Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
విజయవాడలో 14 వేల కనెక్షన్లు సిద్ధం
31-08-2018 08:28:20
 
636713009017868910.jpg
  • భాగ్యనగర్‌ గ్యాస్‌ ఎండీ ప్రసాద్‌
విజయవాడ: రాజధాని ప్రాంతమైన విజయవాడలో పైపులైన్‌ ద్వారా 14వేల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్వీ ప్రసాద్‌ చెప్పారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని పలు జేఎన్‌ఎన్యూఆర్‌ఎం గృహాలకు గ్యాస్‌ కనెక్షన్లను గురువారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైప్‌లైన్‌ ద్వారా అందించే గ్యాస్‌ వినియోగం భద్రతతో కూడిందని, తక్కువ ధరతోపాటు సిలిండర్‌తో అవసరం లేకుండా ఉంటుందన్నారు. భాగ్యనగర్‌ గ్యాస్‌ భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన సంస్థ అని వివరించారు.
 
మిగిలిన పైపులైన్‌ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికీ గ్యాస్‌ సరఫరా చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టు చీఫ్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది 14వేల గృహ కనెక్షన్లు, 60 కమర్షియల్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్‌, భారతీనగర్‌, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో తక్షణమే కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ చీఫ్‌ మేనేజర్‌ ముఖర్జీ, ప్రాజెక్టు చీఫ్‌ మేనేజర్‌ జీవీ వెంకటేశ్‌ కంపెనీ ప్రతినిధులు రవి శేఖర్‌, ధనరాజ్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

విద్యుత్‌ బస్‌లకు.. అధ్యయనం!
01-09-2018 07:26:07
 
636713835687098046.jpg
  • సీఎం ఆదేశాల మేరకు పక్షం రోజులలో నివేదిక
  • వివరాలు తెలుసుకుంటున్న ఎలక్ర్టిక్‌ వాహన విభాగం
  • ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నివేదిక రూపకల్పన
విజయవాడ: ఎలక్ర్టిక్‌ బస్సులు నడపటానికి విజయవాడలో అధ్యయనం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పక్షం రోజుల్లో నివేదికను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్ర్టిక్‌ వాహన విభాగ అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. పక్షం రోజులలో నివేదిక ఇచ్చిన దానిని బట్టి నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పటంతో ఆ దిశగా అధికారులు పని ప్రారంభించారు. ఆర్టీసీలో ప్రధా నంగా ఎన్ని రకాలు సర్వీసులు ఉన్నాయో అధికా రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడ నుంచి ఎలాంటి సర్వీసులు నడుస్తు న్నాయి? వీటిలో హై ఎండ్‌ సర్వీసులతో పాటు వివిధ కేటగిరీలలో ఉన్న బస్సుల వివరాల లెక్కలను తీసుకుంటున్నారు. బస్సుల వివరాలతో పాటు వాటి ఆక్యుపెన్సీ వాటి సామర్థ్యం గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడ నుంచి నడిచే ఆర్టీసీ బస్సులలో పాత బస్సులు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు తెలుసుకుంటున్నారు. హై ఎండ్‌ శ్రేణిలో తిరిగే రూట్లలో ఎలక్ర్టిక్‌ బస్సును నడిపితే ఏ విధంగా ఉంటుంది? సాధారణ బస్సులలో ఒకటిగా నడిపితే ఎలా ఉంటుందన్న వివరాలు తెలుసుకునేందుకే ఈ లెక్కలు తీసుకుంటున్నారు.
 
హై ఎండ్‌ బస్సులలో అమ రావతి బస్సులు, సాధారణ బస్సు లలో ఎక్‌ ్సప్రెస్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ ఆర్డినరీ, తెలుగు వెలుగు బస్సుల్లో వేటి స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే సాధారణ బస్సులలో సిటీ అర్డినరీ బస్సులలో చాలావరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ ఆర్డినరీ సర్వీసుల స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడితే కలిగే ప్రయోజనాలేమిటన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. విజయవాడ ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎలక్ర్టిక్‌ బస్సులను సరఫరా చేసే విషయంలో పలు కంపెనీలు కూడా పోటీలు పడుతున్నాయి. బీవైడీ, అశోక్‌ లేల్యాండ్‌, యాక్సెస్‌, ఐషర్‌, టాటా వంటి సంస్థలు ఎలక్ర్టిక్‌ బస్సులను సరఫరా చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలక్ర్టిక్‌ బస్సును ఒక సంస్థ రూ.3 కోట్లుకు అందించటానికి, మరో సంస్థ రూ.2.50 కోట్లకు అందిస్తామని చెబుతోంది.
 
ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ధర చెబుతున్నప్పటికీ, ఈ బస్సుల ఖర్చు తగ్గించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పన్నులకు మినహాయింపు ఇచ్చింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు రాయితీ వస్తుంది? ఎంత ఖర్చు తగ్గించగలమన్న ఆలోచనతో కూడా అధికారులు ఉన్నారు. ఎలక్ర్టిక్‌ బస్సులను ఉపయోగించడం వల్ల ఆర్టీసీ ప్రధాన వ్యయమైన డీజిల్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందన్న దానిపై అధికారులు నివేదిక తయారు చేయాల్సిఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినట్టు పక్షం రోజుల్లో ఆర్టీసీ అధికారుల సహకారంతో పూర్తి నివేది కను సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ర్టిక్‌ విభాగం డైరెక్టర్‌ భాను ప్రకాష్‌ ఆంధ్రజ్యోతికి చెప్పారు.
Link to comment
Share on other sites

బెజవాడ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి ఇన్వెస్టర్ల అనాసక్తి
04-09-2018 07:27:22
 
636716428417174670.jpg
  • తాము అభివృద్ధి చేయాలంటే 99 ఏళ్ల లీజుకివ్వాలని షరతు
  • కంగుతిన్న రైల్వే అధికారులు
  • తాత్కాలికంగా ప్రతిపాదనకు విరామం
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలో ప్రధాన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేయటానికి ప్రైవేటు సంస్థలు కిరికిరి పెడుతున్నాయి. రైల్వేస్టేషన్‌, అభివృద్ధి నిర్వహణ పది, పదిహేనేళ్లు అయితే చాలదని.. తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి అప్పగించాలని షరతులు విధిస్తున్నాయి. ఈ ప్రతిపాదన రైల్వే శాఖకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో ఈ ప్రక్రియను కాస్తా రైల్వే అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం.
 
 
 
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్‌ హంగులతో అభివృద్ధి చేయటానికి, కమర్షియల్‌గా తీర్చిదిద్దటానికి ప్రైవేటు ఇన్వెస్టర్లకు అప్పగించాలన్న రైల్వే అధికారుల ఆలోచన బెడిసికొట్టింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏ ప్లస్‌ రైల్వేస్టేషన్‌గా ఉన్న విజయవాడ స్టేషన్‌తో పాటు, పలు ఏ కేటగిరీ స్టేషన్లను ప్రైవేటు ఇన్వెస్టర్ల చేత అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు భావించారు. దీనికి అనుగుణంగా ఇటీవల రహస్యంగా ప్రైవేటు సంస్థలతో సమావేశం నిర్వహించి తమ ఆలోచనను వారి ముందుంచినట్టు తెలిసింది. రైల్వేశాఖలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన రంగానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రైవేటు దిశగా అడుగులు వేయటం రైల్వే శాఖకు ఇదే తొలిసారి. రైల్వే స్టేషన్లను కమర్షియల్‌గా అభివృద్ధి చేయటానికి ప్రైవేటు సంస్థల చేతుల్లో విలువైన భూములు పెట్టారు.
 
ఇదే క్రమంలో పూర్తిగా రైల్వేస్టేషన్‌ మొత్తాన్ని కూడా ప్రైవేటు సంస్థకే అప్పగించి దాని ద్వారా అభివృద్ధి చేపట్టే ఆలోచన తొలిసారి రైల్వే అధికారులు చేశారు. ఇప్పుడున్న రైల్వేస్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయటానికి, ఆధునికీకరించటానికి, వెయిటింగ్‌ హాల్స్‌, ఫుట్‌ బ్రిడ్జిలు, ప్లాట్‌ ఫామ్‌ల ఆధునికీకరణ, రైల్వేస్టేషన్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో లిఫ్టులు, ఎస్కలేటర్లు, స్వీపింగ్‌, యూరినల్స్‌, టాయ్‌లెట్స్‌ వంటివి అనేకం అభివృద్ధి చెయ్యాలన్న తమ ప్రణాళికలను రైల్వే అధికారులు ప్రైవేటు సంస్థలకు ఇటీవల జరిగిన సమావేశంలో వివరించినట్టు సమాచారం. ప్రతిగా రైల్వేస్టేషన్‌లో కమర్షియల్‌ స్పేస్‌ను డెవలప్‌ చేసుకోవచ్చని, తద్వారా వచ్చే ఆదాయంలో కొంత రాయల్టీ చెల్లించాలన్న షరతులు విధించినట్టు తెలిసింది.
 
నివేదిక కోరిన అధికారులు
రైల్వేస్టేషన్‌ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? కమర్షియల్‌గా ఏ విధంగా తీర్చి దిద్దుతారు? అన్న అంశాలపై తమకు నివేదికను సమర్పించాల్సిందిగా రైల్వే అధికారులు కోరినట్టు తెలిసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి పది, పదిహేనేళ్ల కాలానికి రైల్వేస్టేషన్‌ను అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. రైల్వే అధికారుల ప్రతిపాదనపై ప్రైవేటు సంస్థల నుంచి అనాసక్తత రావటం గమనార్హం. రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయటానికి తమకు సమస్య లేనప్పటికీ పది, పదిహేనేళ్ల సమయం తమకు సరిపోదని, తొంబై తొమ్మిది సంవత్సరాలు అప్పగించాలని షరతు విధించటంతో రైల్వే అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. ఇంత సుదీర్ఘకాలం ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయంలో రైల్వే అధికారులు పునరాలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది.
 
రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌
ఓ పక్క రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రైల్వే అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. రైల్వేస్టేషన్‌ రూపురేఖలను మార్చివేయటానికి రూ.40 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, నూతన ప్లాట్‌ఫామ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్‌ హాల్స్‌ విస్తరణ, రెస్ట్‌రూమ్స్‌ రెన్నోవేషన్‌, స్మార్ట్‌ పార్కింగ్‌ వంటివి అభివృద్ధిఽ సొంత నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన తర్వాత స్టేషన్‌ను మొత్తంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ఆలోచన చేయటం గమనార్హం.
 
 
ఎందుకీ హడావిడి?
ఇప్పటికే రైల్వేలో ఆపరేషన్‌ మినహా మిగిలిన విభాగాలన్నీ ప్రెవేటీకరణ బాట పట్టేశాయి. రైల్వేటిక్కెట్ల బుకింగ్‌, రైల్వే టిక్కెట్ల జారీ, ఆన్‌లైన్‌ విధానంలో టిక్కెట్ల జారీ, క్యాటరింగ్‌ సర్వీసులు, టూర్‌ సర్వీసులు, వెయిటింగ్‌ హాల్స్‌, మాల్స్‌ వంటి విభాగాలన్నీ ప్రైవేటుపరం అయ్యాయి. ఆఖరుకు హమాలీల వ్యవస్థను కూడా ప్రైవేటుపరం చేసింది. అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రం రైల్వేశాఖ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ దిశగా వెళ్లలేదు. కమర్షియల్‌ యాక్టివిటీ పెంచటానికి కొన్ని అంశాల్లో ముందుకు వెళ్లినప్పటికీ.. రైల్వేస్టేషన్‌ మొత్తంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నది అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
 
 
భగ్గుమంటున్న రైల్వే కార్మిక సంఘాలు
ప్రధాన రైల్వేస్టేషన్‌ను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను రైల్వే ఉన్నతాధికారులు చేయటం పట్ల కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రైల్వేలో ఒక్క అపరేషన్‌ విభాగం తప్ప మొత్తంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, రైల్వేస్టేషన్‌మొత్తాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడమంటే మామూలు విషయం కాదని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఆపరేషన్‌ను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించినా ఆశ్చర్యం లేదని, ఈ విధానాలపై తాము పోరాటం చేస్తామని ఆయా కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

చెన్నుపాటి స్టేడియం అభివృద్ధికి నిధులు
09-09-2018 07:39:41
 
636720755785324362.jpg
విజయవాడ: రాష్ట్ర విభజనానంతరం రాజధాని విజయవాడలో క్రీడా సౌకర్యాలు ఏమాత్రం మెరుగు పడ లేదు. సౌకర్యాల మాట అటుంచితే ఉన్న సేడియాలను కూడా క్రీడాకారులకు సరిగా అందించలేక పోయారు. వీఎంసీ ఆధ్వర్యం లోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం, సింగ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియాలే ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు అర్ధ దశాబ్దానికి పైగా నిరుపయోగంగా ఉన్న పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం పై వీఎంసీ ఇన్నాళ్లకు కనికరించింది. నగరాభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేయడంతో, వాటి లో రూ.7కోట్లతో ఈ స్టేడియానికి పున ర్వై భవం తీసుకురావడానికి నగర కమిషనర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
 
తూర్పు నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న ఏకైక పటమట ఇండోర్‌ స్టేడియం ఏళ్ల తరబడి నిరుపయోగం ఉంది. క్రీడలకు ఆవాసంగా ఉండాల్సిన స్టేడియం వరద బాధి తులకు, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలకు ఆవాసంగా మారింది. అవసాన దశకు చేరిన టెన్నిస్‌ కోర్టులు, దెబ్బతిన్న ప్లాట్‌ఫారాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి భూత్‌ బంగ్లాను తలపించేలా మారిన ఆ స్టేడి యానికి మరమ్మతులు చేయడానికి విజయ వాడ నగర పాలక సంస్థ ముందు కొచ్చింది. రూ.7 కోట్ల నిధులతో స్టేడియాన్ని అంత ర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి సన్న ద్ధమవుతోంది. బాస్కెట్‌బాల్‌ వాలీ బాల్‌, మినహా ప్రస్తుతం మరే క్రీడలకు అవకాశం లేని ఆ స్టేడియంలో ఆరు షెటిల్‌ కోర్టులను నిర్మించడానికి ప్రయత్నాలు చక చకా జరుగుతున్నాయి. అధ్వాన స్థితికి చేరిన గ్యాలరీలను పునరుద్ధరించి ప్రేక్షకులతో పాటు వీఐపీల గ్యాలరీలను నిర్మించడానికి వీఎంసీ అధికారులు ప్రణాళికలు రచి స్తున్నారు.
 
 
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం
పటమట ఇండోర్‌ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ ప్రయోజనకర స్టేడియం గా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి క్రీడాకారులందరికీ అందుబాటులోకి తెస్తాం. నిధులు అందుబాటులో లేక అభివృద్ధిలో కొంత మేర జాప్యం జరిగింది.
-జె.నివాస్‌, నగర కమిషనర్‌
Link to comment
Share on other sites

చెన్నుపాటి స్టేడియం అభివృద్ధికి నిధులు
09-09-2018 07:39:41
 
636720755785324362.jpg
విజయవాడ: రాష్ట్ర విభజనానంతరం రాజధాని విజయవాడలో క్రీడా సౌకర్యాలు ఏమాత్రం మెరుగు పడ లేదు. సౌకర్యాల మాట అటుంచితే ఉన్న సేడియాలను కూడా క్రీడాకారులకు సరిగా అందించలేక పోయారు. వీఎంసీ ఆధ్వర్యం లోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం, సింగ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియాలే ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు అర్ధ దశాబ్దానికి పైగా నిరుపయోగంగా ఉన్న పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం పై వీఎంసీ ఇన్నాళ్లకు కనికరించింది. నగరాభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేయడంతో, వాటి లో రూ.7కోట్లతో ఈ స్టేడియానికి పున ర్వై భవం తీసుకురావడానికి నగర కమిషనర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
 
తూర్పు నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న ఏకైక పటమట ఇండోర్‌ స్టేడియం ఏళ్ల తరబడి నిరుపయోగం ఉంది. క్రీడలకు ఆవాసంగా ఉండాల్సిన స్టేడియం వరద బాధి తులకు, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలకు ఆవాసంగా మారింది. అవసాన దశకు చేరిన టెన్నిస్‌ కోర్టులు, దెబ్బతిన్న ప్లాట్‌ఫారాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి భూత్‌ బంగ్లాను తలపించేలా మారిన ఆ స్టేడి యానికి మరమ్మతులు చేయడానికి విజయ వాడ నగర పాలక సంస్థ ముందు కొచ్చింది. రూ.7 కోట్ల నిధులతో స్టేడియాన్ని అంత ర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి సన్న ద్ధమవుతోంది. బాస్కెట్‌బాల్‌ వాలీ బాల్‌, మినహా ప్రస్తుతం మరే క్రీడలకు అవకాశం లేని ఆ స్టేడియంలో ఆరు షెటిల్‌ కోర్టులను నిర్మించడానికి ప్రయత్నాలు చక చకా జరుగుతున్నాయి. అధ్వాన స్థితికి చేరిన గ్యాలరీలను పునరుద్ధరించి ప్రేక్షకులతో పాటు వీఐపీల గ్యాలరీలను నిర్మించడానికి వీఎంసీ అధికారులు ప్రణాళికలు రచి స్తున్నారు.
 
 
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం
పటమట ఇండోర్‌ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ ప్రయోజనకర స్టేడియం గా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి క్రీడాకారులందరికీ అందుబాటులోకి తెస్తాం. నిధులు అందుబాటులో లేక అభివృద్ధిలో కొంత మేర జాప్యం జరిగింది.
-జె.నివాస్‌, నగర కమిషనర్‌
Link to comment
Share on other sites

ijayawada to host TERI meet on livable cities

author-deafault.png Staff Reporter
Vijayawada, September 10, 2018 01:00 IST
Updated: September 10, 2018 01:00 IST
 

Chandrababu Naidu to deliver inaugural address on September 19

The Energy and Resources Institute (TERI) is organising its southern Regional Policy Dialogue (RPD) on ‘making livable cities’ in Vijayawada on September 19 in association with the Royal Embassy of Denmark in India and International Urban Cooperation/ Global Compact of Mayors.

Experts from Tamil Nadu, Telangana, Kerala, Karnataka, Odisha, Pondicherry and Chhattisgarh will be taking part in the event.

Policy framework

Through a communication to the Special Chief Secretary to CM, Satish Chandra, TERI director general Ajay Mathur invited N. Chandrababu Naidu to give the inaugural address, according to an official release.

Mr. Mathur said the objective of the RPD was to bring together cities and State governments for formulating a policy framework for enhancing the livability of Indian cities.

Collaborative efforts

On the occasion, Mr. Naidu directed the officials of the AP-Capital Region Development Authority (AP-CRDA) to focus on working with global organisations like TERI for developing Amaravati as one of the top five livable cities in the world with emphasis on adoption of advanced technologies for sustainable urban planning and infrastructure development.

Mr. Naidu told the Principal Secretary (Energy, Infrastructure and Investments and CRDA) Ajay Jain that the RPD would be a good platform to understand the best practices in urban governance from global experts.

The CM said Amaravati had received admiration from experts as a potential blue and green capital city even in the recent World Cities Summit in Singapore and took pride in the fact that international universities such as Harvard University had recognised the Andhra Pradesh government’s efforts to transform Amaravati into a world-class city and took up land pooling as a case study.

 

Link to comment
Share on other sites

విజయవాడలో ఇంకెన్నాళ్లిలా.. ఆ నాయకుడు ఎందుకు అడ్డుపడుతున్నారు?
22-09-2018 09:00:41
 
636732036389619401.jpg
  • బందరురోడ్డు విస్తరణకు ముడి పడని ముహూర్తం
  • స్థానికులతో కుదరని సయోధ్య
  • రెండు దశాబ్దాలుగా వెనుకంజలో బందరు రోడ్డు విస్తరణ పనులు
  • మోకాలడ్డుతోన్న ఓ ప్రజాప్రతినిధి
ఏళ్లు గడుస్తున్నా బందరురోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్నో అడ్డంకులు. మోకాలడ్డుతోన్న నాయకులు.. అనుమానాలు, ఆందోళనలో స్థానికులు. ఇదీ 18 ఏళ్ల క్రితం ఊపిరిపోసుకున్న బెంజిసర్కిల్‌ - ఆటోనగర్‌ చెక్‌పోస్టు మధ్య 120 అడుగుల రోడ్డు విస్తరణ పనుల పరిస్థితి. 2000 సంవత్సరంలో ఉడా కార్యాలయ సభ్యులు లేవనెత్తిన ఈ విస్తరణను నగర పాలక సంస్థ అధికారులు నేటికీ ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. స్థానికులతో సయోధ్య కుదుర్చుకోలేక సమావేశాలతో సరిపెడుతున్నారు. స్థానికులు నష్ట పరిహారాన్ని నగదు రూపంలో కోరుతుండగా.. బెట్టు వీడని వీఎంసీ టీడీఆర్‌ బాండ్లనే ఇవ్వగలమని స్పష్టం చేస్తుండటంతో విస్తరణ పనులు అటకెక్కుతున్నాయి. విస్తరణకు అడ్డుపడుతోన్న ఓ ప్రజాప్రతినిధి తనదైన స్టైల్లో చక్రం తిప్పుతున్నారు. ఓటు బ్యాంకుకు లోటు రాకుండా ఉండటం కోసం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలుస్తోంది.
 
 
విజయవాడ: దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ ఆధ్వర్యాన మచిలీపట్నం నుంచి కానూరు వరకు 120 అడుగుల రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగు తున్నాయి. స్థలాలు కోల్పోయిన వారికి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నష్టపరిహారాన్ని అందిస్తోంది. బాధితు లందరికీ నగదు రూపంలోనే పరిహారం అందజేస్తున్నారు. అయితే కామయ్యతోపు వరకు శరవేగంగా పూర్తయిన విస్తరణ పనులు అక్కడి నుంచి నగరంలోకి రావడానికి తటపటాయిస్తున్నాయి. వీఎంసీ పరిధిలో చేపట్టే విస్తరణ పనులను మాత్రం కార్పొరేషనే నిర్వహించాల్సిందిగా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశాలివ్వగా అవి ఇప్పటికీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్థానికు లకు భరోసా కల్పించలేని నగరపాలక సంస్థ పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం సాధించలేకపోతోంది.
 
టీడీఆర్‌ బాండ్ల స్వీకరణకు విముఖత వ్యక్తం చేస్తున్న స్థానికులు తమ గోడును పలుసార్లు వీఎంసీ కమిషనర్‌ జె.నివాస్‌కు వివరించారు. అయితే రూ.250 కోట్లకు పైగా అప్పుల్లో అల్లాడుతోన్న వీఎంసీ నగదు చెల్లింపునకు ససేమిరా అంటోంది. నిన్నటి వరకు బాండ్ల నిష్పత్తి 1:2 వరకే అనుమతులు కలిగిన వీఎంసీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 1:4 నిష్పత్తి వరకు అందజేయడానికి కూడా ముందుకొచ్చింది. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుదో అని స్థానికులు వీటి స్వీకరణకు సుముఖత చూపలేకపోతున్నారు. ప్రస్తుతం 85-90 అడుగుల మేర విస్తరించి ఉన్న ఆ రహదారిని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వంద అడుగులు విస్తరిస్తే తామందరం స్వచ్ఛందంగా సహకరిస్తామని, వీఎంసీ ప్రతిపాదనల ప్రకారం బాండ్లను స్వీకరిస్తామని స్థానికులు తెలియజేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా 120 అడుగుల మేర విస్తరిస్తే మాత్రం నష్టపరిహారం కింద నగదును ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. విస్తరణ కోసం అధికారులు మార్కింగ్‌లు వేసి దాదాపు ఏడాది గడుస్తున్నా.. నేటికీ అడుగు పడకపోవడం విస్తరణ చర్యలపై అనుమానాలు కలుగుతున్నాయి.
 
 
ఆకాశాన్నంటుతోన్న ధరలు 
హైదరాబాద్‌ వంటి నగరాల్లో కూడా లేని భూముల ధరలు విజయవాడలో పలుకు తున్నాయి. ధరలు పలికే ప్రాంతాల్లో బందరు రోడ్డు కూడా ఒకటి. ప్రభుత్వ ధరల ప్రకారం చదరపు గజం విలువ రూ.65 వేలుగా రికార్డుల్లో ఉండగా.. మార్కెట్‌ ధరలు మాత్రం రూ.లక్షను దాటేశాయి. వాస్తవానికి ప్రభుత్వ ధర రూ.65వేలు దాటి ఏళ్లు గడిచాయని, రహదారి విస్తరణకు అడ్డుగా మారుతుందన్న అనుమానంతోనే రికార్డుల్లో ధరలను అధికారులు మార్చడం లేదని స్థానికులు అంటున్నారు. 120 అడుగుల విస్తరణ పనులు చేపడితే సుమారు బెంజిసర్కిల్‌ మొదలు చెక్‌పోస్టు వరకు ఇరువైపులా ఉన్న సుమారు 223 నివాసాలు, 300 మంది నివాసితులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ధరల ప్రకారం గణిస్తే 1:4 నిష్పత్తిలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ గణాంకాల ప్రకారం ఒక్కో నివాసానికి సుమారు రూ.2లక్షల 60వేల చొప్పున సమారు రూ.11కోట్ల నష్ట పరిహారాన్ని కార్పొరేషన్‌ భరించాల్సి ఉంటుంది.
 
 
koneru-sridhar.jpgఏనాటి ప్రతిపాదన అది!
ఉడా కార్యాలయం ఉండగా.. మొదలైన ప్రతిపాదనను ఇవాల్టికీ అమలు చేయలేకపోతున్నాం. ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికైనా అమల్లో వేగం పెంచాలి. స్థానికుల భయాన్ని తప్పుపట్టలేం. కానీ.. మీనమేషాలు లెక్కిస్తూ పోతే సమస్యకు పరిష్కారం దొరకదు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకుని ఆ విస్తరణ పనులు చేపట్టాలి. మొదట్నుంచి ఆ ప్రాంతంలో సైడ్‌ డ్రెయిన్లు లేవు. ఫలితంగా రోడ్లపై మురుగు పేరుకుపోతోంది. రోడ్లపై చిరు వ్యాపారులు, బస్‌ షెల్టర్లలో ప్రయాణికులు, పాదచారులు ఇలా రోజుకు కొన్ని వేల మంది ఇటునుంచి ప్రయాణిస్తున్నారు. రోడ్డు విస్తరణే సమస్యకు పరిష్కారం. - కోనేరు శ్రీధర్‌, మేయర్‌
 
 
అడ్డుపడుతున్న నాయకుడు?
ఓటు బ్యాంకు పోతుందన్న భయంతో ఓ నాయకుడు ఈ విస్తరణ పనులకు మోకాలడ్డుతున్నారు. లక్షలు పలికే భూములే విలువైనవని పలువురు స్థానికులను ప్రలోభపెడుతూ కార్పొరేషన్‌ పనులకు అడ్డుపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభివృద్ధి కంటే స్వీయాభివృద్ధే అజెండాగా ముందుకెళ్తోన్న ఆ నాయకుడిపై ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన తీరుపై బహిరంగంగానే విమర్శలు ఎదురవు తున్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ పనులకు అడ్డుపడుతోన్న ఆ నాయకుడి తీరు అధికార పక్షంలో చర్చనీ యాంశమైంది. స్థానికులను ఎన్నిమార్లు వీఎంసీ చర్చలకు ఆహ్వానించినా ముందుగా ఆయన పరోక్షంగా జోక్యం చేసుకున్నాకే పలువురు స్థానికులు చర్చలకు హాజరవుతున్నారని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతోన్న విజయవాడలో ఈ రహదారి విస్తరణ కార్పొరేషన్‌కు తలనొప్పిగా మారుతుండగా.. అధికార పార్టీ నాయకుడు మోకాలడ్డుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
 
 
1:4 నిష్పత్తిలో నగదు ఇవ్వాలంటున్నారు
ప్రస్తుత ధరల ప్రకారం భూముల ధరలను 1:4 నిష్పత్తిలో నగదును చెల్లించాలని స్థానికులు కోరుతున్నారు. 223 నివాసాల వారూ అదే పద్ధతిలో అడుగుతున్నారు. అందుకు వీఎంసీ సిద్ధంగా లేదు. అలా అని ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరడం సబబు కాదు. స్థానికులే సమస్యను అర్థం చేసుకుని సహకరించాలి. - లక్ష్మణరావు, సిటీప్లానర్‌
 
రెండు ఆప్షన్లు కోరుతున్నాం
 
వంద అడుగుల విస్తరణకు తామెప్పుడూ సిద్ధమే. అందుకు ఒప్పుకుంటే వీఎంసీ చెబు తున్నట్లుగా బాండ్ల స్వీకరణకు మేమూ సిద్ధమే. కానీ 120 అడుగుల విస్తరణ అంటే మాత్రం కచ్చితంగా నష్టపరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాల్సిందే. మార్కెట్లో విలువ కోల్పోతున్న ఆ బాండ్లతో భవిష్యత్తులో ఎలా జీవించగలం?- వి.వి.రామారావు, స్థానికుడు
 
Tags : Vijayawada, benz circle, AP capital
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...