Jump to content

Purushothapatnam lift irrigation project


Recommended Posts

పురుషోత్తమపురం.. మరో పట్టిసీమ!
 
  • పోలవరం ఎడమ కాల్వకు.. గోదావరి జలాల ఎత్తిపోత
  • ప్రాజెక్టు అంచనా రూ.1600 కోట్లు.. 11న బాబు సమీక్ష
 
హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా నదిలోకి నీటిని ఎత్తిపోసి.. కృష్ణా డెల్టాకు ప్రతిష్ఠాత్మకంగా సాగు, తాగు నీరందిస్తున్న ప్రభుత్వం.. అదే తరహాలో పోలవరం ఎడమ కాలువలోకి పురుషోత్తమ పురం పథకం ద్వారా నీటిని ఎత్తిపోసి.. ఏలేరు కాలువలోకి పంపాలని నిర్ణయించింది. ఏలేరు, తాండవ రిజర్వాయరు ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగు నీటిని అందించడంతో పాటు.. విశాఖ నగరానికి తాగునీటిని, విశాఖ స్టీల్‌ ప్లాట్‌ అవసరాలకు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టిసీమ తరహాలోనే ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ.1600 కోట్ల మేర వ్యయం అవుతుందని జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే పురుషోత్తమపురం ప్రాంతంలో ఇంజనీరింగ్‌ నిపుణులు పర్యటించారు. వారు అందజేసిన నివేదికపై జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం సమీక్షించారు. కాగా.. త్వరితగతిన ఈ పథకాన్ని చేపట్టేందుకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేయాలని జల వనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 11న విజయవాడలో సీఎం పురుషోత్తమపురం ఎత్తిపోతలపై సమీక్ష నిర్వహించనున్నారు.
Link to comment
Share on other sites

yeleru.jpg

 

 

There is nothing called wastage even if we invest too drinking water for all villages ki supply cheyochu 25tmc* 4 times fill chesthe 100tmc we can modernize canals system and all villages ki use cheyali.

 

Many don't know godavari delta is using 250-300tmc every year from dawaleswaram but there are few areas where still drought in east godavari. If we use Yeleru water we can divert whole water to cultivation, drinking, industrial ki use cheyochu 

 

Even drought year lo godavari delta got 200-250tmc(exact figure teliyady but 200+ tmc) for all uses. Even this year by august8th Godavari delta used 43+ tmc and 1100tmc wasted.

 

AP govt must plan whereever water is available whole district ki drinking+ farming water full ga isthe chalu. Even this much water wasting into sea 100tmc is more then enough for east godavari to supply drinking water for 365 days. 250-300tmc for farming. 350-400 can be used for east godavari it might help in increasing ground water, cultivation, aqua,... ki use cheyochu

Link to comment
Share on other sites

ఇక ఉత్తరాంధ్రకు గోదారి పరుగులు
 
636065708780251931.jpg
  • సుజల స్రవంతిలో అంతర్భాగంగా పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం
  • రూ.1685 కోట్లతో నిర్మాణం
హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వృథాగా పోతున్న గోదావరి జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ గుండా కృష్ణా డెల్టాకు నీళ్లు మళ్లించిన ప్రభుత్వం... ఇక ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న నీటి సమస్యనూ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. పట్టిసీమ తరహాలోనే పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా విశాఖపట్నం జిల్లాలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించదలచిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలించాల్సిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నందున... వాటిలో అంతర్భాగంగానే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేర్చి సమగ్ర ప్రాజెక్టు నివేదికను జల వనరుల శాఖ రూపొందించింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా 3,500 క్యూసెక్కుల గోదావరి నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.1685 కోట్లు అవసరమవుతాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. వాటిని ఆమోదించాలని ఆర్థిక శాఖను కోరుతూ శుక్రవారంనాడు ఫైలు పంపాలని నిర్ణయించింది. ఆర్థికశాఖ ఆమోదం లభించగానే ఈ పథకాన్ని చేపట్టేందుకు ఆసక్తి కలిగిన ఇంజనీరింగ్‌ సంస్థలను ఆహ్వానిస్తూ ఈ నెల 15వ తేదీ నాటికి టెండర్లను పిలవాలని జల వనరుల శాఖ సిద్ధమవుతోంది.
దశాబ్దాల డిమాండ్‌
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్మించాలంటూ దశాబ్దాలుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఈ మూడు జిల్లాల్లో ఎగువ ప్రాంతాలకు చెందిన 8 లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీటిని అందించవచ్చని ప్రభుత్వానికి నిపుణులు సూచించారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ కాలువలోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ నీటిని ఏలేరు రిజర్వాయర్‌లోకి తరలించాలని, అక్కడి 67,000 ఎకరాల ఆయకట్టును ఈ నీటితో స్థిరీకరించాలని జల వనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో 2,500 క్యూసెక్కులను ఏలేరు రిజర్వాయరులో నిల్వ చేయాలని సూచించింది. ఈ నీటిని విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా అనకాపల్లి శారదానదికి సమీపంలోని మామిడిగెడ్డ వద్ద ఉన్న రిజర్వాయర్‌కు పంపాలని ప్రతిపాదనలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

ఏలేరు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: జేసీ

జిల్లా సచివాలయం(కాకినాడ), న్యూస్‌టుడే: ఏలేరు కాలువ ఆధునికీకరణకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ అధికారులతో వివిధ ప్రాజెక్టుల భూసేకరణపై ఆయన సమీక్షించారు. ఏలేరు భూసేకరణకు సంబంధించి పెద్దాపురం, కిర్లంపూడి, పిఠాపురం మండలాల్లోని 17 గ్రామాల్లో భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే కాండ్రకోట, వీరవరం, తామరాడ గ్రామాల్లో భూసేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. మిగతా గ్రామాల్లో కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజానగరం-సామర్లకోట ఏడీబీ రోడ్డు విస్తరణకు సంబంధించి రాజానగరం, రంగపేట, గండేపల్లి, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని 11 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఇవ్వటానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పూర్తయ్యిందన్నారు. భూమిని ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పగించటానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు బీఆర్‌ అంబేడ్కర్‌, విశ్వేశ్వరరావు, కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

20160818a_001135012.jpg20160818a_002135006.jpg

 

 

It is better to do a survey on Polavaram left canal ni srikakulam and vizayanagaram projects ki interlink cheyali. Idi chesthe chalu per year 40 to 50 tmc divert chesthe 2 districts ki chalu we can make them drought free. Elago odisha nunchi vache water tho idi saripotundi

Link to comment
Share on other sites

  • 1 month later...
పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు పరిపాలన అనుమతి
 
అమరావతి: పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ. 1638 కోట్ల వ్యయంతో పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం పనులను చేపట్టనున్నారు. పోలవరం ఎడమ కాల్వ నుంచి పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు 3500 క్యూసెక్కుల నీటి తరలించనున్నారు. విశాఖ నగర తాగు, పరిశ్రమల అవసరాల నిమిత్తం గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Link to comment
Share on other sites

పురుషోత్తపట్నంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
 
ఏలూరు: పోలవరం ఎడమ ప్రధాన కాల్వపై రూ.1648 కోట్లతో చేపట్టనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సమీక్షలో ఆయన ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ పథకం పూర్తయితే.. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయరు ఆయకట్టు రైతులకు సాగు నీరు ఎలా అందుతుంతో వివరించారు. విశాఖ నగరానికి తాగు నీటిని అందించడంతో పాటు పారిశ్రామికావసరాలకు నీటిని ఇవ్వవచ్చని ఈఎన్‌సీ తెలిపారు. ఈ పథాకాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకూ గోదావరి జలాలను అందించవచ్చన్నారు. ఆ సమయంలో సీఎం జోక్యం చేసుకుంటూ .. నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో సాగు నీటికి కొరతే ఉండదన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...