sonykongara 1,618 Posted February 8, 2017 https://www.youtube.com/watch?v=RiwcGougQio Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted February 13, 2017 గుంటూరు రైల్వేస్టేషనుకు నవ్య శోభ ఆంధ్రజ్యోతి, గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషను రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. ఏ-1 కేటగిరీగా ఉన్న స్టేషనను రెండోదశ పునరాభివృద్ధి ప్రాజెక్టులో చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికను రూపొందించింది. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకించి రైల్వేస్టేషను పునరా భివృద్ధికి నిధులు కేటాయించిన దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకొంది. ప్రాజెక్టు అమలులో భాగంగా ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూరుస్తారు. ఒక విధంగా రిటైల్ మాల్గా స్టేషన్ ను మారుస్తారు. అమరావతి చారిత్రక సంపద ఉట్టిపడేలా ఐకానిక్ బిల్డింగ్‌ని కూడా నిర్మిస్తారని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు రైల్వేస్టేషను ఏ1 కేటగిరీగా ఉంది. ప్రస్తుతం రైల్వేస్టేషను ఆరు ప్లాట్‌ఫాంలను రైళ్ల రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఏడోనెంబర్ ప్లాట్‌ఫాం గుడ్స్ రైళ్లకు కేటా యించారు. ఎనిమిదో నెంబర్ ప్లాట్‌ఫాంని కూడా నిర్మించేందుకు సన్నాహక పనులు జరుగుతున్నాయి. అయితే అన్ని ప్లాట్‌ఫాంలకు రూఫ్ సౌకర్యం లేదు. దీనివల్ల వేసవి, వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు వచ్చిన సమయంలో ప్రయా ణికులు స్టేషన లోపలికి, బయటకు వెళ్లేందుకు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. వెయింటింగ్ హాల్స్ కూడా స్టేషను అవసరాలకు తగినంత సామర్థ్యంతో లేవు. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫాం, ప్రాంగణంలో కింద కూర్చోవాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలో స్టేషను పునరాభివృద్ధి ప్రాజెక్టు రావడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు అమలులో భాగంగా లోపలికి, బయటకు వెళ్లే ముఖద్వారాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఒక మార్గంలో ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారు. మరోమార్గంలో బయటకు పంపుతారు. ఒకే మార్గం నుంచి లోపలికి, బయటకు అనుమతించరు. రైల్వేస్టేషను తో బస్సు, మెట్రో వంటి రవాణా సేవలను అనుసంధానం చేస్తారు. దీని వల్ల ప్రయాణికులు రైలు దిగి బయటకు రాగానే గమ్యస్థానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో చేరుకోవచ్చు. కేటరింగ్, చిన్నతరహా రిటైల్, వాష్‌రూంలు, సామాన్లు భద్రపరుచు గదులు, తాగునీరు, ఏటీఎం, ఔషధాల కౌంటర్, ఇంటర్నెట్, ప్రాథమిక చికిత్స, ఫుడ్‌కోర్టులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు. స్టేషనుకు ఇరువైపులా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం ప్లాట్‌ఫాంల మీద పార్శిల్ వాహనాల రాకపోకల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషను పునరాభివృద్ధి ప్రాజెక్టులో దీనిని అనుమతించరు. అన్నివర్గాల ప్రయాణికులు అర్థం చేసుకొనేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటుచేస్తారు. పార్కింగ్, ప్రయాణికులను దించడానికి, తీసుకెళ్లడానికి వారి సన్నిహితులు వేచి చూసే ప్రదేశాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూస్తారు. సహజసిద్ధమైన వెంటిలేషన్, లైటింగ్‌తో గ్రీన బిల్డింగ్స్ నిర్మాణం చేపడతారు.స్టేషనులోని అన్ని ప్లాట్‌ఫాంలను అనుసంధానం చేస్తూ ఫుట్ బ్రిడ్జీని నిర్మిస్తారు. ప్రతీ ప్లాట్‌ఫాంకు విధిగా ఎస్కలేటర్, లిఫ్టు, మెట్ల సౌకర్యాన్ని మూడు చోట్ల కల్పిస్తారు. పార్శిల్స్ని యాంత్రీకరణ చేస్తారు. లగేజ్ స్కానింగ్ సిస్టమ్స్, ఆటోమేటిక్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పీటీజెడ్ కెమెరాల సౌకర్యం ఏర్పాటుచేస్తారు. అధునాతన సదుపాయాలతో మోడ్రన టాయ్‌లెట్స్‌కు ప్రణాళిక రూపొందిస్తారు. ప్రత్యేకంగా షాపింగ్, డైనింగ్, బడ్జెట్ హోటల్స్ తదితర సౌకర్యాలతో రైల్వేస్టేషన్ ను ఒక రిటైల్ మాల్గా ప్రయాణికులకు స్నేహపూర్వకంగా ఉండేలా రూపొందిస్తారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted March 23, 2017 పీపీపీ విధానంలో బీఆర్ స్టేడియం అభివృద్ధి జాతీయ హోదా తీసుకొచ్చేందుకు ప్రయత్నం అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాకేంద్రం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం దశ తిరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్య విధానంలో స్టేడియాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్నట్లు క్రీడలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అసెంబ్లీ ప్రకటించారు. 2019లో అమరావతి రాజధానిలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని అనుకొంటున్నామని, ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో బీఆర్ స్టేడియం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్టేడియం అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. నిధులు లేక శిథిలావస్థకు.. ఉమ్మడి రాష్ట్రంలో బాస్కెట్ బాల్ శిక్షణకు బీఆర్ స్టేడి యం కేంద్రంగా ఉండేది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ హాస్టల్ కూడా ఇక్కడే ఉండేది. రంజీ, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన క్రికెట్ మ్యాచలకు వేదికగా నిలిచింది. స్టేడియం నిర్వహణకు తగిన నిధులను ప్రభుత్వాలు కేటాయించకపోవడంతో క్రమేపీ శిథిలావస్థ స్థితికి చేరుకుంది. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తమ అవసరాలకు వినియోగించుకోవడం ప్రారంభించా రు. బహిరం గ సభలు, ప్ర దర్శనలు, సమావేశాలకు ఉపయోగించడంతో తరచుగా మరమ్మతులకు గురయ్యేది. ఆంధ్రప్రదేశలో శాప్‌కు ఉన్న ఏకైక స్టేడియం ఇదొక్కటే అయినప్పటికీ ఆలన పాలన కరువైంది. స్కేటింగ్ రింగు నిర్మించినా దానిని విందు కార్యక్రమాలకు ఇస్తుండటంతో క్రీడాకారులు స్కేటింగ్ చేయలేని విధంగా తయారైంది. స్టేడియంలో పచ్చదనం పూర్తిగా కొరవడింది. జాతీయ క్రీడల కోసమే.. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఇటీవలే స్టేడియంను పరిశీలించారు. దీనిపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. 2019 జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏపీ బిడ్ వేసింది. బిడ్ వస్తే స్టేడియం అవసరం ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకు నే స్టేడియం అభివృద్ధికి బిడ్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 4, 2017 త్వరలో గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు పూర్తి మూడో దశ నిర్మించేందుకు సీఆర్డీయే సన్నాహాలు జేకేసీ కాలేజీ నుంచిపెదపలకలూరు రోడ్డు వరకు .. గుంటూరులో ట్రాఫిక్ వెతలకు పరిష్కారం భూములనిచ్చేందుకు 30 మంది రైతుల అంగీకారం ఈనెల ఎనిమిదో తేదీన మరో సమావేశం అమరావతి: గుంటూరు నగరంలో మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్డు మూడో దశకు సీఆర్డీయే ఆమోదం లభించింది. ఈ ఇన్నర్ రింగ్‌రోడ్డు మొత్తం పొడవు 10.55 కిలోమీటర్లు కాగా ఇప్పటికే రెండు దశలు పూర్తి చేశారు. తొలి దశగా ఓల్డ్ ఎన్‌హెచ్‌లోని ఆటోనగర్ నుంచి అమరావతి రోడ్డు వరకు (4.34 కి.మీ.), రెండో దశ కింద అమరావతి రోడ్డు నుంచి జేకేసీ కాలేజీ వరకు (2 కి.మీ.) నిర్మించారు. మూడో దశ కింద గుంటూరులోని జేకేసీ కాలేజ్ రోడ్డు (స్వర్ణభారతి నగర్) నుంచి పెదపలకలూరు రోడ్డు వరకు 4.21 కిలోమీటర్ల మేర, 80 అడుగుల వెడల్పున లింక్‌రోడ్డు నిర్మించేందుకు గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పంపిన అభివృద్ధి ప్రణాళికకు సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఆమోదం తెలిపారు. దీంతో అతి త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఐఆర్ఆర్లోని మూడో దశ నిర్మాణం పూర్తయితే గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఎంతో వీలుగా ఉంటుంది. దామరపల్లి, బండారుపల్లి, పేరేచర్ల, చినపలకలూరు, పెదపలకలూరు తదితర గ్రామాలను గుంటూరుతో మరింత మెరుగ్గా అనుసంధానించడమూ సాధ్యమవుతుంది. భూ యజమానుల్లో పలువురి అంగీకారం ప్రతిపాదిత మూడో దశలో ప్రస్తుతం ఉన్న డొంకను 80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూమిని సేకరించే ప్రక్రియను సీఆర్డీయే చేపట్టగా, యజమానుల నుంచి సుముఖతవ్యక్తమైంది. వారి నుంచి అంగీకారపత్రాలు పొందేందుకు ఈ నెల 1న సీఆర్డీయే గుంటూరు జోనల్ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించగా, భూములు కోల్పోయే అవకాశమున్న 46 మంది రైతులు హాజరయ్యారు. ఐఆర్ఆర్ 3వ దశ ఆవశ్యకతను అధికారులు ఈ సదస్సులో వివరించి, దానికి అవసరమైన భూములను ఇవ్వాల్సిందిగా కోరగా రైతుల్లో 30 మంది ఒప్పుకుని, అంగీకారపత్రాలను కూడా అందజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండో అవగాహన సదస్సును ఈనెల 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని సీఆర్డీయే కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డెవల్‌పమెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ వి.రాముడు తెలిపారు. ఐఆర్ఆర్ నిర్మాణంతో భూములను కోల్పోయే అవకాశమున్న అందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 5, 2017 గుంటూరు బాగుంటుంది! మహాత్మాగాంధీ అంతరవలయ రహదారికి ఆమోదం! 80 అడుగుల వెడల్పుతో నిర్మాణం నగరంపై తగ్గనున్న ట్రాఫిక్ భారం రాయలసీమ నుంచి నేరుగా అమరావతి ఈనాడు, అమరావతి రాయలసీమ ప్రాంతం నుంచి నేరుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి వెళ్లేందుకు అనువుగా గుంటూరు నగరం అంతరవలయ రహదారి నిర్మాణానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఆమోదించింది. మహాత్మగాంధీ ఇన్నర్‌రింగు రోడ్డు మూడో దశలో భూసేకరణకు మార్గం సుగమమైంది. గుంటూరు చేరుకునేందుకు, అమరావతి రాజధాని నగరాన్ని కలిపే మహాత్మగాంధీ అంతర్వలయ రహదారి నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. 80 అడుగుల వెడల్పుతో ఈరోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించినట్లు సీఆర్డీఏ కమిషనరు చెరుకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గుంటూరు నగరానికి మహాత్మగాంధీ అంతర వలయ రహదారి సుమారు 10.55 కిలోమీటర్లు నిర్మాణం చేయనున్నారు. విజయవాడ నుంచి జాతీయ రహదారిమీదుగా గుంటూరుకు వెళ్లే మార్గంలో అమరావతికి రహదారి (లింకు) నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అంతరవలయ రహదారి నిర్మాణంలో మొదటి దశలో పాత జాతీయ రహదారి ఆటోనగర్ నుంచి అమరావతి రోడ్డు వరకు 4.34 కిలోమీటర్లు ఆమోదం తెలిపారు. రెండో దశలో అమరావతి రోడ్డు నుంచి జేకేసీ కళాశాల వరకు 2 కిలోమీటర్లు ఆమోదం తెలిపి నిర్మాణం చేశారు. ప్రస్తుతం మూడో దశలో జేకేసీ కళాశాల నుంచి పెదపలకలూరు రోడ్డు వరకు 4.21 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇటీవల సీఆర్డీఏకు ప్రతిపాదించారు. వీటిని అధ్యయనం చేసిన అధికారులు ఆమోద ముద్ర వేశారు. మూడో దశ ఇన్నర్‌రింగు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే దామరాపల్లి, బండారుపల్లి, పేరేచర్ల, చినపలకలూరు, పెదపలకలూరు గ్రామాలను అనుసంధానం చేసినట్లు అవుతుంది. గుంటూరు నగరంలో (కోర్‌సిటీ) ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించినట్లు అవుతుంది. నగరంలోకి ట్రాఫిక్ ప్రవేశించకుండా ఇన్నర్‌రింగు రోడ్డు ద్వారా మళ్లించవచ్చు. ఆదేవిధంగా రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు గుంటూరు నగరంలోకి ప్రవేశించకుండా రాజధాని అమరావతికి వెళ్లనున్నాయి. అదేవిధంగా విజయవాడ వచ్చే వాహనాలు ఈ ఇన్నర్ రింగు రోడ్డు ద్వారా జాతీయ రహదారికి వెళ్లనున్నాయి. పిడుగురాళ్ల, సత్తెనపల్లి నుంచి వచ్చే వాహనాలకు అనువుగా ఉంటుంది. దీనిపై పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రణాళికలు ఇచ్చారు. 80అడుగుల రోడ్డుగా..! ప్రస్తుతం ఉన్న డొంక రోడ్డును 80 అడుగుల వెడల్పు రోడ్డుగా అభివృద్ధి చేస్తారు. దీని కోసం సరిహద్దులు నిర్ణయించనున్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. దీనికిఅవసరమైన భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. ఆయా ప్రాంత భూయజమానులతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో గుంటూరు సీఆర్డీఏ జోనల్ కార్యాలయంలో అధికారులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 1న భూయజమానులతో సమావేశాన్ని నిర్వహించి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఈ అవగాహన సమావేశానికి మొత్తం 46 మంది యజమానులు హాజరై 30 మంది వరకు అంగీకార పత్రాలపై సంతకాలు చేసినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మరో సదస్సును ఈనెల 8న నిర్వహించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈసమావేశానికి అందరూ హాజరు కావాలని సీఆర్డీఏ ప్రమోషన్ విభాగం సంచాలకుడు వి.రాముడు విజ్ఞప్తి చేశారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 23, 2017 ఇన్నర్ పనుల్లో.. కదలిక గుంటూరు: గుంటూరు శివారులోని ఇన్నర్ రింగురోడ్డు 3వ ఫేస్‌లో పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. సీఆర్డీఏ అధికారులు ఈ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించి చర్యలు ప్రారంభించారు. గుంటూరు నగరానికి ట్రాఫిక్‌ను నివారించేందుకు ఈ రహదారి ఎంతో ప్రధానమైందని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేశారు. దీంతో స్పందించిన సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ పనులు చేపట్టేందుకు సోమవారం పలకలూరు రోడ్డులో పరిశీలించారు. సీఆర్డీఏకు చెందిన జేడీ బాలాజీ, జీఎంసీ ఏసీపీ విజయ్‌భాస్కర్ తదితరులు పలకలూరు వద్ద డొంక పోరంబోకును, రోడ్డు ఏర్పాటుకు సబంధించిన సర్వేను చేపట్టారు. ఈ మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు లక్ష్మణస్వామి, జీఎంసీ సర్వేయర్ సునీల్ సిబ్బందితో తరలివెళ్లారు. స్వర్ణభారతీనగర్ నుంచి పలకలూరు వరకు మూడో ఫేజ్ కింద రోడ్డును ఏర్పాటు భూసేకరణ వరకు వచ్చి ఆగిపోయింది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉడా రద్దు చేయడంతో అప్పట్లో ఈ రోడ్డు మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఆర్డీఏ అధికారులు దృష్టి సారించి జేడీ స్థాయి అధికారి రోడ్డును పరిశీలించి మొత్తం 4.21 కిలోమీటర్ల పొడవును 80 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాధాన్యం ఎక్కువే.. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగురోడ్డులో మూడో ఫేజ్ ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఆటోనగర్ వద్దగల గడ్డిపాడు నుంచి అమరావతి రోడ్డు వరకు ఇన్నర్రింగురోడ్డు ఫేజ్ 1 పూర్తి చేశారు. అదే విధంగా అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతీనగర్ వరకు ఇన్నర్ రింగురోడ్డు ఫేజ్ 2ను పూర్తి చేశారు. ఫేజ్ 3 మాత్రం నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ రోడ్డును అప్పట్లోనే ఏర్పాటు చేయాలని సుమారు.24 కోట్ల నిధులతో చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా రోడ్డు పనులు అంతగా ముందుకు సాగలేదు. తాజాగా రాజధాని అమరావతిలో అంతర్భాగమైన గుంటూరు నగరానికి ఎంతో ప్రాముఖ్య ఉన్న ఈ రోడ్డుపై సీఆర్డీఏ దృ దృష్టి సారించి ంది. తొలి విడత స్వర్ణభారతీనగర్ నుంచి పలకలూరు వరకు భూసేకరణను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి హద్దులను నిర్ణయించనున్నారు. భూసేకరణ అనంతరం రైతులకు అవగాహన సదస్సు కల్పించి వారి ఒప్పందం మేరకు భూమిని తీసుకోనున్నారు. ప్రతిఫలంగా రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించనున్నారు. వీటన్నింటికి సంబంధించి జీఎంసీ నుంచి సమగ్ర నివేదికను సీఆర్డీఏకు అందజేశారు. ఆర్డీపీ ప్రకారం ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ సమస్యకు చెక్.. ఇన్నర్ రింగురోడ్డు ఫేజ్ 3 పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్య దాదాపు పరిష్కారం కానుంది. ఇప్పటికీ పేరేచర్ల, పలకలూరుతో పాటు నరసరావుపేట వైపు వెళ్ళే వాహనాలు గుంటూరు నగరం నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వెళ్ళే వాహనాలు ఇన్నర్ రింగురోడ్డు ద్వారా వెళ్తే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మార్గం సుగుమం అవుతుంది. టూటౌన్, గోరంట్ల, అమరావతిరోడ్డు, కాకాని రోడ్డులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. భూసేకరణ ప్రారంభం పలకలూరు వద్ద భూసేకరణను సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ బాలాజీ, నగరపాలక సంస్థ ఏసీపీ విజయ్‌భాస్కర్‌లు ప్రారంభించారు. తొలుత పలకలూరులో డొంక పోరంబోకును సర్వే చేస్తున్నారు. దీనికి 80 అడుగుల మేరకు హద్దులను నిర్ణయించారు. నేటి నుంచి ముమ్మరంగా భూసేకరణ ప్రారంభం కానుంది. సుమారు 4.21 కిలోమీటర్ల పొడవును 80 అడుగుల మేరకు ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. అడవి తక్కెళ్ళపాడుకు దక్షిణం వైపుగా ఈ రోడ్డును ఇన్నర్ రింగురోడ్డుకు ఫేజ్ 2కు ఎదురుగానే మార్కింగ్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. Share this post Link to post Share on other sites