Jump to content

polavaram

Recommended Posts

మే నెలాఖరుకు ఎగువ కాఫర్‌డ్యామ్‌ 

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ap-state5a_3.jpg

పోలవరం, న్యూస్‌టుడే: కేంద్ర జల సంఘం మంజూరు చేసిన ఆకృతులకు, ప్రమాణాలకు అనుగుణంగా ఎగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే నెలాఖరుకు పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆదివారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టు పనులు 65.8 శాతం పూర్తయ్యాయని, జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు నీరందించాలన్న పట్టుదలతో ఉన్న సీఎం చంద్రబాబు నిత్యం పనులపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.4,021 కోట్లు ఖర్చు చేశామని, ఇందుకు సంబంధించిన బిల్లులు కేంద్రానికి అందజేశామని వివరించారు. పోలవరం పునాదుల్లోనే ఉందని, అమరావతి భ్రమరావతి అంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ జరుగుతున్న పనులను కళ్లుండీ చూడలేకపోతున్నారనిÅ అన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్‌, సలహాదారు వీఎస్‌ రమేష్‌బాబు, నవయుగ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి, ఈఈలు ఎంఎన్‌ సుధాకర్‌, డి.శ్రీనివాస్‌, డీఈ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
ఆరు నెలల ముందే పూర్తి చేయాలి 

పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులపై సీఎం సూచన

ఈనాడు-అమరావతి: పోలవరం జలవిద్యుత్తు కేంద్ర నిర్మాణాన్ని గడువు తేదీకి 6 నెలల ముందుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ విద్యుత్తు కేంద్రం రాష్ట్రానికే గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో హరిత, పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం పెంచేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరలకు సరఫరా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం పెరగాలన్నారు. స్వచ్ఛమైన, హరిత విద్యుత్తు ఉత్పత్తి ప్రభావంపై ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ఈ సూచనలు చేసినట్లు ఇంధనశాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పోలవరం జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తి రెట్టింపు అవుతుందని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రూ.5,339 కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేయాలని ఏపీజెన్‌కో లక్ష్యంగా నిర్ణయించిందని ఎండీ కె.విజయానంద్‌ చెప్పారు. డ్రాప్ట్‌ ట్యూబ్‌, పవర్‌హౌస్‌ లేఔట్లు, ఇన్‌టేక్‌ నిర్మాణాల పురోగతిని వివరించారు.

Link to comment
Share on other sites

45 minutes ago, sskmaestro said:

Given the estimated great out flow from polavaram, a power generation station will constantly feed 3-4 districts throughout the year! 

no, not through out the year (not at full capacity at least). Polavaram hydro electric generator water head is very low. You need many times more water to generate 1MW compared Sileru or other generators. So basically, this will generate full power only few weeks in a year during flood (in other words when the water overflows Dowleswaram barrage). it will be generating far less than its capacity during most of the year. if you run these generators at full capacity it will empty the dam in couple of weeks.

Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

no, not through out the year (not at full capacity at least). Polavaram hydro electric generator water head is very low. You need many times more water to generate 1MW compared Sileru or other generators. So basically, this will generate full power only few weeks in a year during flood (in other words when the water overflows Dowleswaram barrage). it will be generating far less than its capacity during most of the year.

Worst case statewide street lights ki year round saripotundemo ?

Link to comment
Share on other sites

గడువుకు ముందే పోలవరం విద్యుత్‌ కేంద్రం
18-02-2019 02:43:21
 
636860545999945978.jpg
  • సంస్కరణలతోనే విద్యుత్‌ రంగం ముందంజ
  • స్వచ్ఛ, హరిత విద్యుత్‌ ఉత్పత్తిపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పోలవరం జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్దేశిత గడువు కంటే ముందుగానే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన, హరిత విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావంపై ఆదివారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 960 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ విద్యుత్‌ కేంద్రాన్ని త్వరగా పూర్తిచేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఏపీ జెన్‌కో అధికారులకు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏకీకృత ఆయకట్టు అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా, తాగునీటి సరఫరాతోపాటు భారీగా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో హరిత, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. దీనివల్ల భవిష్యత్తులోనూ విద్యుత్‌ చార్జీలు పెంచకుండానే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయవచ్చని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థాపిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు విద్యుత్‌ సంస్థలు ప్రణాళికలు రూపొందించాలని, అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత సంస్కరణలతో, నాలుగేళ్లలో దేశంలోనే ఏపీ పవర్‌ సెక్టార్‌ మొదటి స్థానాన్ని పొందిందన్నారు. విద్యుత్‌ వినియోగదారుల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామన్నారు. 18 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఆదివారం నుంచి 7 గంటలకు బదులుగా 9 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, రైతుల అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ 2014లో యూనిట్‌ రూ.6.50గా ఉన్న సౌర విద్యుత్‌ ధర ప్రస్తుతం రూ.2.70కు తగ్గిపోయిందని, ఈ విషయాన్ని మన ప్రభుత్వం 2014లోనే అంచనా వేసిందన్నారు. పోలవరం విద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి రెట్టింపు అవుతుందని, ప్రస్తుతం 2336 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న జల విద్యుత్‌ ఉత్పత్తి 2022 నాటికి 4600 మిలియన్‌ యూనిట్లకు చేరనుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం ఇంజనీరింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయని విజయానంద్‌ ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ ఏడాది జూన్‌ కల్లా తవ్వకాల పనులన్నీ పూర్తవుతాయని, ఇందుకోసం ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా, సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పోలవరానికి బహుముఖ యత్నాలు 

హైడ్రాలిక్‌ సిలిండర్ల నిమిత్తం జర్మనీకి బృందం 
స్పిల్‌ వే 48 మీటర్ల ఎత్తు నిర్మాణానికి నేడో రేపో అనుమతులు 
ఈనాడు - అమరావతి

21ap-main16a_2.jpg

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్‌ నెలలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేందుకు బహుముఖ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, మార్గ సూచిలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే నెలాఖరుకల్లా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి నీరు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. 
సమీపిస్తున్న గడువు 
జూన్‌ 15 తర్వాత ఏ క్షణమైనా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్పటికల్లా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈలోపు స్పిల్‌ వే పూర్తి చేయాలి, గేట్లు పెట్టాలి.. వాటికి హైడ్రాలిక్‌ సిలిండర్లు ఏర్పాటు చేయాలి. మరోవైపు ఎగువ దిగువ కాఫర్‌డ్యాంల నిర్మాణమూ పూర్తి చేయాలి. వేల మంది పోలవరంలో ఇదే యజ్ఞంలో నిమగ్నమై ఉన్నారు. 
కాఫర్‌ డ్యాం పనులు 
ప్రాజెక్టులో భాగంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు సాగుతున్నాయి. ఎగువ డ్యాం పనులు దాదాపు 26శాతం పూర్తయ్యాయి. దిగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 10శాతం పూర్తి చేశారు. డెల్టా రబీ అవసరాలకు నీటిని వదలాల్సిన పరిస్థితి ఉండటంతో కొంత మేర పనులకు అంతరాయం కలుగుతోంది. ఈ లోపు మిగిలిన ప్రాంతంలోనే కాఫర్‌ డ్యాం పనులు చేసుకోవాల్సి వస్తోంది. 
కీలకం.. హైడ్రాలిక్‌ సిలిండర్లు 
పోలవరంలో అన్నింటికన్నా ముఖ్యం హైడ్రాలిక్‌ సిలిండర్లు. మొత్తం 48 సెట్‌ల హైడ్రాలిక్‌ సిలిండర్లు అవసరమవుతాయి. ఇవి జర్మనీ నుంచి రావాల్సి ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా ఇవే ఆధారం. ఇప్పటికే వీటి కోసం ఆర్డరు ఇచ్చారు. వీటిని వేగంగా రప్పించేందుకు ఒక బృందం జర్మనీ వెళ్లనున్నట్లు పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ చెప్పారు. తొలి విడతలో 24, మలివిడతలో 24 వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
జలసంఘం పరిశీలనలో.. 
ప్రస్తుతం స్పిల్‌ వే నిర్మాణ పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం నుంచి ప్రస్తుతం 42 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే అనుమతులున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలంటే 48 మీటర్ల స్థాయికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర జలసంఘం వద్ద ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది పరిశీలనలో ఉన్నాయి. వారు కోరిన సమాచారం ఇప్పటికే అధికారులు సమర్పించారు. ఈ అనుమతుల కోసం పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ తదితరులు గురువారం దిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ స్పిల్‌వేలో మొత్తం 48 వెంట్లు ఉంటాయి. ఇందులో 10 రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు, మరో నాలుగు ఎవర్ట్‌ మెంట్లు పోను మిగిలిన 34 గేట్లకు సంబంధించిన స్పిల్‌ వే స్తంభాల నిర్మాణం ఇప్పటికే 25.72 మీటర్ల వరకు నిర్మించారు.  రెండ్రోజుల్లో కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

2014- 2018 మధ్య పూర్తయిన పనికి ఏ ధర ఇవ్వాలి?

పోలవరంపై తాజా గణాంకాలు కోరిన కేంద్ర అధికారులు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను రూ.55,578 కోట్లతో కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అనంతరం కేంద్ర జలసంఘం మరికొంత సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖను కోరినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 1.4.2014 నాటికి ఎంత ఖర్చవుతుందో ఆ మేరకు కేంద్రం భరించేందుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు రెండో డీపీఆర్‌ను 2013-14 ధరల ప్రకారం, 2017-18 ధరల ప్రకారమూ రెండు వేర్వేరు ప్రతిపాదనలుగా సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి సమర్పించారు. తాజాగా 2017-18 ధరల ప్రకారమే తాజా డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో 1.4.2014 నాటికి ఎంత పని మిగిలిందో ఆ పనికి ప్రస్తుతం 2017-18 ధరల ప్రకారం అంచనాలు ఆమోదించారు. 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2018 ఏప్రిల్‌ ఒకటి వరకు పని పూర్తి చేసిన పరిమాణానికి 2017-18 ధరలు వర్తింపజేయడం ఏమిటని కేంద్రజలసంఘంలోనే పెద్దలు కొందరు ప్రశ్నించారు. ఇదే నమూనాతో లెక్కలు సిద్ధం చేయించిన దిగువ అధికారులు ఇందుకు అనుగుణంగా తమ వాదన వినిపించారు. ఆ సమయంలో పూర్తయిన పనికి 2013-14 లెక్కలను వర్తింపజేసి ఎంత మొత్తం ఖర్చు చేశారో లెక్కలు తీయాలని కేంద్రజలసంఘం మళ్లీ రాష్ట్రాన్ని కోరింది. దీనిపై ఏపీ జలవనరులశాఖ అధికారులు స్పందించి లేఖ రాశారు.

Link to comment
Share on other sites

పోలవరానికి బహుముఖ యత్నాలు 

హైడ్రాలిక్‌ సిలిండర్ల నిమిత్తం జర్మనీకి బృందం 
స్పిల్‌ వే 48 మీటర్ల ఎత్తు నిర్మాణానికి నేడో రేపో అనుమతులు 
ఈనాడు - అమరావతి

21ap-main16a_2.jpg

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్‌ నెలలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేందుకు బహుముఖ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, మార్గ సూచిలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే నెలాఖరుకల్లా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి నీరు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. 
సమీపిస్తున్న గడువు 
జూన్‌ 15 తర్వాత ఏ క్షణమైనా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్పటికల్లా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈలోపు స్పిల్‌ వే పూర్తి చేయాలి, గేట్లు పెట్టాలి.. వాటికి హైడ్రాలిక్‌ సిలిండర్లు ఏర్పాటు చేయాలి. మరోవైపు ఎగువ దిగువ కాఫర్‌డ్యాంల నిర్మాణమూ పూర్తి చేయాలి. వేల మంది పోలవరంలో ఇదే యజ్ఞంలో నిమగ్నమై ఉన్నారు. 
కాఫర్‌ డ్యాం పనులు 
ప్రాజెక్టులో భాగంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు సాగుతున్నాయి. ఎగువ డ్యాం పనులు దాదాపు 26శాతం పూర్తయ్యాయి. దిగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 10శాతం పూర్తి చేశారు. డెల్టా రబీ అవసరాలకు నీటిని వదలాల్సిన పరిస్థితి ఉండటంతో కొంత మేర పనులకు అంతరాయం కలుగుతోంది. ఈ లోపు మిగిలిన ప్రాంతంలోనే కాఫర్‌ డ్యాం పనులు చేసుకోవాల్సి వస్తోంది. 
కీలకం.. హైడ్రాలిక్‌ సిలిండర్లు 
పోలవరంలో అన్నింటికన్నా ముఖ్యం హైడ్రాలిక్‌ సిలిండర్లు. మొత్తం 48 సెట్‌ల హైడ్రాలిక్‌ సిలిండర్లు అవసరమవుతాయి. ఇవి జర్మనీ నుంచి రావాల్సి ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా ఇవే ఆధారం. ఇప్పటికే వీటి కోసం ఆర్డరు ఇచ్చారు. వీటిని వేగంగా రప్పించేందుకు ఒక బృందం జర్మనీ వెళ్లనున్నట్లు పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ చెప్పారు. తొలి విడతలో 24, మలివిడతలో 24 వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
జలసంఘం పరిశీలనలో.. 
ప్రస్తుతం స్పిల్‌ వే నిర్మాణ పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం నుంచి ప్రస్తుతం 42 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే అనుమతులున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలంటే 48 మీటర్ల స్థాయికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర జలసంఘం వద్ద ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది పరిశీలనలో ఉన్నాయి. వారు కోరిన సమాచారం ఇప్పటికే అధికారులు సమర్పించారు. ఈ అనుమతుల కోసం పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ తదితరులు గురువారం దిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ స్పిల్‌వేలో మొత్తం 48 వెంట్లు ఉంటాయి. ఇందులో 10 రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు, మరో నాలుగు ఎవర్ట్‌ మెంట్లు పోను మిగిలిన 34 గేట్లకు సంబంధించిన స్పిల్‌ వే స్తంభాల నిర్మాణం ఇప్పటికే 25.72 మీటర్ల వరకు నిర్మించారు.  రెండ్రోజుల్లో కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పోలవరంపై భారీ కుట్ర
19-03-2019 02:52:09
 
636885607283825151.jpg
  • నిర్మాణాలు చేపట్టకుండానే మునిగిపోతామని ప్రచారం
  • బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణకు ముంపు అని ఫిర్యాదు
  • ఏపీపై పోరుకు ఇతర రాష్ట్రాలను కలిపే యత్నం
  • వాటి కనుసన్నలలోనే నిర్మాణం జరగాలంటూ షరతు
  • తెలంగాణ పిటిషన్‌పై రాష్ట్ర జల వనరుల శాఖ ఆగ్రహం
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖ అయిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ఎగువ రాష్ట్రంలోని ప్రాంతాలు ఎంతమేరకు ముంపునకు గురవుతాయో అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం సాగకూడదని, ఒకవేళ నిర్మాణం పూర్తయినా నీటిని నిల్వ చేయకుండా నిరోధించాలని ఈ నెల 11న సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌పై ఆంధ్ర ప్రదేశ్‌ ఆశ్చర్యపోతోంది. లక్ష్యం మేరకు నిర్మాణం సాగుతున్న ప్రస్తుత దశలో దానిని అడ్డుకునేలా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసిందని ఆరోపించాయి.
 
పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగిన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టమూ లేని మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా 1980 నాటి గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్‌లోని అంశాలను ఉటంకిస్తూ ఈ వ్యాజ్యంలోకి లాగడం ద్వారా ఆ రెండు రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడేలా చేయాలనేది తెలంగాణ ప్రణాళికగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలను కూడా ఏపీకి వ్యతిరేకంగా మోహరించేలా చేయడం వెనుక అసలు కుట్ర వేరే ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
పైగా... ఇంకా ఎలాంటి నిర్మాణాలూ చేపట్టని భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు మునిగిపోతుందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవపట్టించేలా వ్యాజ్యం వేసిందని అధికారులు అంటున్నారు. ప్రతిపాదిత భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు అభయారణ్య ప్రాంతంలో ఉందని, వన్యప్రాణి సంరక్షణ ప్రదేశంలో ఉన్నందున ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చే అవకాశమే లేదని ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టు ప్రాంతం ముంపునకు గురికావడం వల్ల తమకు భవిష్యత్‌లో హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఉండదంటూ గగ్గోలు పెట్టడంలో సహేతుకత ఏంటని ఏపీ ప్రశ్నిస్తోంది. భద్రాచలం మునిగిపోతుందంటూ ఆందోళన చేయడంలోనూ అర్థం లేదని ఏపీ కొట్టిపారేస్తోంది. పోలవరం స్పిల్‌వే ఎత్తు 145 అడుగులకు మించకుండా ఉండాలని, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి మించకుండా ఉండాలని, కానీ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణం చేపట్టేందుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే... కృష్ణా నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతుందని జలవనరులశాఖ చెబుతోంది. గోదావరి-పెన్నా అనుసంధానం చేస్తే... గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. ఈ అనుసంధాన ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లి హంద్రీనీవా సుజల స్రవంతిలో కలిపేస్తే రాష్ట్రమంతా గోదావరి జలాలతో కళకళలాడుతుందని వివరిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తుల దిగుబడులు పెరుగుతాయి. రైతులో ఆనందం తాండవించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్లోనూ సమూలమార్పులు వస్తాయని అంటున్నారు. ఇలాంటి సానుకూలవాతవరణం ఉంటే రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలూ భారీగా పెట్టుబడులు పెడతాయని చెబుతున్నారు.
 
జాతీయ హోదా కలిగిన పోలవరంపై కేంద్రానికిగానీ, రాష్ట్రానికిగానీ పెత్తనం లేకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ నియంత్రణలో ఈ ప్రాజెక్టు ఉండాలని తెలంగాణ కోరడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అధికారమూ లేకుండా చేయాలన్నదే ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క పోలవరాన్ని అడ్డుకుంటే మొత్తం రాష్ట్ర ప్రగతినే సమూలంగా అడ్డుకోవచ్చన్న భారీకుట్రలో భాగంగానే సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసిందని రాష్ట్ర జలవనరులశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
 
తెలంగాణ వ్యాజ్యంలో ఏముంది?
  1. పోలవరం ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరదను, దాని ప్రభావాన్ని అంచనాగానీ, అధ్యయనంగానీ చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగించడానికి ఏ విధమైన హక్కు, అర్హత లేదు.
  2. ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరద సంభావ్యతను, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, సిడమెంటేషన్‌, పర్యావరణం మొదలైన అంశాలను అంచనా వేసే, అధ్యయనం చేసే బాధ్యతను పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు అప్పగించాలి. ఈ సంస్థకు నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల (తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర)కు చెందిన చీఫ్‌ ఇంజనీర్లను, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సంస్థలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక బృందాన్ని తోడ్పాటు అందించేలా ఏర్పాటు చేయాలి.
  3. 2000 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం అంచనా వేసిన ప్రభావిత ప్రాంతాలకు కట్టుబడి ఉండేలా మొదటి ప్రతివాది కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రతివాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను నిర్దేశించాలి.
  4. తెలంగాణకు చెందిన మణుగూరు హెవీవాటర్‌ ప్లాంటు, భద్రాచలం దేవాలయం వంటి నిర్మాణాలకు గరిష్ఠ వరద వచ్చినప్పుడు ముంపునకు గురికాకుండా తగిన రక్షణ గోడలు నిర్మాంచేలా కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలను ఆదేశించాలి.
  5. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణను స్వయం ప్రతిపత్తిగల నిపుణుల బృందానికి అప్పగించాలి. ఈ బృందంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను నియమించాలి. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం గరిష్ఠ వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి.
  6. పైన పేర్కొన్న అంశాలు పరిష్కారమయ్యేంత వరకూ పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేయకుండా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించాలి.
 
Link to comment
Share on other sites

పోలవరం స్పిల్‌వే ఎత్తు 145 అడుగులకు మించకుండా ఉండాలని, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి మించకుండా ఉండాలని, కానీ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణం చేపట్టేందుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

vammo e point meda kuda Telangana abyantram ante inka India kharma....

CBN a spillway capacity penchindi water storage ki kadu endukaina manchidi ani 100 years flood calculation tho safe kosam

CBN govt after studies preferred 50 lakh cusecs spillway....what is wrong in that? they should appreciate that...

Link to comment
Share on other sites

4 minutes ago, AnnaGaru said:

ide point odissa vallu kooda SC lo raise chesaru le, but CWC, center and state govt stood strongly. cwc permission ichindi kabatti SC vallu denni object cheyaleru le. vorni vallu inka power plant kattakundane munigi poyayi ani cheputhunnaru ga. idhi sc lo nilabadadu kakapothe time drag chestharemo maha aithe.

Link to comment
Share on other sites

tg, orissa, chattisgarh(earlier its part of madhya pradesh) agreed for 150 feet frl(full reservior level) in 1980 . they can't stop it now . as per spillway capacity here we increased spillway width not spillway height . 50 lakh cusecs spillway will enable discharge  more water . it helps in reducing backwater and floods in upper states.

earlier center filed affidavit that there is no need study backwater effect again. center assured sc that there won't be any damage to bhadrachalam temple , power plant etc. 

nobody can stop polavaram and 150 feet frl .

Link to comment
Share on other sites

On 3/18/2019 at 11:16 PM, ravindras said:

cofferdam is more than enough to irrigate kariff season for 36 lac acres. full dam is bonus for rabi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...