Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
జెట్‌ స్పీడ్‌లో గ్రౌటింగ్‌
22-10-2018 02:44:48
 
636757730894198373.jpg
  • నేటితో పరిసమాప్తి.. సమీక్ష కోసం నేడు పోలవరానికి సీఎం
ఏలూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి గతవారానికి మిగిలిన 154 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌ పనులను నిర్మాణ సంస్థ యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సుమారు 1620 మీటర్ల మేరకు జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తి చేయాలి. కానీ మధ్యలో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపరాదన్న ప్రభుత్వ ఆదేశంతో... జెట్‌ గ్రౌటింగ్‌ను సోమవారానికి పూర్తి చేయనున్నారు.
 
సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రతివారమూ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఈ సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి... నిర్మాణ పనులపై సమీక్షించనున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 59.32శాతం పనులు పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి 48వ పిల్లర్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఒక గేటును అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సాధ్యంకాలేదు. ఒకటికి రెండుసార్లు సమీక్షించి వెంటనే నిర్మాణ పనిని పూర్తి చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
 
అయితే డిజైన్ల అనుమతిలో ఉన్న ఆటంకాలు తొలగకపోవడం, ప్రతిదానికీ సీడబ్ల్యూసీ కొర్రీలు పెట్టడంతో పోలవరంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించారు. దీనికి తగ్గట్టుగానే కొన్ని పనుల విషయంలో పురోగతి కనిపించడంలేదు. మెయిన్‌ డ్యాం 45.80% పూర్తికాగా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌లలో 79% పనులు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల విషయంలో 61.85% పురోగతి నమోదు చేయగా.. డయాఫ్రమ్‌ వాల్‌ వందశాతం, కాంక్రీట్‌ 56.6%, కుడికాలువ 90%, ఎడమకాల్వ 64.22% పనులు పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

2nd week of October lo (8th-14th Oct)

87.9% of targeted excavation work chesaru

111.9% of targeted concrete work chesaru

 

This is the best week ippati varaku nenu chusinantha varaku

Pace inka baaga penchaali. At the current rate, April ki 68% complete avthundhi overall project. But work is expected to speed up now. Overall ga 75% reach ayite baaga project chesukovacchu.

Link to comment
Share on other sites

వచ్చే ఏడు నెలలే కీలకం
మే నాటికి పోలవరం పూర్తి లక్ష్యం
ప్రాజెక్టు 59.63 శాతం పూర్తి
డిసెంబరులో గేట్ల పనులు ప్రారంభం
ఎన్ని అడ్డంకులొచ్చినా సవాలుగా తీసుకుంటాం
ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు, పోలవరం, న్యూస్‌టుడే
22ap-main6a.jpg

పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు. ‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్‌ఛానల్‌, స్పిల్‌వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు. ప్రాజెక్టును సోమవారం 28వసారి ఆయన సందర్శించారు. మధ్యాహ్నం రెండింటికి హెలికాప్టర్‌లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన హిల్‌వ్యూ కొండపై నుంచి పనులను పరిశీలించారు. అనంతరం స్పిల్‌వేలో 26వ బ్లాకు పనులను చూశారు. ఆ తరువాత త్వరలో ప్రారంభించబోయే ఎగువ కాపర్‌డ్యాం ప్రాంతం వద్దకు వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు.

కేంద్రం నుంచి రూ.3150 కోట్ల బకాయి
‘ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీకి శ్రీకారం చుట్టాం. మొదటిదశలో నాగార్జునసాగర్‌ కుడి ప్రధానకాల్వకు నీరిస్తాం. రెండో దశలో సోమశిలకు, మూడో దశలో బొల్లపల్లికి నీరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 61 ప్రాజెక్టులు నిర్మిస్తుండగా 18 ఇప్పటికే పూర్తి చేశాం. మరో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 20 వివిధ దశల్లో ఉన్నాయి. 16 టెండర్ల దశలో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నిర్వాసితుల ఇళ్ల నాణ్యతలో రాజీపడబోం
పోలవరాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నవయుగ, త్రివేణి సంస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి అభినందించారు. జూన్‌ వరకు వర్షాలు కురవనందున పనులు మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. దీనిపై రాజీపడే సమస్యే లేదని అన్నారు. గతంలో నిర్వాసితులకు రూ.50 వేలతో ఇళ్లు నిర్మిస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం రూ.3.50 లక్షలతో ఇళ్లు నిర్మిస్తున్నామని, అదికాకుండా నిర్వాసితులకు రూ.ఆరు లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని వివరించారు.

22ap-main6b.jpg
Link to comment
Share on other sites

పోలవరంపై చర్చిద్దాం రండి
దిల్లీ నుంచి ఏపీ ఆధికారులకు పిలుపు
నవంబరు 2న కేంద్ర కార్యదర్శి వద్ద భేటీ
డీపీఆర్‌-2పై స్పష్టమైన  సంకేతాల విడుదలకే!
డీపీఆర్‌-2పై 2న భేటీ

పోలవరం ప్రాజెక్టులో రూ.57,900 కోట్ల మేర సవరించిన అంచనాలపై (డీపీఆర్‌ 2) చర్చించేందుకు కేంద్ర జలవనరులశాఖ అధికారుల నుంచి రాష్ట్రానికి పిలుపు వచ్చింది. నవంబరు 2న దిల్లీకి రావాల్సిందిగా వర్తమానం అందింది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, పునరావాస కమిషనర్‌ రేఖారాణి తదితరులు ఈ సమావేశానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం పోలవరం అంచనాలు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర జలసంఘంలోని వ్యయ అంచనాల మదింపు డైరెక్టరేట్‌ ఈ వివరాలపై సంతృప్తి చెందితే తర్వాత సాంకేతిక సలహా కమిటీ సమావేశం ఉంటుంది. అక్కడ ఆమోదించిన తర్వాత కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర ఆర్థికశాఖలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. పోలవరం సవరించిన అంచనాలపై ఇప్పటిదాకా పంపిన సమాధానాలకు సంబంధించి ఇంతవరకు మళ్లీ ఎలాంటి అభ్యంతరాలు కేంద్రం నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సింగ్‌ వద్ద సమావేశంలో డీపీఆర్‌-2పై ఒక స్పష్టమైన సంకేతాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

పోలవరంలో ఇంటికో 50,000
30-10-2018 04:06:57
 
636764693727036642.jpg
  • 49,106 గిరిజనేతర కుటుంబాలకు ప్రయోజనం
  • నిర్వాసితులకు బాబు అదనపు వరం
  • ప్రభుత్వంపై 245.53 కోట్ల భారం
  • మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలి
  • జనవరికల్లా 48 కాలనీలు పూర్తికావాలి
  • కాంట్రాక్టర్లు, అధికారులకు సీఎం స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నట్లుగానే.. గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల భారం పడుతుంది. అయితే ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేదిలేదని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.15 వేలు అదనంగా ఇవ్వాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు. జనవరికల్లా 48 కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావసం, పరిహారానికి చెందిన సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిర్వాసితులు ప్రభుత్వం నిర్మించే గృహ విస్తీర్ణం కన్నా మరింత విశాలంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దన్నారు. వీలైతే బ్యాంకుల నుంచి వారు రుణాలు పొందేందుకు సహకరించాలని సూచించారు.
 
ప్రాజెక్టు 60% పూర్తి..
పోలవరం ప్రాజెక్టు 60 శాతం పూర్తయి మరో మైలు రాయిని అధిగమించిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు జరిగాయని వెల్లడించారు. మట్టి పనులూ రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల దాకా జరిగాయన్నారు.
 
ముంపు.. పునరావాసం, పరిహారం ఇలా..
ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలోని 8 గ్రామాల్లోని 3,992 నిర్వాసిత కుటుంబాలకు 2014లో పునరావాసం పూర్తయింది. ఇంకా 16,048 నిర్వాసిత కుటుంబాలను తరలించాలి. వీరికోసం 48 కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. 2013 భూసేరణ చట్టం ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఒక్కో నిర్వాసిత కుటుంబానికి అందిస్తారు. పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు రూ.5,00,000.. 12 నెలలకు రూ.36 వేల గ్రాంటు (నెలకు రూ.3,000 చొప్పున), ఎస్సీ, ఎస్టీల తరలింపునకు అదనంగా రూ.50 వేలు, చేతివృత్తుల వారికి, వ్యాపారులకు అదనంగా రూ.25 వేలు, పశుశాలకు అదనంగా రూ.25 వేలు.. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి ఇంటి స్థలం (243 చదరపు గజాలు) రూ.1,00,000, ఇంటి నిర్మాణానికి (ఐఏవై) రూ.2,84,000, ఎస్టీ కుటుంబాలకు అదనంగా రూ.75 వేలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.6,86,000, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక్కో కుటుంబానికి రూ.7,00,000.. మొత్తం రూ.18,45,000. ఎస్టీయేతరులకు రూ.18,20,000 వ్యయమవుతుంది.
Link to comment
Share on other sites

పోలవరంలో మరో కీలక నిర్మాణం పూర్తి
30-10-2018 04:11:54
 
636764695152813914.jpg
  •  ముగిసిన జెట్‌ గ్రౌటింగ్‌ పనులు
  •  రికార్డు టైంలో పూర్తిచేసిన కెల్లార్‌ సంస్థ
  •  వచ్చే వారం గడ్కరీతో సమావేశం
  •  నేడు గండికోట వద్ద సీఎం జలహారతి: దేవినేని
పోలవరం/అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం సోమవారం పూర్తయింది. గోదావరి గర్భంలో నిర్మించే దిగువ కాపర్‌ డ్యాంకు సంబంధించి ముందుగా నిర్మాణం చేపట్టిన జెట్‌ గ్రౌటింగ్‌ పని సోమవారం సాయంత్రంతో పూర్తయింది. 2017 నవంబర్‌ 26న ప్రారంభించిన జెట్‌ గ్రౌటింగ్‌ నిర్మాణ పని 2018 ఫిబ్రవరి 3వ తేదీ వరకు తొలిదశ పూర్తిచేశారు. అనంతరం 2018 జూలై 5వ తేదీన జెట్‌గ్రౌటింగ్‌ పని ప్రారంభించినప్పటికీ వరదల కారణంగా ఆగస్టు, సెప్టెంబరుల్లో నిలిచిపోయింది. మొత్తం 1,417 మీటర్ల పొడవున దీనిని నిర్మించాల్సి ఉండగా వరదలకు ముందు 1,098 మీటర్ల వరకు పని పూర్తయింది. మిగిలిన 319 మీటర్ల పనిని ఈ నెలలో పూర్తిచేశారు. కాఫర్‌ డ్యాంకు దిగువన గోదావరి జలాలు ఊట రాకుండా, ఇసుకను గట్టి పరచడమే జెట్‌ గ్రౌటింగ్‌. ఈ పనిని రెండు డయా మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు చొప్పున ఒక కాలమ్‌గా ఇసుకను గట్టి పరిచారు.
 
మొత్తం 947 కాలమ్స్‌లో ఈ జెట్‌ గ్రౌటింగ్‌ పనులు పూర్తిచేసినట్లు ప్రాజెక్ట్‌ ఈఈ డి.శ్రీనివాస్‌, డీఈ కృష్ణారావు తెలిపారు. కెల్లార్‌ సంస్థ రికార్డు సమయంలో ఈ పనులను పూర్తిచేసిందని జలవనరుల మంత్రి దేవినేని ఉమ సచివాలయంలో తెలిపారు. ఒక నాయకుడు జెట్‌ గ్రౌటింగ్‌ కొట్టుకుపోయిందని అంటున్నారని, అసత్యాలు చెబితే జాతి క్షమించదని స్పష్టం చేశారు. డిసెంబరు రెండో వారంలో గేట్లు అమర్చే పని చేపడతామన్నారు. వచ్చేవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అవుతామన్నారు.
 
సుజల స్రవంతికి శంకుస్థాపన
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నవంబరు తొలివారంలో శంకుస్థాపన చేయనున్నట్లు దేవినేని చెప్పారు. గోదావరి డెల్టాలో రెండో పంటకు నీరు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులకు రూ.61,242 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పట్టిసీమ ద్వారా 78 టీఎంసీలు తరలించి కృష్ణా డెల్టాను ఆదుకున్నామని చెప్పారు. డిసెంబరు నాటికి హంద్రీ-నీవా జలాలను కుప్పానికి తరలిస్తామన్నారు. సీఎం మంగళవారం గండికోట రిజర్వాయరును సందర్శించి జలహారతి ఇస్తారని చెప్పారు. చోడవరం, వైకుంఠపురం ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Link to comment
Share on other sites

ర్యాటక పోలవరం...!
5 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో పర్యాటక ప్రాజెక్టులను పది-పదిహేనేళ్లలో రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు నివేదిక ప్రాథమికంగా సిద్ధమైంది. కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచుతామని పర్యాటక శాఖ కమిషనర్‌ హిమాన్షు శుక్లా చెప్పారు. పోలవరం సమీపంలో 20 పురావస్తు ప్రాంతాలు, ప్రాశస్త్యం ఉన్న 10 ఆలయాలున్నాయని వాటన్నింటికీ పర్యాటక శోభను పెంచేలా కొత్త పర్యాటకప్రాజెక్టుల్లో ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
ప్రధాన ప్రాజెక్టులు:
రావరపు వాటర్‌ఫ్రంట్‌
* అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌
* 7, 5 స్టార్‌ హోటళ్లు
* వెల్‌నెస్‌ కేంద్రం
* డైవింగ్‌ ఏరియా
* చెట్లపై ఇళ్లు..
* డ్యాం మ్యూజియం

ఉప విభాగాల్లో
* కన్వెన్షన్‌ సెంటర్‌
* గోల్ఫ్‌క్లబ్‌
* బొటానికల్‌ గార్డెన్‌
* ఆధ్యాత్మిక ఆహ్లాద కేంద్రం
* జలక్రీడలు
* సాహసక్రీడలు
* ఫిల్మ్‌సిటీ

Link to comment
Share on other sites

ప్రోత్సహిస్తే పర్యాటకంలో ప్రగతి
ఏపీ పర్యాటకంపై విజయవాడలో సదస్సు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పర్యాటకానికి విశేష అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పర్యాటకంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాగే నవ్యాంధ్రకూ గుర్తింపు సాధించేలా కృషి చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. పర్యాటక గమ్యస్థానం ఏపీ అంశంపై ఆంధ్రా ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ విజయవాడ చాప్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో సదస్సు నిర్వహించారు. ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షురాలు వీఎల్‌ ఇందిరాదత్‌, విజయవాడ చాప్టర్‌ అధ్యక్షుడు ఎం.రాజయ్య తదితరులు రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు చేశారు. హోటళ్లు 24గంటలూ తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వాలని వారు సూచించారు. నక్షత్ర హోటళ్లకు జీఎస్టీలో ఏకరూపత ఉండేలా కేంద్రానికి సిఫారసు చేయాలని పేర్కొన్నారు. 2014లో తొమ్మిది కోట్లమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తే గతేడాది ఆ సంఖ్య 16కోట్లకు చేరిందని పర్యాటకశాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. 2020నాటికి రూ.10వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర పర్యాటక రంగంలో లక్ష్యంగా నిర్దేశించుకుంటే ఇప్పటికే రూ.15వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. ‘హోటళ్లు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సరైన పద్ధతిలో వినియోగించుకుని ఫలితాలు సాధిస్తే అప్పుడు 24గంటలు తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వడంపై ప్రభుత్వాన్ని కోరతామని ఏపీటీడీసీ ఎండీ హిమాన్షుశుక్లా తెలిపారు. సమావేశంలో ఏపీటీడీసీ ఛైర్మన్‌ ఆచార్య జయరామిరెడ్డి, జంధ్యాల శంకర్‌ (మాజీ మేయర్‌), తరుణ్‌ (అమరావతి బోటింగ్‌ క్లబ్‌), వాల్మీకి హరికృష్ణ (స్కాల్‌ ఇంటర్నేషనల్‌), కొడాలి సుభాష్‌చంద్రబోస్‌ (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సొసైటీ) తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోలవరం నిర్మాణానికి 16 లక్షల విరాళం
30-10-2018 03:21:45
 
636764665061804199.jpg
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్మాణానికి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పెదరావూరు గ్రామ రైతులు రూ.16,45,101 విరాళాన్ని సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అలాగే తితలీ తుఫాను బాధితుల సహాయార్థం కృష్ణా జిల్లా లారీ ఓనర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటీవ్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రూ.5 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...