Jump to content

AP IT sector


Recommended Posts

సైబర్‌ భద్రతకు ‘యాక్సెంచర్‌’ సహకారం

ఏపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ

30ap-state2a.jpg

ఈనాడు, అమరావతి: సైబర్‌ భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థ ‘యాక్సెంచర్‌’ ముందుకొచ్చింది. శుక్రవారం ఆ సంస్థ భారత విభాగ అధ్యక్షురాలు రేఖా మీనన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. సచివాలయానికి వచ్చిన ఈ బృందం తొలుత ఐటీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమైంది. అనంతరం ఆయన వారిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఐటీని ఎలా ఉపయోగిస్తున్నది వారికి వివరించారు. సీఎం కోర్‌ డ్యాష్‌బోర్డు, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ తదితర ఐటీ ఆధారిత సేవల అమలునూ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, అందుబాటులోని మానవవనరుల గురించి కూడా విశదీకరించారు. సైబర్‌ భద్రతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. తగిన సహకారాన్ని అందించాలని యాక్సెంచర్‌ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దాంతోపాటు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, బిగ్‌డాటా అనలిటిక్స్‌కు సహకారం అందించాలన్నారు. ఇందుకు యాక్సెంచర్‌ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అనంతరం రేఖా మీనన్‌ తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, సంయుక్త కార్యదర్శి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఐటీ సంస్థలకు రెడీమేడ్‌ ఆఫీసులు!
04-07-2017 02:19:37
 
  • 50 లక్షల చ.అడుగుల్లో భవంతులు
  • నిర్మాణ సంస్థలకు 50ు అద్దె రాయితీ
 
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతపరిచేందుకు ప్రభుత్వం కార్యోన్ముఖమైంది. ఇందుకోసం ‘డిజిగ్నేటెడ్‌ ఐటీ పార్కు(డీటీపీ)’ పాలసీని కేబినెట్‌ సోమవారం ఆమోదించింది. మూడేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలను ఐటీ కంపెనీల కోసం నిర్మించాలని నిర్ణయించింది. ఆయా కంపెనీలు తరలివస్తే 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తోంది. కొత్త విధానం ప్రకారం..మొత్తం 50 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ రంగం కోసం భవనాలు నిర్మిస్తారు. నిర్మాణం చేపట్టిన సంస్థకు 50 శాతం దాకా అద్దె రాయితీని ఐటీ శాఖే చెల్లిస్తుంది.
 
లక్ష చ.అడుగుల విస్తీర్ణం మేర భవనాన్ని నిర్మిస్తే.. 18 నెలలు, 2 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే రెండేళ్లు, 3 లక్షల చ.అడుగుల్లో నిర్మిస్తే 30 నెలలు, 4 లక్షల చ.అడుగుల్లో భవనాన్ని నిర్మిస్తే .. 36 నెలల పాటు 50 శాతం అద్దె రాయితీని ఐటీ శాఖ భరిస్తుంది. 70 శాతం ఆక్యుపేషన్‌ రేటు ఉంటే కార్యాలయ భవన నిర్మాతలకు ప్రభుత్వం ఏమీ ఇవ్వదని, అంతకంటే తక్కువ ఉంటే అద్దెలో 50 శాతం రాయితీ ఉంటుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ కృషితో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన కంపెనీలు.. స్థలాల్లేక ఆగిపోతున్నాయని, ఈ సమస్యను అధిగమించడానికి తాజా విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.
Link to comment
Share on other sites

విశాఖపట్నంలో మెగా ఐటీ పార్కు

కాపుల ఉప్పాడ వద్ద 1300 ఎకరాల్లో ఏర్పాటు

తిరుపతిలో రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌

ఐటీ మంత్రి నారా లోకేష్‌

ఈనాడు - అమరావతి

5ap-state1a.jpg

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉప్పాడ వద్ద 1351 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదలను రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు చూపించారు. రాష్ట్రంలో చేపడుతున్న ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీఐఐసీ పరంగా చేపడుతున్న పనులను మంత్రి నారా లోకేష్‌ బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదనలపై, అక్కడ అంత స్థలం ఎక్కడ లభ్యమవుతుంది, ఐటీ పార్కు ఏర్పాటుకు అక్కడ ఉన్న అనుకూల అంశాలు తదితరాలను చర్చించారు. దాంతోపాటు తిరుపతి వద్ద వికృతమాల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌తో పాటు రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ ఏర్పాటు అంశంపైనా మాట్లాడారు. 500 ఎకరాల్లో ఈ రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నారు. దాని ప్రగతి గురించి మంత్రి లోకేష్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ ఐటీ రంగ అభివృద్ధికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అక్టోబర్‌లోపు మిలీనియం టవర్‌: విశాఖపట్నంలో నిర్మించనున్న మిలీనియం ఐటీ టవర్‌ నిర్మాణాన్ని అక్టోబర్‌లోపు పూర్తి చేయాలని లోకేష్‌ అధికారులను ఆదేశించారు. ఈ పార్కు నిర్మాణానికి ఇప్పటివరకు జరిగిన పనులను ఆయన సమీక్షించారు. మంగళగిరిలో ఏపీఐఐసీ నిర్మిస్తున్న ఐటీ భవన్‌ నిర్మాణాన్ని అక్టోబరులోగా పూర్తిచేయాలన్నారు. మధురవాడలో ఐటీ సెజ్‌లో పలు సంస్థలకు భూములిచ్చామని, అందులో కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై ఒత్తిడి తెచ్చి అవి త్వరితగతిన ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ముందుకు రాకపోతే కేటాయించిన భూములను రద్దుచేసి ఇతర సంస్థలకు ఇవ్వాలన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, సలహాదారు జేఏ చౌదరి, ఏపీఐఐసీ ఎండీ ఏ.బాబు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

సైబర్‌ భద్రతా దళాల ఏర్పాటు

సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించేలా రాష్ట్రంలో ప్రత్యేకించి సైబర్‌ భద్రతా దళాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి లోకేష్‌ అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో సైబర్‌ భద్రతపై ఆయన పోలీసు, ఐటీ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. లోకేష్‌ మాట్లాడుతూ హ్యాకింగ్‌, వానాక్రై, మాల్‌వేర్‌ లాంటి వైరస్‌లను ఎదుర్కొవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. పోలీసులకు కూడా ప్రత్యేకించి శిక్షణ ఇవ్వాలన్నారు. సైబర్‌ భద్రతకు ‘భద్రత, నిర్వహణ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

Link to comment
Share on other sites

విశాఖ విప్రో క్యాంపస్‌ విస్తరణ!


636350781032172509.jpg



  • మంత్రి లోకేశ్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ
  • లోకేశ్‌ను కలిసిన గోవా ఐటీ మంత్రి

 

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని విప్రో క్యాంప్‌సను విస్తరిస్తామని, త్వరలోనే రెండో దశ పనులు ప్రారంభిస్తామని విప్రో ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఐటీ మంత్రి లోకేశ్‌తో వారు భేటీ అయ్యారు. విశాఖ క్యాంప్‌సలో ప్రస్తుతం 1500 మందికి ఉపాధి కల్పించామని, త్వరలో రెండో దశ పనులు ప్రారంభించి మరో 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా ఉంచే బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని అన్ని శాఖల్లోనూ వినియోగించుకొనేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కోర్‌ డ్యాష్‌ బోర్డుతోనే ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసే విధంగా సహకరిస్తామని తెలిపారు. ఐటీ సంస్థలకు తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని అయితే, స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేశ్‌ విప్రో ప్రతినిధులను కోరారు.

 

లోకేశ్‌తో కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ భేటీ

కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధీర్‌ హసీజా కూడా లోకేశ్‌తో భేటీ అయ్యారు. తిరుపతిలోని ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌లో తమ ఫ్యాక్టరీ నిర్మాణం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో జరుగుతోందని సుధీర్‌ వివరించారు. విడిభాగాల దిగుమతుల కోసం చెన్నైలో కస్టమ్స్‌ అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని, తిరుపతిలోనే కస్టమ్స్‌ అనుమతులు ఇస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. కాగా, గోవా ఐటీ మంత్రి రోహన్‌ కూడా లోకేశ్‌ను కలిశారు ఐటీ రంగంలో సహకరించాలని కోరారు. ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఏజెన్సీ అధికారులతోనూ లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ- ప్రగతి ప్రాజెక్టు అభివృద్ధిపైనా సమీక్షించారు.


Link to comment
Share on other sites

రాజధానిలో ‘పై డాటా’..సై

21-07-2017 08:20:51
 
636362220753975615.jpg
  • తొలిదశ ప్రాజెక్టుకు నేడే శ్రీకారం
  • మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • రాజధానిలో తొలి ఐటీ ప్రాజెక్టు
మంగళగిరి: స్థానిక ఐటీ పార్కులో ప్రతిష్టాత్మకమైన ఐటీ ప్రాజెక్టు... పై డాటా సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ కంపెనీ పై డాటా సెంటర్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూపుదిద్దుకున్న తొలి అంతర్జాతీయ ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కావడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో నాల్గవ టైర్‌ డాటా సెంటర్‌గా గుర్తింపు పొందనున్న తొలి ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కానుంది. ఈ డాటా సెంటర్‌ ఏర్పాటు వలన మూడొందల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి కలుగనుండగా స్థానికంగా మరో రెండేవేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ప్రస్త్తుతానికి తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. లోకేష్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 
 
మంగళగిరిలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి చెందిన ఇక్కడి ఐటీ పార్కులో ప్లాటు నెం.12 కింద పదెకరాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ 2015 మేలో జీఓ నెం.11 పేరుతో ఉత్తర్వులను ఇచ్చింది. ప్రభుత్వం కూడ ఎన్నో షరతులను విధిస్తూ లీజు కేటాయింపులను చేసింది. 33 ఏళ్లకుగాను లీజుకింద రూ.పదికోట్లను చెల్లించాలని కోరగా పై డాటా యాజమాన్యం ఆ చెల్లింపులను చేసింది. సదరు భూమిని ఏపీఐఐసీ నుంచి పై డాటా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఆరు మాసాల్లోగా నిర్మాణ పనులను ఆరంభించి తదుపరి 15 మాసాల్లోగా ప్రాజెక్టు తొలిదశను పూర్తిచే యాలని ఆతదుపరి మూడు మాసాల్లోగా ప్రాజెక్టులో అనుకున్న విధంగా పనులు ప్రారంభించి తీరాలని ప్రభుత్వం షరతులు విధించింది. ప్రాజెక్టు పనితీరు పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందినట్టయితేనే తదుపరి 33 ఏళ్లకు లీజు కొనసాగుతుందని కూడ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టులో విధిగా 300 మందికి తగ్గకుండా ఐటీ నిపుణులకు ఉపాఽధిని కల్పించాలని కూడ ప్రభుత్వం స్పష్టం చేసింది. పై డాటా సెంటర్‌ యాజమాన్యం కూడ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. భూమిని స్వాధీనం చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఇక్కడ భవన నిర్మాణ పనులను చేపట్టింది. చాలా శరవేగంగా తొలిదశ భవన సముదాయాన్ని పూర్తి చేసింది. మొత్తం ఐదు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న పై డేటా సెంటర్‌ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.600 కోట్లను ఖర్చు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. తొలి దశ కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఐదు వేల సర్వర్‌ ర్యాక్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో ర్యాక్‌లో 47 సర్వర్‌లకు స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. ఈ ఐటీ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడ మంచి సహకారాన్ని అందించింది. ప్రాజెక్టు నిర్వాహణకు అవసరమయ్చే అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా విద్యుత్‌, నీటి సరఫరా విషయంలో రాజీలేని విధంగా ఏర్పాట్లను చేసింది.
 
గుంటూరు ఛానల్‌ నుంచి ప్రత్యేక పైపులైనుతో కృష్ణా జలాలను అందించడంతో పాటు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కూడ ప్రభుత్వం ఏర్పాట్లను గావించింది. తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రజారోగ్యశాఖ ఆఽధ్వర్యంలో పనులను చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత అవసరాలకు 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేసి దానికి తాడేపల్లిలోని నులకపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ ప్రత్యేక విద్యుత్‌ లైనును ఏర్పాటుచేశారు. ఇందుకోసం రమారమి రూ.ఏడు కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ప్రాజెక్టులో ర్యాక్‌ల సంఖ్యను 15వేల వరకు పెంపు చేసే అవకాశం వుంది. ఆ సందర్భంలో సబ్‌స్టేషన్‌ సామర్ధ్యాన్ని 60 మెగావాట్స్‌కు పెంచాల్సివుంటుంది. మొత్తంమీద 2018 నాటికి భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌గా పై డేటా అవతరించబోతుంది. క్లౌడ్‌ కంఫ్యూటింగ్‌ సర్వీస్‌లో అత్యంత ఎక్కువ సామర్ధ్యం కల సర్వర్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పై డేటా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటుంది.
Link to comment
Share on other sites

Basic ga AP lo oka Ameerpet create cheyyali, one for IT and one for Electronics. Automatic ga MNCs land authayi super quick ga.. Ee training institutes ki incentives isthe poddi!

 

Lack of this is what is stopping make in India or "made in AP", that 1500 will quickly jump to 10,000

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...