Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరానికి కేంద్ర బృందాలు
30-08-2018 03:42:09
 
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి జల సంఘం బృందాలను పంపుతామని కేంద్ర జల వనరుల కమిషనర్‌ కె.వోరా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. ఈ బృందాలు పోలవరం ప్రాంతంలో పర్యటించి నిర్మాణ పనులను, సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షిస్తాయని సమాచారమిచ్చారు. ఇంకోవైపు.. పోలవరం తుది అంచనాల విషయలో కేంద్రం వేసిన కొర్రీలకు జవాబిచ్చేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి సమర్పించే సవరణ అంచనాలే ఆఖరివని, కేంద్ర ఫార్మాట్‌లో సిద్ధం చేశాక.. దానిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శికి చూపించాలని కేంద్రం సూచించింది.
Link to comment
Share on other sites

పోలవరానికి ట్రాన్స్‌ట్రాయ్‌ దూరం
మరికొన్ని పనులు నవయుగకు అప్పజెప్పేందుకు ఏర్పాట్లు
మొత్తం రూ. 5438 కోట్ల ప్రధాన డ్యాం పనుల్లో రూ. 4146 కోట్ల పనులు ఈ సంస్థకే..

ఈనాడు, అమరావతి:  పోలవరం ప్రధాన ఆనకట్ట(డ్యాం) నిర్మాణంలో కీలక గుత్తేదారుగా టెండర్లలో పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ ఆ ప్రాజెక్టు నుంచి దాదాపు వైదొలిగే పరిస్థితి.. ప్రాజెక్టులో ఇక దాని పాత్ర నామమాత్రం కాబోతోంది. ఇప్పటికే ముఖ్యమైన స్పిల్‌ వే కాంక్రీటు తదితర పనులు అనేకం నవయుగ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇక ప్రధాన డ్యాంలో రాతిమట్టి కట్ట నిర్మాణం, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలపై కట్టల నిర్మాణ పనులు సైతం ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి తొలగించి నవయుగకు అప్పజెప్పాలనే నిర్ణయం జరిగింది. రాష్ట్రస్థాయి స్టాండింగు కమిటీలో ఈ ప్రతిపాదన ఉంచి నిర్ణయం తీసుకుని వారితో ఒప్పందం అనంతరం పనుల అప్పగింతే మిగిలింది. ఇప్పటికే రూ.2907 కోట్ల పనులు నవయుగకు ప్రభుత్వం అప్పజెప్పింది. మరో రూ.1239 కోట్ల వరకు పనులూ దానికే కట్టబెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం రూ.5438 కోట్ల ప్రధాన పోలవరం డ్యాం పనుల్లో రూ.4146 కోట్ల విలువైన పనులు ఈ కంపెనీకే దక్కినట్లవుతుంది. ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎదురైన ఇబ్బందులు ఇతర అంశాల నేపథ్యంలో పోలవరంలో ఈ బదలాయింపు ప్రక్రియ కొలిక్కి వస్తోంది.

31ap-main17a.jpg

ప్రధాన డ్యాం రాతి, మట్టికట్ట పనులూ..
వర్షాలు తగ్గి, గోదావరి ప్రవాహాలు నెమ్మదించాక అక్టోబరు లేదా నవంబరు నుంచి పనుల సీజన్‌ ప్రారంభమవుతుంది. పోలవరంలో ప్రస్తుతం స్పిల్‌ వే కాంక్రీటు తదితర పనులు సాగుతున్నా 2019 మే నాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల  నిర్మాణం పూర్తికావాలి. అదే సమయంలో ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మాణం, ప్రధాన డ్యాంలో గ్యాప్‌ 1, గ్యాప్‌ 3లు కూడా 2019 చివరికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రధాన డ్యాం రాతి, మట్టి కట్ట పనులకు రెండు సీజన్లు అవసరమవుతాయి. అంటే ఆ పనులూ వచ్చే అక్టోబరుకల్లా ప్రారంభించాలి. మధ్యలో ఇక సెప్టెంబరే మిగిలింది. దీంతో ఈ పనుల వేగం పెంచేందుకు, అనుభవం ఉన్న గుత్తేదారుకు అప్పజెప్పాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్రాన్స్‌ట్రాయ్‌కు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో 60సి కింద వీరికి నోటీసులు ఇచ్చి వారి నుంచి పనులు తొలగించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఇప్పుడు ఈ పనులు నవయుగకే కట్టబెట్టనున్నారు. డ్యాంకు గేట్ల ఏర్పాటు పనులు బెకం సంస్థకు అప్పగించేందుకు నిర్ణయించారు.

60 సి సాయంతోనే ప్రధాన గుత్తేదారు మార్పు
టెండర్ల ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌ ఈ పనులు దక్కించుకోగా.. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవకుండానే 60 సి నిబంధనను అమలుచేస్తూ ప్రధాన గుత్తేదారును మార్చగలిగే కొత్త ప్రక్రియలో ఈ బదలాయింపు సాగింది. గతంలో పోలవరం పనులు ఈపీసీ విధానంలో అప్పగించారు. తర్వాత 60 సి కింద తొలగించి కొంత పనిని నవయుగకు అప్పగించారు. ఈపీసీ విధానంలో తొలగించి ఎల్‌ఎస్‌ పద్ధతిలో ఇప్పటికే రూ.2907 కోట్ల విలువైన పని అప్పగించారు. నేరుగా పోలవరం అధికారులే కొత్త గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నవయుగ ప్రధాన గుత్తేదారుగానే ప్రవేశించింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చే పనులూ ఈ విధానంలోనే అప్పగించబోతున్నారు.

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

daridram poyindi

Link to comment
Share on other sites

పోలవరంలో జెబోల్టుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణంలో గేట్ల బిగింపు కార్యక్రమానికి సంబంధించి కాంక్రీట్‌లో జెబోల్టులు వేసే ప్రక్రియను శుక్రవారం 43వ బ్లాక్‌లో ప్రారంభించినట్లు గేట్ల పనులు పర్యవేక్షిస్తున్న ఈఈ పి.సుధాకర్‌రావు చెప్పారు. ఇవి కాంక్రీట్‌లో అంతర్లీనమవుతాయన్నారు. వీటి పైభాగానికి గడ్డర్లు పెట్టి బిగిస్తారు. స్టాప్‌ లాక్‌ గేట్ల కోసం 24.511 నుంచి 24.841 మీటరు వరకు ప్రక్రియ సాగుతుందన్నారు.

Link to comment
Share on other sites

పోలవరం పనుల ప్రగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
03-09-2018 12:56:49
 
636715762086343769.jpg
అమరావతి: పోలవరం పనుల ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరంలో పనులను లైవ్ ద్వారా సీఎం వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారంలో 8.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాల పనులు జరిగాయని తెలిపారు. అలాగే స్పిల్ వే పనులు 89 వేల క్యూబిక్ మీటర్లకు గాను 87 వేల క్యూ.మీ పనులు జరిగాయన్నారు. వర్షాలు, వరద నీటి వల్ల స్పిల్ ఛానల్‌లో పనుల వేగం తగ్గిందని చెప్పుకొచ్చారు. గత లక్ష్యాలు అధిగమిస్తూనే...కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

నేడు పోలవరం నిపుణుల కమిటీ రాక
రేపు, ఎల్లుండి పరిశీలన, సమావేశాలు
ఆ తర్వాత పునరావాసంపై క్షేత్ర పరిశీలనకు కేంద్ర బృందాలు
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి సమగ్రంగా నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీ బుధవారం రాబోతోంది. వీరు మూడు రోజుల పాటు ఈ పనిలోనే ఉంటారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి సమగ్రంగా పరిశీలించడంతో పాటు ఉన్నతాధికారులతోను సమావేశం కానున్నారు. కేంద్ర జలసంఘం సభ్యుడు ప్రాజెక్టుల పనులు, ప్రణాళికల విభాగం పర్యవేక్షించే వై.కె.శర్మ ఛైర్మన్‌గా ఈ కమిటీ రానుంది. ప్రాజెక్టుల ప్రిపరేషన్‌ సంస్థ చీఫ్‌ ఇంజినీరు, కమిటీ కన్వీనర్‌  పచౌరి, కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరక్టర్‌ ఎన్‌.కె.సింగ్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్‌ ఇంజినీరు ఎ.కె.ప్రధాన్‌, ప్రాజెక్టుల పర్యవేక్షణ విభాగం చీఫ్‌ ఇంజినీరు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్‌ గుప్తా, పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ డైరక్టర్‌లు ఈ కమిటీలో సభ్యులు. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా, కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు డి.వి.తరేజా తదితరులను ప్రత్యేక ఆహ్వానితులు. ఈ కమిటీకి మసూద్‌ ఛైర్మన్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జలసంఘం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో శర్మ ఈ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో మసూద్‌ కమిటీ పోలవరం ప్రాజెక్టును మూడు సార్లు పర్యటించి నివేదికలు ఇచ్చింది. వారు అనేక లోపాలను అప్పట్లో నివేదికల్లో ప్రస్తావించగా...ఆ తర్వాత పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వాటికి ప్రత్యుత్తరమూ ఇచ్చారు. ఐదు నెలల తర్వాత ఇప్పుడు నాలుగోసారి ఈ కమిటీ పర్యటనకు వస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్న నేపథ్యంలో పనుల ప్రగతి తీరుపైనా, నాణ్యత- ఇతరత్రా అంశాలపైనా వీరి అభిప్రాయమూ కీలకం కానుంది. అయితే ఇది పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణ, సాంకేతిక అంశాలకు సంబంధించిన కమిటీయేననే అభిప్రాయమూ ఉంది.

కమిటీ పర్యటన వివరాలు
ఈ కమిటీ బుధవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంటుంది. అక్కడ పోలవరం అధికారులతో ప్రాథమికంగా ఒక సమావేశం నిర్వహిస్తుంది. తాజా ప్రగతిపై వివరాలు కోరుతుంది. గురువారం పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంతో పాటు కాలువల్లో కొంత భాగం పరిశీలించనున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో పోలవరం ఉన్నతాధికారులు, జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. పరిశీలనాంశాలను అధికారుల వద్ద ప్రస్తావించి సమాధానాలు రాబడతారు. అనంతరం ఈ కమిటీ తన పరిశీలనాంశాలను కేంద్రానికి నివేదిస్తుంది.

కేంద్ర బృందాలూ రాక!
సవరించిన అంచానల్లో పునరావాసం, భూసేకరణ అంశాల పరిశీలనకు త్వరలో కేంద్ర బృందాలు రానున్నాయి. ఇప్పటికే నాలుగు బృందాలను కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసింది. ఒకో బృందంలో ముగ్గురు చొప్పున సభ్యులు ఉన్నారు. కేంద్ర జలసంఘం డైరక్టర్‌ నేతృత్వంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ నుంచి సభ్యులను ఎంపిక చేశారని తెలిసింది. తూర్పుగోదావరికి రెండు, పశ్చిమగోదావరికి రెండు బృందాలు రానున్నాయి.

కమిటీ విధివిధానాలు

* పోలవరం ప్రాజెక్టుకు నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ 10న నియమించింది. తిరిగి అదే సంవత్సరం జూన్‌ నెలలో పునర్‌ వ్యవస్థీకరించింది.
* కమిటీ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. కనీసం మూడు నెలలకోసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలి.
* పోలవరం ప్రాజెక్టు వ్యయం కోణంలోను, నిధుల నిర్వహణ విషయంలోను కమిటీ పరిశీలన సాగాలి.
* ఈ కమిటీ పోలవరం ఆకృతుల కమిటీతోను, గుత్తేదారులతో, రాష్ట్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో, కేంద్ర జలసంఘం ఆకృతుల విభాగంతో, కేంద్ర విద్యుత్తు పరిశోధన సంస్థ బృందంతో సమన్వయం చేసుకుంటూ అధ్యయనాలు, ఆకృతులు, వాటి అమలతో పాటు ఏమైనా ప్రతిబంధకాలు ఉన్నాయేమో గుర్తిస్తూ వాటిని అధిగమించేందుకు బాధ్యత వహించాలి.
* కేంద్ర జలసంఘం ఆమోదించిన ఆకృతుల మేరకు పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించాలి. పూర్తి ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగా పనులు సాగుతున్నాయో లేదో చూడాలి. కేంద్రం ఇచ్చిన నిధులకు అనుగుణంగా పనులు సాగాయో లేదో కూడా పరిశీలించాలి.
* ప్రాజెక్టులో వివిధ అంశాల్లో నాణ్యత, భద్రతాపరమైన అంశాలు పరిశీలించాలి. నిర్ణీత గడువులోగా పనులయ్యే అవకాశం ఉందా లేదా, అందుకు తగ్గ సామర్థ్యం గుత్తేదారులకు ఉందా లేదా అన్నది పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వాలి.

Link to comment
Share on other sites

రేపు పోలవరంలో శర్మ కమిటీ పర్యటన
05-09-2018 03:29:03
 
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌ వైకే శర్మ నేతృత్వంలోని బృందం బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం గన్నవరం వస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్తారు. గురువారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల తీరును పరిశీలిస్తారు.
Link to comment
Share on other sites

8 hours ago, sonykongara said:

n7yHQkR.jpgYCvHbbE.jpg

"nanyatha param ga drushti pettali" --- this needs to be taken care and fixed with utmost due diligence. We don't want to see any issues like Panjaguta fly over collapse (in YS Rajasekhar Reddy, the scammer, rule), Flyover collapse in Thane of Maharashtra (BJP is ruling the state there) and Kolkata fly over collapse.

Link to comment
Share on other sites

Orey Committe batch meeru enni sarlu vachi enth pariseelana chesina meeku em dorakadhu. Memu Polavaram maa kosam nirminchukuntunnam, mee Modi gaadi laaga publicity kosam kadhu.

Mundu aa Modi gadikelli funds ivvamani cheppandi. funds isthe CBN tho paatu charithralo oka sentence lo aina mee vadi perundidhi Meeru ichina ivvakapoyina memu ide quality tho kadatham and poorthi chestham. 

Link to comment
Share on other sites

16 hours ago, Hello26 said:

"nanyatha param ga drushti pettali" --- this needs to be taken care and fixed with utmost due diligence. We don't want to see any issues like Panjaguta fly over collapse (in YS Rajasekhar Reddy, the scammer, rule), Flyover collapse in Thane of Maharashtra (BJP is ruling the state there) and Kolkata fly over collapse.

+11111

Link to comment
Share on other sites

పోలవరంలో పనితనం మెరుగుపడాలి
శాశ్వత నిర్మాణమైనందున  మరింత దృష్టి పెట్టాలి
చిన్నచిన్న లోపాలే నాణ్యతపై ప్రభావం చూపుతాయి..
ప్రాజెక్టు అధికారులతో  నిపుణుల కమిటీ ఛైర్మన్‌ శర్మ

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో పనితనం మరింత మెరుగుపడాలని కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వై.కె.శర్మ సూచించారు. ఇది శాశ్వత కట్టడమైనందున మరింత దృష్టి పెట్టాలని అన్నారు. ప్రాజెక్టు ప్రధానడ్యాం పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ బృందం గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పోలవరం అధికారులతో సమావేశమైంది. స్థూలంగా చూస్తే అంతా సంతృప్తికరమేనని, సూక్ష్మంగా చూసిన సందర్భంలో కొన్ని లోపాలు సరిదిద్దాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. స్పిల్‌వేలో షట్టర్ల మధ్య కొంత గ్యాప్‌ వస్తోందని, చీలికలుగా కనిపిస్తోందని వారన్నారు. షట్టర్ల మధ్య ఉన్న సందుల(గ్యాప్‌) నుంచి కొంత ముద్ద(స్లర్రీ) కారడం కనిపిస్తోందని, అక్కడ కాంక్రీటు వద్ద రాళ్లు కనిపిస్తున్నాయని ప్రస్తావించారు. అలాంటి చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శర్మ అన్నారు. జాయింట్ల వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడం మంచిది కాదని, ఇవి చిన్న విషయాలైనా కట్టడం నాణ్యతపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. స్పిల్‌వే 2, 3 బ్లాకుల వద్ద వాలులో పైకి స్టీల్‌ ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. మొదట్లో కేంద్ర జలసంఘం నిపుణుల సూచనల ప్రకారమే పనులు చేశామని, ఈ ఇబ్బంది ఉందని గతంలో సూచించగా మసూద్‌ కమిటీ మార్పులు సూచించిందని గుత్తేదారు ప్రతినిధి వివరించినట్లు సమాచారం. మూడునెలలకోసారి నాణ్యతను పరిశీలిస్తున్నామని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు చెప్పారు. అలాకాకుండా మధ్యమధ్యలోనూ వచ్చి సూచనలు ఇవ్వాలని జలసంఘం ప్రతినిధులు చెప్పారు. కన్సల్టెన్సీ సేవలందిస్తున్న వ్యాప్కోస్‌ వారితోనూ మాట్లాడారు. గ్యాలరీలో గ్రౌటింగు పనులు ఇప్పటినుంచే చేసుకుంటూ వెళ్లాలని చెప్పారు. నిపుణుల కమిటీ బృందం ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించింది. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాలో నీరు చేరుతున్న పవిత్రసంగమ ప్రాంతాన్ని కూడా చూసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...