Jump to content

A.P aqua industry


Recommended Posts

ఏపీలో మత్స్య వర్సిటీ
08-12-2017 03:01:07
 
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
  • చైనా నుంచి సాంకేతిక సహకారం
  • మంత్రి ఆదినారాయణరెడ్డి
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీలైనంత త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్‌ గ్రూప్‌తో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలో దీని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చైనా అకాడమీకి చెందిన జియాన్‌ విశ్వవిద్యాలయ సహకారం ఎలా ఉండాలి, ఆనంద్‌ గ్రూపు ఏమేమి చేయాలి, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలన్న విషయాలపై విజయవాడలో గురువారం ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
 
ఈ చర్చల్లో చైనా సహకారంపై సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని మంత్రి చెప్పారు. నిర్ధిష్ట ప్రతిపాదనలతో కార్యాచరణ పత్రాన్ని రూపొందించి తీసుకురావాలని చైనా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఇందుకు జియాన్‌ వర్సిటీ అధికారులు అంగీకరించారు. ఈ ప్రతిపాదనలు వచ్చాక మంత్రిమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వర్సిటీ ఏర్పాటులో ఆనంద్‌ గ్రూపు 51 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం భాగస్వామ్యం కలిగి ఉంటాయన్నారు. మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటుతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుందని, కాలుష్య రహిత వాతావరణంలో అధికోత్పత్తి సాధిస్తామని చెప్పారు. ఉన్న వనరులను వినియోగించుకుని, అత్యధిక రకాల చేపలను సాగు చేయగలమని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 213
  • Created
  • Last Reply
  • 4 weeks later...
మత్స్యయంత్రం! 
అనుకూలమైన ప్రదేశాల గుర్తింపు 
ఆక్వాలో   యాంత్రీకరణకు రాయితీలు 
జిల్లాలో ఐదు  జోన్ల ఏర్పాటు 
త్వరలో అమలుకు రంగం సిద్ధం 
కైకలూరు, న్యూస్‌టుడే 
kri-STY1A.jpg

డాలర్ల కొద్దీ మారకం రాబట్టే పంటల్లో అగ్రస్థానం ఆక్వారంగానిదే. రెండంకెల వృద్ధిలోనూ దీనిదే ప్రాధాన్యం. అందుకే ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు వివిధ రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రత్యేక విధానం ద్వారా రూ.వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 1.45 లక్షల  ఎకరాలకు పైగా ఆక్వాసాగు జరుగుతోంది. రొయ్యలు సుమారు 80 వేల ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. వీటి సాగులో రైతులు రాత్రింబవళ్లు కష్టపడి దిగుబడులు సాధిస్తున్నారు. అన్నీ బాగుండి కాలం కలిసొస్తే... రొయ్యతో పాటు రైతు కూడా మీసం మెలేసే సాగు ఇది. రూపాయి పెట్టుబడికి రూ. మూడు లాభంతో లక్ష్మీదేవి వరిస్తుంది. వాతావరణం ప్రతికూలించినా.. రొయ్య పిల్లల్లో నాణ్యత లోపించినా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. అందుకే ఇలాంటి ఒడుదొడుకుల నుంచి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం మత్స్యరంగంలో యాంత్రీకరణకు 50 శాతం రాయితీలను ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆక్వా జోన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

ఆక్వా సాగు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విషయాలను అధిగమించడానికి సాగు ప్రాంతాల్లో మండళ్ల (జోన్లు) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఆక్వా జోన్ల ఏర్పాటుకు 2015 మే 25నే జీవో 13 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవోలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా జోన్ల ఏర్పాటు నిమిత్తం జిల్లా కమిటీలను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం 2017 అక్టోబరు 13న మండల కమిటీలను నియమించారు. ఈ కమిటీలో తహసీల్దార్‌ ఛైర్మన్‌గా, మత్స్యాభివృద్ధి అధికారి కన్వీనరుగా, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఇదీ ఉద్దేశం 
సారవంతమైన వ్యవసాయ భూములు ఆక్వా సాగుకు వినియోగించకుండా చూడటం కోసమే జోన్లను ఏర్పాటు చేయదలిచారు. లోతట్టు ప్రాంతాలు, సరిగ్గా ఫలవంతం కాని భూములని మాత్రమే ఆక్వా సాగుకి వినియోగించాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ కమిటీ సభ్యులు గ్రామాల్లో సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు సేకరించాల్సి ఉంది. మండల, జిల్లా కమిటీలు సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. త్వరలో ప్రభుత్వం ఆక్వా జోన్లపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

సాగు క్రమబద్ధీకరణకే.. 
ప్రస్తుతం చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. దీనికి అనుమతులు ఇవ్వడానికి ఉన్న నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతోంది. జోన్లను ప్రకటించిన తరవాత ఆ ప్రాంతాల్లో మాత్రమే చేపల, రొయ్యల చెరువుల తవ్వకానికి అనుమతులు ఇస్తారు. ఆ ప్రాంతంలో సాగుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తారు. రహదారులను అభివృద్ధి చేస్తారు. విద్యుత్తు సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్‌ సౌకర్యాలు, మార్కెట్‌ ధరలు తెలియజేస్తారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఈ ప్రాంతాల్లోని రైతులకు మాత్రమే అందిస్తారు.

అన్ని జిల్లాల ప్రతిపాదనలు తీసుకుంటున్నాం 
రాష్ట్రంలో ఆక్వా సాగయ్యే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటి అన్నింటికి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పరిష్కరించుకుని ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో దాదాపు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతాం. ప్రభుత్వం అమోదం తరువాత జోన్లుగా ప్రకటిస్తాం. ఈలోగా రాష్ట్రాన్ని 181 క్లస్టర్లుగా విభజించి ఆక్వా రైతులకు రాయితీలు, సాంకేతిక సాయాన్ని అందిస్తున్నాం. రానున్న కాలంలో మరింత దిగుబడులు సాధిస్తాం. ఆక్వాను అన్ని రంగాల కంటే ముందు ఉంచుతాం.

 - రామ్‌శంకర్‌నాయక్‌, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌

మత్స్యశాఖ అందించే ప్రయోజనాలు 
ఏరియేటర్లు 
మంచినీటి రొయ్యల పెంపకం చేపట్టే యజమానులకు ఏరియేటర్లు (ప్రాణవాయువు ఉత్పత్తి చేసే యంత్రాలు) 50 శాతం రాయితీపై ఇస్తారు. ఒక్కో యంత్రం ధర రూ.40 వేలు కాగా అందులో రూ.20 వేలు రాయితీ ఉంటుంది. రెండు హెక్టార్లలోపు ఉన్న రైతులకు నాలుగు చొప్పున మంజూరు చేస్తారు.

సౌర ఏరియేటర్లు 
మంచినీటి రొయ్యల పెంపకానికి అవసరమైన సోలార్‌ ఏరియేటర్లను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. సోలార్‌ ఏరియేటర్‌ ధర రూ.2.50 లక్షలు కాగా అందులో రూ.1.25 లక్షలు రాయితీ లభిస్తుంది. రెండు హెచ్‌పీ ఏరియేటర్లు నాలుగు, 4 హెచ్‌పీతో రెండింటిని ఇస్తారు.  23 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బులతో పాటు 12 అడుగుల విద్యుత్తు స్తంభం ఏర్పాటుకు అయ్యే రూ.18 వేలలో సగం రాయితీ లభిస్తుంది.

నిఘా కోసం 
చెరువులపై కాపలా లేకుంటే తెల్లవారే సరికి చెరువులోని రొయ్యలు, చేపలు, మేతలు మాయం అయిపోతుంటాయి. అదీకాక కొందరు విరోధులు విషప్రయోగం చేసే సంఘటనలు ఉంటాయి. దీంతో చెరువులపై పహరాకు నిఘా నేత్రాల (సీసీ కెమెరా)ను, టీవీతో కలిపి సరఫరా చేయనున్నారు. వీటికయ్యే రూ.70 వేల వ్యయంలో రూ.35 వేలు రాయితీ ఇస్తారు.

పంపుసెట్లు 
రొయ్యల చెరువుల్లో నీటిని తోడుకునేందుకు రైతులు ఎక్కువ ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఇంధనం ఖర్చు లేకపోతే విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆక్వా సాగులో పెట్టుబడులు పెరగడానికి ఇదో కారణం. దీనికోసం రైతులకు ప్రభుత్వం పంపుసెట్లను రాయితీపై ఇస్తుంది. యూనిట్‌ ఖరీదు రూ. 5 లక్షలు కాగా రూ.2.50 లక్షలు రాయితీ ఇస్తుంది.

ఆటోఫీడ్‌ డిస్పెన్సరీ 
రొయ్యలు పెరగాలంటే మేత నాణ్యత ముఖ్యం. ఆక్వా సాగుదార్లు మేతలకు మాత్రమే అధిక పెట్టుబడి పెడతారు. మేతలు నాణ్యమైనవి కాకపోతే దిగుబడులు రావు. రొయ్యలు సాగు చేసే వారికి మేతల నాణ్యతలను తెలుసుకునేందుకు సోలార్‌ ఆటోఫీడ్‌ డిస్పెన్సరీ పరికరాన్ని అందించనుంది. దీని ఖరీదు రూ.60 వేలు కాగా రూ.30 వేలు రాయితీ ఇస్తారు.

నీటి నాణ్యత పరికరం 
నీటి పరీక్షల కోసం సాగుదార్లు దూర ప్రాంతాలకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికే నీటి నాణ్యత పరికరాలు అందిస్తే  ప్రభుత్వం ఒక రైతుకు రెండు యూనిట్ల చొప్పున రాయితీ అందిస్తుంది. దీనిధర రూ.80 వేలు, రాయితీ పోగా రూ.40 వేలకు లభిస్తుంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
సూర్యలంకలో ‘క్రాబ్‌ కల్చర్‌’
21-01-2018 08:55:51
 
636521217649477384.jpg
  • మత్స్యశాఖ నుంచి స్థలసేకరణ
  • ఎంపెడా ఆధ్వర్యంలో పండుగప్ప, క్రాబ్‌ (పీతల) హేచరీ
  • త్వరలో శంకుస్థాపన కార్యక్రమం
 
బాపట్ల: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రను ఆక్వాహబ్‌గా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారు. రొయ్యలతోపాటు ఎంతో డిమాండ్‌ ఉన్న పండుగప్పచేప పిల్లలు, క్రాబ్‌ (పీతలు) కల్చర్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పండుగప్ప, పీత పిల్లలు తెచ్చి ఇక్కడ పెంచి వాటిని చెరువులో పెంచటానికి అనువైన పరిమాణం వచ్చిన తర్వాత రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఎంపెడా ఆధ్వర్యంలో చేపపిల్లలు, పీతల హేచరీ పెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సూర్యలంక తీరంలో మత్స్యశాఖ పరిధిలో వున్న 13.35 ఎకరాల భూమిని తీసుకునున్నారు. ఎంపెడా ప్రతినిధులు ఇప్పటికే దీనిని పరిశీలించారు. మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఈ హేచరీలో పీత పిల్లలను పెంచి రైతులకు అందజేసే అవకాశం ఉంది.
 
గత ఏడాది ప్రారంభించాలనుకున్న ఈ ప్రాజెక్టు కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ ఏడాది దీనిని ప్రారంభిస్తారు. ఇప్పటివరకు రైతులు మండ పీత, పండుగప్ప చేప పిల్లలను తమిళనాడు పుదుచ్చేరి నుంచి తెస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఇక్కడ ప్రారంభమైతే ఏటా 33కోట్ల మండపీత, 12కోట్ల పండుగప్ప చేపపిల్లలు ఈ కేంద్రంలో తయారవుతాయి. కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అధారిటీ సంస్థ దీనికి అనుమతినిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.40కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే జాతీయస్థాయిలో మత్స్యసంపద ఆదాయం, ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేవ్‌ మొదటిస్థానంలో ఉంది. సూర్యలంకలో చేపపిల్లలు, పీతల హేచరీ వస్తే ఈరంగం ఇంకా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు
Link to comment
Share on other sites

అపార సంపద.. అందుకుందాం పద.. 
kri-top1a.jpg
మత్స్య ఉత్పత్తుల్లో రాష్ట్రంలో జిల్లా ప్రతిభ చూపి  తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఏటా వృద్ధిరేటును పెంచుకుంటూ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో సముద్ర ఉత్పత్తుల పాత్ర కూడా ప్రత్యేకం. అందుకే చెరువులతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం సాధించలేక పోతోంది.

న్యూస్‌టుడే,గొడుగుపేట (మచిలీపట్నం), కైకలూరు: జిల్లా వ్యాప్తంగా 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాలతోపాటు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కడలినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మత్స్య ఉత్పత్తుల్లో జిల్లా ప్రథమస్థానంలో ఉంటున్నా సముద్ర ఉత్పత్తుల వాటా మాత్రం 30 శాతంలోపే ఉంటుంది. సముద్ర ఉత్పత్తులను కూడా పెంచేలా చర్యలు తీసుకుంటే వృద్ధిరేటు గణనీయంగా పెరగడంతోపాటు రాష్ట్ర ఆదాయం పెంపొంది అభివృద్ధి వేగవంతం అవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు ప్రోత్సాహకంగా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వాటిపై ప్రచారం నిర్వహించడంలో అధికారుల అలసత్వమో, మత్స్యకారుల అవగాహన లోపమో పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారు. విలువైన సంపద మాత్రం అందుబాటులో ఉంది.

విలువైన సంపద టూనా.. 
సముద్రంలో దొరికే విలువైన మత్స్య సంపదలో టూనా ఒకటి. ఆరునెలలపాటు సముద్రంలో ఈదుతూ ఇవి కోస్తా జిల్లాల్లోకి ప్రవేశిస్తాయి. మచిలీపట్నంతోపాటు నాగాయలంక, కృత్తివెన్ను సముద్రతీరంలో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పట్టుకొనే సామగ్రి, అనువైన పడవలు అందుబాటులో లేకపోవడంతో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నాం. వాటిని పట్టుకోవాలంటే సముద్రపులోతుల్లో వేట సాగించాల్సి  ఉంటుంది. అలా సాగించేందుకు అనువైన గాలాలు ఉండాలి. దొరికిన విలువైన సంపదను అంతే విలువతో విక్రయించుకోవాలంటే నిల్వచేసుకునేందుకు  ఐస్‌పెట్టెలు అవసరం. టూనాలను అధిక సంఖ్యలో పట్టుబడి చేసేందుకు గానూ మత్స్యశాఖ పరంగా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అక్కరకు రావడంలేదు.

సంపద పెంచేందుకే వేట నిషేధం 
సముద్రంలో ఉన్న మత్స్యసంపదను సంరక్షించడంతోపాటు పెంచేందుకు గానూ చేపల ఉత్పత్తి కాలంలో వేట నిషేధం అమలు చేస్తున్నారు. మూడు నెలల పాటు అమలు చేస్తున్నా నిషేధకాలంలో వేట సాగిస్తున్న సంఘటనలు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని వేలెత్తిచూపిస్తున్నాయి. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు భృతి అందించడమే కాక  వేట సాగుకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒక్క పడవ వేట సాగినా దాని ప్రభావం ఉత్పత్తులపై పడుతుంది. దీంతోపాటు చేపలు దొరికే ప్రాంతాలను ముందస్తుగా చెప్పే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఆ సేవలు కేవలం స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే అందుతున్నాయి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సేవలను విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఆ దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కేజ్‌కల్చర్‌పై అవగాహన ఏదీ? 
సముద్రంపై  ఆధారపడి జీవించే మత్స్యకారులను ప్రోత్సహించే దిశగా కేజ్‌కల్చర్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్పహిస్తోంది.  ఈ విధానంలో సాగు మాత్రం కావడం లేదు. నాగాయలంక ప్రాంతంలో ఒకరిద్దరు ఈ విధానంలో సాగు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ కూడా అంతగా సాగడం లేదు. ప్రభుత్వం కేజ్‌కల్చర్‌ను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు కల్పిస్తున్నా వాటిపై మత్స్యకారులకు అవగాహన ఉండటం లేదు. ముందుకు వచ్చేవారు కూడా రావడం లేదు. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఈ విధానంలో ఉంది. అవగాహన లేక అక్కరకు రాకుండా పోతుంది. దీంతోపాటు సముద్రపు నాచు పెంపకానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అదేంటో ఎవ్వరికీ తెలియని పరిస్థితి.

శిక్షణ ఏదీ? :  సముద్రంలో దొరికే విలువైన చేపలన్నీ వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. చిన్న చేపలు మాత్రం పరిసర ప్రాంతాల్లో మహిళలు విక్రయిస్తారు. ఈ చేపల నుంచి విలువైన ఉత్పత్తుల తయారు చేయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.

ఏయే రకాల చేపలు ఎక్కడ దొరుకుతాయో? 
* టూనా: జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువగా పడతాయి. 
* పండుగప్ప: మచిలీపట్నం, నాగాయలంక, బంటుమిల్లి, కృత్తివెన్ను, కోడూరు ప్రాంతాలు.. 
* చందువలు: నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం 
* టేకు చేపలు: బందరు, నాగాయలంక 
* సొర చేపలు: బందరు, నాగాయలంక 
* గ్రూపర్‌: నాగాయలంక, మచిలీపట్నం

ఎగుమతులు ఇలా.. : గ్రూపర్‌, పండుగప్ప, టూనా చేపలు సింగపూరు, థాయిలాండ్‌ దేశాలకు ఎగుమతులవుతాయి. టూనా కిలో రూ.200 పలికితే ఇతర దేశాల్లో రూ.900 వరకూ ధర పలుకుతోంది.‌్ర ఎండుచేపల తయారీ, తదితర అంశాలపై శిక్షణ అందించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో ఎక్కడా జరగడం లేదు.‌ 
* మచిలీపట్నంతోపాటు బంటుమిల్లి, కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు తదితర మండలాల్లో అధిక సంఖ్యలో మహిళలు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి వివిధ అంశాలపై శిక్షణ అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. 
 సముద్ర ఆధారిత ఉత్పత్తుల కోసం కానూరు, కొత్తపల్లెతుమ్మలపాలెం, సొర్లగొంది తదితర ప్రాంతాల్లో షోర్‌బేస్డ్‌ ఫెసిలిటీ సెంటర్లకు గానూ ఒక్కోదానికి రూ.కోటి చొప్పున మంజూరు చేశారు. ఇది జరిగి ఏడాదైనా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ఇలా అనేక సమస్యలు సముద్రపు ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. 
 

వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం 
సముద్ర ఉత్పత్తులను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సముద్రంలోని వేటచేసే మత్స్యకారులకు అత్యాధునిక వలలు, మరపడవలు అందజేస్తున్నాం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించే సెన్సార్లు అందిస్తున్నాం. వీటివల్ల సముద్రంలో ఏ ప్రాంతంలో మత్స్యసంపద ఎక్కువగా ఉందో  తెలిసే అవకాశం ఉంది. అవసరమైన మత్స్య సంపదను మాత్రమే వేటాడి ఒడ్డుకు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. నీటిలో మునిగిన జాలర్ల నుంచి కూడా సంకేతాలు వచ్చే పరికరాలను అందజేస్తున్నాం. వీటితోపాటు పంజర సాగులో (కేజ్‌ కల్చర్‌) అనేక రకాల సముద్ర ఉత్పత్తులు పండుగప్ప, పీతలు, రొయ్యలు వంటివి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. సముద్రనాచుకు మంచి గిరాకీ ఉంది. నాచు పెంపకానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.మహిళలకు సముద్ర ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నాం.  మార్కెట్‌ సౌకర్యాలు కల్పిస్తున్నాం.  రాయితీపై పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తుల పెంపునకు, వాటి వినియోగానికి అనేక చర్యలు చేపడుతోంది.

- రామ్‌శంకర్‌ నాయక్‌, మత్స్యశాఖ కమిషనర్‌

 

ఉత్పత్తులు పెంచేలా చర్యలు 
సముద్ర ఉత్పత్తులు పెంచడానికి శాఖాపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీనిలోభాగంగానే వేట నిషేధకాలంలో వేట సాగకుండాచర్యలు తీసుకుంటున్నాం. అర అంగుళం వలలకు మించి వాడకుండా పర్యవేక్షిస్తున్నాం. సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు ప్రత్యేక రాయితీలు కల్పించి ఆదుకుంటున్నాం. టూనాలు సముద్రపు లోతుల్లో మాత్రమే దొరుకుతాయి. అందుకే దానికి తగ్గట్టు బోట్లు అందించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. రూ.80 లక్షల విలువైన బోటు 40 శాతం రాయితీతో ప్రభుత్వం అందిస్తోంది. అలాంటిది జిల్లాలో ఒక బోటు మాత్రమే మంజూరయ్యింది. చేపల లభ్యత వివరాలు తదితర అంశాలపై కూడా మత్స్యకారులకు పూర్తి సమాచారం అందిస్తున్నాం. 
- రాఘవరెడ్డి, మత్స్యశాఖ ఏడీ

Link to comment
Share on other sites

2016-17 ఆక్వా ఎగుమతుల్లో ఏపీకి మొదటిస్థానం
28-01-2018 11:17:52
 
636527350710009816.jpg
కాకినాడ: 2016-17 ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిస్థానం లభించింది. కాకినాడకు చెందిన దేవీ ఫిషరీస్ కంపెనీ రూ.1100 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులను చేసి దేశంలోనే తొలిస్థానాన్ని సాధించింది. కాగా... గోవా ఇంటర్నేషనల్ సీపుడ్ సమ్మిట్‌లో దేవీ ఫిషరీస్ కంపెనీ ప్రతినిధులకు కేంద్రమంత్రి సురేష్ ప్రభు అవార్డు అందజేశారు
Link to comment
Share on other sites

  • 1 month later...
నిరీక్షణకు తెర! 
క్వారంటైన్‌ ల్యాబ్‌కు ముఖ్యమంత్రి నేడు శంకుస్థాపన 
సచివాలయం నుంచే కార్యక్రమం 
నక్కపల్లి, న్యూస్‌టుడే
నవ్యాంధ్రలో ఉన్న తీరప్రాంత వనరులను సద్వినియోగం చేసుకుని ముందుకుసాగడానికి వీలుగా క్వారంటైన్‌ కేంద్రం సహకారంతో ల్యాబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు పాయకరావుపేట మండలం బంగారమ్మపేట తీరప్రాంతం అనుకూలంగా ఉంటుందని, రెండు మూడు పర్యాయాల పరిశీలన, నివేదికల తర్వాత అంగీకారం ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇటు శ్రీకాకుళం నుంచి అటు కృష్ణా వరకు అందరికి అందుబాటులో ఉంటుందని అధికారులు గుర్తించారు.
vsp-sty1a.jpg

డాదిన్నరగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో అమరావతిలోని సచివాలయం నుంచే ఎమ్మెల్యే వంగలపూడి అనిత, జిల్లా  మంత్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా వనామి రకం రొయ్యలను సాగు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తల్లి రొయ్యను హవాయి నుంచి రప్పించి చెన్నైలో ఉన్న ల్యాబ్‌లో పరీక్షల అనంతరం అక్కడ్నుంచి మన రాష్ట్రానికి హేచరీ యజమానులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడి పిల్లలను ఉత్పత్తి చేసి రొయ్యలు సాగు చేసే రైతులకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రవాణా, పన్నులు తదితర రూపాల్లో అధికంగా వ్యయం చేయాల్సి వస్తుంది. సగటున ఒక జత రొయ్యలను తెచ్చుకోడానికి రూ. 15వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ‘ఆక్వా క్వారంటైన్‌ ల్యాబ్‌, బ్రూడర్‌ మల్టిప్లికేషన్‌ కేంద్రం’ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా పాయకరావుపేట నియోజకవర్గంలోని బంగారమ్మపేటను ఎమ్మెల్యే అనిత కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఏర్పాటవుతున్న కేంద్రం అందుబాటులోకి వస్తే తెచ్చుకోడానికి చేస్తున్న వ్యయం సగానికి తగ్గుతుందని అధికారులే పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇక్కడి కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు నాణ్యత, ఇతరాత్ర సహకారాలు అందనున్న నేపథ్యంలో సాగుదారులకు మేలు జరుగుతుంది. ఫలితంగా ఇప్పుడున్న సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.

రూ. 40 కోట్లు కేటాయింపు 
క్వారంటైన్‌ ల్యాబ్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40కోట్ల వరకు కేటాయించింది. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? అక్కడి వాతావరణ పరిస్థితులు? సముద్రంనీరు లభ్యత అవకాశం? ఇలా అనేక అంశాలను అప్పటి ప్రిన్సిపల్‌ కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌, ప్రస్తుత కమిషనర్‌ రాంశంకర్‌ నాయక్‌ పరిశీలించిన తర్వాత 30 ఎకరాల వరకు స్థలం అవసరమని గుర్తించారు. ఇందుకోసం ఇక్కడి మత్స్యకారుల సాగులో ఉన్న ప్రభుత్వ భూమి సుమారు 20 ఎకరాల సహా అవసరమైన మొత్తం స్థలాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్‌ యువరాజ్‌ కేటాయించారు. ఇందుకుగాను సాగుదారులకు పరిహారం చెల్లించారు. మరోవైపు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మున్ముందు మరిన్ని పరిశ్రమలు 
నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన తొలి పరిశ్రమ క్వారంటైన్‌ ల్యాబ్‌. అనివార్యకారణాలతో రాజధానినుంచే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా వస్తారు. ఈ నిర్మాణం తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా సాగుదారులు బలోపేమవుతారు. సాగు భారీగా పెరుగుతుంది. ఇదే కాకుండా ముందుముందు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి.

- వంగలపూడి అనిత, ఎమ్మెల్యే, పాయకరావుపేట.
Link to comment
Share on other sites

ఆక్వా హబ్‌గా ఎపి తీర ప్రాంతం
13-03-2018 01:38:20
 
636565018986567964.jpg
  • విశాఖలో వన్నామి రొయ్యల బ్రూడ్‌ స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌
  •  సీఎం చంద్రబాబునాయుడు
అమరావతి (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర సముద్రతీర ప్రాంతం ఆక్వా హబ్‌గా రూపొందుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రెండంకెల వృద్ధి రేటుతో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. విశాఖపట్నం జిల్లా నక్కవానిపాలెం, బంగారమ్మపేటలో వన్నామి రొయ్యల బ్రూడ్‌ స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌, ఆక్వాటిక్‌ క్వారంటైస్‌ ఫెసిలిటీ కేంద్రాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి సచివాలయం నుంచి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 70 శాతం రాష్ట్రంలోనే జరగుతోందన్నారు. రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. 2016-17లో ఇండియా నుంచి రూ.37,000 కోట్ల మత్స్య ఉత్పత్తులు ఎగుమతైతే, అందులో రాష్ట్ర వాటా రూ.17,000 కోట్ల వరకు ఉందన్నారు. రాష్ట్రంలో 2016-17లో 27.66 లక్షల టన్నుల మత్య్స ఉత్పత్తి జరగ్గా, 2019-20 నాటికి దీన్ని 42 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
 
రూ.80,000 కోట్లకు పెంచేలా చర్యలు
విలువ జోడింపు ద్వారా రాష్ట్ర మత్స్య పరిశ్రమ టర్నోవర్‌ను రూ 80 వేల కోట్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. బ్రూడ్‌ స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌, ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ ద్వారా రైతులకు వ్యాధుల్లేని, నాణ్యత కలిగిన రొయ్య పిల్లను పంపిణీ చేయడానికి వీలుకలుగుతుందన్నారు. దీని వల్ల మత్స్యకార రైతుల ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తరణకు అవకాశం కలుగుతుందన్నారు. రొయ్యలు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల(హేచరీస్‌) నిర్వాహకులు ఆదాయ పెంపుదలతోనే సరిపెట్టకుండా కాలుష్యనివారణకు గట్టిగా కృషి చేయాలన్నారు. ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్‌ సమయంలో కాలుష్య నివారణకు పెద్దపీట వేయాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతలేని ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. బ్రూడ్‌స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌ను 30 ఎకరాల్లో రూ 48 కోట్లతో, ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీని రూ.20.38 కోట్లతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ రెండింటి నిర్మాణం తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
50 ఏళ్లు దాటిన మత్య్సకారులకు పెన్షన్‌..
మత్య్సకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిఎం చంద్రబాబు తెలిపారు. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్లు అందజేయనున్నామన్నారు. లోతట్టు సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు యంత్రసాయంతో నడిచే బోట్లు కూడా ఇస్తామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేసే ఈ రెండు కేంద్రాల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి రొయ్య పిల్లలు దిగుమతి చేసుకునే అవసరం తప్పుతుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యకారశాఖ మంత్రి సిహెచ్‌ ఆదినారాయణ తెలిపారు. తన నియోజకవర్గంలో ఆక్వా పరిశ్రమకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పాయకరావుపేట ఎమ్మెల్ల్యే అనిత.. సిఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఓడరేవుకు ఇక మహర్దశ
ఐదెకరాల అటవీ భూమి బదలాయింపునకు ఆమోదం
సవివర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం అనుమతి
ఈనాడు, గుంటూరు
gnt-gen1a.jpg

నిజాంపట్నం ఓడరేవు జెట్టీ సామర్థ్యం పెంచాలన్న దశాబ్దాల మత్స్యకారుల డిమాండ్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం ఉన్న దాని సామర్థ్యాన్ని విస్తరించడానికి కేంద్రప్రభుత్వం  అనుమతిచ్చింది. ఇందుకు అవసరమైన అయిదెకరాలను అటవీ నుంచి మత్స్యశాఖకు బదిలీ చేసింది. సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)కు ఆమోదం తెలపడంతో మార్గం సుగమమైంది. పర్యావరణ శాఖ ఆధ్వర్యాన ప్రజాభిప్రాయ సేకరణకు సైతం మత్స్యశాఖ సొమ్ము చెల్లించడంతో పనులు వేగవంతం కానున్నాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతవాసుల కలగా మిగిలిపోయిన జెట్టీ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఓడ రేవులో మౌలిక వసతులు పెరిగి ఇక్కడి నుంచి నేరుగా ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా మత్స్యకారులతోపాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.

రూ.340 కోట్లతో అభివృద్ధి పనులు
ఓడరేవు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అటవీ భూమి బదలాయింపు సమస్య కొలిక్కి రావడంతో జెట్టీ విస్తరణ చిక్కుముడి వీడింది. ప్రస్తుతం 60 ఉన్న దానిని 300 పడవల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు అవసరమైన వసతుల అభివృద్ధితోపాటు ఓడరేవులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. నవ్యాంధ్ర రాజధానికి సమీపాన ఉన్న దీని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సవివర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం తయారుచేసి కేంద్రానికి పంపింది. ఇది అభివృద్ధి చెందితే రాజధాని నగరానికి ఆక్వా ఉత్పత్తుల సరఫరాతోపాటు జల రవాణా మార్గాన్ని కూడా అనుసంధానం చేయడంతో ట్రాఫిక్‌ మెరుగుపడనుంది. ఇప్పటివరకు ఇక్కడ లభించిన మత్స్యసంపదను చెన్నై, కోల్‌కత, ముంబై నగరాలకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. జల రవాణా మార్గం అందుబాటులోకి వస్తే గన్నవరం నుంచే ఎగుమతికి అవకాశాలు మెరుగుపడుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన ఓడరేవును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ అమలు జరుగుతోంది.

పరిమిత జెట్టీతో అష్టకష్టాలు
ఓడరేవులో 1982-83లో 60 బోట్ల సామర్థ్యంతో నిర్మించిన జెట్టీ ఉంది. వాటి సంఖ్య 300 అయినా జెట్టీ సామర్థ్యం పెరగకపోవడంతో మత్స్యకారులు అష్టకష్టాలు పడుతున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లి రావడం కంటే తెచ్చిన సరుకును ఓడరేవుకు చేర్చడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. జెట్టీ సామర్థ్యం సరిపోకపోవడంతో రెండు నుంచి మూడు వరుసలుగా పడవలు నిలుపుతున్నారు. అక్కడి నుంచి జెట్టీ పైకి టన్నుల సరుకు తెచ్చుకోవడానికి రెండు బోట్ల మీదుగా తీసుకురావాల్సివస్తోంది. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ గత్యంతరం లేక కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తుపానుల సమయంలో నిజాంపట్నం కేంద్రంగా వేట సాగించే 200 పడవలతోపాటు కాకినాడ, వాడరేవు తదితర ప్రాంతాల నుంచి మరో వంద  వరకు ఇక్కడకు వస్తుంటాయి. దాంతో వాటన్నింటినీ ఓడరేవులో పెట్టుకోవడానికి వీలుకాక నిజాంపట్నం వరకు మురుగు కాలువల వెంబడి నిలుపుకోవాల్సిన దుస్థితి. ఈ విషయమై జెట్టీ విస్తరణతోపాటు గ్రామంలోనూ కొన్ని పడవలు నిలుపుకోవడానికి ఇంకో చిన్నది నిర్మించాలని మత్స్యకారులు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. వేట లేని సమయం, పడవలు మరమ్మతుకు గురైనప్పుడు గ్రామంలో నిర్మించే జెట్టీలో నిలుపుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. జెట్టీ విస్తరణతో ఈ సమస్యలకు పరిష్కారం లభించనుండగా త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసి పనులు మొదలు పెడతామని మత్స్యశాఖ సంయుక్త సంచాలకురాలు శివసామ్రాజ్యం తెలిపారు.

జెట్టీ సరిపోక ఇబ్బందులు
ఓడరేవులో 60 పడవల సామర్థ్యంతో ఉన్న జెట్టీ సరిపోక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఒకదాని వెనుక మరొకటి నిలిపే క్రమంలో ఒకదానికొకటి ఢీకొని వారానికి సగటున రెండు నుంచి మూడు దెబ్బతింటుండగా ఇది యజమానులకు అదనపు భారంగా మారింది. జెట్టీ విస్తరణకు భూమి సేకరించినా పనులు ఇప్పటికీ మొదలుకాలేదు. వేట నుంచి వచ్చిన తర్వాత టన్నుల కొద్దీ సరుకు దింపుకోవడం, వేటకు వెళ్లే సమయంలో ఐస్‌, ఇతర సామగ్రి పడవ ఎక్కించడం సమస్యగా మారింది. జెట్టీ విస్తరిస్తే మత్స్యకారులతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి వేగవంతమవుతుంది. దశాబ్దాల కల నెరవేరినట్లవుతుంది.

- కన్నా మీరయ్య, అధ్యక్షుడు, పడవ యజమానుల సం
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
రొయ్య రైతుకు కష్టం 
రూ.1,730 కోట్ల నష్టం 
ఎగుమతులకు ఎదురుగాలి 
ధరలు తగ్గిస్తున్న దళారులు 
ఎంపెడా పాత్రే కీలకం 
ఈనాడు - అమరావతి 
21ap-main2a.jpg

రొయ్యల రైతుకు కష్టాల సాగు తప్పడం లేదు. విదేశాలకు ఎగుమతుల్లో ఆంక్షలు, దళారుల ప్రమేయం వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ఎంపెడా ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నాలుగు నెలలుగా ధరల పతనంతో రాష్ట్రంలో రొయ్యల రైతులు రూ.1,730కోట్లు నష్టపోతున్నారు. గతేడాదితో పోలిస్తే కిలోకు ధర సగటున రూ.100 తగ్గింది. తాజాగా పక్షం వ్యవధిలోనే రూ.30 నుంచి రూ.40 తేడా  కన్పిస్తోంది. నిషేధిత యాంటిబయోటిక్స్‌ వాడకం, యూరోపియన్‌ దేశాల ఆంక్షలు, దళారుల మాటలు నమ్మి తొందరపడి పంటను తీసి విక్రయించడం తదితర కారణాలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని తొమ్మిది జిల్లాల్లో 1,44,180 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇందులో వనామీ రకం రొయ్య అధికం. గతేడాది 9.75లక్షల టన్నుల ఉత్పత్తి ద్వారా రూ.26,934 కోట్ల మూల విలువ జోడింపు(జీవీఏ) అందగా ఈ ఏడాది రూ.33,438 కోట్లు సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో రాష్ట్రవాటా 45శాతంపైనే ఉంది. ఏటా రూ.17వేల కోట్లకు పైగా విదేశీమారకద్రవ్యం లభిస్తోంది.

దళారుల ప్రభావం.. 
ఎగుమతి వ్యాపారులు, రైతుల మధ్య సంబంధాలు లేకపోవడం దళారులకు వరమైంది. గతేడాది ఇదే సమయంలో 50 కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.330 ఉంది. ప్రస్తుతం రూ.210 మాత్రమే లభిస్తోంది. 30 కౌంట్‌ రకానికి రూ.160 వరకు తేడా వచ్చింది. 100 కౌంట్‌కు అప్పట్లో రూ.230 ఉంటే ఇప్పుడు రూ.160కంటే తక్కువ ఇస్తున్నారు. మొత్తంగా ఉత్పత్తి ఖర్చులోనే కిలోకు రూ.40 తగ్గింది. మార్కెట్లో ఏ కౌంట్‌ సరకు ఎక్కువగా వస్తుందో అంచనావేసి తదనుగుణంగా ధరల్లో కోత వేస్తున్నారు.

ధరల పతనానికి కారణాలేమిటంటే.. 
దేశంలో అయిదేళ్ల కిందట లక్ష టన్నుల రొయ్యల ఉత్పత్తి ఉంటే గతేడాది మార్చి నాటికి ఆరులక్షల టన్నులకు పెరిగింది. ఇందులో అధిక శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికాకు భారత్‌ నుంచి 33శాతం, ఇండోనేసియా నుంచి 20శాతం ఎగుమతులు పెరిగాయి. ఈక్వెడార్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, వియత్నాం నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
* చైనాలో యాంటీడంపింగ్‌ పన్ను విధిస్తున్నారు. దీంతో వియత్నాంనుంచి అక్రమంగా అక్కడికి తరలిస్తున్నారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. 
* నిషేధిత యాంటిబయోటిక్స్‌ భయం ఎగుమతిదారులను వెన్నాడుతోంది. 19 మందిపై ఆంక్షలు విధించడంతో యూరోపియన్‌ యూనియన్‌, అమెరికాకు సరుకు పంపాలంటేనే భయపడుతున్నారు. 
* అమెరికాలో చలికాలం ఎక్కువ రోజులు కొనసాగడం ఎగుమతులపై ప్రభావం చూపింది. అక్కడా యాంటీ డంపింగ్‌ డ్యూటీని పెంచారు. ఈలోగా భారత్‌లో ధరలు దిగజారడంతో వ్యాపారులు తగ్గించి అడుగుతున్నారు.

ఎంపెడా ఏం చేయాలి? 
* అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు దిశానిర్దేశం చేయాలి. 
* నిషేధిత యాంటిబయోటిక్స్‌ వాడకం తగ్గించే దిశగా కృషిచేయాలి. 
* ఎగుమతులపై యూరోపియన్‌ యూనియన్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపి చర్చించాలి. 
* అమెరికా, ఈయూ మాదిరి ఎల్‌సీఎంఎస్‌(లిక్విడ్‌ క్రొమెటోగ్రఫీ మాస్‌ స్ప్రెక్ట్రోమెట్రీ) ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలి. 
* అంతర్జాతీయ విపణిలో రొయ్యల ధరలను ఎప్పటికప్పుడు ప్రకటించాలి. 
* ఎగుమతిదారుల సంఖ్య పెంచి పోటీ వాతావరణం ఏర్పాటుచేసేలా చర్యలు అవసరం.


రాష్ట్రం చేయాల్సిందేంటంటే..

* యూనిట్‌ విద్యుత్తును ఒడిశాలో రూ.1.30, గుజరాత్‌లో రూ.ఒకటి చొప్పున సరఫరా చేస్తున్నారు. మన రాష్ట్రంలో రుసుములతో రూ.4.05 ఉంది. దీన్ని తగ్గిస్తే కిలోకు రూ.20 ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. 
* దళారులను నియంత్రించాలి. ఎగుమతి వ్యాపారులే రైతుల నుంచి రొయ్యలు కొనేలా చర్యలు తీసుకోవాలి. 
* విదేశీ ఎగుమతులే కాకుండా స్థానిక వినియోగం పెంపుపైనా దృష్టి పెట్టాలి. శీతల గిడ్డంగులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలి. 
* రైతులు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది. విత్తనం, దాణా రూపంలోనూ కిలోకు రూ.40 వరకు తగ్గించుకునే వీలుంది. రసాయన రహిత ఉత్పత్తి, ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టాలి.



రొయ్యల సాగు విస్తీర్ణం: 1,44,180 ఎకరాలు 
ఎకరాకు అయ్యే ఖర్చు: రూ.5 లక్షలు 
దిగుబడి: 30 క్వింటాళ్లు 
మొత్తంగా నష్టం:   రూ.1.20 లక్షలు (కిలోకు రూ.40 చొప్పున) 
రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టపోతున్న మొత్తం: రూ.1,730 కోట్లు 
* ఇదే పరిస్థితి కొనసాగితే పంట విరామం తప్పదంటున్నారు.
Link to comment
Share on other sites

ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు వరాలు...
26-05-2018 16:20:58
 
విజయవాడ: రాష్ట్రంలోని ఆక్వా రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్‌పై మరింత సబ్సిడీ ఇస్తామన్నారు. ఏడాది పాటు యూనిట్‌ రూ.2కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అన్నారు.
 
పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు. ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్‌ వినియోగించడం సరికాదన్నారు. పర్యావరణరహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆక్వా సాగు సరికాదని, ఆక్వా రైతులు బాగుండాలని విద్యుత్‌ చార్జీలు తగ్గించామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...