Jump to content

Vijayawada city Beautification

Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
నవ్యాధ్ర రాజధాని అమరావతికి తగ్గట్టుగానే..
15-07-2018 10:26:07
 
636672471648042371.jpg
  • రూ. 40 కోట్లతో బెజవాడ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి
  • శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు
  • డీఆర్‌ఎం ఆర్‌.ధనుంజయులు వెల్లడి
విజయవాడ: నవ్యాంధ్రకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే జంక్షన్‌ను రూ. 40 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఆర్‌.ధనుంజయులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో మొట్టమొదటి సారిగా సాధారణ ప్రయాణికుల సౌకర్యార్ధం యూటీఎస్‌ యాప్‌ను తన కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక వివరాలను వెల్లడించారు. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నూతనంగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ఎస్కలేటర్‌లు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైల్వేస్టేషన్‌ బయట ప్రాంతంలో కూడా పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
 
శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు..
విజయవాడ రైల్వేస్టేషన్‌ రద్దీని తగ్గించేందుకు రాయనపాడు రైల్వేస్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా రూపొందిస్తున్నట్టు డీఆర్‌ఎం ధనుంజయులు తెలిపారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్‌ వైపు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు రాయనపాడులోనే రైలు దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందు కోసం రాయనపాడు రైల్వేస్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. రాయనపాడు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 24 గంటలూ బస్‌లు నడిపే విధంగా ఆర్టీసీ అధికారు లతో చర్చలు జరుపుతున్నామన్నారు. వన్‌టౌన్‌ వైపు ఉన్న తారాపేట ప్రాంతాన్ని కూడా పూర్తి స్ధాయిలో అభివృద్ధి పరుస్తున్నట్టు తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడలో మరో సొరంగ మార్గం
19-07-2018 09:12:44
 
636675883651989510.jpg
  • గుణదల-మొగల్రాజపురం లేదా వన్‌టౌన్‌లో నిర్మాణానికి ప్రతిపాదనలు
  • నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ దిశగా వీఎంసీ ప్రణాళికలు
  • రూ.200కోట్లతో అంచనాలు ఫ ఆర్‌ఎఫ్‌పీకి ఆహ్వానం
 
కొండలతో నిండిన బెజవాడ నగరంలో మరో సొరంగ మార్గం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ చిన్న నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సిందే. అత్యంత తక్కువ దూరం ఉన్న గుణదల - బెంజ్‌సర్కిల్‌ మధ్య ప్రయాణానికి సైతం పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోంది. రామవరప్పాడు నుంచి బస్టాండుకు వెళ్లాలన్నా అంతే. పాతబస్తీలో మాదిరి కొండల మధ్య మరో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తే మరి కొన్ని ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చునని భావించిన వీఎంసీ ఆ దిశగా ప్రణాళికలను రచిస్తోంది. రూ.200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆహ్వానించిన ఆర్‌ఎఫ్‌పీలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన వస్తోంది.
 
విజయవాడ: నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. విజయవాడ చక్రబంధంలో నలిగిపోకుండా నగరపాలక సంస్థ చేస్తున్న మహాప్రయత్నం సొరంగ ప్రతిపాదన. రూ.200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆహ్వానించిన ఆర్‌ఎఫ్‌పీలకు (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన వస్తోంది. ఈ నెల 26తో గడువు ముగుస్తుండగా.. మరికొన్ని రోజులు పెంచాలంటూ వినతులు వీఎంసీకి వస్తున్నాయి. ఏలూరు రోడ్డు మీదుగా గుణదల నుంచి బెంజిసర్కిల్‌ వరకు ప్రయాణించాలంటే దాదాపు గంటకు పైగా పడుతోంది. రామవరప్పాడు నుంచి బస్టాండు వరకు వెళ్లాలంటే చాలా సమయం ప్రయాణించాల్సిందే. ట్రాఫిక్‌ సమస్యలు నివారించడానికి వీఎంసీ ప్రణాళికలను రచిస్తోంది. కొండల మధ్య ఏర్పడ్డ నగరానికి సొరంగ మార్గం ద్వారా సమస్యను పరిష్క రించడానికి అంచనాలు సిద్ధం చేస్తోంది.
 
60వ దశకంలో కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రి(ఇండిపెండెంట్లీ ఇన్‌చార్జి)గా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన సొరంగ మార్గం నేటికీ లక్షలాదిమంది ప్రయాణికులకు ఉపయోగపడుతోంది. అదే తరహాలో నగరంలో కొండల మధ్య నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర సొరంగాన్ని ఏర్పాటుచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని కోసం జూన్‌ 6న ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానిస్తున్నట్టు వీఎంసీ ప్రకటించగా.. ఢిల్లీ నుంచి రెండు అంతర్జాతీయ సంస్థలు, కోల్‌కతా వంటి నగరాలతో పాటు స్వీడన్‌ వంటి ఇతర దేశాల నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం గుణదల, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం, లయోలా కళాశాల, 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలు, పాదచారుల కోసం గుణదల కొండ కిందగా జాతీయ రహదారి వైపునకు గానీ మొగల్రాజపురం వైపునకు గానీ ఏర్పాటుచేయాలని వీఎంసీ భావిస్తోంది. లేకపోతే విద్యాధరపురం కొండకు ప్రస్తుత సొరంగ మార్గం కాకుండా మరో మార్గానికి సన్నాహాలు చేసే అవకాశముంది.
 
ఇదీ నగర జనాభా
విజయవాడ వస్త్ర, వాణిజ్య రంగాలకు కేంద్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు నగరానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. 2001 లెక్కల ప్రకారం 8లక్షల 51వేలకు పైగా జనాభా ఉన్నట్లు అంచనా. 2006కి వచ్చే సరికి ఆ లెక్కలు పది లక్షలకు చేరుకున్నాయి.
 
పెరుగుతున్న వాహనాలు
విజయవాడలో నిర్మితమై ఉన్న 1264 కిలోమీటర్ల రోడ్లపై నిత్యం 250కి పైగా ప్రైవేటు బస్సులు (పర్మిట్‌ ఉన్నవి) హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. వాటితోపాటు 8లక్షల ద్విచక్ర వాహనాలు, 36వేల ఆటోలు, 50వేలకు పైగా కార్లు, 30వేలకు పైగా లారీలు నగరంలో ప్రయాణిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు లెక్కేలేదు. నగర ప్రయాణంలో బందరు, ఏలూరు, రైవస్‌ కాలువలపై ప్రయాణాలకు వీలుగా సుమారు 16 వంతెనలు ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి గతంలో ఉన్న ఉడా చేపట్టిన ఇన్నర్‌ రింగురోడ్డు నైనవరం నుంచి పైపుల రోడ్డు సెంటర్‌ వరకు విస్తరించి ఉంది.
 
హైదరాబాద్‌, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు రెండో విడతగా పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగురోడ్డు వరకు ఉంది. హైదరాబాద్‌-కోల్‌కతా మీదుగా ప్రయాణించే మార్గాలకు ఈ ఇన్నర్‌ రింగు రోడ్డుతో పాటు కనకదుర్గమ్మ వారధి పూర్తయితే మరింతగా రవాణా మార్గాలు మెరుగవుతాయి. అయితే నగర రోడ్లను విస్తరించాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఈ సొరంగ మార్గాన్ని కూడా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇది ఏర్పడితే సుమారు ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
శివారు వాసులకు ఉపయోగం చిట్టినగర్‌ సొరంగం
నగర శివారు ప్రాంతాలైన భవానీపురం, విద్యాధరపురం, కబేళా పరిసర ప్రాంత వాసులు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం సొరంగం. కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడ్డాయి.
 
60వ దశకంలో నిర్మాణమైన ఈ సొరంగ మార్గం.. అప్పట్లో విజయవాడకు ఆ పేరు రావడానికి కూడా ఈ సొరంగం పాత్ర కూడా ఉందన్న వార్తలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. సొరంగం పూర్తయ్యే నాటికి విజయవాడలో అక్షరాస్యుల శాతం చాలా తక్కువ. గ్రామీణుల రాకపోకలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో సొరంగాన్ని బెజ్జంగా పిలిచేవారు. బెజ్జం ఉన్న ఊరు కాస్తా.. బెజ్జంవాడగా.. క్రమేణా బెజవాడగా మారి విజయవాడగా ప్రసిద్ధి చెందింది.

24న అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన
22-07-2018 07:24:53
 
636678410921563325.jpg
విజయవాడ: విద్యాధరపురం లేబర్‌ కాలనీలోని అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. శంకుస్థాపన ప్రాంతాన్ని శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే రహదారిని అభివృద్ధి చేయాలని, దానికి అనుసంధానంగా రోడ్డు నిర్మించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. సుమారు 9 ఎకరాల్లో రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ క్రీడా ప్రాంగణానికి కేంద్ర ప్రభుత్వం రూ. ఆరు కోట్లు వెచ్చిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 54 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ 2 బాబూరావు, జిల్లా యువజన, సంక్షేమ శాఖ, క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

జెట్ సిటీకి నేడో.. రేపో లైన్‌ క్లియర్‌
22-07-2018 07:14:29
 
636678404679347774.jpg
  • జెట్‌ సిటీ కోసం 106 ఎకరాలకు ఆర్థిక పరిహారం
  • ఎదురుచూస్తున్న రైతులు
  • ఎకరానికి రూ.కోటి ఇచ్చేలా ఒప్పించిన టిడ్కో
  • ఇప్పటికే క్యాబినెట్‌లో నిర్ణయం
  • ఆర్థిక శాఖ క్లియరెన్సే ఆలస్యం!
 
విజయవాడ: జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ కోసం అవసరమైన భూములను సేకరించటానికి వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ నేడో, రేపో పరిహారం మంజూరుకు క్లియరెన్స్‌ ఇవ్వనుంది. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ టిడ్కో అధికారులు తీసుకు వచ్చిన ఆర్థిక పరిహార ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించి క్యాబినెట్‌ సమావేశంలో ఎస్పీవీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ.80 లక్షలు మించి ఇచ్చే పరిస్థితుల్లో దూరాభారం ఉండటం వల్ల అంతకు అంత ఖర్చు అవుతుందని, విజయవాడ నగరంలో కాలువ గట్ల వెంబడి పెద్దఎత్తున అభివృద్ధి చేయటానికి భూమి సమకూరుతుందని చెప్పి రైతులకు ఎకరం రూ.కోటి పరిహారం ఇప్పించేలా టిడ్కో అధికారులు సఫలీకృతులయ్యారు. కొద్దికాలంగా ఈ అంశం మరుగున పడింది.
 
ఈ నేపథ్యంలో, ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్‌ రాకపోవటంతో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన ఫైల్‌ను పరిశీలిస్తోంది. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం కాబట్టి.. ఆర్థిక శాఖ సానుకూలంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతోంది. ఎకరానికి రూ. కోటి చొప్పున పరిహారం ఇచ్చేలా మొత్తం 106 ఎకరాలకు రూ.106 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. జెట్‌ సిటీ విస్తరణ కోసం జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల రైతుల నుంచి 106 ఎకరాల భూములను సేకరించటానికి వీలుగా కృష్ణాజిల్లా యంత్రాంగం రైతులను సంప్రదించిన సంగతి తెలిసిందే. తొలిదశలో 196 ఎకరాలను జిల్ల యంత్రాంగం కేటాయించింది. ఈ భూముల్లో కొండ ప్రాంతాలు ఉండటం వల్ల 50 ఎకరాల భూమి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. జెట్‌సిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నివాసాలు, పరిశ్రమలను కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన డీపీఆర్‌ ప్రకారం మొత్తం 28,152 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.
 
రూ.2171. 52 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ గృహాలను నిర్మించటానికి మొత్తం 250 ఎకరాల భూమి అవసరం అవుతోంది. అందుబాటులో 50 ఎకరాల భూమి మాత్రమే ఉండటంతో ప్రస్తుతం 10,624 ఇళ్ల నిర్మాణానికి ఏపీ టిడ్కో అధికారులు శ్రీకారం చుట్టారు. ఇంకా 250 ఎకరాల భూమి అవసరం కావటంతో జక్కంపూడి, వేమవరం, షాబాదలలోని ప్రైవేటు భూమి 200 ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ దశలో కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారులు అక్కడి రైతులతో అనేక దఫాలు మాట్లాడి ఎట్టకేలకు రూ. కోటికి పరిహారం ఇచ్చేలా ఒప్పించారు. ఫేజ్‌ - 1 లో 106 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. వీటిలో 13,630 గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. రూ.1090. 40 కోట్ల వ్యయంతో గృహాలను నిర్మించాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ రానుందని రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. రైతులు కూడా ఆర్థికశాఖ క్లియరెన్స్‌ కోసం కొద్దికాలం నుంచి ఎదురు చూస్తున్నారు.
Link to comment
Share on other sites

సెంచరీ పూర్తి చేసిన ఫుట్ బ్రిడ్జిలు
22-07-2018 07:21:34
 
636678408934373917.jpg
  • సెంచరీ దాటినా నాటౌట్‌
  • ఇంకా అదే పటిష్టత
  • దశాబ్దాలుగా ప్రయాణికుల సేవలో..
  • విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం ఐదు ఫుట్‌బ్రిడ్జిలు
  • కొత్తవి ఏర్పాటుకు రైల్వేశాఖ కసరత్తు
  • పాతవి యథాతథంగా ఉంచాలని డిమాండ్‌
 
ఏళ్ల తరబడి ప్రయాణికుల సేవలో తరించాయి. ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరని పటిష్టతతో పదిలంగానే ఉన్నాయి. ఎన్నాళ్లో.. ఎన్నేళ్లో కోట్లాది మంది ప్రయాణికులకు మార్గదర్శిగా నిలిచాయి. ఎంతోమంది బరువు మోశాయి. ఎన్నో బరువులెత్తాయి. ఇప్పటి ఎస్కలేటర్లు, లిఫ్టులకు పోటీ ఇస్తూ విజయవాడ రైల్వేస్టేషన్‌లో కీలకంగా మారాయి ఫుట్‌బ్రిడ్జిలు. నేడు కొత్త ఫుట్‌బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దశాబ్దాలుగా రైల్వేస్టేషన్‌లో కీలకంగా మారిన ఐదు ఫుట్‌బ్రిడ్జిలపై ప్రత్యేక కథనం.
 
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌లోని రైల్వే ఫుట్‌బ్రిడ్జిలు సెంచరీ పూర్తి చేసుకుని పటిష్టతకు అసలైన అర్థంగా నిలుస్తున్నాయి. శతాధికానికి పైగా నిర్విరామంగా సేవలందిస్తున్న ఈ ఫుట్‌బ్రిడ్జిలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. మరో పాతికేళ్లు ఇవి అలాగే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయినా.. ఈ ఫుట్‌బ్రిడ్జిల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రూ.40కోట్లతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుడుతున్న రైల్వేశాఖ ఫుట్‌బ్రిడ్జిలను కూడా మార్చాలని చూస్తోంది.
 
దశాబ్దాలుగా ప్రయాణికుల సేవలో..
రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటానికి వీలుగా విజయవాడ డివిజన్‌కు దక్షిణ మధ్య రైల్వే రూ.40 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఫుట్‌బ్రిడ్జిలను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వీటిని అనుసంధానం చేసేందుకు మొత్తం ఐదు ఫుట్‌బ్రిడ్జిలు ఉన్నాయి. వీటి మధ్య భాగంలో ఉండే రెండు ఫుట్‌బ్రిడ్జిలు 6, 7 ప్లాట్‌ఫాంల వరకు మాత్రమే ఉంటాయి. మిగిలినవి పదవ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ల వరకు ఉంటాయి. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా మధ్య భాగంలో ఉండే బ్రిడ్జిలనే ఉపయోగిస్తారు. వీటిపైనే ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 
వీటిలో ఒకటి 6, 7 ప్లాట్‌ఫాంల వరకు మాత్రమే ఉండటం వల్ల సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. రోజూ సగటున రెండున్నర లక్షల మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు వచ్చి పోతుంటారు. వీకెండ్స్‌, ఇతర సెలవుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. దశాబ్దకాలంలో రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించే రైళ్లు, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. భవిష్యత్తులో కూడా ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే.. రైల్వేస్టేషన్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరిన్ని ఫుట్‌ బ్రిడ్జిల ఏర్పాటు అవసరం కనిపిస్తోంది.
 
కార్మిక సంఘాల వ్యతిరేకత
రైల్వేస్టేషన్‌లో పాత ఫుట్‌బ్రిడ్జిలను తొలగించాల్సిన అవసరం లేదని రైల్వే కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాంగోపాల్‌లు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. ప్రయాణికుల కోసం నూతన ఫుట్‌బ్రిడ్జిలను ఏర్పాటుచేయటం స్వాగతించాల్సిన విషయమేనని, పాత వాటిని తొలగించటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. మరో రెండు దశాబ్దాల పాటు ఈ ఫుట్‌బ్రిడ్జిలను ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల ఫుట్‌బ్రిడ్జిలపై రద్దీ తగ్గిపోతుందని, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేయటానికి రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, పాత వాటిని కూడా కొనసాగించటం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.
 
అదనంగా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు
రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసే నూతన బ్రిడ్జిలను అధునాతనంగా ఏర్పాటు చేయటానికి రైల్వేశాఖ అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రయాణికులు ఫుట్‌బ్రిడ్జిలు ఎక్కే ప్రాంతాల్లో ఎస్కలేటర్లు, లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. ఒకటవ నెంబర్‌ ప్లాట్‌ఫాం దగ్గర నుంచి పదవ నెంబర్‌ ప్లాట్‌ఫాం వరకు అడుగడుగునా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కలేటర్లు మాత్రమే ఉన్నాయి.
 
పాత వాటిని తొలగించి.. కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆలోచన
రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ యోచిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రైల్వేస్టేషన్‌లో ఉన్న మొత్తం ఐదు ఫుట్‌బ్రిడ్జిలను తొలగిస్తారా? లేదా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. రైల్వేస్టేషన్‌లో 6, 7 నెంబర్ల ప్లాట్‌ఫాం దగ్గర వరకు మాత్రమే ఉన్న ఫుట్‌బ్రిడ్జిని పొడిగిం చాలని భావిస్తోంది. కాబట్టి ఈ ఫుట్‌బ్రిడ్జి యథాతథంగానే ఉండే అవకాశాలు కనిపిస్తు న్నాయి. మిగిలిన నాలుగింటిలో వేటిని తొలగించి కొత్తవాటిని నిర్మిస్తామన్న దానిపై రైల్వేశాఖ అధికారులు తెలియజేయాల్సి ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...