Jump to content

SUPERB ARTICLE ABOUT BALAYYA


Maha Natudu

Recommended Posts

open-letter-from-balakrishna-fans.jpg

 

“ఇంత చదువుకున్నావు. కొద్దోగొప్పో వ్యవస్థలపట్ల అవగాహన, సాహిత్యంతో పరిచయం, కాసిన్ని ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి. ఇన్ని ఉత్తమాభిరుచులుండి మరి ఈ బాలకృష్ణ ఫానిజం ఏంటి? అతనిదీ నీది కమ్మకులం అవడమే కారణమా?” ఒక బ్రాహ్మణ సాహితీ మిత్రుడు నన్నడిగిన ప్రశ్న.

నిజమే మిత్రమా! నా అభిమానానికి కులం అసలు కారణం కాదు అని చెబ్తే ఆత్మవంచన అవుతుంది. కానీ కేవలం కులమే కారణం అని గురివిందగింజల్లా మీరనేసుకుంటే అది చాలా ఎబ్బెట్టుగా ఉంటది. కులమొక్కటే కారణమయితే మేము వెంకటేష్‌కి, నాగార్జునకి కూడా ఫాన్స్ అవ్వాలి. కులమే పునాదయితే రాయలసీమలో రెడ్లతో సహా అంతమంది నాన్-కమ్మ కులస్తులు బాలయ్యకి వీరాభిమానులయ్యుండేవాళ్ళు కాదు. మీకు తెలిసిన ఒక చిన్నప్రపంచం రేంజ్‌లో ప్రతి అంశానికీ ఒక “స్థాయి-స్టాండర్డ్” ఆపాదించేసి ఆ ఇరుకుపరిధిలోకి రాని ప్రతిదాన్నీ (సినిమా, సాహిత్యం, సాంప్రదాయం, ఆచారం, భాష/యాస) లోకువగా జమకట్టే జెనెటిక్ ఆధిపత్యధోరణి మానుకోనంతసేపూ ఇలా మనమధ్య ఘర్షణ జరుగుతానే ఉంటది.

మంగమ్మగారి మనవడు సినిమా నుండి బాలయ్యతో మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకోగలిగాం. మాలో 90% మంది రైతు కుటుంబాలనుండి వచ్చాం. మా మూలాలు, అనుభూతులు, జ్జాపకాలన్ని పల్లెవాతావరణం, వ్యవసాయం, పంచెకట్టు, ముల్లుగర్ర, చర్నాకోల, ఎడ్లపందాలు, ట్రాక్టర్ తోలడం, తిరణాళ్ళు, ఉట్టికొట్టడాలు, నాయనమ్మ తాతల పెంపకం, మరదళ్ళతో సరసాలు, పంతానికి మేనమామ పిల్లనివ్వకపోవడం, పంచాయితీ ఎన్నికల్లో పట్టుదలలు, పల్లెనుండి టౌనుకెళ్ళి చదువుకోడం.. వీటితో ముడిపడున్నాయి. మా జీవనశైలిని, మాకు గొప్పనిపించే వీటిని ప్రతిబింబిస్తూ ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు అంటూ దాదాపు ప్రతిసినిమాలో చూపించిన హీరో బాలయ్య ఒక్కడే. మంగమ్మగారి మనవడు సినిమాలో బాలయ్య పేరు “వీరయ్య”. నాయనమ్మ పేరు “మంగమ్మ”. జస్ట్ ఇమాజిన్ – రామయ్య, వెంకయ్య, వీరయ్య లాంటి మా అయ్య తాత ముత్తాతల పేర్లు సినిమా హీరొల పాత్రలకుంటే మాకెంత బాండింగ్ ఏర్పడుద్దో. అందుకే బాలయ్యంటే అంత పిచ్చి మాకు! అందుకే రాయలసీమలో అంతమంది అభిమానులు. అందుకే నైజాంలో అంతమంది ఫాన్స్ లేరు. మాలో కూడా పట్టణాల్లో పుట్టి, పల్లెకి దూరంగా పెరిగినోళ్ళు బాలయ్యతో అంతగా కనెక్ట్ అవలేదు.

 

 

mangamma-gari-manavadu-balakrishna-old-m

 

 

 

బాలయ్య ఆస్కార్‌ స్థాయి నటుడనుకునే భ్రమలు మాకు లేవు. ఆయన శక్తిసామర్ధ్యాలు, పరిమితులు మాకు తెలుసు. కానీ ఆ పరిమితుల్ని మీ లెన్స్‌లోనుండి (మీకు ఆ స్థాయి లేకపోయినా) మీరు డిఫైన్ చేసి మా ఫానిజం “స్థాయి”ని నిర్ణయిస్తేనే తేడాలొస్తాయి.

ఏ ప్రక్రియ అయినా మన జీవితాలకి దగ్గరగా ఉన్నట్లు తోస్తే, మన వారసత్వాన్ని గొప్పగా చూపిస్తే దాంతో కనెక్ట్ అవుతాం. మీరు కె.విశ్వనాథ్ సినిమాలతో కనెక్ట్ అయ్యేది అందుకే. కులమొక్కటే కారణం కాదు. అందుకే ఇద్దరూ బ్రాహ్మలే అయినా వేటూరి కన్నా మీరు సిరివెన్నెలని ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు. వేటూరిది మీ జీవనశైలి కాదు కనుక. ఆర్ష ధర్మం, సనాతన భారతీయ ధర్మం అంటూ సిరివెన్నెల మాట్లాడ్తాడు కనుక. మేమూ అంతే. మిగతా హీరోలు కమ్మయినా కాకున్నా బాలయ్యతోనే మాకు బాండింగ్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ – వి లవ్ బాలయ్య!

— కేసీ చేకూరి [అమెరికా]

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...