Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
3 minutes ago, Hello26 said:

:HeadBang:

Ya ok enti ippudu,tdp ki 100 kadu kada 1 seat vastadi kuppam adi kuda tough fight,ycp anni districts clean sweep happy now?edanna evaraina positive post veate chalu,adi kadu waste odipotam ala cheyyakapote antaru,evadiki posts kuda veyyavuddi kadu 

Link to comment
Share on other sites

5 minutes ago, Saichandra said:

Ya ok enti ippudu,tdp ki 100 kadu kada 1 seat vastadi kuppam adi kuda tough fight,ycp anni districts clean sweep happy now?edanna evaraina positive post veate chalu,adi kadu waste odipotam ala cheyyakapote antaru,evadiki posts kuda veyyavuddi kadu 

Ala jaragakudadu ane kada badha. We need to win at any cost anedi goal. Anyways, when u have time visit this thread Sai 

 

 

Link to comment
Share on other sites

‘పోలవరం విద్యుత్కేంద్రం పనులపై దృష్టిపెట్టండి’
14-12-2018 03:47:29
 
అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తక్కువ వ్యయంతో విద్యుత్‌ను అందించే పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ పనులపై దృష్టి సారించాలని ఇంధనశాఖ ఉన్నతాధికారులకు మంత్రి కళావెంకట్రావు సూచించారు. గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుదుత్పత్తిలో ఏపీ జెన్కో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అతి పెద్ద విద్యుదుత్పత్తి సంస్థగా రూపాంతరం చెందిందని.. ఈ ఏడాది అక్టోబరు నాటి 6813.025 మెగావాట్లను ఉత్పత్తి చేసిందని చెప్పారు.
Link to comment
Share on other sites

20 minutes ago, ravindras said:

idhe speed taruvata koodaa continue avuthundhaa ?

  eppudo oka roju chesi happy feel avuthaaraa?

sir every monday monitoring untundi konchem reports chudandi. right now perday roughly they are pouring 8000 cubic meters, from jan they are planning 10k.

inka total spill way, spill channel, stilling basin kalipi 18 lac cubic meters veyali, last 2 weeks nundi monitor cheyaledu. so easy ga 1 lac vesina 17 lac undi. may dead line, miss aina june ki complete concrete works avuthayi.

spillway, stillbasin just 4 lacs ne undi, deniki chilled concrete veyali daily 3000 kante ekkuva veyaleru, where as spill channel ki regular concrete chalu just cement road vesinattu vestaru.  march ki easy ga gates and concrete complete avuthayi spillway & stilling basin ki. spill channel ni june ki close chestaru.

Link to comment
Share on other sites

11 hours ago, Saichandra said:

@Dravidictbro 

We need to drop 13K-14K cubic meters of concrete at spillway and spill channel per day. So, almost every day same pace lo work cheyyali project plan prakaram. Of course, the plan is to complete concrete work by March. Excavation work slow ga jaruguthundhi. Dheeni valla concrete work kuda wait cheyyalsi ravacchu spill channel lo

Link to comment
Share on other sites

పోలవరం పనులపై ప్రకృతి కన్నెర్ర!
15-12-2018 03:08:49
 
  •  గిన్నిస్‌ రికార్డు యత్నానికి ‘తుఫాను’ అవరోధం
  •  రేపటి కాంక్రీటు యజ్ఞం వాయిదా
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో పాటు ప్రకృతి కూడా కన్నెర జేస్తోంది. గత అక్టోబరు వరకు వరద ప్రవాహం కారణంగా పనులు చేయలేకపోయారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేస్తూ ‘రికార్డు’ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రయత్నాలకు తుఫాను అడ్డంకిగా నిలిచింది. నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ.. ఈ నెల 16న(ఆదివారం) స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌ కాంక్రీటు పనులు ప్రారంభించి 24 గంటల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాలని నిర్ణయించిం ది. ఈ దిశగా ఇప్పటిదాకా దుబాయ్‌ పేరిట ఉన్న గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టాలని సంకల్పించింది. మర్నాడు అంటే 17న ప్రాజెక్టు రేడియల్‌ గేట్ల బిగింపునకు ముహూర్తం కూడా నిర్ణయమైంది. కాంక్రీటు పనుల్లో రికార్డు సృష్టించనున్నందున ఈ రెండు కార్యక్రమాలకు ముక్తాయింపుగా ప్రాజెక్టు ప్రాంతంలో 17న బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా పిలవాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. కానీ అందరి ఆశలపై ‘పెథాయ్‌’ తుఫాను నీళ్లు చల్లింది. తుఫాను కారణంగా ఆదివారం చేపట్టాల్సిన కాంక్రీటు పనులు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ పనుల పర్యవేక్షణ కోసం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నమోదు ప్రతినిధులనూ.. కేంద్ర జల వనరుల శాఖ అధికారులనూ.. రాష్ట్ర యంత్రాంగాన్ని నవయుగ సంస్థ అప్రమత్తం చేసింది. వాస్తవ పరిస్థితిని నవయుగ ఎండీ శ్రీధర్‌ శుక్రవారం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వాతావరణం సహకరించనప్పుడు ఏం చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. నెలాఖరులో గానీ, జనవరిలో గానీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ ఏడాది జూన్‌-జూలైలో ఒకసారి అనధికారికంగా రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టేందుకు నవయుగ సిద్ధపడింది. ఆరోజు 11,650 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేశాక.. భారీ వర్షంతో పనులు నిలిచిపోయిన ఘటన సీఎంతో చర్చ సందర్భంగా చర్చకు వచ్చింది.
 
 
Link to comment
Share on other sites

పోలవరం గేటు ఏర్పాటు 24కు వాయిదా
జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు మొదటి గేటు ఏర్పాటు పనులను ఈ నెల 17 నుంచి 24వ తేదీకి వాయిదా వేసినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గిన్నిస్‌ రికార్డు సృష్టించేలా ఈ నెల 16వ తేదీన చేపట్టదలిచిన కాంక్రీటు పనులను జనవరి మొదటి వారానికి మార్చినట్లు వెల్లడించారు.

శనివారం విజయవాడలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. 24 గంటల్లో 28,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నవయుగ నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే దుబయిలో 21,580 క్యూ.మీ. కాంక్రీటు వేసిన రికార్డు ఉందన్నారు. పోలవరం పనులు 62.16 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం రూ.6,727 కోట్లు కేటాయించగా ఇంకా రూ.3,342 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. డీపీఆర్‌-2 ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు మంత్రి  తెలిపారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, వీటిలో పోలవరం వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చేలా పనులు చేస్తున్నట్లు వివరించారు. వైకాపా అధినేత జగన్‌ పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేశారని, మరో వంక తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని మంత్రి ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టుల సమాచారాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పక్క రాష్ట్రాల వారికి అందజేస్తున్నారని దుయ్యబట్టారు.

అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి: తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. పంటలు దెబ్బతినకుండా, ధాన్యం కూడా తడవకుండా రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రాజెక్టులో గేటు బిగింపునకు గడ్డర్‌ ఏర్పాటు
15ap-main9a.jpg
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో గేట్ల బిగింపులో భాగంగా 43 బ్లాక్‌లో ఒక సమాంతర గడ్డర్‌ను శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. సంబంధిత గేట్ల పనులను  పర్యవేక్షిస్తున్న ఈఈ పి.సుధాకర్‌రావు ఈ మేరకు విలేకరులకు తెలిపారు. ఒక గేటుకు నాలుగు గడ్డర్లను చొప్పున అమర్చాల్సి ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలో 43వ బ్లాక్‌లో గేటు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పూజలు చేస్తారని, అనంతరం సమాంతర గడ్డర్‌కు గేటును బిగించే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం క్లస్టర్‌స్థాయి 25.72 మీటర్ల నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తులో ఈ గడ్డర్‌ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
Link to comment
Share on other sites

పోలవరంపై పీఎంవో కక్ష
16-12-2018 03:19:19
 
636805271577022696.jpg
  • జగన్‌ కుమ్మక్కు ఫలితం ఇది: మంత్రి దేవినేని
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మంత్రి కార్యాలయం కక్ష బూనింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కేంద్రంలోని బీజేసీ సర్కారుతో, పొరుగు రాష్ట్రాలతో కుమ్మక్కయిన ఫలితం ఇది’’ అని జల వనరుల మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు నిధులూ అనుమతులూ రాకుండా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అడ్డుపడుతోందని శనివారమిక్కడ ఆరోపించారు. తుది అంచనాలను ఆమోదించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తుది అంచనాల ఆమోదానికి సాంకేతిక సలహా మండలి (టీఏసీ) సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా వెల్లడించడం లేదన్నారు. పొరుగు రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు హుటాహుటిన టీఏసీ సమావేశాన్ని నిర్వహించి, వెనువెంటనే అనుమతులు మంజూరుచేసిన కేంద్రం, జాతీయ హోదా ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరంపై మాత్రం శీతకన్ను వేసిందన్నారు. ‘‘కేంద్రమే పోలవరానికి సంబంధించిన అన్ని అనుమతులూ మంజూరయ్యేలా చూస్తుందంటూ విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులన్నీ వచ్చినట్లే భావించాలని కూడా విభజన చట్టంలో స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టుకు అనుమతులన్నీ ఇచ్చేస్తే .. నిధులు మంజూరు చేయాల్సి వస్తుందన్న కారణంతోనే , 2013-14 అంచనాలకు కేంద్ర జల సంఘం అడ్డుపుల్లలు వేస్తోంది’’ అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ఎత్తు 41.5 మీటర్లకుగాను భూసేకరణ చేపడుతున్నామని ..ఇందుకోసం నిర్వాసితుల పునరావాసం , పరిహారం చెల్లింపుల కోసం ఇంకా రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి పాత అంచనాల మేరకు చేసిన వ్యయం నుంచి ఇప్పటికీ రూ.3,250 కోట్లు రావాల్సి ఉందన్నారు.
 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతూ, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నలు సంధించడం .. వాటికి కేంద్రం ఇచ్చిన సమాచారం ఆధారంగా పొరుగు రాష్ట్రాలు సుప్రీం కోర్టులోను, రాష్ట్రాల న్యాయస్థానాల్లోను కేసులు వేయడం .. వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు సమాధానాలు చెప్పేందుకు న్యాయస్థానాల చుట్టూ తిరగడంతోనే సమయం హరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోవడమే కాకుండా .. లోట్‌సపాండ్‌లో టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమై పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేలా వైసీపీ నేతలు సమాలోచనలు నెరపుతున్నారని ఆరోపించారు. పోలవరం నిర్మాణం పూర్తయితే, వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులుండవన్నారు. అందుకోసమే .. ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా అడుగడుగునా జగన్‌ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
 
 
‘కాంక్రీటు’ రికార్డు వాయిదా
తుఫాను కారణంగా పోలవరంలో ముందుగా తలపెట్టిన రికార్డుస్థాయి కాంక్రీటు పనులను, రేడియల్‌ గేట్ల బిగింపును వాయిదా వేసినట్లు మంత్రి వెల్లడించారు. తుఫాను కారణంగా గేట్ల బిగింపును ఈ నెల 24వ తేదీకి, కాంక్రీట్‌ పనులను జనవరి మొదటివారానికి వాయిదా వేశాం’’ అని చెప్పారు.
Link to comment
Share on other sites

చైనా త్రీగోర్జెస్‌ రికార్డు అధిగమించి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన పోలవరం..

   
polavaram-16122018.jpg
share.png

దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము... శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము... బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం... సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ ... నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. 23 గంటల్లో 16,368 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. దీంతో చైనా త్రీగోర్జెస్‌ ప్రాజెక్టు రికార్డును నవయుగ సంస్థ అధిగమించింది.

 

polavaram 16122018 2

స్పిల్‌వేలో 4,268 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌లో 12100 మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. శనివారం ఉదయం 8.45 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వాతవరణం అనుకూలించదని, ఈ రికార్డు కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనుకున్నా, ఒక రోజు ముందే రంగంలోకి దిగి, ఈ రికార్డు సృష్టించారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది.

polavaram 16122018 3

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. అయితే ఈ రికార్డు ని జూన్ నెలలోనే పోలవరం అధిగమించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. మళ్ళీ పోయిన నెల 11వేల 289 క్యూబిక్ మీటర్లతో మరో రికార్డు నెలకొల్పింది. అయితే తన రికార్డును తానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు అధిగమించింది. చైనాలోని త్రీగోర్జెస్‌ రికార్డును కూడా అధిగమించారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల అనుకున్న ప్రకారం, వచ్చే జూన్ నెలకు సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...