Jump to content

Amaravati shilpa sampada


Recommended Posts

అమరావతి ‘సంపద’ అంతే!
 
635983584362599548.jpg
  • లండన్ మ్యూజియంలోనివి తేవడం కష్టమే!.. బ్రిటన్‌సర్కారు షరతులు
  • స్పందించని ఢిల్లీ, కోల్‌కతా మ్యూజియం క్యూరేటర్లు
  • తెలంగాణలోని స్టేట్‌ మ్యూజియం శిల్పాల పంపిణీలోనూ జాప్యం
హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): వేల ఏళ్ల ‘అమరావతి’ చరిత్రకు, శిల్పకళ చాతుర్యానికి సాక్ష్యాలుగా నిలిచిన అపురూప సంపద... ఇప్పట్లో ఏపీకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. తెలంగాణలో ని స్టేట్‌ మ్యూజియంతోపాటు తమిళనాడులోని ఎగ్మోర్‌ మ్యూజియం, కోల్‌కతా, ఢిల్లీ, లండన్‌ మ్యూజియంలలో భద్రపర్చిన విలువైన చారిత్రక సంపదను అమరావతికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వడం లేదు. ఢిల్లీ, కోల్‌కతా మ్యూజియాల నుంచి కనీస స్పందనే కరువవ్వగా, ఎగ్మోర్‌ మ్యూజియం అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
 
ఇక, లండన్‌ మ్యూ జియం క్యూరేటర్‌ అయితే షరతులు విధిస్తున్నారు. బౌద్ధులకు సంబంధించిన దాదాపు 400లకు పైగా శిల్పాలు చెన్నైలోని ఎగ్మోర్‌ మ్యూజియంలో ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకులు నాడు అమరావతిలో తవ్వకాలు జరపగా బయటపడిన శిల్పాలను చెన్నై తరలించి ఎగ్మోర్‌ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రంగా ఉంచారు. వీటిని ఏపీ రాజధాని అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శిల్పాలు తమకు తిరిగి ఇవ్వాలని ఏపీ ఉన్నతాధికారులు తమిళనాడుకి లేఖ రాశారు. దీంతో, ఈ విషయమై తగిన నివేదిక ఇవ్వాలని తమిళనాడు అధికారులు ఎగ్మోర్‌ మ్యూజియం అధికారులను ఆదేశించారు.
 
ఈ నేపథ్యంలో... ‘‘అమరావతి శిల్పాలు తిరిగి ఇవ్వాలని ఏపీ కోరడం సబబే. అయితే ఇప్పటికే ఈ శిల్పాలను పరిరక్షించటానికి రూ.కోట్లు ఖర్చుపెట్టాం. కదిలించటానికి వీలు లేని విధంగా శాశ్వతంగా చాలా శిల్పాలను ఫిక్స్‌ చేశాం. అందులోనూ అమరావతి శిల్పాలు చాలా సున్నితంగా ఉంటా యి. వీటిని తరలించడం చాలా కష్టం. ఆ శిల్పాలను ఇక్కడ ఉంచటమే మంచిది’’ అంటూ ఎగ్మోర్‌ మ్యూజియానికి చెందిన క్యూరేటర్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు, అమరావతి శిల్పాల కోసం విదేశాంగ శాఖ ద్వారా ఏపీ ప్రభుత్వం లండన మ్యూజియానికి లేఖ రాసింది.
 
దీనికి ఆ మ్యూజియం క్యూరేటర్‌ స్పందిస్తూ... ‘‘అమరావతి శిల్పాలను లోన్‌బేసి్‌సలో ఇస్తాం. కానీ, అన్నింటినీ ఇవ్వలేం. కొన్ని శిల్పాలను 5-10 ఏళ్లు ఏపీలో ఉంచి తిరిగి మాకు అప్పగించాలి. వీటికి సమ్మతమైతే తిరిగి లేఖ రాయండి’’ అంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో, ‘‘లోనబేసి్‌సలో ప్రత్యేక ఏర్పాట్లతో వీటిని ఏపీకి తీసుకురావడం చాలా కష్టమైన పని. ఈ శిల్పాలను పరిరక్షించే అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం లేదు. నెలకు లక్షల్లో ఖర్చుపెట్టి లండన నుంచి నిపుణులను తీసుకురావాలి. వీటిని పరిరక్షించటానికి రూ.కోట్లలో ఖర్చు అవుతోంది. తిరిగి లండనకు పంపించే ఖర్చులు కూడా మనమే భరించాలి. వీటన్నింటి కన్నా లండనలో ఉంటేనే అమరావతి పేరు పాపులర్‌ అవుతుంది’’ అని ఏపీ ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

 

Link to comment
Share on other sites

వైకుంఠపురం కొండపై బౌద్ధం ఆనవాళ్లు
635990449609901798.jpg

  • నీటితొట్లు, ఇటుక, పెంకులు, నదిలో శివలింగాలు
  • చరిత్రకారుడు శివనాగిరెడ్డి పరిశోధనతో వెలుగులోకి
విజయవాడ, మే 16: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని వైకుంఠ పురంలో బౌద్ధం ఆనవాళ్లు బయటపడ్డాయి. చరిత్రకారుడు, కల్చరల్‌ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆ వివరాలను సోమవారం విలేకరులకు చెప్పారు. వైకుంఠపురం గ్రామానికి చెందిన భోగినేని నాగేశ్వరరావు, మేడసాని శుభకర్‌, రావెల చైతన్య ఇచ్చిన సమాచారం మేరకు తాను ఆ ఊరి కొండ మీద, చుట్టుపక్కల పరిసరాలలో పరిశోధనలు చేశానని చెప్పారు. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గడంతో రెండు శివలింగాలు బయట పడటం గుర్తించానన్నారు. ఇవి క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవని చెప్పారు. తరువాత కొండ మీద పరిశీలించగా ప్రస్తుతం ఉన్న 17వ శతాబ్దానికి చెందిన వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉత్తరాన భైరవకొండ ప్రాంతంలో అంచెలంచెలుగా కట్టుకున్న 3 బౌద్ధస్థూపాల ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. పెద్ద పెద్ద బండరాళ్లలో ఏటవాలు ప్రదేశాన్ని చదరం చేసి దాని మీద 60-30-8 సెంటీమీటర్ల కొలతలతో ఉన్న ఇటుక రాళ్లతో నిర్మించిన స్థూపాల పునాదులు ఉన్నాయని చెప్పారు. పరిసరాల్లో ఎర్ర ని నగిషీలు కల మట్టికుండల పెంకులు, విహారాల మీద పైకప్పునకు వాడిన ఇప్పటి బంగళా పెంకులను పోలిన పెంకులు, చదరపు రాతి పెంకులు దొరికాయని, ఇవన్నీ క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన కాలానివని ఆయన వెల్లడించారు. బౌద్దభిక్షువులు ఆ కొండ మీద విహారాలలో ఉండేవారని, తాగునీటి కోసం కొండ మీద సుమారు అర ఎకరం విస్తీర్ణంలో రెండు చెరువులు, రాతిని తొలచి నిర్మించిన 66-4 కొలతలతో రెండు తొట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
అమరావతి శిల్పాలు అప్పగించండి
01-11-2015 02:18:46
635819411256870296.jpg
  • జయకు సీఆర్డీఏ లేఖ 
చెన్నై, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): చెన్నై ఎగ్మూరు మ్యూజియంలో భద్రపరచిన అమరావతి ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నాలు, పురాతన శిల్పాలను తిరిగి అప్పగించాలని అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ జె.వీరాంజనేయులు తమిళనాడు సీఎం జయలలితకు విజ్ఞప్తి చేశా రు. ప్రాచీన ప్రాంతీయ సంస్కృతిని చాటిచెప్పేలా చెన్నై మ్యూజియంలో 400లపైగా ఉన్న ప్రాచీనచిహ్నాలు, పురాతన శిల్పసంపదను ఏపీకి బదిలీ చేయాలంటూ జయకు లేఖ రాశారు.
Link to comment
Share on other sites

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ చరిత్ర ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని పేరుగాంచిన జాతీయ మ్యూజియంలో పదిలంగా ఉంది. నాడు బుద్ధుడు నడయాడిన చరిత్ర విశేషాలు, రాజులు బౌద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనాలైన పురాతన శిల్పాలు సందర్శకులతో ఔరా అని పించుకుంటున్నాయి. భారతదేశంలో 1, 2 దశాబ్దాలలోనే ఇంతటి గొప్ప కళారూపాల సృష్టి, బుద్ధుడి బోధనలు, గొప్ప పరిపాలనా పద్ధతులు అవలంభించారా? అంటూ విదేశీయులు ఆశ్చర్యపోతున్రాఉ. నాటి అమరావతి ప్రాంతంలోని విశేషాలను వివరించే అద్భుత కళారూపాలు, శిలాశాసనాల ఏవేవి ఎక్కడ ఉన్నాయనే అంశాలపై ఆంధ్రజ్యోతి పరిశీలన..
 
నేషనల్‌ మ్యూజియం, న్యూఢిల్లీ
  •  అమరావతి పాంత్రాన్ని 1, 2, శతాబ్దాలలో శుద్ధోధనుడు సందర్శించాడని తెలిపే శిలాశాసనం. ఇది సత్వధానుడి పరిపాలనా కాలంలో జరిగినట్లు శిలాశాసనంలో పేర్కొన్నారు. 
  •  1, 2, కాలంలో సత్వధానుడి పరిపాలనలో బుద్ధుడు అమరావతి ప్రాంతంలో ప్రసంగిస్తున్నట్లు తెలిపే శాసనాలు. 
  •  అమరావతిలో బుద్ధుడి పర్యటన విశేషాలను వివరించే శిలా విగ్రహాలు 
  •  రెండో శతాబ్దంలో తయారు చేసిన పురుషుల కళారూపాలు 
  • ఇండియన మ్యూజియం, కోల్‌కతా 
  •  రెండో శతాబ్దంలో రూపొందిన ధర్మచక్రం, అశ్వదళాలతో రూపొందించిన శిలాశాసనాలు. 
  •  సింహాసనంపై ఏర్పాటు చేసిన బోధి మొక్కను భక్తులు కొలుస్తున్న శిలా విగ్రహాలు. 
  •  రెండో శతాబ్దంలో రూపొందించినబుద్ధుడి నిలుచున్న కళారూపం. 
  •  గవర్నమెంట్‌ మ్యూజియం, చెన్నైలో మరికొన్ని శిల్పాలు, శాస నాలు ఉన్నాయి. లండనలోని బ్రిట న మ్యూజియంలో బౌద్ధం విశేషాల ను తెలిపే ఆధారాలతో కూడిన శి లావిగ్రహాలు, శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు రాష్ర్టాలకు బయట ప్రాంతాల్లో ఉన్న చరిత్ర విశేషాలు.
Link to comment
Share on other sites

AMARAVATI is very fascinating. Every time I start digging learning new things

 

In PARIS museum:-  collection they took from AMARAVATI,Andhra Pradesh

 

http://www.guimet.fr...au-musee-guimet

http://www.guimet.fr...-tete-de-buddha

 

In BOSTON museum:-  collection they took from AMARAVATI,Andhra Pradesh

 

http://www.mfa.org/s...fulltext=andhra

http://www.mfa.org/c...ng-buddha-16227

 

We should get all these along with Chennai&London and it is possible if central govt tries

Link to comment
Share on other sites

Guest Urban Legend

AMARAVATI is very fascinating. Every time I start digging learning new things

 

In PARIS museum:-  collection they took from AMARAVATI,Andhra Pradesh

 

http://www.guimet.fr...au-musee-guimet

http://www.guimet.fr...-tete-de-buddha

 

In BOSTON museum:-  collection they took from AMARAVATI,Andhra Pradesh

 

http://www.mfa.org/s...fulltext=andhra

http://www.mfa.org/c...ng-buddha-16227

 

We should get all these along with Chennai&London and it is possible if central govt tries

 

 

amaravati ki art lo chaala importance vundhi ga

 

endho hyderabad moju lo padi ivvani neglected

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...