Jump to content
Sign in to follow this  
sonykongara

Guntur city beautification

Recommended Posts

గుంటూరుకు సిటీ బస్సుల కళ

amr-gen1a.jpg

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గుంటూరు నగర ప్రాధాన్యత పెరిగింది. నగర ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ గుంటూరు తొలి నుంచి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా నగర వీధులను అనుసంధానం చేస్తూ గతంలో పద్దెనిమిది మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.36 లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ పెద్ద బస్సులను తీసుకువచ్చారు. అందులో అత్యంత ఆధునాతన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సులు మలుపుల వద్ద తిరగకపోవడం, సమయపాలన కొరవడటం కొంత నిరాశపరిచింది. అయినా ఆర్టీసీ అధికారులు వెనక్కు తగ్గలేదు. ఆర్టీసీకి నష్టం వాటిల్లినా.. రాజధాని నగర ప్రజలకు ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసులను అలవాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో రైట్‌..రైట్‌ అంటూ ముందుకు నడిపారు. ఇప్పటి పోటీ ప్రపంచంలో ప్రయాణికుల ఆలోచనలకు మరింత దగ్గరయ్యేందుకు ఆర్టీసీ మినీ బస్సులను కావాలని ఉన్నతాధికారులను అడిగారు. ఈనెల 13వ తేదీన గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌కు తొలి విడతగా అయిదు మినీ బస్సులను మంజూరు చేశారు. బస్సు అనుమతులు, ఇతరత్ర పనుల నిమిత్తం రెండు వారాలు డిపోకే మినీ బస్సులు పరిమితమయ్యాయి. అయితే సోమవారం బస్సులకు అనుమతి (పర్మిట్‌) లభించింది. దీంతో మంగళవారం ఉదయం 5.45 నుంచి రాజధాని నగర వీధుల్లో రైట్‌..రైట్‌ అంటూ బస్సులు దూసుకెళ్లాయి.

మినీ బస్సులను నగర ప్రధాన కూడళ్లతో పాటు జీఎంసీ పరిధిలోకి వచ్చిన నాలుగైదు గ్రామాల మీదగా బస్సు సర్వీసుల రూట్లను ఖరారు చేశారు. దశాబ్దాల తరబడి ఆర్టీసీ సర్వీసు ల్లేని పాతగుంటూరు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఏటీ అగ్రహారం మీదుగా బస్సులు వెళ్తున్నాయి. నగరంలోని వేలాది ఆటోల రద్దీ, అక్రమ వాహనాల నుంచి బయటపడేందుకు మినీ బస్సులు ప్రవేశం కచ్చితంగా ఆర్టీసీకి కాసుల పంట పడిస్తుందని ఆశిస్తున్నారు. ప్రయాణ ఛార్జీలను సైతం నగర వాసులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఎస్‌వీఎన్‌ కాలనీ నుంచి మార్కెట్‌కు ఆటోల్లో రూ.15లు చెల్లించాలి. అదే ఆర్టీసీ సిటీ సర్వీసుల్లో రూ.9లు చెల్లిస్తే ఎంచక్కా ప్రయాణించవచ్చు. ఎన్టీఆర్‌ బస్టాండ్‌ నుంచి ఏటీ అగ్రహారం పరిధిలోని బోరింగ్‌ పంపు సెంటర్‌కు ఆటోలో రూ.15లు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో రూ.9 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఎన్టీఆర్‌ బస్టాండ్‌ నుంచి లాడ్జి కూడలి, కొరిటెపాడు, విద్యానగర్‌కు ఆర్టీసీ ఛార్జీ రూ.8, రూ.9లు, ప్రైవేటు వాహనాల్లో రూ.10 నుంచి రూ.12లు ముట్టజెప్పాల్సిందే. నగరంలో తిరిగే బస్సుల నిర్ణీత వేళల ప్రచార బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దీనికై ప్రధాన కూడళ్లను ఎంపిక చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

నగరవాసులకు ఎంతో సౌకర్యం

రాజధాని నగర వాసుల సౌకర్యార్థం మినీ ఆర్టీసీ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. తొలి విడతగా అయిదు బస్సులు మంజూరు చేశారు. మిగతా బస్సులు దఫాల వారీగా త్వరలో రానున్నాయి. గతంలో గుంటూరు నగరాన్ని అనుసంధానం చేస్తూ, ప్రస్తుతం తిరిగే 18 మెట్రో సర్వీసులు కొనసాగుతాయి. మొత్తం 22 బస్సులను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశాం. అయితే ఆర్టీసీ సర్వీసులను నగర ప్రయాణికులు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Share this post


Link to post
Share on other sites
శిల్పారామం..ఆశాదీపం
 
636170403264627804.jpg
  • గుంటూరులో శిల్పారామానికి శంకుస్థాపన
  • తొలిదశలో 3.65 ఎకరాల భూమి కేటాయింపు
  • హస్తకళాకారులకు ప్రోత్సాహం

ఆంధ్రజ్యోతి, గుంటూరు : అంతరించిపోతున్న హస్తకళలను పరిరక్షించేందుకు.. శిల్పారామం నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన శిల్పారామంని నవ్యాంధ్రప్రదేశలో అన్ని జిల్లాలకు తీసుకురావాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం గుంటూరు నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శిల్పారామాన్ని మంజూరు చేస్తూ తొలి విడతగా రూ.కోటి నిధులను విడుదల చేశారు. భూమిని ఎంపిక చేసే ప్రక్రియలో కొంత జాప్యం జరగగా ఎట్టకేలకు కలెక్టర్‌ కాంతీలాల్‌దండే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అడవి తక్కెళ్లపాడు రోడ్డులోని ఇన్నర్‌రింగు రోడ్డు వద్ద 3.65 ఎకరాల భూమిని కేటాయించారు. తొలిదశ పనులు పూర్తి అయితే రెండోవిడతగా మరో 4.35 ఎకరాల భూమిని కూడా కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధత వ్యక్తం చేసింది.
 
 
జిల్లాలో ఇప్పటివరకు హస్తకళలు, చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు ఏడాదికి మూడు, నాలుగు సార్లు జరుగుతున్నాయి. హస్తకళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువులకు ప్రజల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ తగిన వేదిక లేకపోవడం వలన కళాకారులకు ప్రోత్సాహం తగ్గిపోతోన్నది. ఈ నేపథ్యంలో వారికి శాశ్వతంగా ఒక ఆశ్రయం కల్పించేందుకే శిల్పారామం నిర్మాణానికి ప్రభుత్వం పూనుకొన్నది. తొలి విడతగా సువిశాలమైన ఎగ్జిబిషన గ్రౌండ్‌ని ప్రాంగణంలో నిర్మిస్తారు. శాశ్వతంగా స్టాల్స్‌ నిర్మాణం పూర్తి చేస్తారు. గ్రామీణ వంటల రుచులు అందించేందుకు ఫుడ్‌కోర్టులు నిర్మిస్తారు. నిత్యం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలుగా ఒక కళావేదికని నిర్మిస్తారు. దీని వలన నిత్యం సాయంత్రం వేళ సందర్శకులను ఆకర్షించ వచ్చని అధికారులు చెబుతోన్నారు. చేతి పనులు, ఆహార, సాంస్కృతిక కార్యక్రమాలతో నిరంతరం ఉండే శాశ్వతమైన మార్కెట్‌ని శిల్పారామంగా ప్రభుత్వం పరిగణిస్తోంది.

రెండో విడత నిర్మాణం జరిగితేనే...
శిల్పారామం రెండో విడత పనులు అత్యంత కీలకం. ఇందుకోసం రూ.9 కోట్లను ప్రభుత్వం విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తపరిచింది. ప్రధానంగా సంప్రదాయ వేదిక, భోజనశాల, కళాకారుల విశ్రాంతి భవనం, పురావస్తు, హస్తకళల ప్రదర్శనశాల, విద్యార్థుల నైపుణ్య శిక్షణ శిబిరం, చేతివృత్తి కళాకారులు తయారు చేసే విధానాన్ని ప్రదర్శంచే శాలలు, జిల్లాలోని చారిత్రక కట్టడాల నమూనాలతో ప్రదర్శన శాల, ఆర్ట్‌ గ్యాలరీ, గ్రామీణ మ్యూజియం, చిన్నపిల్లల ఆట వస్తువులు వంటివి ఏర్పాటు చేస్తారు.

హస్తకళల ప్రదర్శనకు గుంటూరు కేంద్రం : మంత్రి రావెల
సాంస్కృతిక కార్యకలాపాలు, హస్తకళల ప్రదర్శనకు గుంటూరు నగరం వేదిక కాబోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని అడవి తక్కెళ్లపాడు రోడ్డులో శిల్పారామం ప్రాంగణం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి శిల్పారామం నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ శిల్పారామం నిర్మాణం వలన చుట్టుపక్కల ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అడవి తక్కెళ్లపాడు పరిసర ప్రాంతాల్లో రూ.13 కోట్లతో గురుకుల పాఠశాల, రూ.10 కోట్లతో క్రైస్తవ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.
 
రూ.4.50 కోట్లతో యూత ట్రైనింగ్‌ సెంటర్‌ని కూడా ఇక్కడే నిర్మించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం అడవి తక్కెళ్లపాడులో నిర్మాణం చేపడతామన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ శిల్పారామం నిర్మాణం పూర్తి అయితే గుంటూరు నగరం కల్చరల్‌ హబ్‌గా మారుతుందన్నారు. మిర్చియార్డు చైౖర్మన మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మన సంస్కృతి మరిచిపోతున్న సందర్భంలో శిల్పారామం ఏర్పాటు వలన పునరుజ్జీవం లభిస్తుందన్నారు. అర్బన బ్యాంకు చైౖర్మన బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ వట్టికూటి హర్షవర్ధన, శిల్పారామం ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఏవో గణేష్‌, హీరా, టీడీపీ రూరల్‌ నాయకులు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి, పసుపులేటి సుబ్బారావు, మన్నవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×