Jump to content

A.P aqua industry


Recommended Posts

  • Replies 213
  • Created
  • Last Reply
పి కబురు
రొయ్యల సాగుకు ప్రభుత్వ బాసట
కేజీకి రూ.30 అదనంగా చెల్లింపు
విద్యుత్తు యూనిట రూ.2కు సరఫరా
ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్ల ఆదా
మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే
kri-top2a.jpg
రొయ్యల రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భారీస్థాయిలో పడిపోయిన ధరలకు కళ్లెం వేసి రైతుకు కనీస భరోసాను కల్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆక్వా రంగంపై కరుణ కురిపించింది. రొయ్యల సాగుకు వాడే విద్యుత్తు యూనిట్‌ ధరను రూ.3.86 నుంచి రూ.2 కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కొనుగోలు చేసిన రొయ్యలకు ఎగుమతిదారులు కిలోకు రూ.30 పెంచాలని నిర్ణయించారు. ఆక్వా సాగును జోన్ల వారీగా విభజించి  రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రస్థాయిలో రొయ్యల వ్యాపారులు, రైతులు, మేత తయారీ సంస్థలతో శనివారం సమావేశాన్ని నిర్వహించి రైతుల ఇబ్బందులకు అనుగుణంగా ప్రకటన చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆక్వా సాగుదార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించడానికి ముఖ్య కారణంగా నిలిచింది రొయ్యల సాగే. జిల్లాలో 2015లో 20 వేల ఎకరాలకు లోపు ఉన్న రొయ్యల సాగు క్రమంగా పెరుగుతూ 2018లో 90 వేల ఎకరాలకు చేరింది. రెండేళ్ల కిందటి వరకూ సాఫీగా సాగిన రొయ్యల సాగు ఒక్కసారిగా అనేక ఇబ్బందులకు గురైంది. వరుసగా తెల్లమచ్చల వ్యాధి విజృంభణ, అనధికార, గుర్తింపు లేని హేచరీలు పుట్టుకు రావడం,  పిల్ల నాణ్యత లోపించడం, సాగులో ఇష్టారాజ్యంగా యాంటీ బయోటిక్స్‌ వినియోగించడం, రన్నింగ్‌ మొట్రాలిటీ, వాతావరణం అనుకూలించకపోవడం.. ఇలా అనేక సమస్యలతో రైతులు వరుస నష్టాలను చవిచూశారు. 2017 వేసవి నుంచి రైతులకు ధరల సమస్య శరాఘాతంలా తయారైంది. అవసరానికి మించి ఉత్పత్తి పెరగడం, మార్కెట్‌కు ఒకేసారి పెద్దఎత్తున సరకు రావడంతో అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గింపు లేకపోయినా దళారులు, వ్యాపారులు ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మూడు పంటలకు ఒకసారి లాటరీ రూపంలో వచ్చిన దిగుబడికి కూడా ధర రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లాలో అక్కడక్కడ పంట విరామాన్ని కూడా ప్రకటించారు. రూ.లక్షల్లో లీజులు చెల్లించి ధరలు లేకపోవడంతో చెరువులను ఖాళీగా ఉంచుకున్నారు.

రూ.2500 కోట్లు ఆదా..
తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను ప్రస్తుతం గట్టెక్కించేందుకు రొయ్యల కొనుగోలుదారులు కిలోకు రూ.30 అదనంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రొయ్యల మేత, మందులు, ఇతర ఖర్చులు మరో రూ.30 వరకు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మత్స్యశాఖ 11.80 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో 40 శాతం వాటా (4.75 లక్షల టన్నులు) రొయ్యల సాగుదే. గడచిన రెండు నెలల ఉత్పత్తులను తీసివేసి మిగిలిన పది నెలలకు ఈ లెక్కన రూ.2400 కోట్లు రైతులకు ఆదా అవుతుందని అంచనా. ప్రస్తుతం విద్యుత్తు యూనిట్‌కు రూ.3.86లను రూ.2 తగ్గించడం ద్వారా జిల్లా రైతులకు మరో రూ.100 కోట్లు మిగులుతుంది. మొత్తంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానంతో ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.2500 కోట్లు ఆదా అవుతుందని అంచనా.

ధరల పెంపు ప్రకటనతో ఊరట
ప్రస్తుతం వంద కౌంట్‌ రొయ్యలు పెంచేందుకు రైతుకు రూ.220 ఖర్చు అవుతుంది. 100 కౌంట్‌ను మార్కెట్‌లో రూ.160-170 లకు కొనుగోలు చేస్తున్నారు. మేత, మందులు, విద్యుత్తు వ్యయం రూ.30 తగ్గడంతో ప్రస్తుతం వంద కౌంట్‌కు రూ.200 చెల్లిస్తే రైతు గ్టెక్కే అవకాశం ఉంటుంది. రొయ్యల కొనుగోలుదారులు అదనంగా రూ.30 చెల్లించడంతో రైతుకు ఊరట లభిస్తుంది. వంద కంటే తక్కువ కౌంట్లు దిగుబడి సాధిస్తేనే రైతుకు లాభాలు వస్తాయి. నష్టాలబారి నుంచి కనీసం ఖర్చులు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ బయోటిక్స్‌ నియంత్రణలో భాగంగా మత్స్యశాఖ అధికారులు, ఎంపెడా, కాలుష్యనియంత్రణ మండలి సభ్యులు, ఎగుమతిదారులు, హేచరీల ప్రతినిధులు సభ్యులుగా కమిటీలను వేయనున్నారు. ఆక్వా సాగును జోన్లుగా విభజించి అందులోనే సాగు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

పారదర్శకంగా అమలు చేయాలి
ప్రభుత్వం ప్రకటించిన ధరల పెంపును, మేత, విద్యుత్తు ధరల తగ్గింపును పారదర్శకంగా అమలు చేస్తేనే రైతుకు లాభం చేకూరుతుంది. జిల్లాలో రొయ్యల సాగు చేస్తున్న వారిలో 70 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరి వద్ద నుంచి నేరుగా కంపెనీలే రొయ్యలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలి. టన్ను, రెండు టన్నుల రొయ్యలను కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మత్స్యశాఖ, ఎంపెడాలను సమన్వయపరిచి రైతులకు అభివృద్ధి ఫలాలను అందించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధిలో ప్రేక్షక పాత్రను పోషించిన ప్రభుత్వం ధరల నియంత్రణ మండలిని ఏర్పాటు చేసి ఆక్వా ఉత్పత్తుల ధరలను స్థిరీకరించాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు పేద, చిన్న, సన్నకారు రైతులకు చేరే విధంగా శాఖల పనితీరును మెరుగుపరచాలని కోరుతున్నారు.

‘ఈనాడు’ కృషికి ప్రతిఫలం
జిల్లాలోని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలకు మత్స్యశాఖ జేడీ యాకుబ్‌ బాషా స్పందించి.. రాష్ట్రవ్యాప్త సమస్యగా పరిగణించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని చూపారు. ‘ఈనాడు’ కృషికి జేడీ యాకుబ్‌ బాషా అభినందనలు తెలిపారు.

కనీస మద్దతు ధరతో రైతులకు ఊరట
ధరల పతనం వరుస నష్టాలతో జిల్లా ఆక్వారంగం కుదేలవుతున్న తరుణంలో ప్రభుత్వం చక్కని పరిష్కారం చూపింది. నష్టాలలో కొట్టుమిట్టాడుతున్న రొయ్యల సాగుకు పెంచిన ధరలతో కనీస మద్దతు ధర లభించినట్లయింది. సాగులో నాణ్యతను పెంచితే మరింతగా ఆక్వారంగం వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. రొయ్యలకు ముందు మంచికాలం ఉంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ధరలు పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరల్లో మార్పు వస్తే అన్ని రకాలుగా రైతుకు లాభం చేకూరుతుంది.

-యాకుబ్‌ బాషా, సంయుక్త సంచాలకులు, మత్స్యశాఖ
ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించాలి
ఆరోగ్యకరమైన ఆక్వా ఉత్పత్తులు సాధించడానికి రైతులంతా కృషి చేయాలి. ఇప్పటికే ఇతర దేశాల్లో మనదేశ ఎగుమతుల్లో చెడ్డపేరు వచ్చింది. అన్ని దేశాలకు చెందిన రొయ్యల కంటైనర్లలో మూడు, నాలుగు నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తుంటే మన దేశం నుంచి వెళ్లిన కంటైనర్లలో మాత్రం 50కు పైగా నమూనాలు సేకరించి మరింత క్షుణ్ణంగా పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 15 మంది ఎగుమతిదారులపై నిషేధం విధించారు. మిగిలిన ఎగుమతిదారులు కూడా ఎగుమతులకు సాహసించడం లేదు. రైతులు కూడా ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించి దేశానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి.
- కలిదిండి సీతారామరాజు, రాష్ట్ర మత్స్యశాఖ అదనపు సంచాలకులు
సీఎం ఎక్కువ ఆసక్తి చూపించారు
ఆక్వా సాగుపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఆక్వా రైతులపై ప్రేమను చూపించారు. చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నిసార్లు కలిసి మాట్లాడినా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆక్వా ఈ దశకు చేరిందంటే కారణం రైతుల కృషితోపాటు ప్రభుత్వ సహకారం ఉంది. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆక్వా రంగంలోని అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకున్నాం. తాజాగా విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన ప్రయోజనకరంగా ఉంది.
-ముదునూరి సీతారామరాజు, చేపల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రైతుల్లో మార్పు రావాలి
ప్రభుత్వం సూచించిన విధంగా ఆక్వా రైతుల్లో మార్పు రావాలి. ఇష్టం వచ్చినట్లు చెరువుల తవ్వకం వల్ల ప్రమాదం ఉంది. ఆక్వా జోన్ల ప్రకటనతో సాగులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపలు, రొయ్యల సాగులో యాంటీ బయోటిక్స్‌ వాడకంపై ప్రతి  రైతుకు అవగాహన ఉంటేనే మేలు. అదీకాక ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయడం వల్ల ఉప్పునీటితో చేపల సాగుకు, నీటి వనరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకప్పుడు కొల్లేరులో నీరు తోడుకుని చేపల సాగుచేసే పరిస్థితి ఉండేది. నేడు కొల్లేరులో నీరు ఉప్పుగా మారి సాగుకు పనికి రావడం లేదు. ప్రభుత్వ సూచన మేరకు రైతులు సాగును చేస్తేనే ఆక్వారంగం వర్ధిల్లుతుంది.
-చదలవాడ శేషగిరిరావు, చేపల రైతుల సంఘం నాయకుడు, మండవల్లి
 
 
 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణకు 40కోట్లు
02-07-2018 02:24:56
 
అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): హుద్‌హుద్‌ తుపాన్‌కు దెబ్బతిన్న విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.40కోట్లు మంజూరు చేసింది. నాణ్యమైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి పరిశ్రమలశాఖ కమిషనర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునికీకరించనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీం (టీఐఈఎస్‌) కింద మంజూరైన రూ.16.97 కోట్లతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.23.03 కోట్లు మంజూరు చేస్తూ, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారు. వ్యాట్‌, టెండర్‌ ప్రీమియం, ఇంజనీరింగ్‌ చార్జీలను మినహాయించి, రూ.33.93 కోట్లు సదరు ఏజెన్సీకి విడుదల చేయనున్నారు. ఈ నిధులతో ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల, రొయ్యల మార్కెటింగ్‌కు కొత్త ఫ్లాట్‌ఫారాలు, వృధా నీటిపారుదలకు డ్రెయినేజీల నిర్మాణం.. విద్యుద్దీకరణ, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Link to comment
Share on other sites

Facts about AP’s fisheries industry:

  • Andhra Pradesh is the largest seafood exporter in India. Andhra Pradesh stands first in total fish and prawn/shrimp production in India
  • Seafood exports in India are fetching ₹40,000 crores in foreign exchange and AP’s contribution is the highest (₹17,000 crores).
  • The total contribution of AP to fish production at the national level amounts to 20.77% while that at the global level stands at 1.19%. The target is to increase its production to 42 lakh tonnes by the year 2020.
  • Andhra Pradesh has the highest number of fishermen villages (408) in the East Coast.
  • It occupies second and third position in the size of fishermen population and number of fish craft and gear respectively.

How did it become the largest exporter of fresh water fish in India?

  • The State Government has identified as a priority sector for growth.
  • In this year alone, the Govt has allocated ₹400 crores in the Budget this year for the sector.
  • Linkage with MPEDA is developed for storage/refrigeration/Harbour Facilities/ Fiscal Incentives.
  • Great fish marketing and distribution chains. Andhra Pradesh has three prominent agencies, viz., Directorate of Fisheries, Fishery Co-operatives and Fisheries Corporation, that are working for the fisheries development activities include the promotion of fish marketing also.
  • Another one, established by the Govt in 1974 called the AP Fisheries Corporation is the major body that help in marketing and distribution efforts including exports.
  • AP has fishermen co-operatives, another institutional agency working for the development of fisheries in Andhra Pradesh.
  • Mega Food Parks have been established in suitable places by tapping the incentives from the Government of India.
  • Effort are made to develop fisheries infrastructure for promotion of fish and fish products exports in Bhimavaram and Visakhapanam which are recognized as the towns of export excellence (Marine Sector) in trade policy of Government of India, 2015-2020.

Here’s the graph of fisheries production growth in AP between 2008 and 2017:

 
main-qimg-f5785c4a8131937ab5840d91d7bc99c9

In fiscal year 2017, the production of fish in the state amounted to about 2.76 million metric tons, a significant increase from about 1.01 million metric tons in fiscal year 2008.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
మా వద్ద ఫార్మాలిన్‌ వాడటం లేదు 
  చేపల నాణ్యత విషయంలో  ఏపీ ప్రభుత్వానిది హామీ 
  అసోం, నాగాలాండ్‌,  మేఘాలయ రాష్ట్రాల సీఎంలకు  చంద్రబాబు లేఖలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి చేస్తున్న చేపలను భద్రపరిచేందుకు తమ రాష్ట్రంలో ఫార్మాలిన్‌ వినియోగించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసోం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా రైతులు మొదలుకొని వ్యాపారులు, సరఫరాదారులతోపాటు ఆయా రాష్ట్రాల సరిహద్దులకు సరకు చేరేంతవరకూ తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఎక్కడా ఆ అవశేషాలు బయటపడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోకి సరుకు చేరాక అన్‌లోడింగ్‌ చేసుకునే ముందు మరోమారు తనిఖీలు చేయించాలని కోరారు. నాణ్యత పరీక్షల కోసం సాంకేతిక బృందాలను నియమించాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం అసోం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సర్బానంద సోనోవాల్‌, రియో స్వోర్న్‌, కొన్రాడ్‌ సంగ్మాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ  మత్స్యసంపదపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపేందుకు అవసరమైన మద్దతు తమకు అందివ్వాలని పేర్కొన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న చేపల నాణ్యత విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను లేఖల్లో ప్రస్తావించారు. 
* ఫార్మాలిన్‌ అవశేషాలను పరిశీలించేందుకు మత్స్య, ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేశాం. చేపలను ప్యాకింగ్‌ చేస్తున్న షెడ్లు, పంపిణీ కేంద్రాలు, రిటైల్‌ అవుట్‌లెట్లు, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌లలో తనిఖీలు చేపడుతున్నాం. ఫార్మాలిన్‌ను గుర్తించే పరీక్ష కోసం కొచ్చిన్‌లోని ఐకార్‌ సంస్థ తయారుచేసిన కిట్లను వినియోగిస్తున్నాం. మా తనిఖీల్లో ఎక్కడా ఫార్మాలిన్‌, అమ్మోనియా వినియోగిస్తున్నట్లు తేలలేదు. 
* ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న సరకుకు చేపల నాణ్యత పరీక్ష ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాం. 
* మా రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్‌ సాంకేతిక అధికారులు ఈనెల 13 నుంచి 16 వరకూ అసోంలో పర్యటించారు. అక్కడి అధికారులు, ప్రజలు, మీడియా సమక్షంలో స్థానికంగా ఉండే ఓ చేపలమార్కెట్‌లో మొత్తం తొమ్మిది నమూనాలను సేకరించి పరీక్షిస్తే.. వాటిలో ఎక్కడా ఫార్మాలిన్‌ అవశేషాలు కనిపించలేదు. 
* ఆంధ్రప్రదేశ్‌ మత్స్య శాఖ కమిషనర్‌, అధికారుల బృందం అసోం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ వ్యవహారంతో సంబంధమున్న విభాగాల అధికారులను కలిసి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. నాణ్యత విషయంలో ప్రభుత్వానిది పూచీ అని హామీనిచ్చారు. 
* చాలా కాలంగా మన రాష్ట్రాల మధ్య మత్స్య వ్యాపారం స్నేహపూర్వకంగా ఉంది. ఫార్మాలిన్‌ వినియోగంపై దుష్ప్రచారం మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. మత్స్య ఎగుమతుల్లో ఏపీ రాష్ట్రానికున్న ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, మార్కెట్‌ ధరలను క్షీణింపజేసే కుట్రలో భాగంగానే ఈ తరహా దుష్ప్రచారాలకు కొందరు తెరలేపారు.

Link to comment
Share on other sites

అసోం, మణిపూర్‌లలో మన చేపలపై నిషేధం ఎత్తివేత
29-07-2018 03:12:34
 
  •  ఏపీ సీఎం లేఖతో సానుకూల వాతావరణం
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిగుమతి అవుతున్న చేపలపై అసోం, మణిపూర్‌ రాష్ర్టాలు నిషేధాన్ని ఎత్తివేశాయి. క్యాన్సర్‌ కారకమైన ‘ఫార్మాలిన్‌’ పూత ఉందన్న సాకుతో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఏపీ చేపలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖ తర్వాత అసోం నిషేధాన్ని తొలగించింది. స్థానికంగా డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో మణిపూర్‌ గత నెలాఖరులోనే నిషేధం ఎత్తేసింది. మేఘాలయ ఒకసారి నిషేధం ఎత్తేసి, మళ్లీ విధించింది. మరోవైపు ఏపీ మత్స్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో నిపుణుల బృందం నాలుగు రోజులు పాటు ఈశాన్య రాష్ర్టాల్లో పర్యటించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌ రాష్ట్రాల ఫిషరీస్‌, హెల్త్‌, వెటర్నరీ, ఫుడ్‌ సేఫ్టీ ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న చేపలపై ఫార్మాలిన్‌ పూత లేదని స్పష్టం చేసింది.
 
35 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాలకు చేపల ఎగుమతులు చేస్తున్నందున తమ సాగుదారులు, వ్యాపారులు రసాయనాలు వాడే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఇంకా అనుమానాలుంటే తమ రాష్ర్టానికి నిపుణులను పంపి పరిశీలించుకోవచ్చని సూచించింది. మేఘాలయ అధికారులకు కూడా పూర్తి భరోసాతో నచ్చజెప్పగా, నిషేధం తొలగింపునకు హామీ లభించినట్లు మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌ నాయక్‌ శనివారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఫోన్‌లో చెప్పారు. నాగాలాండ్‌ అధికారులు మాత్రం చేపల ప్యాకింగ్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేయగా, గౌహతి మార్కెట్‌కు దిగుమతైన చేపల లోడులో ఏ తేడా లేదని ఆ రాష్ట్ర అధికారులు గుర్తించిన పత్రాలను నాగాలాండ్‌ వైద్యమంత్రికి అందజేసినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...