Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

నా జీవిత లక్ష్యం పోలవరం పూర్తి చేయడం. అందులో నేడు కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టాము. మొదటి స్పిల్ వే గేటు స్థాపనకు పూజ కార్యక్రమం పూర్తి చేసి ప్రారంభించాము.

పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతంగా తయారవుతుంది. కాంక్రీటు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. వచ్చే నెల 7వ తేదీన 28 వేలకు పైగా క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని సంకల్పించాము.

https://pbs.twimg.com/media/DvLbjW6WoAAlUdR.jpg:large

https://pbs.twimg.com/media/DvLcENeWoAEeHD0.jpg

Link to comment
Share on other sites

జనవరిలో పోలవరంపై టీఏసీ భేటీ? 

 

డీపీఆర్‌-2 ఆమోదం.. నిధులే కీలకం 
  రాబోయే 5 నెలలూ అసలైన సవాల్‌ 
  సమాంతరంగా పనులన్నీ పూర్తిచేసేందుకు ప్రణాళిక

25ap-main9a_1.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో రూ.57,900 కోట్ల అంచనా వ్యయంతో సమర్పించిన రెండో డీపీఆర్‌పై చర్చించేందుకు జనవరి రెండు లేదా మూడో వారంలో సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశం నిర్వహించే వీలుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దిల్లీలో కేంద్ర జలసంఘం వద్ద దీనిపై చర్చలు జరిగాయి. అనేక అనుమానాలు, అభ్యంతరాలకు జలవనరులశాఖ సమాధానాలు పంపింది. ప్రధాన డ్యాం, కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన అన్ని అంశాలపైనా పరిశీలన కొలిక్కి వచ్చిందని సమాచారం. పునరావాసం అంచనాల పైనా సమాధానాల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం పోలవరం విద్యుత్కేంద్రం అంచనా వ్యయాల పెంపుపై కేంద్ర జలసంఘం పరిశీలన జరుపుతున్న విషయం తెలిసిందే. రెండు అంశాలపై వారి అనుమానాలకు ఈ వారంలోనే సమాధానాలు పంపనున్నారని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ముఖ్యమంత్రికి తెలియజేశారు. జల విద్యుత్కేంద్రం పనులు రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో చేపట్టేందుకు సిద్ధమైనా డీపీఆర్‌-1లో ఆ అంచనాలూ కలిసి ఉన్నందున ఇప్పుడు వాటిపైనా కేంద్ర జలసంఘం పరిశీలన జరుపుతోంది. ఇదంతా పూర్తయ్యాక కేంద్ర జలసంఘం నివేదిక సిద్ధం చేసి కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి సమర్పించనుంది. అనంతరం జనవరిలో టీఏసీ సమావేశం జరగవచ్చని జలవనరులశాఖ అధికారులు చెప్పారు.

నిధులే కీలకం 
పోలవరం ప్రాజెక్టుకు రాబోయే 5 నెలలూ ఎంతో కీలకం. మే నెలాఖరుకల్లా కాఫర్‌ డ్యాంలు, స్పిల్‌వే, గేట్లు, అనుసంధాన పనులు, ఆ మేరకు గ్రామాల పునరావాసం కల్పించి నీళ్లు ఇవ్వాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అధికారులకు గట్టిగా దిశానిర్దేశం చేశారు. ‘మీకు మీ పని పూర్తిచేస్తే చాలు. నా వరకు నీళ్లెలా ఇవ్వాలా అని అన్ని కోణాల్లోనూ  ఆలోచిస్తున్నాను. పునరావాసమూ పూర్తిచేసి కోర్టు అనుమతి తీసుకోవాలి. దానిపై న్యాయ నిపుణులతో సంప్రదించాను. అందరూ కచ్చితంగా దృష్టిపెట్టి పనులు పూర్తిచేయాలి. జూన్‌కు పనులు అవ్వకపోతే ఒక సీజన్‌ను కోల్పోయినట్లే. లేకుంటే ఇంత తపన ఎందుకు పడతాను’ అని ఆయన ప్రశ్నించారు.

అవసరమయ్యే నిధులపై సీఎం ఆరా 
పోలవరానికి వచ్చే మే నెలలోపు అవసరమయ్యే నిధుల గురించి  ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే దాదాపు రూ.7,500 కోట్లు అవసరమని అంచనాకు వచ్చారు. ప్రస్తుతం 42.5మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టాలంటే చేపట్టవలసిన పునరావాసానికే రూ.2,000 కోట్లకు పైగా కావాలి. మిగిలిన పనులకు రూ.5,500కోట్ల వరకు అవసరమవుతుంది. పాత డీపీఆర్‌ ప్రకారం కేంద్రం నుంచి రూ.431కోట్లే రావాల్సి ఉంది. కొత్త డీపీఆర్‌ ఆమోదం అనంతరం ఆర్థికశాఖ అనుమతి వంటి కీలక ప్రక్రియలున్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రమే ఈ నిధులన్నీ సమకూర్చాల్సి ఉంది. పైగా ఇప్పటికే రూ.3,500 కోట్ల వరకు కేంద్రం నుంచి పోలవరం బకాయిలున్నాయి. వచ్చే మే నెలలోపు పోలవరానికి కేంద్రం రూ.11వేల కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక కేంద్రం ఇచ్చిన నిధులు రూ.6,727 కోట్లు. ఈ ఐదునెలల్లో అంతకుమించి నిధులు అవసరమవుతాయి. ఈలోపు ఆర్థిక సంస్థల నుంచి నిధులు సర్దుబాటు చేయాలని, బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించాలని రాష్ట్రప్రభుత్వం తలపోస్తోంది.

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...