Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
8 minutes ago, Nfan from 1982 said:

Details brother 

STALIN CENTRAL - A New 10 Floor Shopping Mall + Premium Office Spacing, Beside Hotel Manorama, Near Old Bus Stand, MG Road - 1st 5 Floor's For Shopping Mall - 6-10 Floors For Office Space - 2 Floors Basement Parking For More Details  https://www.stalincentral.com/index.php

Link to comment
Share on other sites

అమరావతి గేట్‌వే ప్రాజెక్టుకు తొలి అడుగు
12-06-2018 07:43:43
 
636643862353185590.jpg
  • పీఎంసీ కమిటీకి బాధ్యతలు
  • 28.99 ఎకరాల్లో అభివృద్ధి కార్యాచరణ
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘విజయవాడ అమరావతి గేట్‌వే ప్రాజెక్టు’కు తొలి అడుగు పడింది. ప్రాజెక్టుకు కార్యరూపం ఇవ్వడానికి ప్రభుత్వం సోమవారం ప్రాజెక్టు మోనిటరింగ్‌ కమిటీ(పీఎంసీ)ని నియమించింది. రాజీవ్‌గాంధీ పార్కు సర్క్యూట్‌లో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, దుర్గగుడి టూరిజంను కలిపి విజయవాడ అమరావతి గేట్‌వే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీని పర్యవేక్షణ బాధ్యతలను పీఎంసీ నిర్వహిస్తుంది. డిజైన్ల రూపకల్పన మొదలుకుని వాటిని ఖరారు చేయడం, టెండర్ల ప్రక్రియను నిర్వహించడం, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్టు సమాచారాన్ని ప్రభుత్వానికి ఎప్పటికపుడు అందించడం పీఎంసీ బాధ్యత.
 
రాజీవ్‌గాంధీ పార్కు కేంద్రంగా విస్తరించి ఉన్న 28.99 ఎకరాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థలాల్లో రివర్‌ఫ్రంట్‌ బ్యూటిఫికేషన్‌ కింద నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా స్థలాల్లో నిర్మించాల్సిన ఐకానిక్‌ నిర్మాణాలపై లోగడ చర్చలు జరిగాయి. మాస్టర్‌ డిజైన్‌ ప్లాన్లను ఆయా స్థలాలకు సంబంధించిన శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిర్మింపజేయాల్సిన కట్టడాల బాధ్యతలను అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ) ఆధ్వర్యంలోని పీఎంసీ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. మాస్టర్‌ డిజైన్లను రూపొందింపజేయడం, వాటిని ఖరారు చేయించడం మొదలుకుని ఏయే స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు రావాలన్న నిర్ణయాలకు ఈ పీఎంసీ కమిటీ వ్యవహరిస్తుంది.
 
28.99 ఎకరాల్లో..
విజయవాడ అమరావతి గేట్‌వే ప్రాజెక్టు 28.99 ఎకరాల్లో విస్తీర్ణంలో అభివృద్ధి చేయబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఈ భూముల్లో ప్రాజెక్టు పనులను చేపడతారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన స్థలం 12.91 ఎకరాలు, ఏపీ ట్రాన్స్‌కో/ఏపీ జెన్‌కోకు చెందిన 3.91 ఎకరాలు, పీడబ్ల్యుడీ(ఇరిగేషన్‌)కు చెందిన 5.20 ఎకరాల స్థలం, ఏపీఎ్‌సఆర్టీసీకి చెందిన 2.93ఎకరాల స్థలం, సౌత్‌సెంట్రల్‌ రైల్వేకు చెందిన 4.04ఎకరాలస్థలంలో షాపింగ్‌ మాల్స్‌, మెగా కాంప్లెక్సు, థీమ్‌ పార్కులు, సిటీ గార్డెన్స్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, గ్రీన్‌ కారిడార్‌, గ్రీన్‌ బ్రిడ్జిలు, కెనాల్‌ ఫ్రంట్‌, వాటర్‌ ట్యాక్సీలు, బ్యాటరీ ఆపరేటివ్‌ వాహనాలు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. తద్వారా అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఉపాఽధి కల్పనకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
 
వీఎంసీకి చెందిన 12.91 ఎకరాల స్థలంలో గ్రీన్‌ రూట్‌, రీటైల్‌ మాల్‌, ఎగ్జిబిషన్‌ గార్డెన్‌, రాజీవ్‌గాంధీ పూల మార్కెట్‌ స్థలంలో ఎగ్జిబిషన్‌ హాల్‌, రివర్‌ రూట్‌ గార్డెన్‌, జి+2 హైస్ర్టీట్‌ ఆఫీస్‌ భవనాలు, కన్వెన్షన్‌ సెంటర్‌ అలాగే ప్రస్తుత కార్పొరేషన్‌ భవనమున్న స్థలంలో జి+2 భారీ ఆఫీస్‌ భవనం, 5 స్టార్‌ హోటల్‌, ల్యాండ్‌స్కేప్‌ గ్రీన్‌, కెనాల్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, 4 స్టార్‌ హోటల్‌, చిల్డ్రన్స్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు వంటివి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న స్థలంలో గ్రీన్‌ రూట్‌, కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న స్థలంలోని ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన రిసీవింగ్‌ స్టేషన్‌ను మార్చి ప్రస్తుత వీఎంసీ భవనానికి ముందున్న కెనాల్‌కు ఎదురుగా గల స్థలంలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై నిర్ణయం జరగాల్సి ఉంది. ఏపీఎ్‌సఆర్టీసీ స్థలానికి పక్కనే ఉన్న రైల్వేకు చెందిన స్థలంలో గ్రీన్‌ రూట్‌తో పాటు వన్‌టౌన్‌ నుంచి అలాగే సౌత్‌ నుంచి ఈ ప్రాజెక్టులోపలికి వచ్చేందుకు వీలుగా ప్రధాన ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటుచేయదలచారు. 
Link to comment
Share on other sites

అందరి నోట బెజవాడ!
21-06-2018 09:28:35
 
636651701299228151.jpg
  • కెనాల్స్‌ సిటీగా నగరం
  • గుంటూరు, విజయవాడ అమరావతిలో భాగాలు
  • ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెరగాలి
  • తూర్పుడెల్టాకు నీటి విడుదల సభలో సీఎం చంద్రబాబు
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ‘ఒకప్పుడు అంతా హైదరాబాద్‌ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు విజయవాడ వచ్చి ఇక్కడ రహదారులను చూసిన వాళ్లంతా ఈ నగరం గురించే మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో నంబర్‌వన్‌ నగరాలకు విజయవాడ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విజయవాడను కెనాల్స్‌ సిటీగా అభివర్ణించారు. మధ్య నుంచి మూడు కాల్వలు ప్రవహిస్తున్న నగరం విజయవాడ మాత్రమేనని చెప్పారు. కృష్ణానదికి అవతల ఉన్న గుంటూరు, ఇవతల ఉన్న విజయవాడ అమరావతిలో భాగామేనని చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు నగరాలు మెగా సిటీలుగా తయారవుతాయన్నారు. బ్యారేజ్‌ను ఆనుకుని ఉన్న ప్రధాన కాల్వకు ఇరువైపులా మొక్కలను పెంచినట్టయితే ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. ఎదురుగా కనిపిస్తున్న ఇంద్రకీలాద్రి పైనా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. దీనివల్ల వాతావరణంలోనూ మార్పులు వచ్చి, ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
 
 
కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు
హెడ్‌ రెగ్యులేటర్‌ (స్లూయిజ్‌) నుంచి కాల్వలకు నీరు విడుదల చేసిన సందర్భంలో సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు ప్రత్యేకపూజలు చేసి, హారతులిచ్చారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...