Jump to content

Purushothapatnam lift irrigation project


Recommended Posts

  • 2 weeks later...
  • 4 weeks later...

పురుషోత్తపట్నం’ పోటీలో మేఘా, నవయుగ

 

  • టెక్నికల్‌ బిడ్‌ తెరిచిన జలవనరుల శాఖ..
  • 2న ఫైనాన్సియల్‌ బిడ్‌
హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువపై ‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌, నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్‌ బిడ్‌లను మంగళవారం జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు తెరిచారు. మరో పట్టిసీమగా పేర్కొంటున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు రూ.1638 కోట్ల వ్యయం అవుతుందని జల వనరుల శాఖ అంచనా వేసింది. ఐబీఎం కమిటీ రూ.1483.71 కోట్లుగా పేర్కొంది. దీనిని నిర్మించేందుకు ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ జలవనరుల శాఖ టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థలు మేఘా ఇంజనీరింగ్‌, నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వీటిపై బుధవారం సమీక్ష జరుగుతుంది. అనంతనం గురువారం రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలనకు పంపుతారు. ఈ కమిటీ పరిశీలన తర్వాత డిసెంబరు 2న ఫైనాన్సియల్‌ బిడ్లను తెరుస్తారు.
Link to comment
Share on other sites

పురుషోత్తపట్నం ఎత్తిపోతల టెక్నికల్‌ బిడ్‌ ‘మేఘా’కే
 
హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల టెక్నికల్‌ బిడ్‌లో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టు కోసం బిడ్‌ను దాఖలు చేసిన మరో సంస్థ నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థకు టెక్నికల్‌గా ఆమోదం లభించలేదు. దీనిపై శుక్రవారం పరిశీలించిన టెండర్‌ కమిటీ శనివారం తుది నిర్ణయం తీసుకుని అర్హత సాధించిన కంపెనీని ప్రకటిస్తుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

purushottapatnam-03012017.jpg

గోదావరి ఎడమగట్టు పై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద 1687 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5న శంకుస్థాపన చెయ్యనున్నారు. ఈ పధకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాలలో 67 వేల ఎకరాల్లో సేద్యపు స్థిరీకరణ జరగడంతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ శివారులో సుమారు 20 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగనుంది. అలాగే విశాఖపట్నానికి 3,500 క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు ఉపయోగపడనుంది.

 

రానున్న9 నెలల కాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకాన్ని గోదావరి బ్యారేజీ ఎగువన 40 కిలోమీటర్ల వద్ద పురుషోత్తపట్నం గ్రామం వద్ద నిర్వహిస్తారు. ఈ పథకంలో భాగంగా పురుషోత్తపట్నం వద్ద ఒక్కొక్కటి 350 క్యూసెక్కుల సామర్ధ్యం కలిగిన 10 పంపులను ఏర్పాటు చేయనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం తరహాలోనే ఇక్కడ కూడా 14 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడే పంపులు తిరిగేలా ఏర్పాటు చేస్తారు.

Link to comment
Share on other sites

phase 2 has long term benefit (lift water from left canal to Yeleru reservoir for offseason storage). 

phase 1 lo aqueducts/bridges are necessary to complete the left canal.

but lift part in phase 1( lifting water from Godavari to Left canal) waste kada. inko one year lo Polavaram nunchi gravity dwara water istam antu, malli ee lift enduku?

Link to comment
Share on other sites

ప్రాజెక్టుల పరుగులు
 
636190930883165391.jpg
  •  రేపు పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు సీఎం భూమిపూజ 
  •  11న పులివెందుల కెనాల్‌కు నీరు 
హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి.. పొలాల్లో నీరు పారించే దిశగా రాష్ట్రప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి పురుషోత్తపట్నం నుంచి నీటిని ఎత్తిపోసే పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో జల వనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొంటారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థే.. పురుషోత్తపట్నం పనులనూ దక్కించుకుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసి ఏలేరు రిజర్వాయరులోకి పంపడం ద్వారా ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీనితో పాటు.. ఎన్నో ఏళ్లుగా నీటి కోసం ఎదురు చూస్తున్న విశాఖ ప్రజల దాహార్తి తీరుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల అవసరాలకు నీరు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల రైతాంగం, ప్రజల కష్టాలు తీరతాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే.. మున్ముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి.. శ్రీకాకుళం జిల్లా వరకూ నీటిని తీసుకెళ్లవచ్చని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే .. పట్టిసీమ, ముచ్చుమర్రి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసిన ‘జోష్‌’లో ఉన్న మేఘా ఇంజనీరింగ్స్‌, జల వనరుల శాఖలు.. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా విశాఖ వరకూ నీటిని పారించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు.. ఇటీవల ప్రాజెక్టు పనులకు శ్రీకారం, పూర్తి చేసిన పథకాల ప్రారంభోత్సవాల్లో నిమగ్నమైన జల వనరుల శాఖ.. ఈ నెల 11న కడప జిల్లా గండికోట నుంచి పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమవుతుంది. గండికోటలో 4 టీఎంసీల నీటిని సిద్ధం చేస్తే.. ఎత్తిపోతలను ప్రారంభించవచ్చని జల వనరుల శాఖ చెబుతుంటే.. నిర్మాణ సంస్థ మాత్రం 4.5 టీఎంసీలు ఉండాలని చెబుతోంది. ఈ నెల 7నుంచి ట్రయల్‌ వేసి.. పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని పంపాలని జల వనరుల శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యానవన పంటలకు నీరందించే వీలుంటుంది. త్వరలోనే చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరకూ నీటి ఎత్తిపోసే కార్యక్రమం ప్రారంభం కానుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...