Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

CBN eppudu edo oka work chesthunte vuntaaru, district visit/project visit/foreign visit for investment ayina edo oka gola vuntadi evaro okari nunchi. Raavalsinantha milege ravadam ledu edo oka negative incident tho.

 

Inkopakka KCR 350 days intlo bobbunna evadu emi adagaru antha baagundi antunnaru in TG.

Link to comment
Share on other sites

CBN eppudu edo oka work chesthunte vuntaaru, district visit/project visit/foreign visit for investment ayina edo oka gola vuntadi evaro okari nunchi. Raavalsinantha milege ravadam ledu edo oka negative incident tho.

 

Inkopakka KCR 350 days intlo bobbunna evadu emi adagaru antha baagundi antunnaru in TG.

Link to comment
Share on other sites

సుందర దృశ్యం..అద్భుతం ఆవిష్కృతం
weg-sty1a.jpg

ఎత్తైన కొండలు.. దట్టమైన చెట్ల మధ్యలో నుంచి గోదారమ్మ పరవళ్లు, హోయలు, పచ్చని పాపికొండల అందాలు చూడాలని ఉందా? తొందరపడితే కుదరదు మరి.. కొన్నాళ్లు ఆగాలి. అదీ ఎక్కడనుకుంటున్నారు? మన పోలవరం మండలం కొరుటూరులో. మరెందుకు ఆలస్యం. ఆ అవకాశం ఎలా కలుగుతుందో చూద్దామా..

 

పోలవరం: నవ్యాంధ్ర మణిహారం పర్యాటకం. అందునా గోదావరి అందాలు చెప్పాలా. అందుకే కలెక్టరు కాటంనేని భాస్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం మండలం కొరుటూరులో తేనె కొండ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా మొట్టమొదట పర్యటక శాఖ నుంచి కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కలెక్టరు రూ.80 లక్షలు విడుదల చేశారు. ఆ నిధులతో ప్రస్తుతం ఐదు కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దాదాపు 30 - 40 ఎకరాల విస్తీర్ణంలో మరిన్ని కాటేజ్‌లు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలనేది ఉన్నతాధికారుల ఆలోచన. దానికి అవసరమైన రెండో విడత నిధులు త్వరలో విడుదల చేస్తారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయికి 50 మీటర్లు పైన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కొరుటూరు గ్రామంతో పాటు గోదావరి ఒడ్డున తేనెకొండపై నిర్మించిన బ్రిటీషు కాలం నాటి కట్టడాలు మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం అనంతరం మునిగిపోయే ప్రాంతం నుంచి 50 మీటర్ల ఎగువన కొండపై నుంచి పర్యాటకులు నేరుగా పాపికొండలు అందాలు కనిపించే విధంగా కాటేజ్‌లు నిర్మిస్తున్నారు.

అంతా కలపతోనే
ఫ్లాట్‌ఫాం, మరుగుదొడ్ల నిర్మాణం, కాటేజ్‌ల పైన మంగుళూరు పెంకు తప్ప మిగిలిన నిర్మాణం అంతా స్పూస్‌ కలపతోనే చేపట్టారు. ఈ కలప కెనడా నుంచి తీసుకొచ్చారు. ఈ స్పూస్‌ కలప ప్రత్యేకమైంది. దీనిని రసాయనాల్లో కొద్ది రోజుల పాటు ఉంచి చెన్నై తీసుకొస్తున్నారు. అక్కడ కాటేజ్‌ల నిర్మాణానికి వీలుగా కోసి కొరుటూరు తీసుకొస్తున్నారు. ఈ కలపకు చెద పట్టే అవకాశం ఉండదు.

సౌర విద్యుత్తుతో నీటి సరఫరా
పర్యాటకులకు అవసరమైన నీటి కోసం సౌర పంపుసెట్‌ (10 హార్స్‌పవర్‌) తిరిగేది ఏర్పాటు చేశారు. కొండపై నుంచి వచ్చే నీరు వల్ల కాటేజ్‌లకు ఎలాంటి ముప్పు జరగకుండా మూడు విడతల్లో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. పర్యాటకులు కొంతసేపు వాటిపై కూర్చునేందుకు వీలుగా మెట్లు కింద నిర్మిస్తున్నారు.

ముమ్మరంగా పనులు
భవిషత్తులో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరిన్ని కాటేజ్‌ల నిర్మాణం చేపట్టే ఆలోచన ఉంది. ప్రస్తుతం కాటేజ్‌ల నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి ఆన్న దానిపై జిల్లా కలెక్టరు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకూ గోదావరి ఒడ్డు నుంచి పాపికొండల అందాలను తిలకిస్తున్న పర్యాటకులు ఇకపై దట్టమైన చెట్ల మధ్య నిర్మిస్తున్న కాటేజ్‌ల నుంచి చూసే వీలు కలుగుతుంది. దానికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

- ఎన్‌.దావీద్‌రాజు, పోలవరం అటవీ శాఖ అధికారి
Link to comment
Share on other sites

 

సుందర దృశ్యం..అద్భుతం ఆవిష్కృతం

weg-sty1a.jpg

ఎత్తైన కొండలు.. దట్టమైన చెట్ల మధ్యలో నుంచి గోదారమ్మ పరవళ్లు, హోయలు, పచ్చని పాపికొండల అందాలు చూడాలని ఉందా? తొందరపడితే కుదరదు మరి.. కొన్నాళ్లు ఆగాలి. అదీ ఎక్కడనుకుంటున్నారు? మన పోలవరం మండలం కొరుటూరులో. మరెందుకు ఆలస్యం. ఆ అవకాశం ఎలా కలుగుతుందో చూద్దామా..

 

పోలవరం: నవ్యాంధ్ర మణిహారం పర్యాటకం. అందునా గోదావరి అందాలు చెప్పాలా. అందుకే కలెక్టరు కాటంనేని భాస్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం మండలం కొరుటూరులో తేనె కొండ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా మొట్టమొదట పర్యటక శాఖ నుంచి కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కలెక్టరు రూ.80 లక్షలు విడుదల చేశారు. ఆ నిధులతో ప్రస్తుతం ఐదు కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దాదాపు 30 - 40 ఎకరాల విస్తీర్ణంలో మరిన్ని కాటేజ్‌లు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలనేది ఉన్నతాధికారుల ఆలోచన. దానికి అవసరమైన రెండో విడత నిధులు త్వరలో విడుదల చేస్తారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయికి 50 మీటర్లు పైన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కొరుటూరు గ్రామంతో పాటు గోదావరి ఒడ్డున తేనెకొండపై నిర్మించిన బ్రిటీషు కాలం నాటి కట్టడాలు మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం అనంతరం మునిగిపోయే ప్రాంతం నుంచి 50 మీటర్ల ఎగువన కొండపై నుంచి పర్యాటకులు నేరుగా పాపికొండలు అందాలు కనిపించే విధంగా కాటేజ్‌లు నిర్మిస్తున్నారు.

అంతా కలపతోనే

ఫ్లాట్‌ఫాం, మరుగుదొడ్ల నిర్మాణం, కాటేజ్‌ల పైన మంగుళూరు పెంకు తప్ప మిగిలిన నిర్మాణం అంతా స్పూస్‌ కలపతోనే చేపట్టారు. ఈ కలప కెనడా నుంచి తీసుకొచ్చారు. ఈ స్పూస్‌ కలప ప్రత్యేకమైంది. దీనిని రసాయనాల్లో కొద్ది రోజుల పాటు ఉంచి చెన్నై తీసుకొస్తున్నారు. అక్కడ కాటేజ్‌ల నిర్మాణానికి వీలుగా కోసి కొరుటూరు తీసుకొస్తున్నారు. ఈ కలపకు చెద పట్టే అవకాశం ఉండదు.

సౌర విద్యుత్తుతో నీటి సరఫరా

పర్యాటకులకు అవసరమైన నీటి కోసం సౌర పంపుసెట్‌ (10 హార్స్‌పవర్‌) తిరిగేది ఏర్పాటు చేశారు. కొండపై నుంచి వచ్చే నీరు వల్ల కాటేజ్‌లకు ఎలాంటి ముప్పు జరగకుండా మూడు విడతల్లో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. పర్యాటకులు కొంతసేపు వాటిపై కూర్చునేందుకు వీలుగా మెట్లు కింద నిర్మిస్తున్నారు.

ముమ్మరంగా పనులు

భవిషత్తులో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరిన్ని కాటేజ్‌ల నిర్మాణం చేపట్టే ఆలోచన ఉంది. ప్రస్తుతం కాటేజ్‌ల నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి ఆన్న దానిపై జిల్లా కలెక్టరు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకూ గోదావరి ఒడ్డు నుంచి పాపికొండల అందాలను తిలకిస్తున్న పర్యాటకులు ఇకపై దట్టమైన చెట్ల మధ్య నిర్మిస్తున్న కాటేజ్‌ల నుంచి చూసే వీలు కలుగుతుంది. దానికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

- ఎన్‌.దావీద్‌రాజు, పోలవరం అటవీ శాఖ అధికారి

 

:super:

Link to comment
Share on other sites

పనుల వేగానికి స్పష్టమైన ప్రణాళికతో రండి

పోలవరంపై సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం

జూన్‌ ఒకటి నుంచి గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు

22ap-state1a.jpg

ఈనాడు, ఏలూరు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా కాంక్రీటు పనులే ఆలస్యమవుతున్నాయని, మిగిలిన పనులన్నీ ప్రణాళికాబద్ధంగానే సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కాంక్రీటు పనులు వేగం పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన ప్రణాళికతో రావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి గుప్తా, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబులను ఆదేశించారు. కాంక్రీటు పనులు చేపట్టేందుకు వేరే ఉపగుత్తేదారు ఎవరికైనా అప్పగించవచ్చేమో పరిశీలించాలన్నారు. యంత్రపరికరాలు ఏమేం ఎక్కడ నుంచి రావాల్సి ఉందో కూడా సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును సోమవారం స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆయన పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇతర ప్రాజెక్టుల పనుల తీరును సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోను 2018 చివరికల్లా గ్రావిటీ ద్వారా పోలవరం నీరు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. కాఫర్‌ డ్యాంలో 41 మీటర్ల ఎత్తుకు నీరు నిలబెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ స్థాయికి నీరు నిలబెడితే ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయో ఆ మేరకు పునరావాస కార్యక్రమాలు తక్షణమే పూర్తి చేయాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు, 2019 నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రూ.3200 కోట్ల పనులకు కేంద్రం నుంచి బిల్లులు రావాల్సి ఉందని, వీటిని తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. పనులు నిమిత్తం రూ. 5 వేల కోట్లు, భూసేకరణ నిమిత్తం రూ. 5 వేల కోట్లు మొత్తం రూ. 10 వేల కోట్లు వరకూ ఖర్చుపెట్టాల్సి ఉందని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం భూసేకరణకే ఖర్చుపెట్టాల్సి ఉంటుందని, కేవలం 20శాతం మాత్రమే నిర్మాణానికి వెచ్చిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా 10.55 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులకుగానూ 6.84 కోట్ల మేర పని పూర్తయిందని, మరో 3.45 కోట్ల క్యూబిక్‌మీటర్ల మట్టిపని చేయాల్సిఉందన్నారు. స్పిల్‌ఛానెల్‌లో 1.94 కోట్లు మట్టి పని చేయాల్సి ఉందని, వీటిలోనే కొండ ప్రాంతాల్లో తవాల్సిన మట్టి పని కూడా ఇమిడి ఉందన్నారు. ఎప్పటికప్పుడు పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీ, ఇక్కడ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. వంశధార పనుల విషయంపై పత్రికలో ప్రచురితమైన విషయాన్ని పరిశీలించానని, ఈ పనులు వేగవంతం చేయడంపై దృష్టిపెడతామని చెప్పారు.

22ap-state1b.jpg

* గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలకు జూన్‌ ఒకటి నుంచే నీటిని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఒక వేళ గోదావరిలో ప్రవాహాలు సరిపోకపోతే సీలేరు నుంచి నీళ్లు తీసుకోవాలన్నారు.కృష్ణాడెల్టా కోసం పులిచింతలలో నిల్వ చేసిన నీటినిఅందిస్తే ఆతర్వాత పట్టిసీమద్వారా నీరు ఇవ్వవచ్చని చెప్పారు. తుపాన్లకు ముందే రైతుల చేతికి పంట రావాలంటే ఖరీఫ్‌ను ముందే ప్రారంభించాలని, తదనుగుణంగా నీళ్లు అందివ్వాలని అధికారులను ఆదేశించారు.

* పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు 15 కల్లా తాను ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు పంపులు పూర్తి చేస్తామని ఎస్‌ఈ సుగుణాకరరావు వివరించారు. ఎన్ని పంపులనేది కాదని, ఏలేరులోకి నీటిని ఎత్తిపోయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

* తాడిపూడి ఎత్తిపోతల పూర్తయినా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, ఈ ప్రాజెక్టు ప్రారంభించి 13 ఏళ్లు అయినా ఇంత ఆలస్యం ఏమిటని, పోలవరం పూర్తయినా దీని వల్ల ప్రయోజనం ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు. ఇది అవసరమేనని, దీనికి ప్రత్యేకంగా ఆయకట్టు ఉందని ఈఎన్‌సీ వివరించారు. ప్రయోజనం ఉంటుందంటేనే సొమ్ములు ఖర్చు పెట్టాలని సీఎం చెప్పారు.

Link to comment
Share on other sites

పోలవరం చెల్లింపుల్లో మరిన్ని సడలింపులు?

ఖర్చు మేరకు తొలుత ప్రభుత్వ చెల్లింపులు

ఖాతాలు, నిబంధనల ప్రకారం ఆనక సర్దుబాట్లు

కోటేశ్వర్‌ ప్రాజెక్టు తరహా చేపట్టే యోచన

మరింత లోతైన పరిశీలనకు ప్రభుత్వం మార్గనిర్దేశం

ఈనాడు - అమరావతి

వాలు ద్వారా 2018కల్లా పోలవరం నీరు ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక సడలింపులు ఇస్తోంది. ప్రభుత్వమే నిర్మాణం చేపడితే యంత్రాంగం ఎలా వ్యవహరిస్తుందో ఆ స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ, బ్యాంకుల తోడ్పాటు, ఉపగుత్తేదారుల ఏర్పాటు, ఇతరత్రా అనేక రాయితీలతో స్వయంగా అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే అనేక అంశాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తుండగా తాజాగా బిల్లుల చెల్లింపులోనూ మరింత సడలింపునిచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్న సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలోని లోటుపాట్లు అనేకం చర్చకు వస్తున్నాయి. ఇటీవల సమీక్ష సందర్భంగా ప్రభుత్వం నియమించిన నిపుణుడు భార్గవ, ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి గుప్తాలు కొన్ని ఇబ్బందులను ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం గుత్తేదారు సమీకరించిన యంత్రాలు, ఇతరత్రా పెట్టుబడులు, శ్రామికులు, రెండేళ్లలోనే పూర్తి చేయాల్సి రావడం వల్ల తదనుగుణంగా సమీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. గుత్తేదారు పెట్టుబడి పెట్టే కన్నా రాబడి తక్కువగా ఉందనే వాదనను చర్చకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీని వల్ల నిధుల ప్రవాహం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రస్తావించారు. దీనిపై లోతైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఒప్పంద నిబంధనలను అనుసరించి గుత్తేదారు ప్రీమియం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఖర్చుకు సంబంధించిన పని పరిమాణానికి బిల్లులు చెల్లిస్తున్నారు. అలా కాకుండా తొలుత గుత్తేదారు చేసిన ఖర్చు చేసినట్లు చెల్లిస్తూ వెళ్లాలని, ఆనక చివర్లో సర్దుబాటు చేసుకుని గుత్తేదారు నుంచి మినహాయించుకోవాలనేలా చెల్లింపు ప్రక్రియ చేపట్టడంపై చర్చించారు. ఇలా అయితే అంచనాలు మించి జరిగిన ఖర్చుకు బాధ్యులెవరన్న ప్రశ్న వచ్చింది. చివర్లో గుత్తేదారు బ్యాంకు పూచీకత్తు మొత్తాన్ని దాటి ఈ ఖర్చు ఉంటే ఎలా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది.

కోటేశ్వర్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు తరహాలో?

ప్రభుత్వం ముందే చెల్లింపులు చేసి చేపట్టిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో భార్గవ తదితరులు పరిశీలించారని తెలిసింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న కోటేశ్వర్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు నిర్మాణం చివర్లో ఇలాగే చెల్లింపు చేశారని గుర్తించినట్లు సమాచారం. కేంద్రం, అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తెహ్రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెహ్రీకి 22 కిలోమీటర్ల దిగువన ఈ హైడ్రో ప్రాజెక్టు చేపట్టారు. 90శాతం పని పూర్తయ్యాక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గుత్తేదారుతో ఇబ్బందులు వచ్చాయి. గుత్తేదారు ఆ సమయంలో మధ్యవర్తిత్వానికి (ఆర్బిట్రేషన్‌) వెళ్లారు. దీంతో ప్రాజెక్టు ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తి ఖర్చు మేరకు చెల్లించారు. చివరకు అదనంగా రూ.150 కోట్లు చెల్లించినట్లు తేలింది. గుత్తేదారు, ప్రభుత్వం మధ్య ఈ వ్యవహారం చివర్లో సర్దుబాటు అయింది. ఇప్పుడు పోలవరంలోనూ అదే కోవ చెల్లింపులకు మార్గాన్ని అన్వేషిస్తున్నారు.

Link to comment
Share on other sites

పోలవరం నిధులకు కేంద్రానికి లేఖ

రూ.3314.16 కోట్లు తక్షణమే ఇవ్వండి

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఖర్చు చేసిన... ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మే 15 వరకు చేసిన ఖర్చుకు సంబంధించి రూ.3314.16 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ రెండు రోజుల కిందట పోలవరం ప్రాజెక్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి, కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇకపై పోలవరం రూపేణా నిధులు అందాలంటే తాజాగా సవరించిన అంచనాలు కేంద్రంతో ఆమోదింపజేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు రూ.48,000 కోట్ల సవరించిన అంచనాలతో లెక్కలు సిద్ధమయ్యాయి. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిశీలిస్తోంది. కొన్ని మార్పులు చేర్పులు సూచించడంతో తదనుగుణంగా పోలవరం అధికారులు కేంద్రానికి వివరాలు సమర్పించారు. ప్రస్తుతం పోలవరం అధికారులకు, పోలవరం అథారిటీకి మధ్య తాజా అంచనాలపై సవివర చర్చలు సాగుతున్నాయి. వీటిపై ప్రాజెక్టు అథారిటీ తనిఖీ పూర్తయిన తర్వాత కేంద్రానికి ఆ సవరించిన ప్రతిపాదనలు సమర్పిస్తారు.

Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టుకు మరో 71 వేల ఎకరాలు
 
  • సేకరణకు 7,391 కోట్లు అవసరం
రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు పనులు ఓ వైపు ఉధృతంగా సాగుతున్నా... ఇంకా 71,319 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కొత్త భూసేకరణ చట్టం-2013 ప్రకారం దీనికి రూ.7,396 కోట్లు అవసరం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి హెడ్‌వర్క్సు, కాలువలు, పునరావాసం, భూమికి భూమి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం వంటి అన్ని అవసరాలతో కలిపి 1,54,754.25 ఎకరాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి భూసేకరణ అధికారులు ఇప్పటివరకూ రూ.1,858.52 కోట్లు ఖర్చు చేసి 83,435.06 ఎకరాలు సేకరించారు. గతంలో మొత్తం భూసేకరణ బాధ్యత రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగేది. ఇటీవల సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఉభయ పశ్చిమగోదావరి జిల్లాలోని భూముల సేకరణను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. కానీ పునరావాస బాధ్యత రంపచోడవరం ఐటీడీఏ పీవోకు అప్పగించారు. దీంతో భూసేకరణ వేగవంతమైంది. 2018, డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంవల్ల ప్రాజెక్టు మొదటి దశను మూడో కాంటూరు వరకే నిర్మించనున్నారు. మొత్తం ముంపు మండలాల్లో 234 శివారు ప్రాంతాలు ఖాళీ చేయించాల్సి ఉండగా మూడో కాంటూరు వరకే ప్రస్తుతం నిర్మిస్తుండడంవల్ల దేవీపట్నం మండలంలో 38, కూనవరంలో 1, వీఆర్‌పురంలో 11 గ్రామాల్లో మాత్రమే ప్రస్తుతం భూసేకరణ చేస్తున్నారు. పునరావాసానికి అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించారు.
Link to comment
Share on other sites

మిగిలిన ఆరు గ్రామాలకు నోటిఫికేషన్‌

weg-gen1a.jpg

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం భూసేకరణలో విలీన మండలాల్లో మిగిలిన ఆరు గ్రామాలకు రూఢీ ప్రకటన విడుదలయింది. ఈ గ్రామాలకు పరిహారం చెల్లింపులు పూర్తయితే, భూసేకరణ వంద శాతం పూర్తయినట్లే. ఇప్పటికే కుక్కునూరు మండలంలో 19, వేలేరుపాడు మండలంలో మూడు గ్రామాలకు పరిహారం చెల్లింపులు జరిగిన విషయం తెలిసిందే. న్యాయస్థానంలో ఉన్న కేసులు, కొన్ని గ్రామాల్లో ఖాల్సా భూములు, వివిధ కారణాలతో నిలిచిన చెల్లింపులు మినహా, మిగిలిన 90 శాతం పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. దాదాపు 1,400 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ గ్రామాల్లో మిగిలిన చెల్లింపులు కూడా ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో చెల్లించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఈ గ్రామాల ప్రక్రియ ఓ కొలిక్కిరావడంతో, మిగిలిన ఆరు గ్రామాల భూసేకరణపై అధికారులు దృష్టిపెట్టారు.

ప్రత్యేక జీవో ద్వారా..

ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ఆరంభమైన ఆరుగ్రామాలు తొలుత నీటిపారుదల శాఖ విడుదల చేసిన ముంపు గ్రామాల జాబితా (జీవో 111)లో లేవు. తర్వాత ఈ గ్రామాలకూ ముంపు ఉందని గుర్తించిన అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా వీటినీ ముంపుగ్రామాలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ భూసేకరణ పనులు ముమ్మరం అయ్యాయి. సీతారామనగరం, కండ్రిగ (బ్రాహ్మణ అగ్రహారం), పోలవరం, ఆర్వాయిపల్లి, పోచవరం, వసంతవాడ గ్రామాలకు సంబంధించి 1,749 ఎకరాల భూసేకరణకు సంబంధించిన రూఢీ ప్రకటనను ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రకటన వెలువడిన 30 రోజుల తర్వాత అవార్డు విచారణ ఆరంభమవుతుంది.

ఎస్‌ఈఎస్‌ సర్వే..

ఈ గ్రామాల్లో భూసేకరణతోపాటు ఎస్‌ఇఎస్‌ (సామాజిక ఆర్థిక సర్వే) కూడా ఆరంభమైంది. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలుకు సంబంధించి ఈ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ సర్వేలు నిర్వాసిత కుటుంబానికి ఉన్న స్థిరాస్తులు, వాటి విలువ, 18 ఏళ్లు పైబడిన వయస్సు గల వారి కుటుంబాలు తదితర వివరాలను సేకరిస్తారు. ప్రస్తుతం ఈ సర్వే కూడా ఆరంభమైంది. అయితే ఈ ఆరు గ్రామాల్లో మూడు గ్రామాల్లో జనవాసం లేదు. వరుసగా వస్తున్న గోదావరి వరదలకు తాళలేక ప్రజలు వెళ్లిపోవడంతో ఆ గ్రామాలు ఎప్పుడో ఖాళీ అయ్యాయి. అయితే ప్రభుత్వ దస్త్రాలలో అవి రెవెన్యూగ్రామాలుగా ఉండటం, అక్కడ సేద్యపు భూములు ఉండటంతో ఆ గ్రామాల పేరిట ఇప్పటికీ ప్రభుత్వ దస్త్రాలు నడుస్తున్నాయి. పోలవరం, పోచవరం, కండ్రిగ అగ్రహారం గ్రామాల్లో ఎస్‌ఈఎస్‌ సర్వే మినహా మిగిలిన ప్రక్రియ యథావిధిగా నడుస్తోంది. దీంతోపాటు 2008లో భూసేకరణ జరిపిన గొమ్ముగూడెం, రామచంద్రాపురం, వింజరం గ్రామాల్లోనూ ఎస్‌ఇఎస్‌ సర్వే జరుపుతున్నారు.

మరో ఆరునెలల్లో నూరుశాతం పూర్తి..

విలీన మండలాల్లో పోలవరం సహాయ పునరావాస ప్రక్రియ మరో ఆరునెలల్లో నూరు శాతం పూర్తికానుంది. ఇక గ్రామాల తరలింపు మాత్రమే మిగులుతుంది. గ్రామాల తరలింపునకు సహాయ పునరావాస ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తికావాలి కనుక, అవి పూర్తయ్యే వరకూ గ్రామాల తరలింపును నిలిపివేస్తారు. సాధ్యమైనంత త్వరగా ఆ పనులు కూడా పూర్తిచేసి, గ్రామాలను తరలించే ప్రక్రియను ఆరంభిస్తామని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.

Link to comment
Share on other sites

పోలవరం’ సలహాదారుగా దినేష్‌ ప్రసాద్‌ భార్గవ నియామకం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సలహాదారుగా ఎన్‌హెచ్‌పీసీ విశ్రాంత సాంకేతిక సంచాలకుడు దినేష్‌ ప్రసాద్‌ భార్గవను నియమిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై పోలవరం ప్రాజెక్టును దినేష్‌ ప్రసాద్‌ భార్గవ ప్రతి నెలలో మూడు, నాలుగుసార్లు సందర్శిస్తారు. జలాశయం నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యల పరిష్కారం నిమిత్తం ఆయన సేవలు వినియోగించుకోనున్నట్టు సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రతిపాదన మేరకు ఈ నియామకం చేపట్టినట్టు వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...