Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
కాంక్రీట్‌ రికార్డుకు సిద్ధం

 

5ap-main3a_1.jpg

పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌లో ఒక టవర్‌ నిర్మాణానికి 2017 మేలో 36గంటల్లో 21,580 ఘనపు మీటర్ల(ఘ.మీ.) కాంక్రీట్‌ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30వేల ఘ.మీ. కాంక్రీట్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూణ్నెల్ల కిందట 24 గంటల్లో 11,158 ఘ.మీ. కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11,289 ఘ.మీ. కాంక్రీట్‌ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల ఘ.మీ. కాంక్రీటు వేసేందుకు గుత్తేదారు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.

30వేల ఘ.మీ. కాంక్రీట్‌కు కావాల్సినవి..

సిమెంటు : ఏడువేల టన్నులు
ఇసుక :  22వేల టన్నులు
కంకర :  36వేల టన్నులు

 

మానవ వనరులు

కార్మికులు : 3,600 మంది
సాంకేతికేతర సిబ్బంది : 720
సాంకేతిక సిబ్బంది : 500
వివిధ హోదాల్లోని ఇంజినీర్లు : 21 మంది

ప్రస్తుతం ప్రాజెక్టులో గంటకు 3,770 మెట్రిక్‌ టన్నుల కంకర తయారు చేసే క్రషర్లున్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర రసాయన మిశ్రమాలు కలిపే బ్లాచింగ్‌ప్లాంట్లలో గంటకు 1560ఘ.మీ. కాంక్రీట్‌ కలిపేలా సన్నద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8గంటలకు స్పిల్‌ఛానల్‌లో పని ప్రారంభించి సోమవారం ఉదయం 8గంటలకు 30వేల ఘ.మీ. పైబడి కాంక్రీట్‌ వేసి రికార్డు సాధించాలనుకుంటున్నారు. అదే పనిని మరికొన్ని గంటలపాటు కొనసాగించే ఆలోచనతో ఉన్నారు.

5ap-main3b.jpg

రికార్డు సాధించాకే సంబరాలు
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సిబ్బంది అనుమతి ఇచ్చిన వెంటనే ఆదివారం ఉదయం స్పిల్‌ఛానల్‌లో కాంక్రీట్‌ వేసే పనిని ప్రారంభించేందుకు అవసరమైన యంత్రసామగ్రినంతా ఇప్పటికే సమకూర్చారు. శనివారం రాత్రికే గిన్నిస్‌ ప్రతినిధులు, అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రణాళిక ప్రకారం కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. రికార్డు సాధించిన అంశంపై లండన్‌ నుంచి ప్రకటన వచ్చాక ప్రాజెక్టులో సంబరాలు చేసుకునేందుకు నవయుగ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు.

5ap-main3c_1.jpg

నిర్విరామంగా కొనసాగిస్తాం
పోలవరం ప్రాజెక్టులో మరో రికార్డు సాధించే దిశగా పనులు ముమ్మరంగా చేస్తున్నాం. స్పిల్‌ఛానల్‌లో 30వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేసే పనిని 24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఉన్నాం. దీనికి దైవసంకల్పం తోడవ్వాలి.

- సీఈ శ్రీధర్‌, ఈఈ డి.శ్రీనివాస్‌

 

Link to comment
Share on other sites

గిన్నిస్‌ రేస్‌
06-01-2019 03:14:53
 
636823412915814276.jpg
  • ప్రపంచ రికార్డు బాటలో పోలవరం
  • 24 గంటల్లో 28000 క్యూ.మీ. కాంక్రీట్‌
  • 21,580 క్యూ.మీ. వేస్తే రికార్డు ఛేదనే
  • నేటి ఉదయం 7 నుంచి రేపు ఉదయం
  • ఆరు గంటలదాకా అవిశ్రాంత పరిశ్రమ
  • ‘రికార్డు’ ఖరారుకు రంగంలోకి గిన్నిస్‌
  • 15 నిమిషాలకు ఒకసారి పని నమోదు
  • గంట గంటకు లండన్‌కు సమాచారం
  • పని స్థలంలో 8 మంది నిరంతర ఆరా
అమరావతి, ఏలూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదవుతోంది. తన రికార్డులను తానే తిరగరాసేందుకు ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అతి భారీ కాంక్రీట్‌ విన్యాసం ద్వారా గిన్ని్‌సబుక్‌లోకి ఎక్కనుంది. చైనాలోని త్రీగార్జెస్‌ ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల రికార్డును ‘పోలవరం’ ఇప్పటికే అధిగమించింది. తాజాగా దుబాయ్‌లోని అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ షబీబ్‌ , రాల్స్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను అధిగమించేందుకు నవయుగ ఇంజనీరింగ్స్‌ సిద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. అప్పటినుంచి సోమవారం ఉదయం ఆరు గంటల లోపు 28,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అదే జరిగితే ‘నవయుగ’ మరో ప్రపంచ రికార్డును ఛేదించినట్టే!
 
రికార్డుకిదే గీటురాయి..
ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ ప్రతినిధి రిషినాథ్‌ బృందం శుక్రవారం సాయంత్రమే పోలవరం చేరుకొంది. స్వతంత్రంగా వచ్చిన సివిల్‌ ఇంనీరింగ్‌ ప్రతినిధులు, జాతీయ మీడియా సంస్థలు, స్థానిక మీడియా సంస్థలతో ఈ ప్రాంతం సందడిగ మారింది. ఈ అద్భుత క్షణాల కోసం ఉత్సుకతతో వీరంతా ఎదురుచూస్తున్నాయి. వీరందరి కోసం ప్రాజెక్టు స్థలంలో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ రికార్డు నమోదులో భాగంగా గిన్నిస్‌ బృందం కాంక్రీటు ప్రతి గంటకు ఎంత వేస్తున్నారనేది పరిగణనలోకి తీసుకొంటుంది. ఆ వివరాలను ఎప్పటికప్పుడు టెలి వీడియోల ద్వారా లండన్‌లోని కేంద్ర కార్యాలయానికి చేరవేస్తుంది. కాంక్రీటు వేసే దృశ్యాలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రికార్డు చేస్తారు. ఈ బృందంలోని ఎనిమిదిమంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
 
అంతా సిద్ధం...
కాంక్రీటుకు కావల్సిన ముడి పదార్థాలు, భారీ యంత్రాలు సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం పోలవరం వద్ద 10 బ్లాచింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ బ్లాచింగ్‌ పాయింట్‌ ద్వారా ఒక గంటకు 1560 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు సిద్ధం చేయొచ్చు. ఇలా సిద్ధ్దమైన కాంక్రీటును స్పిల్‌ చానల్‌కు తరలించడానికి 70 ట్రాన్సిక్‌ మిల్లర్లు, 20 ఎడిటర్లు, 20 డంపర్లు, 5 టెలిబెల్టులను సిద్ధం చేశారు. స్పిల్‌ చానల్‌లో సుమారు 350 బ్లాకుల్లో కాంక్రీటు వేయడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నాటికి 320 బ్లాకుల్ని రెడీ చేశారు. ఈ బ్లాకుల్లో కాంక్రీట్‌ను నింపేందుకు 2 లక్షల బస్తాల సిమెంట్‌, 40 క్యూబిక్‌ మీటర్‌ల మెటల్‌, 2 లక్షల క్యూబిక్‌ మీటర్‌ల మేర ఇసుకను సిద్ధం చేసినట్టు ప్రాజెక్ట్‌ ఈఈ శ్రీనివాస్‌ వివరించారు. ఈ కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్‌ మిక్చరు కూడా ఉందన్నారు. ప్రతీ క్యూబిక్‌ మీటరుకు 4 కేజీలు చొప్పున ఈ యార్డ్‌ మిక్చరు కలపనున్నారు.
 
వడి..వడిగా..
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పూర్తయితే.. 38.78 లక్షల ఎకరాలకు సాగునీరు ..540 గ్రామాలకు చెందిన 28.5లక్షల మందికి తాగునీరు అందనున్నది. అదేవిధంగా 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కానున్నది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌వే కుడి ఫ్లాంక్‌ 1128.4 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి 48 రేడియల్‌ గేట్లు అమర్చుతారు. 16 మీటర్లు వెడల్పు, 20.84 మీటర్ల ఎత్తు కలిగిన ఈ రేడియల్‌ గేట్లు హైడ్రాలిక్‌ విధానంలో పనిచేస్తాయి. అదేవిధంగా 1000 మీటర్ల వెడల్పు ..2920 మీటర్ల పొడవు కలిగిన స్పిల్‌ చానల్‌ ద్వారా 50 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు బయటకొస్తాయి. మొత్తం కాంక్రీట్‌ 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర వేయాలి. ఇందులో ఇప్పటికే 21.48 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
 
నేడు పోలవరంలో రివ్యూ కమిటీ భేటీ
పోలవరం పని స్థలంలోనే కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశం ఆదివారం జరగనున్నది. ఈ సమీక్షలోనైనా డిజైన్లను ఆమోదిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది. డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశంలో గ్యాప్‌ 1, గ్యాప్‌ 3కు సంబంధించిన డిజైన్లను సమీక్షిస్తారు. ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌), అప్రోచ్‌ చానల్‌ ఎస్కవేషన్‌, స్పిల్‌వే ఎడమ గైడ్‌బండ్‌ డిజైన్లను ఈ కమిటీ సమీక్షిస్తుంది.
 
నవయుగ విజయ పరంపర..
  •  2018 జూన్‌ 10,11 తేదీలలో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
  • 2018 నవంబరు 25-26 తేదీల్లో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 11,298 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
  •  2018 డిసెంబరు 15-16 తేదీల్లో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 16,368 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ వేశారు.
  •  మొత్తంగా 2018లో 12 నెలల కాలంలో 16,64,397 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
Link to comment
Share on other sites

పోలవరాన్ని సందర్శించనున్న డ్యాం ఆకృతుల కమిటీ

 

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం ప్రత్యేకంగానియమించిన డ్యాం ఆకృతుల కమిటీ ఆది, సోమవారాల్లో ప్రాజెక్టును సందర్శించనుంది. నిర్మాణ పురోగతి, పెండింగులో ఉన్న వివిధ ఆకృతులపై ఈ కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. కమిటీ ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో పోలవరం ఇంజినీర్లు, అధికారులు భేటీ కానున్నారు.

Link to comment
Share on other sites

అర్ధరాత్రి కల్లా అరుదైన రికార్డు ఏపీ ప్రభుత్వ సొంతం!
06-01-2019 20:37:29
 
636824039564280727.jpg
పోలవరం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించబోతోంది. పోలవరం ప్రాజెక్టులో ఏకధాటిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 6 జోన్లలో 300 బ్లాకుల్లో కాంక్రీట్ నింపే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 3600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికే 11 గంటల్లో 15,107 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. 24గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి కల్లా దుబాయ్‌ రికార్డ్‌ను దాటే అవకాశం ఉంది. దుబాయ్‌ దేశం ఓ టవర్ నిర్మాణంలో భాగంగా 36 గంటల్లో 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి రికార్డ్‌ సాధించింది.
Link to comment
Share on other sites

పోలవరం ‘గిన్నిస్‌’ పనులు ప్రారంభం

06012019brk-polavaram1a.jpg

పోలవరం: బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన పనులు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో దీన్ని నమోదు చేసేందుకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిథి విశ్వనాథ్‌ ఆదివారం పనులను పరిశీలించారు. ఇప్పటి వరకూ దుబాయ్‌లో నమోదైన రికార్డును అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు పనులలో భాగంగా 24 గంటల్లో 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ ఎండీ బి.శ్రీధర్‌ చెప్పారు. గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు 24 మంది ఈ కాంక్రీట్ పనులను పర్యవేక్షిస్తున్నారు.

దుబాయ్‌లో ఒక టవర్‌ నిర్మాణానికి 2017 మే లో 36 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల(ఘ.మీ.) కాంక్రీట్‌ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30 వేల ఘ.మీ. కాంక్రీట్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూణ్నెల్ల కిందట 24 గంటల్లో 11,158 ఘ.మీ. కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11,289 ఘ.మీ. కాంక్రీట్‌ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల ఘ.మీ. కాంక్రీటు వేసేందుకు గుత్తేదారు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి 15 నిమిషాలకోసారి గణాంకాలు గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు నమోదు చేసుకుంటున్నారు. రేపు ఉదయం పనులను సీఎం చంద్రబాబు పరిశీలంచనున్నారు.

06012019brk-polavaram1b.jpg

 

Link to comment
Share on other sites

16 hours ago, sskmaestro said:

18 lakh cube Meters concrete is required for completion of Polavaram project....

 

so far entha completed? (Excluding the proposed 28k-30k in a day) 

as per Navayuga MD on 06 Jan Midnight, inka 10 lakhs pending - only in spill channel

still lot of excavation is pending which will be done by Mar. Looks like Thriveni (most of excavation works are by Thriveni) has some siisues

Link to comment
Share on other sites

8-9 am          1st hour            1275     cum

9-10 am        2nd hour           1340     cum

10-11 am      3rd hour            1380     cum

11-12 am      4th hour            1420     cum

12-1 pm        5th hour            1382     cum

1-2 pm          6th hour            1397     cum

2-3 pm          7th hour            1417     cum

3-4 pm          8th hour            1385     cum

4-5 pm          9th hour            1300     cum

5-6 pm          10th hour          1396     cum

6-7 pm          11th hour          1415     cum

7-8 pm          12th hour          1477     cum

8-9 pm          13th hour          1345     cum

9-10 pm        14th hour          1350     cum

10-11pm       15th hour          1480     cum

11-12 pm      16th hour          1286     cum

---------------------------------------------------------

                         Total          22045    cum

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...