Jump to content

polavaram


Recommended Posts

41 minutes ago, ravindras said:

ecrf dam, coffer(lower and upper) dams navayuga ki isthe manchidi .

ఈ నేపథ్యంలో ఈ వారంలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే పనులు, కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ ఈ పనులు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కొత్తగా ఎల్‌ఎస్‌(లంసమ్‌) పద్ధతిలో అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కాంక్రీటు పనుల తరహాలోనే ధర మారకపోయినా అందుకునే మొత్తం మారుతుంది.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరంపై జీఎస్‌టీ దెబ్బ
16-08-2018 03:12:44
 
  • ప్రధాన పనులకు కాంట్రాక్టు సంస్థలు దూరం
  • పాతధరలు, పన్ను నష్టాలే కారణం
  • తక్షణమే సంస్థను గుర్తించండి: సీఎం
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులపై వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) దెబ్బ పడుతోంది. ప్రధాన పనుల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలు జంకుతున్నాయి. ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణ పనుల్లో తమకు మిగలడం మాటెలా ఉన్నా.. జీఎస్‌టీ దెబ్బతో కోట్లలో నష్టం వాటిల్లుతుందని అవి చెబుతున్నాయి. వీటి పనుల్ని మరో నిర్మాణ సంస్థ ‘రత్న’తో చేయిస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ట్రాన్‌స్ట్రాయ్‌.. జీఎస్‌టీ లెక్కలు వేశాక తటపటాయిస్తోంది.
 
 
ఈ పనులు చేపట్టడానికి తానూ రెడీ అన్న నవయుగ సంస్థ కూడా వెనకాముందూ ఆడుతోంది. 2010-11 ధరల ప్రకారం వీటి పనులు చేపడితే.. యూనిట్‌కు రూ.12 నుంచి రూ.18 దాకా నష్టం వాటిల్లుతుందని.. నష్టం మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించకుండా.. రాష్ట్రంలో జల వనరుల శాఖ జీఎస్‌టీని అమల్లోకి తేవడంతో కాంట్రాక్టు సంస్థలపై భారీగా భారం పడుతోందని.. ఫలితంగా నిర్మాణాలకు సంస్థలేవీ ముందుకు రావడం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
 
ఉన్నతాధికారులపై చంద్రబాబు అసంతృప్తి..
గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరు 1 నుంచి కాఫర్‌ డ్యాంలు, రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు అక్టోబరు మొదటి వారానికే యంత్రాలు, ఇతర వాహనాలను కాంట్రాక్టు సంస్థ సిద్ధం చేసుకోవాలి. అలా చేయాలంటే సెప్టెంబరులోనే నిర్మాణ సంస్థను గుర్తించాలి. ఈలోగా వాటి డిజైన్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా అధికారులు ఈ దిశగా అడుగులు వేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, కాఫర్‌ డ్యాం, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులకు 60-సీ కింద ట్రాన్‌స్ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలా.. లేక నామినేషన్‌ విధానంలో పనులు కట్టబెట్టలా అనేది జల వనరుల శాఖ తేల్చుకోలేకోపతోంది.
 
 
గతంలో స్పిల్‌ వే, చానల్‌ కాంక్రీట్‌ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనప్పుడు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ దానికి సమ్మతించలేదు. దీంతో పాతధరలకే చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను క్షేత్రస్థాయిలో బేరీజు వేయడానికి కేంద్ర జల సంఘం బృందం ఈ నెలాఖరులో లేదా సెప్టెంబరు మొదటి వారంలో పర్యటనకు రావచ్చని తెలిసింది. తుది అంచనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం కోరిన ఫార్మాట్‌లో సమాచారం ఇస్తున్న అధికారుల బృందం.. మరో దఫా ఢిల్లీ వెళ్లనుంది.
 

Advertisement

Link to comment
Share on other sites

ఈ కొర్రీలకు అంతు లేదు!
18-08-2018 03:13:29
 
636701588106218855.jpg
  • పోలవరంపై మళ్లీ జలసంఘం సందేహాలు
  • తలసరి వ్యయమెంతో చెప్పండి
  • ఒక్కో నిర్వాసితుడిపై చేసే ఖర్చెంత?
  • ఇంకెంత భూమిని సేకరించాలి?
  • రాష్ట్ర జలవనరుల శాఖకు తాజా లేఖ
  • జవాబిస్తే తుది అంచనాలపై మలి అడుగు
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): అడిగేవాడికి చెప్పేవాడు లోకువన్న చందంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయం ఎందుకు పెరిగిందో రా ష్ట్ర అధికారులు ఢిల్లీలోనే మకాం వేసి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదు. అది వేసే కొర్రీలకు అంతూ పొంతూ ఉండడం లేదు. ఈ నెలాఖరులోగానీ, సెప్టెంబరు మొదటివారంలో గానీ క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తామన్న జలసంఘం.. తాజాగా మరిన్ని ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించింది. పోలవరం ప్రా జెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలెన్ని.. తలసరిన ఒక్కో నిర్వాసితుడిపై చేసే వ్యయమెంత.. గృహ నిర్మాణానికెంత అవుతుంది.. కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రహదారులు, మంచినీటి సదుపాయం, విద్య, వైద్య సేవలు, పార్కులు, వాణిజ్య భవన సముదాయాలు, దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ఎంతెంత వ్యయం అవుతుంది..? వీటన్నిటికీ సవివరంగా.. కేంద్ర ఫార్మాట్‌లో సమాధానాలివ్వాలని శుక్రవారం రాష్ట్ర జల వనరుల శాఖకు లేఖ పంపింది.
 
ఇందులో ఈ నెల 6, 7 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస ప్రత్యేక కమిషనర్‌, రెవెన్యూ శాఖకు చెందిన భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఇంజనీరు, పీపీఏ, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌తో జరిగిన సమావేశం గురించి.. ఈ నెల 14న జల సంఘం చైర్మన్‌ మసూద్‌ నేతృత్వంలో జరిగిన భేటీ గురించి ప్రస్తావించిం ది. ఆయా సమావేశాల్లో ప్రాజెక్టు కోసం సేకరించే భూమి విలువ ఎంతో.. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చెంతో అందిందని పేర్కొంది. భూసేకరణ, సహాయ పునరావాసంపై చర్చించాక.. కొన్ని గణాంకాలను రాష్ట్రం సమర్పించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అరడజను సందేహాలను వ్యక్తంచేసిన కేంద్ర జల సంఘం.. వాటికి .జవాబులివ్వాలని సూచించింది.
8 ముంపునకు గురయ్యే రెవెన్యూ గ్రామాల వారీగా చేపట్టిన భూ సేకరణ వివరాలు అందించాలి. ఇందులో వర్కింగ్‌, డింపింగ్‌ ఏరియాలనూ స్పష్టం చేయాలి.
 
ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, పునరావాసం కింద లబ్ధిదారులకు అందించే భూమికి భూమి తదితర వివరాలను మేం పంపిన ప్రొఫార్మాలో ఇవ్వాలి. భూమి వివరాలను కాంపౌనెంట్‌ వారీగా తెలియజేయాలి. ప్రభుత్వ భూమి.. ప్రైవేటు పట్టా భూమి.. అసైన్డ్‌ భూమి.. ఆక్రమిత ప్రభుత్వ భూమి ఎంతెంతో వివరించాలి. పోలవరం ముంపులో అటవీ భూమి విస్తీర్ణం కూడా స్పష్టం చేయాలి. భూసేకరణ కోసం 2013 భూసేకరణ, సహాయ పునరావాస చట్టం అమల్లోకి రాకముందు చేసిన చెల్లింపులు, 2014 మార్చి 31 దాకా చేసిన చెల్లింపులు, 2018 మార్చి 31 దాకా చెల్లించాల్సిన మొత్తాలను తెలియజేయాలి.
 
  •  ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం, సరిహద్దు రాళ్లు, డ్యాం యాక్సిస్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ తదితరాలన్నీ జియో ట్యాగింగుతో ఇవ్వాలి.
  •  ల్యాండ్‌ ప్లాన్‌ షెడ్యూల్‌ను సమర్పించాలి. అన్ని రకాల భూ సేకరణ అవార్డు కాపీలనూ భూమి సరిహద్దుల వివరాలతో ఇవ్వాలి. మ్యాపులూ జత చేయాలి.
  •  భూసేకరణ జరిగితే నిర్వాసితుడి పేరు, రెవెన్యూ గ్రామం, విస్తీర్ణం, ప్రభుత్వ ఉత్తర్వు నంబరు, ఉత్త ర్వు జారీ చేసిన తేదీ, ప్రభుత్వ భూమి పట్టా భూమి గా మార్చినట్లయితే తెలియజేయాలి.
  •  ఆవాసాల వారీ సమాచారమూ ఇవ్వాలి. ఇందులో గిరిజనులు ఎందరు.. గిరిజనేతరులు ఎందరో కూడా చెప్పాలి. రాష్ట్ర వ్యవసాయ పరపతి సంఘాల్లో నమోదైన వ్యవసాయ భూముల సమాచారంతో కూడిన నిర్వాసిత కుటుంబాల వివరాలూ ఇవ్వాలి. భూసేకర ణ చట్టం-2013 అమల్లోకి రాకముందు చేసిన చెల్లింపులు, 2014 మార్చి 31 వరకు ఇచ్చిన పరిహారం, ప్రస్తుత ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన మొ త్తాల సమాచారాన్ని సమగ్రంగా అందించాలి. నిర్వాసి తుల వివరాలను మేం పంపిన ప్రొఫార్మాలో ఇవ్వాలి.
  •  ఇప్పటికే సేకరించిన 73,000 ఎకరాలతో పాటు ఇంకా సేకరించాల్సిన 37,000 ఎకరాలకు సంబంధించి యూనిట్‌ విలువనూ సమర్పించాలి.
ఈ సమాచారాన్నంతటినీ త్వరితగతిన అందజేస్తే.. తుది అంచనాలపై వీలైనంత త్వరగా తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని జలసంఘం పేర్కొంది. వాస్తవానికి ఈ లేఖను గురువారమే పంపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు వర్తమానం పంపింది.
Link to comment
Share on other sites

ఒక పక్క ఉగ్రగోదావరి.. మరో పక్క పోలవరం పనులు..

Super User
18 August 2018
Hits: 1
 
polavaram-18082018.jpg
share.png

గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ల్తో పాటు గోదావరి నది వెంబడిగల లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముంచెత్తుతుంది. వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఆపేయల్సిన పరిస్థితి వచ్చినా, పనులు మాత్రం ఎక్కడా ఆపటం లేదు. పనులు మందకొడిగా సాగుతున్నాయి కాని, పనులు మాత్రం ఆపటం లేదు. మానవ సంకల్పం అంటే ఇదేనేమో. కొంచెం సమయం కూడా వేస్ట్ చెయ్యకుండా, ఏ పని, ఎంత వరకు సాధ్యమైతే, అంత వరకు చేస్తున్నారే కాని, పనులు మాత్రం ఆపటం లేదు. ముఖ్యమంత్రి సంకల్పానికి, కార్మికులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలు కూడా సహకరిస్తున్నాయి.

 

polavaram 18082018 2

గురువారం 2500క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు సాగితే శుక్రవారం 1500క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులే జరిగాయి. ప్రతికూల వాతావరణంలో కూడా పోలవరం పనులు నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్‌డిఓ మోహన్‌కుమార్‌ను పోలవరం వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించమంటూ కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. గోదావరి పోటెత్తడంతో లోతట్టు గిరిజన గ్రామాలు నీటమునిగాయి. ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. మరో పక్క, ఇటీవల వరుసగా గోదావరిలో జరుగుతున్న పడవ ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని వరద ఉదృతి సమయంలో పడవ ప్రయాణాల్ని అధికారులు నిషేదించారు. నాటు పడవల్నుంచి లాంచీల వరకు వేటీని గోదావరిలో ప్రయాణానికి అనుమతించడంలేదు.

polavaram 18082018 3

శుక్రవారం రాత్రి 8గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 16.6అడుగులకు చేరుకుంది. అప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. అదే సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.40 అడుగు లకు చేరింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. శుక్రవారం ఉదయానికే 10లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతంనుంచొస్తుండగా అదే పరిమాణంలో నీటిని సముద్రంలోకి విడుదల చేయడం మొదలెట్టారు. కాగా ఉదయం 11గంటలకు ఎగువ నుంచొస్తున్న నీరు 11.86 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రి 8గంటల సమయాని కిది 12.10లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.

Link to comment
Share on other sites

కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులకు ట్రాన్‌స్ర్టాయ్‌ దూరం!
19-08-2018 03:26:16
 
  • ఈ పనులకూ నవయుగ రెడీ..
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజె క్టులో ప్రతిష్ఠాత్మకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం పనుల బాధ్యతల నుంచి వైదొలి గేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటిదాకా ఈ పనులు తామే చేస్తామని, ‘రత్నా’ కాంట్రాక్టు సంస్థతో చేయిస్తామని చెబుతూ వచ్చింది. అయి తే 2010-11 నాటి ధరలకు ఈ పనులు చేపడితే నష్టం తప్ప దని, జీఎస్‌టీ భారం కూడా కోట్లలో ఉండడంతో ట్రాన్‌స్ట్రాయ్‌ సహా పలు కాంట్రాక్టు సంస్థలు వెనుకాడుతున్నట్లు ప్రచారం. వాస్తవానికి.. గోదావరిలో వరద ఉధృతి అక్టోబరు మూడో వారం దాకా ఉంటుంది. ఉధృతి తగ్గిన వెంటనే.. నవంబరు 1 నుంచి కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు ప్రారంభిస్తేనే.. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వడం సాధ్యమ వుతుంది. తక్షణమే ఈ పనులు ఎవరు చేపట్టాలన్న స్పష్టతను జల వనరుల శాఖ ఇవ్వాలి. ఈ నెల 13నాటి సమీక్షలో సీఎం చంద్రబాబు.. కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వాలని ట్రాన్‌స్ట్రాయ్‌ను ఆదేశించారు. 20వ తేదీ నాటి భేటీకి కాంట్రాక్టు సంస్థ ఎంపికపై అవగాహనతో రావాలని సూచించారు. ప్రస్తుతం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే టెండరు ద్వారానా.. లేక నామినేష న్‌పై సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వాలా అనేది జలవనరుల శాఖ తేల్చుకోలేకపోతోంది.
Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:
కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులకు ట్రాన్‌స్ర్టాయ్‌ దూరం!
19-08-2018 03:26:16
 
  • ఈ పనులకూ నవయుగ రెడీ..
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజె క్టులో ప్రతిష్ఠాత్మకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం పనుల బాధ్యతల నుంచి వైదొలి గేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటిదాకా ఈ పనులు తామే చేస్తామని, ‘రత్నా’ కాంట్రాక్టు సంస్థతో చేయిస్తామని చెబుతూ వచ్చింది. అయి తే 2010-11 నాటి ధరలకు ఈ పనులు చేపడితే నష్టం తప్ప దని, జీఎస్‌టీ భారం కూడా కోట్లలో ఉండడంతో ట్రాన్‌స్ట్రాయ్‌ సహా పలు కాంట్రాక్టు సంస్థలు వెనుకాడుతున్నట్లు ప్రచారం. వాస్తవానికి.. గోదావరిలో వరద ఉధృతి అక్టోబరు మూడో వారం దాకా ఉంటుంది. ఉధృతి తగ్గిన వెంటనే.. నవంబరు 1 నుంచి కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు ప్రారంభిస్తేనే.. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వడం సాధ్యమ వుతుంది. తక్షణమే ఈ పనులు ఎవరు చేపట్టాలన్న స్పష్టతను జల వనరుల శాఖ ఇవ్వాలి. ఈ నెల 13నాటి సమీక్షలో సీఎం చంద్రబాబు.. కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వాలని ట్రాన్‌స్ట్రాయ్‌ను ఆదేశించారు. 20వ తేదీ నాటి భేటీకి కాంట్రాక్టు సంస్థ ఎంపికపై అవగాహనతో రావాలని సూచించారు. ప్రస్తుతం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే టెండరు ద్వారానా.. లేక నామినేష న్‌పై సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వాలా అనేది జలవనరుల శాఖ తేల్చుకోలేకపోతోంది.

:super:

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:
కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులకు ట్రాన్‌స్ర్టాయ్‌ దూరం!
19-08-2018 03:26:16
 
  • ఈ పనులకూ నవయుగ రెడీ..
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజె క్టులో ప్రతిష్ఠాత్మకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం పనుల బాధ్యతల నుంచి వైదొలి గేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటిదాకా ఈ పనులు తామే చేస్తామని, ‘రత్నా’ కాంట్రాక్టు సంస్థతో చేయిస్తామని చెబుతూ వచ్చింది. అయి తే 2010-11 నాటి ధరలకు ఈ పనులు చేపడితే నష్టం తప్ప దని, జీఎస్‌టీ భారం కూడా కోట్లలో ఉండడంతో ట్రాన్‌స్ట్రాయ్‌ సహా పలు కాంట్రాక్టు సంస్థలు వెనుకాడుతున్నట్లు ప్రచారం. వాస్తవానికి.. గోదావరిలో వరద ఉధృతి అక్టోబరు మూడో వారం దాకా ఉంటుంది. ఉధృతి తగ్గిన వెంటనే.. నవంబరు 1 నుంచి కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు ప్రారంభిస్తేనే.. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వడం సాధ్యమ వుతుంది. తక్షణమే ఈ పనులు ఎవరు చేపట్టాలన్న స్పష్టతను జల వనరుల శాఖ ఇవ్వాలి. ఈ నెల 13నాటి సమీక్షలో సీఎం చంద్రబాబు.. కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులు చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వాలని ట్రాన్‌స్ట్రాయ్‌ను ఆదేశించారు. 20వ తేదీ నాటి భేటీకి కాంట్రాక్టు సంస్థ ఎంపికపై అవగాహనతో రావాలని సూచించారు. ప్రస్తుతం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ కాఫర్‌, రాక్‌ఫిల్‌ పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే టెండరు ద్వారానా.. లేక నామినేష న్‌పై సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వాలా అనేది జలవనరుల శాఖ తేల్చుకోలేకపోతోంది.

navayuga is very dedicated towards projects assigned to them. they won't compromise on quality. 

Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

intWS5h.jpg

distribution canals are must for irrigation paddy fields. distribution canals are permanent solutions for irrigation. drip & sprinkler maintenance cost is high. no maintenance charges for farmers who are irrigating through canals ,except small water tax collected by panchayats. after paying 33,000 crores to polavaram r&r  it is foolish to go for sprinkler&drip irrigation. initially land acquisition costs are high for distribution canals . later almost zero maintenance charges.

Link to comment
Share on other sites

కాఫర్‌ డ్యాం పనుల వేగం పెంచండి 
‘పోలవరం’పై అధికారులను ఆదేశించిన చంద్రబాబు 
సెప్టెంబరు చివర్లో ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర బృందం 
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురంలో ఇంకా లోటు వర్షపాతమే 
ప్రతి నాలుగో శనివారం మొక్కలు పెంపకం చేపట్టాలి: ముఖ్యమంత్రి 
ఈనాడు - అమరావతి, ఈనాడు డిజిటల్‌ - అమరావతి 
20ap-main4a.jpg

వచ్చేనెల నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాఫర్‌ డ్యాం, స్పిల్‌ వే పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు చివరి వారంలో కేంద్ర బృందం పోలవరం పనుల పరిశీలనకు రాబోతోందని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జలవనరులపై సమీక్షా సమావేశం; నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై అధికారులతో టెలీకాన్ఫెరెన్స్‌, గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా) అనుసంధానంతో వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా తొలుత అధికారులు, పోలవరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ...ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పోలవరం పనులకు అడ్డంకిగా ఉన్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గేలరీ వాక్‌ నిర్మాణం, గేట్ల ఏర్పాటులో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు. వీటికి సీఎం స్పందిస్తూ ప్రస్తుతం వర్షాల వల్ల పనుల వేగం కొంత మందగించినా...వర్షాలు తగ్గిన తర్వాత మాత్రం వాటిని త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. డిసెంబరు మాసాంతానికల్లా పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. కర్నూలు జిల్లా గాజులదిన్నెకు నీటిని పంపిణీ చేసే పనుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించారు. కొండవీటి వాగు పనులు పూర్తయ్యాయని ఈ నెలాఖరుకు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

అధికారులూ అప్రమత్తంగా ఉండండి 
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నందున అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను సామాజిక బాధ్యతతో అంతా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఇంకా 40 నుంచి 50 శాతం లోటు వర్షపాతం ఉంది. ఆ ప్రాంతాల వారికి సాగునీటి కొరత లేకుండా చూడాలి. రెయిన్‌ గన్‌లు, జిబా సాంకేతికతతో పంటలను కాపాడాలి. ఉపరితల, భూగర్భ జలాలు సద్వినియోగం చేసుకొని కరవును శాశ్వతంగా నివారించాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‘‘ఎర్రకాలువ, బుడమేరు, తమ్మిలేరు నదుల పరిధిలోని పంటలు మునగకుండా సకాలంలో వరద ప్రవాహ నిర్వహణ జరగాలి. కర్ణాటక నుంచి మొక్కజొన్నపై తెగుళ్లు ప్రబలుతున్నందున చిత్తూరు, అనంతపురం జిల్లాల వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. 5,67,410 మంది కౌలు రైతులకు రూ.2,158 కోట్ల పంటరుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు. ఉపాధిహామీ పథకంలో ఆరు అంశాలకు గానూ నాలుగింటిలో అగ్రస్థానంలో ఉన్నాం. సిమెంటు రోడ్ల నిర్మాణం, గృహ నిర్మాణంలో లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం 
ప్రతి నెలా నాలుగో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి, నాలుగో శనివారం ఒక పూట పాఠశాలల విద్యార్థులను మొక్కల నాటే క్రతువులో భాగస్వాములను చేయాలని సూచించారు. నరేగా నిధులతో గ్రామాల్లో నిర్మించిన రహదారులకు ఇరువైపులా వృక్షమిత్రలు, డ్వాక్రా సంఘాల భాగస్వామ్యంతో మొక్కలు నాటి ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం ఇతర ఆదేశాలు, సూచనలు 
* వెలుగోడు నుంచి బ్రహ్మసాగర్‌కు 300 క్యూసెక్కుల నీరు పంపించాలి. 
* వెలిగొండ ప్రాజెక్టు పనులు 2018 జనవరికి పూర్తి కావాలి. 
* తూర్పుగోదావరి జిల్లా మురుసుమల్లి ప్రాజెక్టు పనులను రెండు నెలల్లో పూర్తి చేసి నిల్వ, నీటి పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయాలి. 
* ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉందో గుర్తించి వర్షాకాలం పూర్తయ్యేలోగా వాటి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలి. 
* సూక్ష్మ సాగునీటి ప్రణాళిక ద్వారా కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలకు నీరందించాలి. 
* స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌ నెలకొల్పాలి. 
* నీటి ఆడిటింగ్‌ చేయాలి. నీటి లభ్యత, వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. 
* రాష్ట్రంలోని వివిధ జల వనరుల్లో గతేడాది కంటే 420 టీఎంసీలు నీరు అధికంగా ఉంది. 
* వ్యూహాత్మక విధానాలను అనుసరించి మధ్య, చిన్న తరహా నీటి ప్రాజెక్టుల్లో నీరు నింపగలిగితే రాబోయే సీజన్‌లో సరైన సమయంలో పంటలు వేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

పోలవరం పునరావాసం.. డిసెంబరుకల్లా పూర్తికావాలి
21-08-2018 03:58:11
 
  • వర్షాలు తగ్గాక పనుల జోరు పెంచాలి: ముఖ్యమంత్రి
  • పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష
 
అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పరిధిలో డిసెంబరుకల్లా పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, జలవనరుల అధికారులతో ఆయన పోలవరం, ఇతర ప్రాధాన్య నీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పోలవరం గేలరీ వాల్‌ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతోందని, ఎడతెరపి లేని వర్షాలు పనులకు అడ్డంకిగా ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. గేట్ల ఏర్పాటు కూడా స్వల్పంగా వాయిదా పడుతుందని చెప్పారు. సెప్టెంబరు చివరిలో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే సమయానికి కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.
 
 
పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్షాల వల్ల పనుల వేగం ఇప్పుడు కాస్త తగ్గినా.. ఆ తర్వాత వేగిరపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర ప్రాజెక్టులపై సమీక్షిస్తూ.. 2 కోట్ల ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యంతో జలవనరుల వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కోటి ఎకరాల ఉద్యానవనాలు.. సూక్ష్మ సాగు నీటి ప్రణాళిక ద్వారా కోటి ఎకరాలు అభివృద్ధి చేయాలన్నారు. స్మార్ట్‌ వాటర్‌గ్రిడ్‌లు ఏర్పాటుచేసి నీటి ఆడిటింగ్‌ చేయాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉన్న నీటి పంపిణీ గురించి వారికి సీఎం ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా గాజులదిన్నెకు నీటిని పంపిణీ చేసే పనులకు రూ.2 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా మురుసుమల్లి పనులను రెండు నెలల్లో పూర్తిచేసి నిల్వతో పాటు నీటి పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.
Link to comment
Share on other sites

గోదారి ఉధృతికి అడ్డుకట్ట!
22-08-2018 02:25:12
 
636705015151125698.jpg
  • పోలవరం స్పిల్‌వే మునగకుండా మట్టిగోడ
  • ఇది తాత్కాలిక ఉపశమనమే
  • నీటిమట్టం 55 అడుగులకు చేరితే
  • స్పిల్‌వేను చుట్టుముట్టడం ఖాయం
  • ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆందోళన
ఏలూరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): భద్రాచలం దగ్గర అంతకంతకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. వరద భారీగా ఉండడంతో ఏ క్షణాన్నైనా మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. దరిమిలా గోదావరి పరివాహక ప్రాంతమంతటా అప్రమత్తత ప్రకటించారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే వరద ముంపునకు గురికాకుండా అధికారులు ముందుచూపుతో ప్రవాహం అటురాకుండా చకచకా అడ్డుకట్టలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు.
 
మట్టిగోడలు నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని.. గోదావరిలో నీటి మట్టం 55 అడుగులకు చేరితే వరద యావత్తు స్పిల్‌వేను చుట్టిముట్టే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకు వరద రూపంలో ఎలాంటి అవాంతరం తలెత్తలేదు. కానీ ఈసారి గోదావరి పోటెత్తుతోంది. పేరూరు నుంచి ఒకవైపు, శబరి నుంచి మరోవైపు అఖండ గోదావరిలోకి వరద వచ్చి పడుతూనే ఉంది.
 
 
ఇది మంగళవారం పెరిగి ప్రాజెక్టు ప్రాంతంలో అలజడి సృష్టించింది. రాబోయే 24 గంటల్లో ప్రాజెక్టు ప్రాంతం వైపు చొచ్చుకొస్తుందేమోనన్న కలవరం సిబ్బందిలో కనబడుతోంది. నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టిస్తుందేమోనన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఒక్క పైలట్‌ చానల్‌లోకే వరద చేరింది. స్పిల్‌ చానల్‌కు దిగువన ఉన్నదే పైలట్‌ చానల్‌. గోదావరిలో ఉధృతి పెరిగాక ఈ చానల్‌కు ఉన్న గట్టు.. వరద తాకిడికి కొట్టుకుపోవడంతో వరద నీరు లోపలికి ప్రవేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వరద తగ్గుముఖం పడుతుందని తొలుత అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రమాదస్థాయిలో నీటిమట్టం నమోదవుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి నీటిమట్టం 48.7 అడుగులకు చేరింది. ఇది మరింతగా పెరిగి రాబోయే 24 గంటల్లో 52 అడుగులకు చేరవచ్చని అంచనా.
 
 
దీనిని దృష్టిలో పెట్టుకుని స్పిల్‌వే పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కాంట్రాక్టు సంస్థలు అప్రమత్తమయ్యాయి. వెంటనే యంత్రాలను రంగంలోకి దించాయి. కొద్ది గంటల వ్యవధిలోనే మట్టి కట్టడాన్ని అడ్డుగా నిర్మించారు. వరద ఈ దిశగా రాకుండా స్పిల్‌వే భాగం నుంచి కుడివైపున ఈ అడ్డుకట్టను నిర్మించారు. గోదావరి మట్టం 27-28 మీటర్లకు చేరినా స్పిల్‌వేకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ మట్టికట్ట కాపాడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ప్రస్తుతానికి 14 లక్షల క్యూసెక్కులు ఉందని.. మరో 2 లక్షలకు పెరిగినా మట్టికట్టకు నష్టం లేదని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు వద్ద అప్రమత్తం 
నీళ్లు రాకుండా అడ్డుకట్టలు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పోలవరం: గోదావరిలో వరద పోటెత్తుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా 14.50లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండటంతో స్పిల్‌వేలోకి వరద రాకుండా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే గోదావరి నది మధ్యన కాకుండా గోదావరిని ఆనుకుని ఉన్న కొండల మధ్య నిర్మిస్తున్నారు. దాదాపు 52 బ్లాకుల పనులు ఇప్పటికే 90శాతానికి పైగా ఒక స్థాయికి వచ్చేశాయి. గోదావరిని ప్రస్తుత సహజ మార్గంలో కాకుండా ఈ స్పిల్‌వే నుంచి మళ్లించేందుకు వీలుగా అప్రోచ్‌ఛానల్‌ కూడా తవ్వుతున్నారు. ప్రస్తుతం ఆ ఛానల్‌ వైపు నుంచి వరద నీరు ప్రాజెక్టు స్పిల్‌వే క్షేత్రంలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం నుంచి స్పిల్‌వే వెనుక రహదారిని మరింత పటిష్ఠం చేశారు. మట్టితో ఆ రోడ్డు పొడవునా పెద్దకట్టలా నిర్మించారు. స్పిల్‌ఛానల్‌ వైపు నుంచి కూడా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరిలో వరద +25 మీటర్ల స్థాయికి మించి పోలవరం వద్ద ప్రవహిస్తోంది. స్పిల్‌ఛానల్‌ ప్రాంతం +8.8 మీటర్లే ఉంటుంది. స్పిల్‌ఛానల్‌లోకి నీరు చొచ్చుకువచ్చేందుకు ఏ స్థాయిలో అవకాశం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ స్పిల్‌ఛానల్‌లోకి కూడా నీరు రాకుండా అడ్డుకట్ట నిర్మించారు. శబరి, సీలేరు వైపు నుంచి ప్రవాహాలు తగ్గుతున్నాయి. భద్రాచలం వద్ద వరద పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంత నిలకడగా ఉండి వరద తగ్గే అవకాశమూ ఉందని పోలవరం అధికారులు భావిస్తున్నారు. స్పిల్‌వేలోకి నీరొస్తే పోలవరం పనులకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఆ నీరంతా పోయేవరకు పనులకు అంతరాయం కలుగుతుంది. స్పిల్‌వే అంతా కాంక్రీటు నిర్మాణమే అయినందున ఇతరత్రా ఇబ్బందులుఉండబోవని అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

పోలవరం పనులకు ఆటంకం
04021622BRK101POLA.JPG

పోలవరం: పశ్చిమగోదావరిజిల్లా పోలవరంలో గోదావరి ఉద్థృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో పోలవరం కడెమ్మ వంతెన పూర్తిగా నీటమునిగింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు రవాణా మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ప్రాజెక్ట్ స్పిల్ ఛానల్ కు వరద నీరు పొటెత్తడంతో పనులు నిలిచిపోయాయి. కొత్తూరు కాజ్ వే పైకి పది అడుగులు మేర నీరు చేరడంతో సమీపంలోని 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న గిరిజన గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను గోదావరి వరద ముంచెత్తింది. వేలేరుపాడు మండలంలో ఇప్పటికే ఐదు గ్రామాలను ఖాళీ చేయించారు. రేపాకగొమ్ము, తోటకూరుగొమ్ము, తిరుమలాపురం, నారవరం, చిగురుమామిడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కమ్మరగూడెంలో పెదవాగు ముంచేత్తింది. దీంతో పలు ఇళ్లు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సాయంత్రానికి వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్తపట్టిసీమ, గూటాల, తాడిపూడి, తాళ్లపూడి గ్రామాల్లో గోదావరి గట్లు బలహీనంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద ఆలయాలన్ని నీట మునిగాయి. పరిస్థితిని మంత్రి జవహర్‌ సమీక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...