Jump to content

AP IT sector


Recommended Posts

ఏపీకి సదర్‌లాండ్‌!
01-04-2018 02:04:17
 
636581450586851394.jpg
  • అనంతకు నెట్‌మ్యాజిక్‌..
  • విశాఖకు డెస్క్‌ఎరా
  •  నెట్‌మ్యాజిక్‌ పెట్టుబడి 600కోట్లు
  •  క్యూలో మరిన్ని ఐటీ కంపెనీలు
  •  ఐబీపీఎస్‌ ద్వారా 20వేల ఉద్యోగాలు లక్ష్యం
  •  ఇప్పటికే 19,380 మందికి ఉపాధి
  •  మరో 10వేల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేశ్‌ నిర్దేశం
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఏపీకి ఐటీ ఏమిటి? అనే అనుమానాలను పంటాపంచలు చేస్తూ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి. మరికొన్ని ఇదే బాటలో ఉన్నాయి. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాండ్యుయెంట్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఇటీవలే రాష్ట్రానికి వచ్చాయి. ఐటీతో పాటు ఐటీకి అవసరమైన సేవలందించే కంపెనీలను విశాఖకు తీసుకొచ్చారు. దీంతో విశాఖపట్నంలో ఒక బలమైన ఐటీ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో అమరావతిలో ఐటీ పార్కు, ఏపీఎన్‌ఆర్‌టీ టెక్‌జోన్‌లో పదుల కొద్దీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తిరుపతికి పలు ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ యూనిట్లు వచ్చాయి. ఈ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది. అవకాశమున్న ప్రతి కంపెనీని ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సదర్‌లాండ్‌ గ్లోబల్‌ కంపెనీతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి దాదాపు 19 దేశాల్లో శాఖలున్నాయి. అమెరికాలోనే మూడుచోట్ల శాఖలున్నాయి. వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బ్యాంకింగ్‌, బీమా, బీపీవో, ఐటీ తదితర రంగాల్లో ఈ కంపెనీ సేవలందిస్తోంది. విశాఖపట్నం, అమరావతిల్లో ఎక్కడైనా ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. త్వరలోనే ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూల నిర్ణయం తీసుకొంటారని సమాచారం.
 
అనంతకు నెట్‌మ్యాజిక్‌!
ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరొందిన నెట్‌మ్యాజిక్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కంపెనీతో చర్చలు జరిపింది. ఏపీలో ఐటీ, పరిశ్రమల రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించింది. కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పిస్తామని, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరింది. అన్నీ కుదిరితే రూ.600కోట్ల మేర ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఒక డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీని ఒప్పించే దిశగా మాట్లాడుతున్నారని సమాచారం. ఇప్పటికే అమరావతిలో పై డేటా సెంటర్‌ ఉంది. అనంతపురం జిల్లాలో డేటా సెంటర్‌ను పెట్టాలని నెట్‌మ్యాజిక్‌ కంపెనీకి ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే కియ అనంతపురానికి రాగా.. ఐటీలోను ఇలాంటి కంపెనీలు రావడం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు డెస్క్‌ఎరా కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చేందుకు మొగ్గుచూపుతోంది. ఈ కంపెనీతోను పలుమార్లు ఐటీశాఖ చర్చలు జరిపింది. ఈఆర్‌పీ సొల్యూషన్స్‌, ఐటీ సేవలు అందించడంలో ఈ కంపెనీ ఆగ్నేయాసియాలోనే మంచి స్థానంలో ఉంది. విశాఖపట్నంలో ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ఐటీశాఖ కోరుతోంది. సదరు కంపెనీ కూడా ఈ ప్రతిపాదనపై సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
 
ఐబీపీఎస్‌తో 20వేల ఉద్యోగాలు
ఇండియన్‌ బీపీవో ప్రాసెసింగ్‌ స్కీం(ఐబీపీఎస్‌)కింద 20వేల ఉద్యోగాలను రాష్ట్రంలో కల్పించాలనేది ఐటీశాఖ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తెచ్చింది. దీన్ని ఉపయోగించుకోవడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కంపెనీలు పెడితే కొన్ని ప్రోత్సాహకాలను దీనికింద ఇస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 19,380 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరో 10వేల ఉద్యోగాలు కల్పించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ నిర్దేశించినట్లు ఏపీటా సీఈవో తిరుమలరావు చామళ్ల పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని దేశంలో మరే రాష్ట్రం చేరుకోలేదన్నారు.
 
25వేల ఐటీ ఉద్యోగాలకు ఒప్పందాలు
2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐటీ శాఖ అందులో భాగంగా ఇప్పటికే 16,500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేసింది. ఇవి కేవలం ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాలు మాత్రమే. మరో 25వేల ఉద్యోగాల కల్పనకు పలు ఐటీ కంపెనీలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఇవి కార్యరూపం దాలుస్తాయని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఇక్కడితో ఆగకుండా మరో 40 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ ఐటీ రంగంలో నేరుగా వస్తున్న ఉద్యోగాలని, వీటికితోడు పలు పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తాయని పేర్కొన్నారు.
9suther.jpg 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాష్ట్రానికి విశాఖే ఐటీ రాజధాని: లోకేశ్
28-04-2018 03:21:24
 
636604824847482183.jpg
  • మేధోహక్కుల నెలవుగా అమరావతి: లోకేశ్‌
విశాఖపట్నం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి మాత్రం ఆగదని..ఆంధ్రపద్రేశ్‌కు విశాఖపట్నమే ఐటీ రాజధాని అని ఐటీ మంత్రి లోకేశ్‌ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలోకి వచ్చాక 22 వేల మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం. గత ఏడాదిలోనే 12 వేల మందికి అవకాశాలు వచ్చాయి. విశాఖలో మిలీనియం టవర్‌ నిర్మాణం పూర్తయింది. ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాం. విశాఖకు కాండ్యుయెంట్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కంపెనీలు వస్తుంటే కొందరు దుష్ప్రచారం చేశారు. కానీ వాటివల్ల ఎంతోమందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి’ అని చెప్పారు. తృతీయ శ్రేణి నగరాలైన శ్రీకాకుళం, విజయనగరంలో కూడా 1000 చొప్పున ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.
Link to comment
Share on other sites

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌’కు విశాఖలో 40 ఎకరాలు

ఈనాడు, అమరావతి: విశాఖలోని రుషికొండలో ఐటీ కంపెనీ నెలకొల్పేందుకు ముందుకొచ్చిన ఇన్నోవా సొల్యూషన్స్‌కు కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో ఒకే ఉత్తర్వునిచ్చింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు 25 ఎకరాలు, ఇన్నోవా సొల్యూషన్స్‌కు 15 ఎకరాల చొప్పున కేటాయింపులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం మొత్తం 40 ఎకరాల భూమిని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కేటాయిస్తూ మరో జీవో విడుదలయింది. దీనిపై సంబంధిత ఉన్నతాధికారి ఒకరిని ‘ఈనాడు’ సంప్రదించగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తమకు 40 ఎకరాలు అవసరమని కోరడంతో మొత్తం భూమిని కేటాయిస్తూ రెండోసారి ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. ఇన్నోవా సొల్యూషన్స్‌కూ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 5 weeks later...
క్లౌడ్‌ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ
28-07-2018 02:45:04
 
  • జోహో.. ఇన్‌స్టా ఈఎంఐ సంస్థలతో ఒప్పందం
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): క్లౌడ్‌ అకౌంటింగ్‌లో బీకాం, ఎంకాం, ఎంబీఏ విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు జోహో, ఇన్‌స్టా ఈఎంఐ సంస్థలతో శుక్రవారం ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగం గా రాష్ట్రంలోని 391 ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌ సెంటర్లలో జోహో, ఇన్‌స్టా ఈఎంఐ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్ధులకు క్లౌడ్‌ అకౌంటింగ్‌లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీ వరప్రసాద్‌ వివరించారు. భవిష్యత్‌లో క్లౌడ్‌ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుందని జోహో సంస్థ డైరెక్టర్‌ నారాయణన్‌ చెప్పారు. ఫైనాన్స్‌ రంగంలో ఉండే అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధిలో శిక్షణను ఇస్తామని ఇన్‌స్టా ఈఎంఐ సీఈవో హనుమంతు వివరించారు.
Link to comment
Share on other sites

బీపీవో టూ బీపీఎం
28-07-2018 04:28:01
 
636683488813482671.jpg
  • అవసరాలకనుగుణంగా ఐటీలో మార్పులు
  • విశాఖలో 18వేల ఉద్యోగాలు..అభ్యర్థుల్లేరు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో శిక్షణ
విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పాతికేళ్ల క్రితం ఐటీ కొలువు అంటే కాల్‌సెంటర్‌ ఉద్యోగమే! పెద్దగా విద్యార్హతలు అక్కర్లేదు. కాసింత ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసే పరిజ్ఞానం ఉంటేచాలు తీసుకునేవారు. పదిహేను రోజుల శిక్షణతో బాధ్యతలు అప్పగించేవారు. వీరంతా కస్టమర్‌ రిలేషన్‌షి్‌ప, టెక్‌ సపోర్టర్లుగా వ్యవహరించేవారు. ఇవన్నీ అమెరికా, ఇతర దేశాలకు అనుబంధ ఉద్యోగాలు. అందుకని అవుట్‌ సోర్సింగ్‌ చేసేవారు. అలా ఈ రంగానికి ‘బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌’ (బీపీవో) అని పేరు వచ్చింది. బీపీవోలో భారత్‌ 2 దశాబ్దాలపాటు అగ్రగామిగా వెలుగొందింది. అయితే కొంతకాలంగా ఇతర దేశాల నుంచి పోటీ మొదలైంది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌, ఈస్ట్‌ యూరోపియన్‌ దేశాలు ఈ రంగంలోకి దూసుకొచ్చాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సైతం బీపీవోలు నడుపుతున్నాయి. దాంతో భారత్‌కు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్త పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా భవిష్య ప్రణాళికలు రూపొందించే నాస్కామ్‌ బీపీవో కొన్నాళ్లకు సాచ్యురేషన్‌కు వస్తుందని గ్రహించింది. ఈ స్థాయిని దాటి ముందుకెళ్లాలని ఆలోచించింది. ఇదే సమయంలో అమెరికా, ఐరోపా దేశాల ఆలోచనలు కూడా మారాయి. బీపీవో విధానం సక్సెస్‌ అయినందున కోర్‌ సర్వీసు ఉద్యోగాలను కూడా అవుట్‌సోర్సింగ్‌ చేయడం ప్రారంభించాయి. దీనికనుగుణంగా ఐటీ కంపెనీలు ప్రతి సబ్జక్ట్‌ను ప్రత్యేక డొమైన్‌గా అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. ఆటోమేషన్‌ చేసుకుంటూ వెళుతున్నాయి. హెల్త్‌కేర్‌, షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఇలా అనేక రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు రావడం మొదలైంది. ఇలా బీపీవో అంతా బీపీఎం (బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌)గా, కేపీవో (నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్స్‌)గా మారాయి. అయితే ఇప్పటికీ టు టైర్‌, త్రీ టైర్‌ సిటీల్లో చాలామందికి ఐటీ జాబ్‌ అంటే... కాల్‌ సెంటర్‌ ఉద్యోగమనే భావనే ఉండిపోయింది. ఏపీ ఇప్పుడు దాన్ని దాటి ముందుకెళ్లి బీపీఎంగా మారింది. ఉద్యోగావకాశాలు పెరిగాయి. జీతాలూ పెరిగాయి. కానీ, నైపుణ్యం ఉన్నవారు లభించడం లేదు. ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నంలో 18వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. సీఎం చేతులు మీదుగా ప్రారంభమైన కాండ్యుయెంట్‌ కంపెనీ ఐదు వేల మందికి ఉద్యోగాలివ్వడానికి సిద్ధంగా ఉంది. పాత్ర, డబ్ల్యుఎన్‌ఎ్‌సలు చెరో వేయి మందికి ఉద్యోగాలిస్తామని ప్రకటించాయి. ఇలా అన్ని కంపెనీలు కలిపి 18 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించాయి.
 
నైపుణ్యమే ప్రధాన లోపం
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ప్రధానంగా కావలసింది ఇంగ్లిష్‌ పరిజ్ఞానం. ప్రాజెక్ట్‌లన్నీ విదేశాలవే కాబట్టి ఆ దేశాల యాక్సెంట్‌ అర్థం చేసుకోగల స్థాయి ఉండాలి. విన్నది పేపరుపై పెట్టగల డాక్యుమెంటేషన్‌ స్కిల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌ ఉండాలి. ఈ ‘స్కిల్స్‌’ ఉంటేనే ఐటీ కంపెనీలు ఉద్యోగం ఇస్తున్నాయి. ఉత్తరాంధ్రాలో ఏడాదికి 20వేల మంది యువతీ యువకులు డిగ్రీలు పట్టుకొని బయటకొస్తున్నారు. వారిలో 5వేల మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులే. వీరిలో అత్యధికులకు స్కిల్స్‌ ఉండడం లేదు.
 
ఎంపిక నిష్పత్తి 6:2
బెంగళూరు, పుణె ల్లో ఐటీ కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నపుడు పది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే వారిలో ఆరుగురు సెలెక్ట్‌ అవుతున్నారు. అదే విశాఖలో పదికి ఇద్దరే ఎంపికవుతున్నారు. స్కిల్స్‌ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ లోపాన్ని గుర్తించని యువత బెంగళూరులో అయితే ఉద్యోగావకాశాలు ఎక్కువని అక్కడికి పోతున్నారు. దాంతో కాస్త స్కిల్స్‌ ఉన్నవారు కూడా చేజారిపోతున్నారు. నైపుణ్యం లేని వారు ఇక్కడి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
 
‘స్కిల్స్‌’ శిక్షణతో ఎట్టకేలకు పరిష్కారం
విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు తామెదుర్కొంటున్న సమస్యను ఎంపీ కంభంపాటి హరిబాబు దృష్టికి తీసుకువెళ్లాయి. యువతకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో శిక్షణ ఇచ్చే అవకాశాలు కల్పించాలని కోరాయి. కేంద్రం, రాష్ట్రం నిర్వహిస్తున్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాల్లో ఇప్పటివరకు పది, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పాసైన వారికే శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ చదివిన వారికి ఎటువంటి శిక్షణ లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీ హరిబాబు ఆంధ్ర విశ్వవిద్యాలయం, సెంచూరియన్‌ యూనివర్సిటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్ల నిర్వాహకులతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించి, ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులు తయారు చేసేందుకు ప్రొగ్రామ్‌ డిజైన్‌ చేయాల్సిందిగా కోరారు. దానికి కోర్సును తామే రూపొందిస్తామని, ఫ్యాకల్టీగా తామే వెళతామని ఐటీ కంపెనీలు ప్రతిపాదించాయి. ఏయూ, సెంచూరియన్‌ యూనివర్సిటీలు దీనికి అంగీకరించాయి. కొద్దిరోజుల్లోనే ఎంవోయూలు కూడా చేసుకోవాలని నిర్ణయించాయి. నెల నుంచి మూడు నెలల వ్యవధి గల ఈ శిక్షణలో ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, డాక్యుమెంటేషన్‌, విదేశీ భాషలపై సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహిస్తారు.
 
 
హెల్త్‌కేర్‌ రంగంలో ఉపాధి ఎక్కువ
9vspIT1.....jpgహెల్త్‌కేర్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఫార్మశీ, ఎం.ఫార్మసీ, బీఎ్‌ససీ లైఫ్‌ సైన్స్‌ కోర్సులు చేసిన వారిని మేమే తీసుకుంటున్నాం. మంచి ప్యాకేజీలు ఇస్తున్నాం. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటు నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగల సామర్థ్యం ఉంటే చాలు.
 
- నారాయణ, రాష్ట్ర ఐటీ సంఘం అధ్యక్షులు
 
 
 
 
ఆలోచనా ధోరణి మారాలి
9vspIT2...........jpgయువత ఆలోచనా ధోరణి మారాలి. ఇప్పుడు కాల్‌సెంటర్‌ ఉద్యోగాలు లేవు. ఇన్ఫోసి్‌సతో పోటీగా ప్రారంభ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు హెల్త్‌కేర్‌, లీగల్‌ ప్రాసెసింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ రంగాల్లో వస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి.
- శ్రీధర కొసరాజు, రాష్ట్ర ఐటీ సంఘం మాజీ కార్యదర్శి
 
 
 
 
 
అందరి దృష్టి ఏపీపైనే
9vspIT3.....jpgదేశంలో ఐటీ రంగానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నది ఏపీలోనే. కేంద్రం ఐబీపీఎస్‌ కింద ఏపీకి 11వేల సీట్లు కేటాయించింది. అందులో ఏడు వేల సీట్లు ఒక్క విశాఖపట్నానికే ఇచ్చారు. ఒక ఉద్యోగం కల్పిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2 లక్షల ప్రయోజనం కలుగుతుండటంవల్లే ఎక్కువ కంపెనీలు ఏపీకి, విశాఖకు వస్తున్నాయి.
- నరేశ్‌కుమార్‌, రుషికొండ ఐటీ పార్క్‌ సంఘం ఉపాధ్యక్షులు
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఐటీ అంటే విశాఖే!
10-08-2018 02:20:37
 
636694644364668317.jpg
  •  నేడు 10 కంపెనీల ప్రారంభం..
  •  విస్తరణలో మరో 4 కంపెనీలు
  •  10,300 మందికి కొత్త కొలువు
  •  మధురవాడ ఐటీ హిల్స్‌ కిటకిట
  •  కొత్త జోన్‌ అన్వేషణలో ఐటీ శాఖ
  •  కాపులుప్పాడ అభివృద్ధిపై దృష్టి
  •  ఫలిస్తున్న మంత్రి లోకేశ్‌ చొరవ
అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఐటీ కంపెనీల రాక కొనసాగుతోంది. విశాఖపట్నానికి శుక్రవారం కొత్తగా 10 ఐటీ కంపెనీలు రానున్నాయి. ఇదివరలో ప్రారంభమైన నాలుగు కంపెనీలు విస్తరణ బాట పట్టాయి. ఐటీ, బీపీవో, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, మొబైల్‌ యాప్స్‌, హెచ్‌ఆర్‌...తదితర రంగాల్లో ఉన్న కంపెనీలు కొత్తగా విశాఖలో అడుగుపెడుతున్నాయి. ఈ కంపెనీల వల్ల సుమారు 9,300మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ఈ కంపెనీలను ప్రారంభించనున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో లోకేశ్‌ పాల్గొననున్నారు. ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు ప్రతి కంపెనీని సందర్శించనున్నారు. లోకేశ్‌, ఐటీ విభాగం చొరవతో ఈ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవన్నీ విశాఖపట్నం నగరంలో సముద్ర తీరానికి చేరువలో ఉన్న మధురవాడ ఐటీ హిల్స్‌పై రానున్నాయి. కాగా, మధురవాడ ఐటీ హిల్స్‌ దాదాపు నిండిపోవడంతో...కాపులుప్పాడలో మరో ఐటీ జోన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వ భూమిలో తొలి దశలో 100ఎకరాలను అభివృద్ది చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని ఐటీ కంపెనీలకు కేటాయించాలని భావిస్తున్నారు.
 
విస్తరణతో వేలాది ఉద్యోగాలు
బీపీవో సేవలు అందిస్తున్న కాన్డ్యూయెంట్‌ కంపెనీ విస్తరణ ద్వారా ఐదువేలమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీ ద్వారా తొలి దశలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు వచ్చాయి. ఆఫ్‌ షోర్‌ డెవల్‌పమెంట్‌ సేవలు అందిస్తున్న సింబయోసిస్‌ విస్తరణ ద్వారా 100మందికి, ఇన్స్‌ ఫైర్‌ ఎడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ విస్తరణతో 200మందికి, పాత్రా ఇండియా బీపీవో సర్వీసెస్‌ ద్వారా 1600ల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. పాత్రా ఇండియా కూడా బీపీవో సేవలు అందిస్తోంది. ఇవికాక విశాఖపట్నంలోని హెచ్‌ఎస్ బీసీ కంపెనీ విస్తరణకోసం లోకేశ్‌ చొరవ చూపి మాట్లాడారు. అదనంగా వెయ్యిమందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఆ కంపెనీ విస్తరణ చేపట్టింది.
 
ఇక.. కొత్తగా కొలువుతీరుతున్న సెరియం సిస్టమ్స్‌ కంపెనీ వెయ్యి మందికి, సహస్రమయ టెక్నాలజీస్‌ 500 మందికి, హిప్పో క్యాంపస్‌ కంపెనీ 250మందికి, సీఈఎస్‌ లిమిటెడ్‌ 110 మందికి, వివిలెక్స్‌ టెక్నాలజీస్‌ 100మందికి, ఇన్ఫోటీం కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ 75మందికి, ిఎన్వోయ్‌ మోర్టగేజ్‌లో 60మందికి, స్వేయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌ 50మందికి, వెలాంటా కేపీవో అకౌంటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 44మందికి, ఇన్‌డేటా అనలిటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 32మందికి, న్యూవి సొల్యూషన్స్‌ 32మందికి, బెల్‌ ఫ్రిక్స్‌ క్రిప్టెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 22మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.
 
సంస్థలు.. సేవలు..
  •  సీఈఎస్‌ లిమిటెడ్‌...బిజినెస్‌ ప్రోసెస్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు
  •  సెరియం సిస్టమ్స్‌ కంపెనీ.. వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సెక్టార్‌కి గ్లోబల్‌ డిజైన్‌ సేవలు
  •  సహస్రమయ టెక్నాలజీ్‌స...ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సేవలు
  •  హిప్పో క్యాంపస్‌ కంపెనీ.. ఇ-గవర్నెన్స్‌ సేవలు
  •  ఎన్వోయ్‌ మోర్టగేజ్‌.. బ్యాంకింగ్‌ సేవలు
  •  వివిలెక్స్‌ టెక్నాలజీ్‌స..సా్‌ఫ్టవేర్‌ డెవల్‌పమెంట్‌ సేవలు న్యూవి సొల్యూషన్స్‌.. చిరు ఫారాలకు వెబ్‌ అప్లికేషన్స్‌ సేవలు
  •  ఇన్ఫోటీం కన్సల్టింగ్‌ సర్వీసెస్‌.. బీపీవో, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ సేవలు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...