Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బెజవాడలో బైక్‌ క్యాబ్‌లు

విజయవాడ: మీరు త్వరగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాలా? కళాశాలకు టైం అయిపోతుందా? చరవాణిలో ఒక్క క్లిక్‌ కొట్టండి.. నిముషాల్లో ద్విచక్రవాహనం మీముందుంటుంది. నిర్ణీత సమయానికి మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ద్విచక్రవాహన క్యాబ్‌లు ఇప్పుడు నూతన ఒరవడి సృష్టిస్తున్నాయి. విజయవాడలో ర్యాపిడో సంస్థ ద్విచక్రవాహనాల క్యాబ్‌లకు శ్రీకారం చుట్టింది.

నవ్యాంధ్రలో ప్రజల జీవన విధానం మారుతోంది. కార్లు, ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలు క్యాబ్‌లుగా మారుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో చేరుస్తామంటూ దూసు కుపోతున్నారు బైక్‌ క్యాబ్‌ రైడర్స్‌. ర్యాపిడో సంస్థ బెంగళూరు కేంద్రంగా విజయవాడలో బైక్‌ క్యాబ్‌ సేవలందింస్తోంది. ఇప్పటికే 250 మంది వాహనదారులు డ్రైవర్లుగా పేర్లు నమోదు చేసుకోగా.. ప్రస్తుతం 100 మందితో క్యాబ్‌ సేవలను ప్రారంభించారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బైక్‌ క్యాబ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. నగరంలో 20 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విజయవాడకు మరో సరికొత్త ఆకర్షణ

విజయవాడ: విజయవాడకు మరో సరికొత్త ఆకర్షణ వచ్చిచేరబోతోంది. పున్నమిఘాట్‌లో కొత్తగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి ఆధ్యర్యంలో సెల్ఫీ పాయింట్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నమూనాను జిల్లా కలెక్టరు లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ‘మన విజయవాడ నీలిహరిత నగరి’ పేరుతో 130 అడుగుల విస్తీర్ణంలో ఈ సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా తీరంలో పర్యాటకానికి పున్నమిఘాట్‌ చిరునామాగా ఉంటోంది. నిత్యం ఈ ప్రాంతానికి వచ్చే వేలాదిమంది పర్యాటకులకు తీపి గుర్తు ఉండేలా సెల్ఫీ పాయింట్‌ను తీర్చిదిద్దుతున్నారు. విజయవాడకు వచ్చే పర్యాటకులకు ఈ సెల్ఫీ పాయింట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు.

 

Link to comment
Share on other sites

డబుల్‌ లైన్‌ దిశగా కార్పొరేషన్‌ ఫ్లై ఓవర్‌
28-04-2018 09:55:16
 
636605061162168659.jpg
విజయవాడ: కంట్రోల్‌ రూమ్‌ నుంచి విజయవాడ కార్పొరేషన్‌ వరకు ఉన్న ఫ్లైఓవర్‌ను డబుల్‌ లైనుగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎన్‌సీపీ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి సుభాని రూ.24.69 కోట్ల వ్యయంతో తయారు చేసిన డీపీఆర్‌ను మేయరు కోనేరు శ్రీధర్‌కు శుక్రవారం అందించారు.
 
   మేయర్‌ మాట్లాడుతూ డీపీఆర్‌లను ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని)కు అందజేసి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, బుగతా ఉమామహేశ్వరితో పాటు చీఫ్‌ ఇంజనీరు పి.ఆదిశేషు ఈ డీపీఆర్‌ ను అందుకున్న వారిలో ఉన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...