Jump to content

Purushothapatnam lift irrigation project


Recommended Posts

ఏలేరులోకిగోదావరి జలాలు
09-07-2018 02:45:48
 
636667011477573918.jpg
  • అనుసంధాన ప్రయోగం విజయవంతం
  • నీటి విడుదలను పరిశీలించిన అధికారులు
ఏలేశ్వరం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి ట్రయల్‌ రన్‌ కోసం విడుదల చేసిన గోదావరి జలాలు ఆదివారం ఏలేరు రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నాయి. ఈనెల 5న పురుషోత్తపట్నం పంప్‌హౌస్‌ నుంచి నీటిపారుదల శాఖాధికారులు 1,750క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ ప్రధాన కాలువకు విడుదల చేశారు. శనివారం రాత్రి జగ్గంపేట మండలం రామవరం వద్ద ఏర్పాటు చేసిన ఫేజ్‌-2 పంపుహౌస్‌ నుంచి 8మోటార్ల ద్వారా 700క్యూసెక్కుల గోదావరి వరద నీటిని పంపింగ్‌ చేశారు. అక్కడ నుంచి ఒక పైప్‌లైన్‌ ద్వారా 58వ కిలోమీటరు వద్ద ఉన్న ఏలేరు నదిలోకి మళ్లించారు. ఈ ప్రక్రియ కూడా విజయవంతం కావడంతో ఏలేరులో గోదావరి జలాల అనుసంధానం ఆచరణలోకి వచ్చినట్టయ్యింది. రామవరం నుంచి ఏలేరు వరకు 15కిలోమీటర్ల దూరం వెంబడి 2వరుసల పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి రెండో పైప్‌లైన్‌ ద్వారా మరో 700క్యూసెక్కుల గోదావరి జలాలను రామవరం నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు తరలించే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు.
 
ఏలేరు రిజర్వాయర్‌ 1వ మట్టి ఆనకట్ట విభాగం వద్ద కాంక్రీట్‌తో నిర్మించిన డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్దకు శనివారం విడుదల చేసిన 700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో పవిత్ర గోదావరి- ఏలేరు నదుల అనుసంధాన కల నెరవేరింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు రిజర్వాయర్‌ వద్దనున్న గోదావరి డిశ్చార్జ్‌ చానల్‌ పాయింట్‌ వద్ద నీటి విడుదల ప్రక్రియను ఆదివారం పరిశీలించారు. మొదటి, రెండు దశల సాంకేతికపరమైన ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

idi simple gaa oka waste project. deeniki pette karchu polavaram lmc ki petti vunte eepatiki polavaram lmc(left main canal) complete ayyi vundedi. purushottham lift irrigation cost around 1600 crore(stage1+stage2) 3500 cusecs . it starts supplying water only in this season(2018-2019) . polavaram coffer dam get completed by 2019 may/june . ie polavaram left canal gets 17,500 cusecs water from 2019 june through gravity. why should we spend 1600 crore for one season water supply of 3500 cusecs 

 

Link to comment
Share on other sites

23 minutes ago, ravindras said:

idi simple gaa oka waste project. deeniki pette karchu polavaram lmc ki petti vunte eepatiki polavaram lmc(left main canal) complete ayyi vundedi. purushottham lift irrigation cost around 1600 crore(stage1+stage2) 3500 cusecs . it starts supplying water only in this season(2018-2019) . polavaram coffer dam get completed by 2019 may/june . ie polavaram left canal gets 17,500 cusecs water from 2019 june through gravity. why should we spend 1600 crore for one season water supply of 3500 cusecs 

 

Yah I too had the same doubt. I convinced myself with the below.

But polavaram canal full supply level is at 42 metres(75 tmc). once the level goes down water has to be pumped, Instead release the water down(if possible power generation) and use purushottapatnam/polavaram lifts.

considering the scenario, if the water is below active level, and we don't get good flows in may and june like this year.

Hope someone in the DB has the right answer.

 

 

 

Link to comment
Share on other sites

4 hours ago, ravindras said:

idi simple gaa oka waste project. deeniki pette karchu polavaram lmc ki petti vunte eepatiki polavaram lmc(left main canal) complete ayyi vundedi. purushottham lift irrigation cost around 1600 crore(stage1+stage2) 3500 cusecs . it starts supplying water only in this season(2018-2019) . polavaram coffer dam get completed by 2019 may/june . ie polavaram left canal gets 17,500 cusecs water from 2019 june through gravity. why should we spend 1600 crore for one season water supply of 3500 cusecs 

 

we need to read between the lines

stage 2 is needed anyway i.e to lift the water to Eleru from LMC at 50 KM

stage 1 is needed until there is water in LMC thru gravity. Water thru gravity by 2019-June, I doubt, being in this political situations.

But if we can use it for two years - its still worth more than what it was spent - remember just stage 1

Edited by rk09
Link to comment
Share on other sites

మెట్టకు మహర్దశ
జిల్లా సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయం
పురుషోత్తపట్నం రెండో దశ, పుష్కర ఎత్తిపోతల పథకాలు లాంఛనంగా ప్రారంభం నేడు
న్యూస్‌టుడే, సీతానగరం
eag-top2a.jpg
జిల్లా సాగునీటి రంగంలో మరో కీలక ఘట్టానికి బుధవారం వేదిక కానుంది. ఏలేరు ఆయకట్టుకు సాగునీటితో పాటు విశాఖపట్నంలో పారిశ్రామిక
అవసరాలకు నీటి సరఫరా లక్ష్యంగా రూ.1,638 కోట్లతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎత్తిపోతల ప్రయోగాత్మక పరిశీలనతో ఏలేరుకు నీటిని విజయవంతంగా పంపింగ్‌ చేసిన జలవనరుల శాఖ అధికారులు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెట్టలో ఖరీఫ్‌కు సాగునీటి సరఫరాలో ముఖ్య భూమిక పోషించే పుష్కర ఎత్తిపోతల పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. ఈ పథకాలకు సంబంధించి ప్రయోగాత్మక పరిశీలనను మంగళవారం చేపట్టారు. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో మంగళవారం ఉదయం గోదావరి నీటిమట్టం 18.6 మీటర్లకుచేరింది. ఈ నేపథ్యంలో పుష్కర-1, 2 పథకాల నుంచి రెండు మోటార్లతో 350 క్యూసెక్కుల నీటిని మెట్టకు సరఫరా చేసేలా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఈఈ పి.గంగయ్య మాట్లాడుతూ పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్టలోని 18 మండలాల పరిధిలో సుమారు 1.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసేలా 8 మోటార్ల మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. ఒక్కో పంపు నుంచి 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు 12 గొట్టాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది సుమారు రూ.3 కోట్ల వ్యయంతో మరమ్మతులతో పాటు 32 ప్రాంతాల్లో పైపుల లీకేజీలను అరికట్టే పనులు చేశామన్నారు. రంపచోడవరం 220/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పుష్కర పథకాలకు విద్యుత్తు సరఫరా అవుతుందని, త్వరలోనే పురుషోత్తపట్నం విద్యుత్తు ఉపకేంద్రానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. పుష్కర ఎత్తిపోతల పథకాల వద్ద 13 మీటర్ల నీటిమట్టం ఉంటేనే పంపులు పనిచేస్తాయని తెలిపారు. మంగళవారం ప్రయోగాత్మక పరిశీలనలో 10 కిలోమీటర్ల పైపులైన్ల పరిధిలోని 12 వరుసల్లో ఎటువంటి సాంకేతిక అవరోధాలు రాలేదని డీఈ వెంకట్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఈ నెల అయిదో తేదీన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదటి దశ, 8వ తేదీన జగ్గంపేట (రామవరం) వద్ద రెండోదశ పథకాల నుంచి సాగునీటి విడుదల ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైందన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పెందుర్తి వెంకటేష్‌, వర్మ తదితరులు ఈ పథకాల నుంచి అధికారికంగా నీటిని విడుదల చేస్తారని జలవనరుల శాఖ ఎస్‌ఈ బీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో ఏలేరు జలాశయానికి 12 టీఎంసీలు, 67,164 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు 8 టీఎంసీలు, విశాఖ నగర పారిశ్రామిక అవసరాలకు మరో 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకాలను ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని చెప్పారు.
 
 
 
jillalu.png

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...