఊగుతూ, ఉయ్యాలపై గాలిలో తేలియాడుతున్నారు.
Link to comment
Share on other sites

రూ.20.77 కోట్లతో పార్కుల అభివృద్ధి
24-05-2018 07:10:49
 
636627426515363272.jpg
  • విజయవాడ రైవస్‌ కెనాల్‌, రాజధాని అనంతవరం వద్ద...
  • టెండర్లు పిలిచిన ఏడీసీ ఫ వచ్చే నెల 5 వరకు గడువు
అమరావతి: సీఎం చంద్రబాబు ఆదేశానుసారం నగరంలోని గులాబీతోటలో రైవస్‌ కెనాల్‌ ఒడ్డును అభివృద్ధి పరచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. దీంతోపాటు రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో ఏర్పాటు చేయదలచిన ఉద్యానవనం పనుల కోసం కూడా బిడ్లను ఆహ్వానించింది. ఈ రెండు పనులకు రూ.20.77కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసిన ఏడీసీ ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్లను సమర్పించేందుకు వచ్చే నెల5వ తేదీ వరకు గడువునిచ్చింది.
 
రైవస్‌ కాల్వ గట్టున...
బెజవాడలోని వివిధ కాల్వగట్ల సుందరీకరణ పనుల్లో ముందుగా గులాబీతోటలో రైవస్‌ కాల్వను పలు పర్యాటక ఆకర్షణలతో తీర్చిదిద్దాలని ఏడీసీ నిర్ణయించింది. వాకింగ్‌ ట్రాక్‌లు, ఫుడ్‌ కోర్టులు, పచ్చదనం, ఆటస్థలాలు, పార్కింగ్‌ ఇత్యాది వాటితో ఇందుకోసం ప్రణాళిక రూపొందించింది. సుమారు 0.9 కిలోమీటర్ల పొడవున ఇవన్నీ రానున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పనులను చేపట్టబోతున్న ఏడీసీ ముందుగా కంచెను ఏర్పాటు చేయనుంది. దీని ఏర్పాటు జరుగుతుండగానే ఇతర పనులను కూడా చేపడుతుంది.
 
Link to comment
Share on other sites

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడ్డంకులెన్నో..!
24-05-2018 06:59:51
 
636627419931606899.jpg
  • స్మార్ట్‌ పార్కింగ్‌.. ఎప్పటికో!
  • ఎలాగైనా ప్రారంభించాలన్న పట్టుదలతో కమిషనర్‌
  • జేబులు నింపుకొంటున్న పార్కింగ్‌ సిబ్బంది
  • ఆక్రమణకు చక్రం తిప్పుతున్న పాత కాంట్రాక్టర్లు
స్మార్ట్‌ పార్కింగ్‌... వీఎంసీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. పుష్కరాల సమయంలో పురుడు పోసుకున్న ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఆయా పార్కింగ్‌ స్థలాలను హస్తగతం చేసుకునేందుకు ప్రజా ప్రతినిధుల మద్దతుతో కొందరు పాత కాంట్రాక్టర్లు పావులు కదుపుతుంటే, ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా నగర కమిషనర్‌ నివాస్‌ ప్రయత్నాలను వేగవంతం చేశారు.
 
 
విజయవాడ: పుష్కరాల సమయంలో పురుడు పోసుకున్న స్మార్ట్‌ పార్కింగ్‌ రెండేళ్లయినా క్షేత్రస్థాయి అమల్లో అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ జాప్యాన్ని అడ్డుపెట్టుకుని కొందరు పార్కింగ్‌ సిబ్బంది జేబులు నింపుకొంటుండగా, ఆయా పార్కింగ్‌ స్థలాలను హస్తగతం చేసుకునేందుకు కొందరు పాత కాంట్రాక్టర్లు సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఇందుకు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ విష ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు స్మార్ట్‌ పార్కింగ్‌ శీఘ్రంగా అమలుచేయడం ఒక్కటే మార్గమని నిర్ణయించిన కమిషనర్‌ నివాస్‌ చకచకా పావులు కదుపుతున్నారు. స్మార్ట్‌ పార్కింగ్‌ తీర్మానాన్ని గతనెల కౌన్సిల్లో వాయిదా వేయడంతో ఆ జాప్యం అక్రమార్కుల జేబులో లాభం కాకూడదన్న నిర్ణయంతో పైలెట్‌ ప్రాజెక్టు కింద 20కి బదులు 2-3 చోట్ల స్మార్ట్‌ పార్కింగ్‌ను అమలుచేసి చూపించాలన్న నిర్ణయంతో ఉన్నారు.
 
పుష్కరాల సమయంలో ఆలోచన
2016లో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో మొదటిసారిగా ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ విజయవాడకు పరిచయమైంది. ప్రజోపయోగంగా ఉంటుందని నమ్మిన అప్పటి నగర కమిషనర్‌ వీరపాండియన్‌ ఈ ప్రయోగంపై దృష్టి సారించారు. దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, పూణె వంటి ప్రాంతాల్లో అమలవుతున్న ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ను విజయవాడలో కూడా అమలుచేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టి ఆమోదం పొందారు. పార్కింగ్‌ కోసం అవసరమైన టెండర్లు ఆహ్వానించి 20 ప్రాంతాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారు. ఇంతలోనే అనంతపురం కలెక్టర్‌గా పదోన్నతిపై వీరపాండియన్‌ బదిలీ అయ్యారు.
 
జాప్యానికి కారణమిదీ..
వీరపాండియన్‌ తర్వాత బాధ్యతలు స్వీకరించిన నివాస్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ను చాలెంజ్‌గా తీసుకుని అమలుకు కావాల్సిన ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తిచేశారు. 20 ప్రాంతాల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ అమలుకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన మూడు కంపెనీలు స్మార్ట్‌ పార్కింగ్‌ అమలు కోసం ముందుకొచ్చాయి. వారిలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని కోట్‌ చేసిన చెన్నైకు చెందిన స్మార్ట్‌ పార్కింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆ బాధ్యతలను అందిపుచ్చుకుంది. దీంతో రెండేళ్ల లీజుకు గానూ ఏడాది అద్దెను రూ.2కోట్ల25లక్షలుగా నిర్ధారిస్తూ ఆ సంస్థకు వర్క్‌ ఆర్డరును వీఎంసీ జారీ చేసింది.
 
రూ.కోటి25లక్షల డీడీలను లీజు పొందిన సర్వీసు ప్రొవైడరు యాక్సిస్‌ బ్యాంకు ద్వారా వీఎంసీకి ముందస్తుగా చెల్లించారు. తక్కిన మొత్తాన్ని మార్చిలోపు చెల్లించి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, చెల్లింపులో జాప్యం, కౌన్సిల్‌ తీర్మానం వాయిదా తదితర కారణాలతో స్మార్ట్‌ పార్కింగ్‌ అమలు మరికొన్ని నెలలు వెనక్కు వెళ్లింది. అవే పార్కింగులకు గతంలో టెండర్లను ఆహ్వానించగా, ఏడాదికి రూ.కోటిన్నర చొప్పున కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. అవే పార్కింగులను ప్రస్తుతం రూ.2కోట్ల25లక్షలకు కాంట్రాక్టు అప్పగించడంతో వీఎంసీకి ఏడాదికి రూ.75లక్షల ఆదాయం సమకూరుతోంది.
 
ఇంటి దొంగల పనే..!
స్మార్ట్‌ పార్కింగ్‌ అమలుకు నగరంలోని 20 పార్కింగ్‌ ప్రదేశాలను వీఎంసీ గుర్తించింది. అందులో ఎన్టీఆర్‌ కాంప్లెక్సు, కాళేశ్వరరావు మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌, కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌, సిల్కో షోరూమ్‌ వద్ద, హోటల్‌ రాజ్‌టవర్స్‌ వద్ద ఇలా.. పలు ప్రధాన పార్కింగులు ఉన్నాయి. వాటన్నింటికీ చెందిన గత కాంట్రాక్టు పిరియడ్‌ ముగియగానే, తదుపరి టెండర్లకు వెళ్లకుండా వీఎంసీనే స్వాధీనం చేసుకుని ఏడాదిగా నిర్వహణాబాధ్యతలను చూస్తోంది. కార్పొరేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం కొందరు పాత కాంట్రాక్టర్లకు మింగుడు పడట్లేదు. దీంతో పార్కింగుల్లో జరిగే అవకతవకలను పలు రూపాలుగా బయటకు తీసుకురావడంలో వారిలో కొందరు సఫలీకృతులయ్యారు. అందులో భాగంగానే కాళేశ్వరరావు మార్కెట్‌, ఎన్టీఆర్‌ కాంప్లెక్సుల్లో జేబులు నింపుకుంటున్న సిబ్బంది అక్రమార్జన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
 
ఈ అక్రమాల్లో సిబ్బందితో పాటు కిందిస్థాయి అధికారుల పాత్ర కూడా ఉందని తేల్చారు. దీంతో పలువురు సిబ్బందిపై విజిలెన్స్‌ అధికారులు కూడా దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. నిజానిజాలను కమిషనర్‌కు, కలెక్టర్‌కు నివేదించారు. తదుపరి చర్యలకోసం విజిలెన్స్‌ ఎదురుచూస్తోంది. అక్రమార్జనకు అలవాటు పడిన సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఒకవైపు అక్రమార్జనలను బయటపెడుతూనే మరోవైపు పలు పార్కింగ్‌ స్థలాలను కైవసం చేసుకునేందుకు ఓ ఉన్నతాధికారితో ఆ పాత కాంట్రాక్టర్లు మంతనాలు నెరిపారని తెలుస్తోంది. అదీ లాభించకపోవడంతో స్మార్ట్‌ పార్కింగ్‌ ప్రక్రియపైకి కొందరు ప్రైవేటు వ్యక్తులను పావులుగా ప్రయోగిస్తున్నారని వినికిడి. దీంతో అప్రమత్తమైన కమిషనర్‌ 2-3 ప్రదేశాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద స్మార్ట్‌ పార్కింగ్‌ను రోజుల వ్యవధిలోనే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరరావు మార్కెట్‌లో స్మార్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

విజయవాడను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు 24 కిలోమీటర్ల మేర ఉన్న మూడు ప్రధాన కాలువల వెంట రెండు కోట్లకు పైగా ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేపట్టారు. మరియు రాజివ్ గాంధీ పార్క్, రాఘవయ్య పార్క్ లను అభివృద్ధి చేస్తున్నారు.@ncbn @AndhraPradeshCM #krishnadistrict

DeRgjFYUwAAIIax.jpg

DeRgkknUQAUWt0L.jpg

DeRgi3IUQAAHjUX.jpg

Link to comment
Share on other sites

జక్కంపూడిలో నగర వనం
06-06-2018 11:42:33
 
636638821616204323.jpg
విజయవాడ: ఈ ఏడాది కార్తీక మాసంలో విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలోని నగర వనాన్ని సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సుమారు రూ. రెండున్నర కోట్లతో నగర వనం నిర్మాణ పనులను చేపట్టామని చెప్పారు. ప్రజలంతా ఆరోగ్య ంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కనీసం గంటపాటు వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో నిర్మిస్తున్న నగర వనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నగర వనంలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఉమా మాట్లాడుతూ, కార్తీక మాసంలో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
 
నగర వనంలోనూ కార్తీక మాసం సందర్భంగా మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మొక్కలు నాటటంతో పాటు గోడలపై పెయింటింగ్‌ వేయించి అందంగా తీర్చిదిద్దారని, ఫలితంగా పర్యావరణ సహిత నగరాల్లో విజయవాడ ప్రఽథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. నగర వనానికి వచ్చే వారికి సైకిళ్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. . ధ్వని కాలుష్యాన్ని కూడా నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్‌ను నిషేధించి జనపనార, క్లాత్‌ సంచులను వినియోగించటంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉమా పిలుపునిచ్చారు. డీఎఫ్‌వో బెనర్జీ, పర్యావరణశాఖ అధికారి మధుసూదనరావు, విజయవాడ రూరల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావు, ఎంపీడీవో కె అనురాధ, జక్కంపూడి సర్పంచ్‌ కొమ్ము రవి, కొత్తూరు తాడేపల్లి ఉప సర్పంచ్‌ దొంతగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...