Jump to content

Purushothapatnam lift irrigation project


Recommended Posts

పురుషోత్తపట్నం భూసేకరణ 2013 చట్టం ప్రకారమే
07-06-2017 02:26:28
 
  • వివాదాలు వైజాగ్‌ స్పెషల్‌ కోర్టుకు
  • రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ విజయకృష్ణన్‌
రాజమహేంద్రవరం జూన 6, ఆంధ్రజ్యోతి: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూములను 2013 భూసేకరణ చట్టం ప్రకారమే సేకరించామని, రైతులకు పరిహారం కూడా ఇదే చట్టప్రకారం ఇవ్వడానికి అవార్డు ప్రకటించామని రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌, పురుషోత్తపట్నం భూసేకరణ అధికారి విజయకృష్ణన్‌ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె రైతులు, అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, అవార్డు ప్రకటించకముందే భూములు కోల్పోయిన రైతులతో చర్చించినట్టు వివరించారు.
 
అవార్డు ప్రకటించిన తర్వాత రైతులు పరిహారం తీసుకున్నా, తీసుకోకపోయినా, ఏవైనా అభ్యంతరాలు ఉంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు విన్నవించుకోవాలన్నారు. ఈ పథకానికి మొత్తం 335 మంది రైతులకు చెందిన 206 ఎకరాల భూమిని సేకరించామని, అవార్డు ప్రకటించకముందు 223మంది రైతులు అంగీకార పత్రాలు ఇచ్చి భూములు అప్పగించారన్నారు. మిగతా రైతుల భూమిని అవార్డు ప్రకటించడం ద్వారా సేకరించామని ఆమె వివరించారు. అవార్డు ప్రకటించక ముందు పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి గ్రామాలలో ఎకరాకు రూ.28లక్షలు, నాగంపల్లి గ్రామంలో రూ.24లక్షలు పరిహారం ఇచ్చామన్నారు. అవార్డు ప్రకటించిన తర్వాత 2013 చట్టం ప్రకారం పురుషోత్తపట్నంలో ఎకరానికి రూ.17.78లక్షలు, చినకొండేపూడిలో 17.75లక్షలు, నాగంపల్లిలో రూ.15.23లు మాత్రమే పరిహారం వస్తుందన్నారు.
Link to comment
Share on other sites

పురుషోత్తపట్నం పిటిషన్‌పై విచారణ వాయిదా
07-06-2017 02:24:44
 
హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం సేకరించిన భూములపైనే పిటిషనర్లు ఆధారపడి జీవిస్తున్నారనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. సంబంధిత వివరాలను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు మంగళవారం ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలో తలపెట్టిన ఈ ఎత్తిపోతల నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ స్థానిక రైతు కూలీలు సీహెచ్‌ వెంకటేశ్వరరావు, మరో 14 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరపున న్యాయవాది బి.రచన వాదించారు.
 
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించిన భూములపైనే పిటిషనర్లు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. భూయజమానులకు, ఇక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే రైతు కూలీలకు తగిన సహాయ, పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీల్లేదన్నారు. భూసేకరణ చట్టం-2013లోని రెండో షెడ్యూల్‌ ప్రకారం భూమిలేని నిరుపేదలకు, చేతివృత్తుల వారికి ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు. పిటిషనర్లు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు ఆధారాలున్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉపాధి హామీ కార్డులు, ఆ భూముల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నట్లు యజమానులతో అఫిడవిట్‌, ఆధార్‌ కార్డులు కోర్టు పరిశీలనకు ఇస్తామని, అందుకు కొంత గడువు ఇవ్వాలని న్యాయవాది కోరారు. దీంతో ఈ వ్యాజ్యం విచారణను న్యాయమూర్తి వారం రోజులకు వాయిదా వేశారు.
Link to comment
Share on other sites

ఆగస్టు 7, 8 తేదీల్లో పురుషోత్తపట్నం ట్రయిల్‌రన్‌

సీతానగరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఎడమ గట్టున రూ.1,600 కోట్లతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్‌ఈ సుగుణాకరరావు పేర్కొన్నారు. విశాఖ పారిశ్రామిక, తాగు అవసరాలకు, ఏలేరు జలాశయానికి సాగు నీరు విడుదల చేసేందుకు ఈ పథకం ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే. సంబంధిత పనులను పరిశీలించేందుకు శుక్రవారం పురుషోత్తపట్నం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు జలవనరుల శాఖకు భూములను అప్పగించడంతో పంపుహౌస్‌, పైపులైను పనులు వేగవంతం అయ్యాయన్నారు. 4 పంపుల వద్ద డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పూర్తిచేసి ప్రస్తుతం శ్లాబు వేస్తున్నామన్నారు. రెండు వరుసల్లో సుమారు 20 కిలోమీటర్ల చేపట్టే పైపులైను పనులకు ఇప్పటికే 9.5 కిలోమీటర్లు పూర్తయ్యిందన్నారు. రోజుకు 200 మీటర్ల నుంచి 250 మీటర్ల మేర పైపులైను పనులు చేపట్టి జులై నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి నాలుగు పంపుల నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

అనుసంధానానికి అడుగులు

వేగం అందుకున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు

ఎడమ కాలువలో కట్టడాల నిర్మాణమే సవాలు

పూర్తి చేస్తారా.. తాత్కాలిక ఏర్పాట్లు తప్పవా?

ఆగస్టు 15కు నీటిని తరలిస్తామంటున్న అధికారులు

28ap-main10a.jpg

గోదావరి ఏలేరు నదుల అనుసంధాన పనులు వేగం అందుకున్నాయి. గోదావరికి కుడి వైపున పట్టిసీమ నిర్మించి కృష్ణమ్మకు గోదావరి నీళ్లు తరలించినట్లే.. ఎడమ వైపున పురుషోత్తపట్నం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఈ నీటిని ఏలేరుకు తీసుకువెళ్లనున్నారు. ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నా ఈ నీటిని ఏలేరుకు తరలించే పోలవరం ఎడమ కాలువ పనులు సవాలుగా నిలిచాయి. దాదాపు 58వ కిలోమీటరు వరకు రెండు ప్యాకేజీల్లో కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో కీలక నిర్మాణాలు ఉండటంతో పాటు జాతీయ రహదారిని దాటుకుని వెళ్లే మూడు ప్రధాన వంతెనల నిర్మాణమూ కీలకమయ్యాయి. పురుషోత్తపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న పది పంపుల్లో కనీసం నాలుగింటిని ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి 1400 క్యూసెక్కుల నీటినైనా తరలించాలనే ఆలోచనతో పనులు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.1638 కోట్లతో ఈ పథకానికి పాలనామోదం ఇచ్చింది. రూ.1551 కోట్ల ఒప్పంద విలువతో మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ ఎత్తిపోతల పనులు చేపట్టింది.

తూర్పుగోదావరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

రెండు దశల్లో గోదావరి వరద నీరు ఏలేరుకు చేరుతుంది. తొలి దశ పురుషోత్తపట్నం వద్ద పది పంపులతో 3500 క్యూసెక్కుల నీటిని వరద సమయంలో ఎత్తిపోస్తారు. ఆ నీటిని పది కిలోమీటర్లు పైపుల ద్వారా తరలించి పోలవరం ఎడమ కాలువ 1.60 కిలోమీటరు వద్ద కాలువలో పోస్తారు. ఆ కాలువలో 50వ కిలోమీటరు వరకు ప్రవహించాక అక్కడ ఎనిమిది పంపులతో 1300 క్యూసెక్కుల నీటిని కాలువలోంచి ఎత్తిపోస్తారు. 13 కిలోమీటర్లు పైపుల ద్వారా ఏలేరు జలాశయానికి తరలిస్తారు. పోలవరం ఎడమ కాలువలోనే 50వ కిలోమీటరు తర్వాత కొంత నీటిని పంపించి నేరుగా వెయ్యి క్యూసెక్కులు ఏలేరులో కలుపుతారు. ఈ నీరు ఏలేరు ఆయకట్టుకు అందుతుంది.

ఏమిటీ ప్రయోజనం?

గోదావరి వరద రోజుల్లో మొత్తం 30 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 2.15 లక్షల ఎకరాలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతుందని జలవనరులశాఖ పేర్కొంటోంది. ఇందులో ఏలేరు జలాశయం ఆయకట్టు స్థిరీకరణ కలిపి ఉంది. విశాఖ పారిశ్రామిక అవసరాలకు ఈ నీటిని మళ్లిస్తారు. అయితే ఏలేరు ఎడమ కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించాకే ప్రాజెక్టు ప్రయోజనం దక్కుతుంది. కొన్నేళ్లుగా ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండటం లేదు. ఏలేరు పరీవాహక ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వివిధ వాగులపై చెక్‌డ్యాంలు, ఇతర నిర్మాణాలు, నీటి దిశ మళ్లిపోవడంతో నీరు రావడం లేదని చెబుతున్నారు. నవంబరు నెలాఖరువరకు కూడా గోదావరిలో వరదతో ఏలేరును పూర్తి స్థాయిలో నింపి నిల్వ చేసుకోగలిగితే ప్రయోజనాలు ఉంటాయని జలవనరులశాఖ చెబుతోంది.

28ap-main10b.jpg

ఇదీ పనుల తీరు...

సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాల్సి ఉంది. ప్రభుత్వం ఆగస్టు 15 నాటికే ఇందులో తొలి దశ ప్రారంభించాలని భావిస్తోంది. పురుషోత్తపట్నం వద్ద భూసేకరణకు తొలుత అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. కొందరు రైతులు భూమినిచ్చేందుకు సమ్మతించినా మరికొందరు అంగీకరించకపోవడంతో ఆ భూమి తీసుకోవడం ఆలస్యమయింది. ఈలోపు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో పనులు ప్రారంభించారు. జనవరి నెలాఖరున ఈ పనుల ఒప్పందం జరిగినా మే 27 నాటికి మాత్రమే అక్కడ భూమి రెవెన్యూ శాఖ నుంచి అందుబాటులోకి వచ్చింది.

* గోదావరి వద్ద తొలి పంపుహౌస్‌లో మొత్తం 11 పంపులకు సంబంధించి మట్టి తవ్వకం, గైడ్‌వాల్‌ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో డయాఫ్రంవాల్‌ పద్ధతిలోనే నిర్మిస్తున్నారు. అయిదు పంపులకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. భూమి ఆలస్యంగా అప్పగించడం వల్ల ఆ ప్రాంతంలో పనులు ప్రారంభించడానికి కొంత ఇబ్బంది ఏర్పడింది.

* పోలవరం ఎడమ కాలువ 50 కిలోమీటరు వద్ద రెండో దశ ఎత్తిపోతల పనులు వేగంగానే సాగుతున్నాయి. ఇక్కడ మట్టితవ్వకం పూర్తయింది. ఇక్కడ తక్కువ లోతులోనే రాయి తగలడంతో డయాఫ్రం వాల్‌ పద్ధతి అవసరం లేకపోయింది. నాలుగు పంపులకు సంబంధించిన గోడల పని పూర్తయింది. మరో పంపునకు సంబంధించిన పని జరుగుతోంది.

28ap-main10c.jpg

70 కిలోమీటర్ల పైపులైను కావాల్సిందే!

ఈ పథకంలో ఏకంగా 70 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించాలి. తొలి దశలో 10.10 కిలోమీటర్ల మేర అయిదు వరుసల్లో పైపులైను వేయాలి. రెండో దశ నీటిని ఎత్తిపోశాక 13.120 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో పైపులు వేయాలి. ఇప్పటివరకు 50 కిలోమీటర్ల మేర పైపుల ఫ్యాబ్రికేషన్‌ పూర్తయింది. భారీ యంత్రసామగ్రితో రాత్రీపగలు కూడా పనులు చేస్తున్నారు.

* ఏలేరుకు అనుసంధానించాలంటే ఎడమ కాలువలో 58 కిలోమీటర్ల మేర అంటే మూడో ప్యాకేజీ వరకు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇందులోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తం 21 లక్షల క్యూబిక్‌మీటర్ల మేర ఇంకా మట్టి తవ్వాలి. మూడు చోట్ల కాలువ జాతీయ రహదారిని దాటుతుంది. అక్కడ వంతెనలు నిర్మించాలి. తొలి ప్యాకేజీలో 61 సి కింద పనులను గుత్తేదారు నుంచి తొలగించి వేరే వారికి అప్పగిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వుల్లో ఆలస్యం కావడంతో బ్లాస్టింగ్‌ పనులు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. వంతెనల నిర్మాణం జాతీయ రహదారుల సంస్థ జలవనరులశాఖకే అప్పగించింది. ఆకృతులు ఆమోదించడంలో ఆలస్యంతో పనులు ఇప్పుడిప్పుడే చేపడుతున్నారు.

* 58వ కిలోమీటరు వరకు కాలువ ద్వారా నీరు పంపాలంటే మొత్తం 111 కట్టడాలు పూర్తి చేయాలి. వీటిలో మరో పది కట్టడాల పనులు ప్రారంభించాల్సి ఉంది.

28ap-main10d.jpg పట్టిసీమ అనుభవమూ ఉపయోగిస్తున్నాం

పట్టిసీమ ఎత్తిపోతల సమయంలో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నాం. పనుల నాణ్యతలో రాజీ లేకుండా రాత్రీ పగలు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ పనులూ కొలిక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

- సుగుణాకర్‌రావు, ఎస్‌ఈ
Link to comment
Share on other sites

‘ఏలేరు’కు 7 నుంచి 9 టీఎంసీలు!

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా వరద జలాలు సరఫరా

పూర్తిస్తాయిలో తరలింపు

ఈ ఏడాదికి అసాధ్యమే..!

పోలవరం ఎడమ కాలువలో ప్రత్యామ్నాయాలపై దృష్టి

ఈనాడు - అమరావతి

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద జలాలను కనీసం 1400 క్యూసెక్కులైనా ఆగస్టు 15 నాటికి ఏలేరు జలాశయానికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇందుకోసం పోలవరం ఎడమ కాలువలో పనులకు సంబంధించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఒడ్డున, పోలవరం ఎడమ కాలువ 50వ కిలోమీటరు వద్ద నీటిని ఎత్తిపోసేలా పంపుల నిర్మాణం పూర్తి చేయనున్నారు. అయితే..ఈ నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా మళ్లించే విషయంలో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై మూడు చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఆ వంతెనల నిర్మాణం ఆగస్టులోపు పూర్తి చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రత్యామ్నాయాలను చేపట్టి..

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా 3500 క్యూసెక్కుల(దాదాపు 30టీఎంసీలు) గోదావరి వరద జలాలను మళ్లించాలనేది యోచన. ఈ నీరు సరఫరా చేయాలంటే పోలవరం ఎడమ కాలువలో తొలి రెండు ప్యాకేజీల్లో పనులు పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంటుంది.

* ఎడమ కాలువ 5.986 కిలోమీటరు వద్ద వచ్చి కలిసే వినుకొండ కాలువ పైనుంచి వెళ్లిపోయేలా సూపర్‌ పాసేజ్‌ నిర్మించాల్సి ఉంది. మొత్తం 284 క్యూమెక్కుల నీరు ఈ కాలువ ద్వారా ఎడమ కాలువను దాటుతుంది. ప్రస్తుతం ఈ సూపర్‌ పాసేజ్‌ నిర్మాణం పూర్తి కాకపోయినా ఆ కాలువలో వచ్చే నీటిని పోలవరం ఎడమ కాలువలోనే కలిపి పంపేలా...మరీ ఎక్కువగా వస్తే కాలువ నుంచి బయటకు వదిలేసేలా ప్రత్యామ్నాయం చూస్తున్నారు.

* పోలవరం ఎడమ కాలువ 13.26 కిలోమీటరు వద్ద బురద కాలువపై సూపర్‌ పాసేజ్‌ నిర్మించాలి. ఈ కాలువలో గరిష్ఠంగా 1,360 క్యూమెక్కుల నీరు వస్తుంది. ఇక్కడ కూడా పై తరహా విధానాన్నే చేపట్టనున్నారు.

* 16.385 కిలోమీటరు వద్ద రెండు వరుసల వంతెన నిర్మించాల్సి ఉంది. నిర్ణీత సమయంలో ఈ పనులను పూర్తి చేసే యోచనలోనే ఉన్నారు. లేని పక్షంలో ఇక్కడా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు.

* పోలవరం కాలువ 17.365 కిలోమీటరు వద్ద ఒక వరుస వంతెనతో పాటు సూపర్‌ పాసేజ్‌ నిర్మించాలి. ఈ పనులు ప్రారంభమయ్యాయి.

వంతెనల నిర్మాణమే సవాల్‌...

ఈ ఎడమ కాలువ 58వ కిలోమీటరు లోపు మూడు చోట్ల జాతీయ రహదారిని కాలువ దాటాల్సి ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణ పనులు జలవనరులశాఖే చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ అనుమతులిచ్చింది, టెండర్లు పిలిచి పనులు అప్పచెప్పారు. జాతీయ రహదారుల అధికారులు వంతెనల ఆకృతుల అనుమతులకు వేరే అంశానికి ముడిపెట్టడంతో కొంత ఆలస్యమయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి ఆ వంతెనల నిర్మాణం పూర్తి కాదనే నిర్థారణకొచ్చారు. ఈ నేపథ్యంలో 1500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి తగ్గట్టుగా తాత్కాలిక వంతెనలు నిర్మించనున్నారు. ఇందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఆమోదించిన మేరకే ఈ తాత్కాలిక వంతెనలకు ఆకృతులు సిద్ధం చేస్తున్నామని ఎస్‌ఈ సుగుణాకరరావు తెలిపారు.

కనీసం 7 టీఎంసీలైనా మళ్లించాలని..

ఆగస్టు 15న ఈ ఎత్తిపోతల్లో పంపులను ప్రారంభించి కనీసం 7 నుంచి 9 టీఎంసీలనైనా ఏలేరు జలాశయానికి ఈ ఏడాది మళ్లించాలని యోచిస్తున్నారు. ఏలేరులో సహజంగా వచ్చే ప్రవాహాలకు తోడు ఈ నీరు కలిస్తే ఏలేరును పూర్తి స్థాయిలో నింపవచ్చని లెక్క కడుతున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Machhumarri project complete ayyinda? Is it operational now? varadalu vasthe water release cheyyochha to Kurnool & Kadapa?

Matchumarri - almost dead storage level lo kuda lift cheyyotchu - into KC canal

But only two pumps - 350 or 700 cusecs

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...