Jump to content

Purushothapatnam lift irrigation project


Recommended Posts

పురుషోత్తపట్నం పథకం ప్రారంభం

సీతానగరం: గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసి మొదటి విడతలో మెట్ట రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం తొలి విడతను ప్రారంభించిన చంద్రబాబు రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రారంభం నుంచి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ పథకం ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకుంది. ఈ పథకం తొలుత అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయినా నీటి విడుదలకు ప్రాథమిక దశను మాత్రం అధిగమించింది.

Link to comment
Share on other sites

 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల జాతికి అంకితం
15-08-2017 16:10:22
 
 
636384106106620740.jpg
తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. రూ. 1500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ రికార్డ్ సమయంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు. ప్రగతికి చిహ్నం నీళ్లు అని, ప్రతి పంద్రాగస్టు రోజున ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
 
 
భ్రష్టుపట్టిన వ్యవస్థలో లోపాలను సరిచేశామని చెప్పారు. మరో మూడు నెలల్లో 28 ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ప్రకటించారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ వల్ల ప్రత్యక్షంగా... పరోక్షంగా 11 జిల్లాలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. ఇదే స్ఫూర్తితో 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం తన కల గా పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
తీరనున్న ఏలేరు ఆయకట్టు రైతుల కష్టాలు
 
 
636416698520448696.jpg
రాజేమహేంద్రవరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం బాలరిష్టాలు అధిగమించింది. దీంతో సాగు నీరు విడుదలకు మార్గం సుగమమైంది. ఆగష్టు 15న ఈ పథకం మొదలైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల నీరు విడుదల కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించడంతో నీటి పంపింగ్ పనులను అధికారులు పూర్తి చేశారు.
 
గోదావరికి ఎడమ వైపున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది ఆగష్టు 15నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించడంతో ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి అనుకున్నట్లుగానే ఆగష్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే పనులు పూర్తి కాకపోవడంతో నీరు విడుదల సాధ్యం కాలేదు. దీనిపై సీఎం సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశారు. పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లు, రెండు పంపులను ఏర్పాటు చేసి ప్రతి రోజు గోదావరి నుంచి 700 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు.
 
పంపింగ్ చేసిన నీటిని కిలో మీటర్ల దూరం వరకు పైప్‌లైన్ల ద్వారా తరలించి అక్కడ డెలివరీ సిస్టం ద్వారా పుష్కర ఎత్తిపోతల పథకం కాల్వలోకి కలుపుతున్నారు. ప్రతిరోజూ పంపింగ్ చేసిన 700 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా తరలించి ఏలేరు కాల్వకు సాగునీరు అందించే విధంగా ఇరిగేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా ఏలేరు ఆయకట్టు పరిధిలోని 67వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం.
 
అక్టోబర్ నెలాఖరునాటికి పురుషోత్తపట్నం వద్ద పంపింగ్ స్టేషన్ పనులను పూర్తి చేసి ప్రతిరోజు 2100 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌తో పాటు ఏలేరు ఆయకట్టుకు అందిస్తామంటున్నారు ఇరిగేషన్ అధికారులు. అక్టోబర్ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసే విధంగా ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజ్1లో భాగంగా పురుషోత్తపట్నం వద్ద పంప్‌హౌస్ పనులను పూర్తి చేయడంతో పాటు డెలివరీ సిస్టం వద్ద పైప్ ‌లైన్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. స్టేజ్1కు సంబంధించి 254ఎకరాల భూములను అధికారులు సేకరించారు.
 
ఇప్పటికే రూ.36కోట్లను నేరుగా రైతు ఖాతాల్లోనూ జమ చేశారు. స్టేజ్2కు సంబంధించి రామవరం దగ్గర పంపింగ్ స్టేషన్, డెలివరీ సిస్టమ్ పనులను పూర్తి చేశారు. దీని కోసం 115 ఎకరాల భూములను సేకరించారు. రైతులకు రూ.17కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ రెండు పంప్‌హౌస్‌ల వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంది. స్టేజ్1 పనులు 70శాతం పూర్తి అయ్యాయని అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేస్తామంటున్నారు ఇరిగేషన్ అధికారులు. స్టేజ్2 వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయ్యిందని పైప్‌లైన్ పనులు 50శాతం పూర్తి చేశామంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సీజన్‌లో ఏలేరు రిజర్వాయర్‌లో 8 నుంచి పది టీఎంసీల నీరు నిల్వ చేస్తామంటున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...