Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
డీపీఆర్‌ 2ను వెంటనే  ఆమోదించండి 

 

రూ.3722 కోట్ల నిధులివ్వాల్సి ఉంది 
వెంటనే మంజూరు చేయండి 
5 రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టువల్ల నేరుగా ప్రయోజనం 
గడ్కరీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి డిమాండ్‌ 
స్వయంగా అందించిన జలవనరుల మంత్రి దేవినేని ఉమా

21ap-main8a_1.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండో డీపీఆర్‌ (సవరించిన ప్రాజెక్టు వ్యయ అంచనాలు)ను తక్షణమే ఆమోదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం ఇవ్వాల్సిన రూ.3722.04 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖను జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు విజయవాడకు వచ్చిన  కేంద్ర మంత్రికి నేరుగా అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సక్రమంగా ఇవ్వకపోతే ఈ జాతీయ ప్రాజెక్టును నిర్మించుకునే ఒక గొప్ప అవకాశాన్ని దేశం కోల్పోయినట్లేనని, 5రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రయోజనం కలుగుతుందని సీఎం ఆ లేఖలో గుర్తు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు తక్షణం విడుదల చేయకపోతే ఈ ప్రాజెక్టు పనుల వేగంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. భూసేకరణ-పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణమూ, భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 100శాతం నిధులు తామే ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని’ సీఎం లేఖలో ప్రస్తావించారు. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర మంత్రి వచ్చినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు ఇప్పిస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్టు పురోగతిని, ఎంత నిధులు ఖర్చు చేశారు, ఎన్ని నిధులు కేంద్రం నుంచి ఇంకా రావాలో ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.

లేఖలోని ముఖ్యాంశాలు.. 
* 2019 డిసెంబరులోగా ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. 
* ఈ విషయంలో సీబీఐపీ అవార్డు ఇచ్చింది 
* ప్రధాన డ్యాం పనులు : 54.33 శాతం.. 
* కుడి కాలువ పనులు: 90శాతం, ఎడమ కాలువ: 67.37శాతం పూర్తి 
* మొత్తం ప్రాజెక్టు పనులు: 64.31శాతం పూర్తయ్యాయి. 
* ఇంతవరకు ఖర్చు చేసిన నిధులు: 15,585.17 కోట్లు 
* జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన ఖర్చు: రూ10,459.30 కోట్లు 
* కేంద్రం ఇచ్చింది: రూ.6,727.26 కోట్లు 
* కేంద్రం ఇప్పటివరకూ ఇవ్వాల్సిన నిధులు: రూ.3722.04 కోట్లు 
* ఆఖరుగా కేంద్రం నిధులు ఇచ్చింది: 2018 జూన్‌ 11

మీరు అడిగినవన్నీ ఇచ్చామంటూ.. 
* ప్రాజెక్టు సవరించిన అంచనాలు( డీపీఆర్‌ 2) 2017 ఆగస్టులోనే సమర్పించాం. 
* కేంద్ర జలసంఘం అనుమానాలన్నీ నివృత్తి చేశాం 
* ఇంకా కేంద్ర జలసంఘం డీపీఆర్‌ 2 పరిశీలిస్తూనే ఉంది 
* రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు కేంద్రం తిరిగి ఇవ్వాలంటే ఈ డీపీఆర్‌ 2 ను ఆమోదించాలి 
* ఇంకా ఆలస్యమైతే పనులకు ప్రతికూలమవుతుంది. సకాలంలో మీరు నిధులివ్వక ఎంతో ఇబ్బంది పడుతున్నాం 
* ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వనరుల నుంచి ఖర్చు చేయడం కష్టంగా ఉంది 
* కేంద్రం నిధులు తిరిగివ్వకపోవడంతో ఇతర ప్రాధాన్య పథకాలకు నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు పడుతున్నాం.


జూన్‌ నాటికి పోలవరం నీళ్లు ఇవ్వాల్సిందే: చంద్రబాబు

ఈ ఏడాది జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాం నిర్మించి పోలవరం కాలువలకు గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పోలవరంలో పనిచేసే శ్రామికులు గ్రామాలకు వెళ్లడంతో గత వారం రోజులుగా పురోగతి మందగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల పురోగతిపై ఆయన సోమవారం సమీక్షించారు. జూన్‌ కల్లా నీరు ఇవ్వాలనుకుంటున్న సమయంలో ఇన్ని పని రోజులు కోల్పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. కాఫర్‌ డ్యాం పనులు ఆలస్యం అవుతుండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాం నిర్మించి నీళ్లు ఇచ్చేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని వారం రోజుల్లో వస్తే చర్చిద్దామన్నారు. ఏప్రిల్‌ నెలాఖరుకు తవ్వకం పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాల్సిందేనని లక్ష్యం విధించారు.

పోలవరం ప్రాజెక్టును ఇంతవరకు 5,02,295 మంది సందర్శించారని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని కొండలపై రిసార్టులు, హొటళ్లు నిర్మించి పర్యాటక కేంద్రంగా మార్చాలని సీఎం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించడంతో ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జలపూజ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీలయితే తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని సీఎం చెప్పారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీరు జలంధర్‌లను సీఎం అభినందించారు. ఎనర్జీ ఎన్విరాన్‌మెంటల్‌ ఫౌండేషన్‌ నుంచి ‘గ్లోబల్‌ హెచ్‌ ఆర్‌ స్కిల్‌’ విభాగంలో ప్లాటినం పురస్కారం అందుకున్నందుకు జలవనరులశాఖను అభినందించారు.

 

Link to comment
Share on other sites

పోలవరం సంగతేంటో చెప్పండి

 

 డీపీఆర్‌-2ను నెలరోజుల్లో ఆమోదిస్తామని చెప్పి ఏడాదైంది 
ఏపీకి ఎక్కువ నిధులిచ్చామనడం అబద్ధం 
కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం 
95 లక్షల మంది మహిళలకు మేలు చేస్తున్నామని వెల్లడి 
పింఛన్‌ను 10 రెట్లు పెంచడంతో 55 లక్షల మందికి ప్రయోజనమని వ్యాఖ్య 
ఈనాడు - అమరావతి

22AP-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు కేటాయించామంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఆయన అబద్ధం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కే కేంద్రం ఎక్కువ నిధులిచ్చిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో ముందు గడ్కరీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు సన్నద్ధతపై ఆయన మంగళవారం ఉదయం తెదేపా నాయకులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపు జరుగుతోందని, ఆయన వివక్షకు ప్రతిరూపంగా మారారని చంద్రబాబు మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్క బుల్లెట్‌ రైలుకే రూ.లక్ష కోట్లకుపైగా కేటాయించారన్నారు. కేంద్రంలో ఏర్పాటవుతున్న ప్రత్యామ్నాయ కూటమికి నలుగురు ప్రధానులని భాజపా అనడం, ఆ పార్టీలో గూడు కట్టుకున్న భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఏదో ఉద్ధరించినట్టు భాజపా నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టోల్‌ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకునే రోడ్లకే కేంద్రం అనుమతులిచ్చింది. మిగతా రాష్ట్రాలతో పాటే ఆంధ్రప్రదేశ్‌కూ ఇచ్చారు తప్ప, ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌-2ను నెల రోజుల్లో ఆమోదిస్తామని గడ్కరీ చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి సంవత్సరమైనా ఇప్పటి వరకూ ఆమోదం రాలేదు. ముందు గడ్కరీ దీనికి సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి భాజపా వల్ల జరగలేదు. మనం స్వయం కృషితో చేసుకున్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

25న మూడు చోట్ల పసుపు-కుంకుమ సభలు 
ఈ నెల 25న రాష్ట్రంలోని మూడు చోట్ల ‘పసుపు-కుంకుమ’ సభలు నిర్వహిస్తామని, అమరావతి, విశాఖ, కడపల్లో అవి జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. 95 లక్షల మంది మహిళల్ని పేదరికం నుంచి బయటకు  తెస్తున్నామని, ప్రతి మహిళకు రూ.10 వేలు రాబడి వచ్చేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

కాపులకు రిజర్వేషన్లపై కేంద్రాన్ని గతంలోనే కోరాం 
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని కేంద్రాన్ని ఇది వరకే కోరామని, కానీ భాజపా నేతలు అంగీకరించలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో... రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం కాపులకు ఇచ్చేసిందని, మిగతా ఐదు శాతాన్ని ఇతర వర్గాల్లోని పేదలకు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నాలుగేళ్లలో పింఛన్‌ను 10 రెట్లు చేశామని, దీని వల్ల 54.61 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఆటో, ట్రాక్టర్‌ యజమానులు తెదేపాకు మద్దతివ్వాలి 
‘‘అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.250 కోట్లు ముందస్తుగా ఇస్తున్నాం. చిన్న మొత్తాలు డిపాజిట్‌ చేసినవారికి మొదట చెల్లింపులు జరుపుతాం. దీని వల్ల ఆరు లక్షల మంది బాధితులకు సత్వర ఊరట కలుగుతుంది. మిగతా వారికి హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయం చేస్తాం. ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను తీసేశాం. ప్రతి ఆటో, ట్రాక్టర్‌ యజమాని తెదేపాకు మద్దతు ఇవ్వాలి’’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

 

Link to comment
Share on other sites

150 రోజుల్లో పోలవరం

 

  సమస్యలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం
  గోదావరి వరద ప్రవాహాలకు అనుగుణంగా గేట్ల ఏర్పాటు
  హైడ్రాలిక్‌ సిలిండర్లు వేగంగా తెచ్చేందుకు జర్మనీకి ఇంజినీర్లు

ap-main3a_3.jpg

ఈ ఏడాది జూన్‌ చివరికల్లా పోలవరం నీళ్లు ఇచ్చేస్తాం.ఇదీ ప్రభుత్వ ప్రకటన నిజంగా సాధ్యమేనా?సామాన్యుడికి ఒక వైపు ఆశతో పాటు  మరో వైపు సందేహం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్న మాట వాస్తవమే.. కానీ, ఇందుకోసం 1128.4 మీటర్ల స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేయాలి. 48 రేడియల్‌ క్రస్టు గేట్లు నిర్మించాలి. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వాలి. స్పిల్‌ ఛానల్‌ పూర్తి చేయాలి. 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించాలి. స్పిల్‌ ఛానల్‌కు ఇరువైపులా కట్టలు నిర్మించాలి. ఇవన్నీ కేవలం 150 రోజుల్లో సాధ్యమేనాఅంటే సాధ్యమేనని అంటున్నారు అధికారులు.పోలవరం జలాశయంలో నీరు నిలబెట్టి ఇచ్చేందుకు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఆధ్వర్యంలో పోలవరం చీఫ్‌ ఇంజినీరు వి.శ్రీధర్‌, సలహాదారు రమేష్‌బాబుల బృందం ప్రణాళిక సిద్ధం చేసింది.రాబోయే 150 రోజుల్లో పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ పూర్తి చేసి నీరు ఇవ్వగలమని ఈ ప్రణాళిక పేర్కొంటోంది. పోలవరం ప్రాజెక్టులో 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించి.. జలాశయంలో నీటిని నిలబెట్టి జూన్‌ నెలాఖరుకు నీళ్లు సరఫరా చేయాలనేది లక్ష్యం. ఎగువ కాఫర్‌ డ్యాం పనులు 18% పూర్తయ్యాయి. జూన్‌ నాటికి ఈ కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. దిగువ కాఫర్‌ డ్యాం పనులను కూడా జూన్‌కు పూర్తి చేసేందుకు ఇబ్బందులు ఏమీ లేవని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

మే 20 నాటికి స్పిల్‌ ఛానల్‌ పనులు: స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు మే 20 నాటికి పూర్తి చేస్తారు. స్పిల్‌ ఛానల్‌కు అటూ ఇటూ వరద నీరు పొర్లకుండా కరకట్టలు నిర్మించాలి. వీటి శాశ్వత నిర్మాణాలకు ఇంకా ఆకృతులు ఖరారు కాలేదు. తాత్కాలికంగా కట్టలను నిర్మించనున్నారు.

ఏప్రిల్‌ నెలాఖరుకు సివిల్‌ పనులు పూర్తి: పోలవరం స్పిల్‌ వేలో మొత్తం 48 గేట్లకు సంబంధించిన పియర్‌ నిర్మాణం, ఇతర సివిల్‌ పనులన్నీ ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించారు. గేట్లు ఏర్పాటు చేశాక స్పిల్‌ వే శ్లాబ్‌ పనులు, స్పిల్‌ వే వంతెన పనులు చేపడతారు.

మొత్తం 48 గేట్లు...ఎప్పుడు ఎలా? మే నెలాఖరుకల్లా మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేసి వాటిని నిర్వహించుకునేలా పనులు పూర్తి చేయాల్సిన అవసరం లేదని, జులై నెలాఖరు వరకు కూడా ఈ పనులు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ఇంజినీరింగు అధికారులు ప్రణాళిక రూపొందించారు.  జూన్‌లో గరిష్ఠంగా 7 లక్షల క్యూసెక్కులు, జులై నెలాఖరుకు గరిష్ఠంగా 13 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని లెక్కిస్తూ...ఆ వరద దిగువకు వదిలెయ్యాలంటే ఎప్పటికి ఎన్ని గేట్లు పని చేయించాల్సి ఉంటుందో అంచనాకు వచ్చారు.

జులైలో కాలువలకు నీళ్లిస్తాం: అన్ని పరిస్థితులను, సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక సిద్ధం చేశాం. వచ్చే ఖరీఫ్‌కు పోలవరం నీటిని కాలువలకు గ్రావిటీ ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు మేం పూర్తి చేస్తాం. పోలవరం కాలువలు 35.5 మీటర్ల గర్భ స్థాయితో నిర్మిస్తున్నాం. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే 38.1 మీటర్ల వరకు నీరు నిలబడాలి. ఆ స్థాయిలో నీరు రావాలంటే పోలవరం జలాశయంలో 80 టీఎంసీలు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయి నీళ్లు జులై నెలలోనే వస్తాయి. అంతవరకు గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి నీళ్లందిస్తాం. ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రధాన డ్యాం పరిధిలో పనులకు రూ.2,000 కోట్ల ఖర్చు చేయగలిగితే సరిపోతుంది. హైడ్రాలిక్‌ సిలిండర్లను త్వరగా రప్పించేందుకు వీలుగా ఉన్నతాధికారులను ప్రభుత్వం జర్మనీ వెళ్లమని సూచించింది.

-వి.శ్రీధర్‌, పోలవరం చీఫ్‌ ఇంజినీరు

 

Link to comment
Share on other sites

పోలవరానికి రూ.55,548 కోట్లు

 

 రెండో డీపీఆర్‌కు అనుమతిపై ఉత్తర్వులు
 దిల్లీలో నేడు సాంకేతిక సలహా కమిటీ సమావేశం

10ap-main12a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,548.87 కోట్ల విలువతో రెండో డీపీఆర్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతితో జలవనరుల శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలసంఘం సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పోలవరం సవరించిన అంచనాలపై సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశం దిల్లీలో సోమవారం జరగనుంది. దాదాపు ఏడాదిన్నరగా రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఎదురు చూస్తున్న ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు ఇప్పటికే దిల్లీ వెళ్లారు. ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ గత వారం రోజులుగా దిల్లీలోనే ఉంటూ కేంద్ర జలసంఘం అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 1.4.2014 నాటికి పోలవరం ప్రాజెక్టుపై ఎంత ఖర్చయ్యిందో ఆ మొత్తాన్ని తాము తిరిగిస్తామని కేంద్రం పేర్కొంది. ఆ మేరకు కొత్త అంచనాలు తయారు చేసి పంపాలని గతంలోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరింది. 2013-14 ధరల ప్రకారం అధికారులు రూ.57,940.86 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపారు. ఇప్పటికే 2017-18 ధరలు కూడా అమల్లోకి రావడంతో కొత్త ధరల ప్రకారం ఎంత అవుతుందో ఆ నివేదిక కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్ర జలవనరులశాఖ 2017-18 అంచనాలతో కూడా నివేదిక సమర్పించింది.

10ap-main12b.jpg

తగ్గిన అంచనాలు
2013-14 నాటి ధరలతో పోలిస్తే 2017-18 ధరల ప్రకారం అంచనాలు రూ.2,391.99 కోట్లు మేర తగ్గాయి. హెడ్‌వర్క్స్‌, భూసేకరణ, పునరావాస పనులకు గతంలో రూ.44,614.11 కోట్లతో అంచనా వేయగా.. గతేడాది ధరల ప్రకారం దీన్ని రూ.39,004.86 కోట్లుగా పేర్కొన్నారు. విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి గతంతో పోలిస్తే రూ.81 కోట్లు తక్కువతో అంచనాలు వేశారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మాణ వ్యయం మాత్రం రూ.3,298.28 కోట్లు పెరిగింది

Link to comment
Share on other sites

vella gola endo

--------------------------------------

https://odishasuntimes.com/odisha-to-construct-barrage-on-jhanjhabati-river/

Jeypore: In ongoing conflict between Odisha and Andhra Pradesh over the Polavaram project, the State government is planning to construct a barrage on the Jhanjhabati River for irrigation.

A source said that the mega project will be constructed at an expenditure of Rs 106 crore focusing Narayanpatna and Lakshmipur blocks in Maoist-infested district Koraput. It is likely to affect the Jhanjhavathi Medium Irrigation Project in Andhra.

 

According to reports, Odisha’s Water Resources Department will construct the 106-meter-long barrage near Chintaguda village under Narayanpatna block in Koraput. The barrage will have 12 gates (10-meter length and 6-meter width in size) through which the water will be released. While the target has been set for irrigation in total 2546 hectare, 1909.76-hectare land can be irrigated during Kharif season after completion of the project benefitting around 127 villages under Narayanpatna block and more than 10 panchayats under Lakshmipur block in the district.

The project was planned 15 years ago for constructing barrage on the Jhanjhabati River. While Rayagada district administration had proposed the project, Koraput district administration took initiatives for its execution in 2014, said Minor Irrigation Executive Engineer Subash Chandra Sethi.

Reports said that the water resources department in Jeypore had conducted a survey in June last year. Subsequently, the necessary paperwork was expedited for construction of the barrage.

While both the Polavaram project on the Godavari River and Rubber dam project on the Jhanjhabati River are sub-judice, the proposed project is assumed as a masterstroke by the Odisha Government to the neighbouring State.

Notably, the 4370 length-Rubber dam project was built at expenses of Rs 600 crore on the Jhanjhabati/Jhanjhavathi River in Vizianagaram district of Andhra Pradesh.

 
 
 
Link to comment
Share on other sites

50 minutes ago, Yaswanth526 said:

https://pbs.twimg.com/media/DzK-VCJWsAAS5IM.jpg:large

e file forever finance ministry ki irrigation ministry ki to and fro kodutundi as long as MoSha is in power. 

 

Worst case election mundu sign chestaru.... malli velle vastey (mana kharma kaali) Okka paisa release cheyyaru.... on top of all you will see court stay orders on Polavaram 

Link to comment
Share on other sites

11 hours ago, sskmaestro said:

e file forever finance ministry ki irrigation ministry ki to and fro kodutundi as long as MoSha is in power. 

  

 Worst case election mundu sign chestaru.... malli velle vastey (mana kharma kaali) Okka paisa release cheyyaru.... on top of all you will see court stay orders on Polavaram 

 

7 minutes ago, Hello26 said:

yenni approvals vachina.....actual ga money release chese time lo korrilu, waiting lu, reports, audits and etc and etc and etc ani funds will never be released. 

first adi fm ministry clear cheyali, cabinet munduku vellali e approvals ante easy ga 1-2 years padatayi. early ga vasthe we are happy  lekapoyina no problem. coffer dam kattadaniki and cofferdam to store chese water ki r&r anni kalipina inko 10k coreres kante ekkuva avvavu. kabatti pichha l8. coffer dam storage ki main dam storage ki difference just 60-80 tmc technically and that to useful for second crop. godavari delta ki etu seleru water vadathunnaru. krishna delta ki second crop undaka povachhu maha aithe. even dam full ga kattina first 3 years etu water full storage level to nimparu with dam security.  antha worry avvalisina pani emi ledu. 10k crores state bare chesthe all is well.

Link to comment
Share on other sites

3 hours ago, AnnaGaru said:

If FM approves then they have to release 4000 crores immediate.

Right now Andhra has put own money 4000 crores waiting for center approval..

 

Modi don't want to approve as that would ease AP  financial issues before election

Ah daridrudu odipothadu le.... manaki appudu kaani manchi jaragadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...