Jump to content

polavaram


Recommended Posts

తుది దశకు డీపీఆర్‌-2 పరిశీలన 
డిసెంబర్‌ 5 కల్లా  కేంద్ర జలవనరుల శాఖకు 
15 లోపు టీఏసీ సమావేశం 
‘పోలవరం’పై అధికారుల  ఆశాభావం 
ఈనాడు - అమరావతి 
27ap-main15a.jpg

పోలవరం ప్రాజెక్టుపై దాదాపు రూ.57,900 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర జలసంఘానికి సమర్పించిన రెండో డీపీఆర్‌ పరిశీలన తుది దశకు వచ్చింది. ఏడాదిగా అటూఇటూ సాగుతోన్న ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లేనని దిల్లీ వెళ్లిన జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఆశాభావం ప్రకటించారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ 15 నాటికి సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) భేటీకి అవకాశం ఉంది. దిల్లీలో మంగళవారం కేంద్ర జలసంఘం డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజినీరుతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. పోలవరం డీపీఆర్‌పై చర్చించేందుకే ప్రత్యేకంగా కార్యదరి శశిభూషణ్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులు అక్కడకు వెళ్లారు. కేంద్ర జలసంఘంలో సాంకేతిక సలహా కమిటీ ముందు డీపీఆర్‌ ప్రతిపాదన సమర్పించాల్సిన చీఫ్‌ ఇంజినీరు దాస్‌, డైరెక్టర్‌ హల్దార్‌, పచౌరి, నవీన్‌కుమార్‌ తదితరులతో ఈ సమావేశం జరిగింది.

తాజాగా కేంద్ర జలసంఘం లేవనెత్తిన ప్రశ్నలకూ పోలవరం అధికారులు సవివరంగా సమాధానాలు పంపారు. ఇప్పటికే 63వేల పేజీల్లో సమగ్ర వివరణా ఇచ్చారు. తాజాగా కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అభ్యంతరాలూ చర్చకు రాలేదని అధికారులు చెప్పారు. ఎడమ కాలువ, కుడి ప్రధాన కాలువల పనులపైనా చర్చ జరిగింది. వీటికి సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మొత్తం ప్రధాన కాలువకే చూపించారని, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు చెందిన అంచనాలు తక్కువగా ఉన్నాయేమిటని ప్రశ్నించారు. తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల కింద ఇప్పటికే కొన్ని డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయని, పోలవరం కాలువల కింద కొంతమేర ఇవి ఉపయోగపడతాయని అధికారులు బదులిచ్చారు. అలాగే పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి తరలించే 80 టీఎంసీలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీల అవసరం లేదంటూ వివరణ ఇచ్చారు. దీంతో కేంద్ర జలసంఘం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

డిసెంబర్‌ 5 నాటికి కొలిక్కి 
పోలవరం రెండో డీపీఆర్‌ అంశం డిసెంబర్‌ 5 నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం నుంచి సంకేతాలు అందాయి. మొత్తం పరిశీలన పూర్తిచేసి కేంద్ర జలవనరులశాఖకు ఆ తేదీ కల్లా సమర్పిస్తామని మౌఖిక హామీ జలసంఘం నుంచి లభించింది. ఆపై 10 రోజుల్లోనే ప్రాజెక్టు అంచనాల ఆమోదానికి అవసరమైన సాంకేతిక సలహా కమిటీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంచనా కడుతున్నారు. డీపీఆర్‌-2 సాంకేతిక సలహా కమిటీ సమావేశంలో ఆమోదం లభిస్తే కీలక దశకు చేరినట్లే. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర అధికారులు కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సింగ్‌ను కలవగా.. ఆయన సైతం సానుకూలంగానే స్పందించారు.


17న తొలిగేటు ఏర్పాటు: మంత్రి దేవినేని

విజయవాడ, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు సందర్శనను విజ్ఞాన యాత్రగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరంపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారన్నారు. విజయవాడలోని విడిది కార్యాలయంలో మంగళవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కళాశాలల విద్యార్థులు పోలవరం సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ‘ప్రాజెక్టును ఇప్పటివరకు 2.60 లక్షల మంది సందర్శించారు. ఈనెల 26న 11,298 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయడం ద్వారా దేశీయంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో రికార్డు సాధించింది. పనులు 61 శాతం పూర్తవగా, డిసెంబరు 17న తొలిగేటు ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 62 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టగా, వీటిలో 17 ప్రారంభించాం. మరో ఆరు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పంచనదుల సంగమం తమ లక్ష్యమని..దీనికి ఎన్టీఆర్‌ సాగర్‌ అని’ నామకరణం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

జగన్‌ నేరుగా సమాధానం చెప్పాలి 
ఒక నది నుంచి మరో నదికి 260 టీఎంసీల నీటిని మళ్లించిన వైనం దేశంలో ఎక్కడా లేదని, ఏపీలో పట్టిసీమ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. దీనిపై వైకాపా అధినేత జగన్‌ నేరుగా సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కడప జిల్లాకు నీరిచ్చామని, ఇక చిత్తూరు జిల్లాకు కూడా నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఈడీ దాడులను మంత్రి ఖండించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం నిర్వాసితుల కోసం పునరావాస కాలనీ లోపనులు వేగవంతం చేస్తున్నామని డిసెంబర్ 31 లోపు వారికి కేటాయించిన ప్రాంతంలో అన్ని మౌలిక వసతులను సమకూర్చి పునరావాసం కల్పిస్తామని ఐటీడీఏ పీవో, కుక్కునూరు సబ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు.

https://pbs.twimg.com/media/DtKZRHXWkAEDmOS.jpg

https://pbs.twimg.com/media/DtKZSZpWsAAiPRq.jpg

Link to comment
Share on other sites

ఆ బాధ్యత కేంద్రానిదే
30-11-2018 02:18:32
 
636791411143144555.jpg
  • పోలవరంపై ప్రజాభిప్రాయ సేకరణ
  • ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లలోని ప్రభావిత ప్రాంతాల్లో జరపాలి
  • స్వతంత్ర సంస్థతో చేపట్టండి
  • కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • మేమూ అదే కోరుతున్నాం
  • ఒడిసా స్పందించడంలేదు
  • కోర్టుకు ఏపీ, కేంద్రం వివరణ
  • సుప్రీం ఆదేశాలతో మేలు
  • ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌: ఏపీ
 
న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థచేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని విధి విధానాలపై శనివారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తమ రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పోలవరం నిర్మిస్తున్నారంటూ ఒడిసా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పనులను నిలిపివేయాలని కోరింది.
 
 
ఈ పిటిషన్‌పై ఆ బాధ్యత కేంద్రానిదే
గురువారం జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒడిసా తరఫున సీనియర్‌ న్యాయవాది అరుణ్‌ కత్పాలియా వాదనలు వినిపించారు. ‘‘పర్యావరణ పరిస్థితులపై పూర్తిస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రాజెక్టును చేపట్టడం సరికాదు. గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవు. తాజాగా పర్యావరణంపై కూడా అధ్యయనం జరగాలి’’ అని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘స్టాప్‌ వర్క్‌’ ఆర్డర్‌ను నిలిపివేస్తూ, ఎప్పటికప్పుడు పర్యావరణ అనుమతుల గడువు పెంచుకుంటూ వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
 
 
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... ఇప్పుడు ప్రాజెక్టు పనులను నిలిపివేస్తే ఖర్చు ఎంత పెరుగుతుందని ప్రశ్నించింది. ఆ వివరాలు తమ వద్ద లేదని అరుణ్‌ బదులిచ్చారు. అయితే, ముంపు ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని సమాధానమిచ్చారు. ప్రాజెక్టును ఇప్పుడు నిలిపివేస్తే అదనంగా రూ.30 వేల కోట్ల మేరకు ఖర్చు పెరుగుతుందని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ స్పందిస్తూ... ‘‘పోలవరం డిజైన్‌ ప్రకారం గతంలో 36 లక్షల క్యూసెక్కుల బ్యాక్‌ వాటర్‌ ఉండేది. దీనిని 50 లక్షలకు పెంచారు. దీని వల్ల భద్రాచలం ప్రాంతంలో ముంపు పెరుగుతుంది. దీని ప్రాతిపదికన కరకట్టలు ఎంత ఎత్తులో నిర్మించాలన్న అంశాలను పరిశీలించాలి’’ అని కోరారు.
 
పర్యావరణంపై చూపే ప్రభావంపై ఇప్పటికే గోపాలకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మరోసారి అధ్యయనం అక్కర్లేదని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ స్పష్టం చేశారు. ‘‘ప్రజాభిప్రాయ సేకరణను ముంపు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రమే చేపట్టాలి. దీనిపై ఒడిసా సర్కారుకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం.
 
 
అయినా పట్టించుకోలేద’ని వివరించారు. దీనిపై మీ స్పందన ఏమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని ధర్మాసనం ప్రశ్నించగా... ‘ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మేము కూడా ఒడిసాకు సూచించాం’ అని స్పష్టం చేశారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రాజెక్టు పనులు ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ప్రక్రియ వల్ల ఏం ప్రయోజనం అని కేంద్రం తరఫు న్యాయవాది అనగానే... ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరే ప్రజాభిప్రాయ సేకరణ జరిపించగలరా’ కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి కేంద్రం తరఫున న్యాయవాది సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఈ విధివిధానాలను అఫిడవిట్‌ రూపంలో శనివారంలోగా దాఖలు చేయాలని సూచించిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
 
 
అంతా మన మంచికే: ఏపీ
ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో స్వతంత్ర సంస్థచేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ఆదేశాలను ఏపీ సాగునీటి శాఖ వర్గాలు స్వాగతించాయి. ‘‘నిబంధనల ప్రకారం ఒడిసా సర్కారే ఆ పని చేయాలి. దీనికి అవసరమైన నిధులను ఇప్పటికే జమ చేశాం. ఇన్నాళ్లు ఒడిసా సర్కారు దీన్ని పట్టించుకోలేదు. కేంద్రమూ స్పందించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది’’ అని అధికారవర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

కేంద్రం యూటర్న్‌!
02-12-2018 02:09:01
 
636793133387553532.jpg
  • పోలవరంపై పిల్లిమొగ్గ.. 2 రోజుల్లోనే మారిన మాట
  • బయటపడ్డ మోదీ సర్కారు కపటం
  • ప్రాజెక్టుపై వెల్లడైన అయిష్టత
  • సుప్రీంలో ‘ప్రజాభిప్రాయానికి’ ఓకే
  • అఫిడవిట్‌ నాటికి అంతా తూచ్‌
  • అబ్బే.. మేం చేయం అంటూ వాంగ్మూలం
  • ‘జూనియర్‌’కు అవగాహన లేకే ముందు ఓకే అన్నారంటూ వింత వాదన
  • ఒడిసాపై తప్పు మోపే ప్రయత్నం
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్లేటు తిరగేసింది. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణకు సుప్రీంకోర్టులో అంగీకరించిన కేంద్రం... అఫిడవిట్‌ దాకా వచ్చేసరికి మాట మార్చింది. ‘అబ్బే... అప్పుడు మా వాళ్లు అనాలోచితంగా ఆ హామీ ఇచ్చారు. దానిని పట్టించుకోవద్దు’ అని న్యాయస్థానాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పనులు చేస్తున్నారంటూ ఒడిసా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
 
నిబంధనల ప్రకారం ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని... దీనిపై ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీ తెలిపారు. ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కూడా ఇదే విషయం చెప్పారు. ‘‘ప్రజాభిప్రాయ సేకరణను ముంపు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రమే చేపట్టాలి. దీనిపై ఒడిసా సర్కారుకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రక్రియకు అవసరమయ్యే ఖర్చును కూడా ఆ రాష్ట్ర ఖజానాలో జమ చేశాం. అయినా పట్టించుకోలేదు’’ అని వివరించారు. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని... కేంద్రం కూడా పట్టించుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమే స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న కేంద్ర న్యాయవాది ఖాద్రీ... అందుకు అంగీకరించారు.
 
దీంతో... ప్రజాభిప్రాయ సేకరణ విధి విధానాలు తెలుపుతూ శనివారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్‌ సునామని కెర్కెట్టా శనివారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే... ప్రజాభిపాయ్ర సేకరణపై గురువారం నాటి వైఖరికి పూర్తి భిన్నంగా స్పందించారు. దీంతో కేంద్రానికి సంబంధం లేదనేలా వ్యవహరించారు. ‘ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకకరణ జరుపుతామని మా తరఫు న్యాయవాది చెప్పారు. అయితే... దీనిపై సీనియర్‌ అధికారుల సూచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా... ఒక జూనియర్‌ లెవెల్‌ అధికారితో మాట్లాడి కోర్టుకు అనాలోచితంగా హామీ ఇచ్చారు. అందువల్ల ఇది అనుకోకుండా చెప్పిన మాటగా భావించి మన్నించండి’’ అని కోరారు. అంటే, కీలకమైన ఈ ప్రక్రియపై కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట!
 
ఇది మరో షాక్‌...: ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న సుప్రీం ఆదేశాలను ఏపీ సాగునీటి శాఖ వర్గాలు స్వాగతించాయి. ‘‘నిబంధనల ప్రకారం ఒడిసా సర్కారే ఆ పని చేయాలి. ఒడిసా దీనిని పట్టించుకోలేదు. కేంద్రమూ స్పందించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది’’ అని గురువారం అధికారవర్గాలు తెలిపాయి. శనివారం సీన్‌ మారిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
 
ఆది నుంచీ ఇంతే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పొరుగు రాష్ట్రాలైన ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ తొలినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును అనుమతించవద్దంటూ, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం 2006లో సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఈ రాష్ట్రానికి ఒడిసా జతకలిసింది. ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఈ రెండు రాష్ట్రాలూ సుప్రీం కోర్టులో వాదిస్తూ వస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సంబంధిత జిల్లా యంత్రాంగంతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని .. ఇందుకయ్యే వ్యయాన్ని తాము భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు లిఖితపూర్వకంగా పలు దఫాలు అంగీకారాన్ని తెలిపింది. అయినా, ఆ రాష్ట్రాలు న్యాయస్థానంలో ఉన్న కేసును బూచిగా చూపిస్తూ ..తాము ప్రజాభిప్రాయ సేకరణను చేయలేమంటూ తప్పించుకుంటూ వచ్చాయి. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ జరగనందున .. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నాయి.
 
2014లో రాష్ట్ర విభజన జరిగాక .. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. దీంతో .. ఈ ప్రాజెక్టును 100 శాతం పూర్తి చేసే బాధ్యత రాష్ట్రం నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పర్యావరణ- అటవీ అనుమతులూ, డిజైన్ల ఆమోదం, సరిహద్దు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, నష్టపరిహారం చెల్లంపు, పునరావాస కార్యక్రమాలు, నిధుల విడుదల వంటి అంశాలన్నీ కేంద్రం భుజస్కందాలపైనే పడ్డాయి. జాతీయ హోదా ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే అన్ని కార్యక్రమాలనూ చేపట్టాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై పడింది. అయినా, ప్రాజెక్టు నిర్మాణంలో అతి ముఖ్యమైన ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టాలన్న అత్యంత మౌలికమైన అంశంపై రెండు రోజుల్లోనే రెండు రకాల మాటలు చెప్పడం, కోర్టు సాక్షిగా పిల్లిమొగ్గలు వేయడం చర్చనీయాంశమైంది.
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. తాజా పరిణామాల వెనుక రాజకీయకక్ష సాధింపు ధోరణ కనిపిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి జీవనాడిలాంటి .. పోలవరం ప్రాజెక్టును ముందుకు కదలకుండా కట్టిపడేసేలా .. ప్రజాభిప్రాయ సేకరణ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడమే దీనికి నిదర్శమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయపరమైన విభేదాలకు తోడు, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బలపడే ఆలోచన కూడా తోడయినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Link to comment
Share on other sites

పోలవరాన్ని అడ్డుకోవాలని కేంద్రం యత్నం: మంత్రి దేవినేని
03-12-2018 13:55:14
 
636794421150443334.jpg
అమరావతి: కేంద్రం కక్ష్య కట్టి పోలవరం అడ్డుకోవాలని చూస్తోందని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పోలవరం విషయంలో కేంద్రం యూటర్న్‌ తీసుకుందని మండిపడ్డారు. కేంద్ర తరుపు న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పిన మాటలను ఎందుకు అఫిడవిట్‌లో మార్చారని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్నారు. మేధావుల ముసుగులో మాజీ అధికారులు టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని మంత్రి దేవినేని నిలదీశారు.
Link to comment
Share on other sites

పోలవరం కీలక ఘట్టం 17న 
తొలి గేటు అమర్చే పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం 
జనవరిలో డ్యామ్‌ పనులు ప్రారంభం: దేవినేని ఉమా 
2ap-state5a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్పిల్‌వే 41వ బ్లాక్‌లో మొదటి గేటును అమర్చే పనులను ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో వ్యాప్‌కోస్‌ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనుల్లో భాగంగా ఇసుకను గట్టి పర్చే ప్రక్రియ కెల్లర్‌ సంస్థ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. జనవరి నుంచి డ్యామ్‌ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, దిగువ కాఫర్‌డ్యామ్‌కు అవసరమైన ఆకృతులు సీడబ్ల్యూసీ నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎటువంటి ముంపు ఉండదని, ఛత్తీస్‌గఢ్‌ 1.5 టీఎంసీలు, ఒడిశా ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం పనులకు సంబంధించి సమగ్ర వివరాలు ప్రతి వారం ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని వెల్లడించారు. అనంతరం తొలి గేటు అమర్చే పనులను 100 అడుగుల పైకి క్రేన్‌లో వెళ్లి మంత్రి పరిశీలించారు.ఆయన వెంట నవయుగ ఎండీ కె.శ్రీధర్‌,  ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్‌, ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

పోలవరం నిర్మాణంపై స్టే ఇవ్వం 
సుప్రీంకోర్టు స్పష్టీకరణ 
ఈనాడు - దిల్లీ 
3ap-main17b.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలంటే తమకు మరికొంత సమాచారం కావాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు కోరడంతో ‘ఇది అంతులేని కథ’లా ఉందే అని వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు తాజా నమూనాకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణం ఆపాలని ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలంటూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన అప్లికేషన్లను సోమవారం జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణలో ఒడిశా, ఛŸత్తీస్‌గఢ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని అంగీకరించిన కేంద్రం ప్రమాణపత్రంలో నిర్వహించలేమని పేర్కొనడంపై జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఆయా రాష్ట్రాలే నిర్వహించుకోవాలని కేంద్రం తరఫు సీనియర్‌ న్యాయవాది ఏకే పాండా కోర్టుకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు లేఖలు రాసినా స్పందించలేదని ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రాలతో మాట్లాడి ఈ అంశంపై కేంద్రం త్వరగా ఏదో ఒకటి తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ తరఫు న్యాయవాది అతుల్‌ ఝా వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిజాయిండర్‌లో కూడా ముంపు ప్రాంతాల వివరాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖకు ఈ విషయంపై లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రాజెక్టు నమూనా మార్చారని ఒడిశా తరఫు సీనియర్‌ న్యాయవాది అరుణ్‌ కత్‌పాలియా పేర్కొన్నారు. 50 మీటర్ల వెడల్పుతో 60 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నమూనా అంశం కాదని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలన్న ఒడిశా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్రం నుంచి సమాచారం కావాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు పునరుద్ఘాటించాయి. ప్రాజెక్టు నిర్మాణంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని, అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని స్టే ఇవ్వాలని రేలా తరఫు సీనియర్‌ న్యాయవాది జయంత్‌ భూషణ్‌, న్యాయవాది శ్రావణ్‌లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణంపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు అడిగిన సమాచారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వారికి ఇవ్వాలి. సమాచారం ఇవ్వలేకపోతే ఎందుకో కారణం చెప్పాలి. ముంపు ప్రాంతాల సమాచారం కూడా వారికి ఇవ్వాలి’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.

3ap-main17a.jpg
Link to comment
Share on other sites

పోలవరం ఆపం!
04-12-2018 02:28:44
 
636794873245587001.jpg
  • ‘స్టాప్‌ వర్క్‌’ ఉత్తర్వును పునరుద్ధరించం
  • అంతులేని కథలా ప్రజాభిప్రాయ సేకరణ
  • కోర్టులో ఒక మాట.. అఫిడవిట్‌లో మరోటా
  • కేంద్రంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం
  • తాము నిర్వహిస్తామన్న ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌
  • పనులు నిలిపివేయాలని వినతి
  • ససేమిరా అన్న సుప్రీం కోర్టు బెంచ్‌
ప్రజాభిప్రాయ సేకరణపై పిల్లి మొగ్గలు వేసిన కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలన్న ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ అభ్యర్థనలను తోసిపుచ్చింది. ఇక తామే ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
 
న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గతంలో ఇచ్చిన ‘స్టాప్‌ వర్క్‌’ ఉత్తర్వుల పునరుద్ధరణకు నిరాకరించింది. ‘స్టాప్‌ వర్క్‌’ ఆదేశాలను పునరుద్ధరించాలని ఒడిసా దాఖలు చేసిన పిటిషన్‌పై ఇలా స్పందించింది. దీనిపైఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. పోలవరంపై అభ్యంతరాలు తెలుపుతూ ఒడిసా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అలాగే... ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలోని ప్రభావిత ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణకు తొలుత అంగీకరించి.. తర్వాత ప్లేటు తిరగేసిన కేంద్రంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహించింది.
 
గురువారం జరిగిన విచారణ సందర్భంగా... ప్రజాభిప్రాయ సేకరణకు తాము సిద్ధమే అని చెప్పి, అఫిడవిట్‌లో మాత్రం మాట ఎందుకు మార్చారని ప్రశ్నించింది. కింది స్థాయి అధికారులు ఇచ్చిన సమాచారంతో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణపై మాట ఇచ్చామని... ఆ తర్వాత ఉన్నతాధికారులు దానిపై స్పష్టత ఇచ్చారని కేంద్రం తరఫు సీనియర్‌ న్యాయవాది ఏకే పాండానివేదించారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణకు మార్గదర్శకాలు కేంద్రం నుంచే తీసుకోవాలని ఏకే పాండా చెప్పడంపై ‘ఇదో అంతులేని కథలా మారిందని’ ధర్మాసనం వాఖ్యానించింది.
 
మేం రెడీ...
తమ రాష్ట్రాల్లో ప్రజాభి ప్రాయసేకరణ జరిపేందుకు తాము సిద్ధమేనని ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. తమకు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా సమాచారం ఇస్తేనే అది వీలుపడుతుందని కోర్టుకు తెలిపాయి. ఏ సమాచారం కావాలో లిఖితపూర్వకంగా కేంద్రాన్ని కోరాలని ఆయా రాష్ట్రాలకు ధర్మాసనం సూచించింది. వారు కోరిన సమాచారం అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అడిగిన సమాచారంలో ఏదైనా ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేదో కారణం కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది.
 
మరోవైపు... పోలవరం ప్రాజెక్టు స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయని, కనీసం బ్యాక్‌ వాటర్‌ అధ్యయనం కూడా జరగలేదని, ఎంత మేర ముంపు ప్రాంతం ఉంటుందో కూడా స్పష్టత లేదని ఒడిసా తరఫున అరుణ్‌ కత్పాలియా ధర్మాసనానికి నివేదించారు. అందుకే స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశాన్ని ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది అతుల్‌ ఝా కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ పునరుద్ధరించడం వీలుపడదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
 
కృష్ణా జలాలపై కేసు పాత బెంచ్‌కే
రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలు మళ్లీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసి వ్యాజ్యంపై విచారణ ధర్మాసనాన్ని సుప్రీం మార్చింది. ఇది జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. అయితే దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్రానికి, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటకకు నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమవ్వగా... మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం గతంలో వ్యాజ్యం దాఖలు చేసిందని, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఈ వ్యాజ్యాన్ని కూడా తెలంగాణ వ్యాజ్యాన్ని విచారించిన బెంచ్‌కే తరలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసి విచారణ వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

48 గంటలు..27 లక్షల క్యూ.మీ.!
06-12-2018 03:04:24
 
636796622650692088.jpg
  • పోలవరంలో మరో కాంక్రీట్‌ రికార్డుకు సన్నాహం
  • రేడియల్‌ గేట్ల బిగింపు తేదీ ఖరారు
  • ముఖ్య అతిథిగా 18న గడ్కరీ రాక?
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): చకచకా పనులు..వరుస రికార్డులు! పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థ నవయుగ మరో సవాల్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. 48 గంటల్లో 27 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి.. ప్రపంచ రికార్డును స్థాపించేందుకు ఉత్సాహంగా కదులుతోంది. నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ ఎండీ శ్రీధర్‌ ఇటీవల విదేశాల్లో పర్యటించి భారీ యంత్ర సామగ్రిని సమీకరించారు. ఈ యంత్రాల సహాయంతో ఈ నెల 17-18 తేదీల్లో 48 గంటల పాటు నిర్వీరామంగా స్పిల్‌వే స్పిల్‌ చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌ల కాంక్రీట్‌ను ఏకంగా 27 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర వేయాలనేది ఆయన ఆలోచన. తన ఆలోచనను ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సీఎం అనుమతించారు. నవయుగ చొరవను అభినందించారు. సరిగ్గా 17వ తేదీనే రేడియల్‌ గేట్ల బిగింపునకు ముహూర్తం ఖారారు చేసినట్టు ఆయనకు సీఎం వివరించారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ రికార్డులు తిరగరాసేలా కాంక్రీట్‌ పనులు చేయాలని నిర్ణయించడం ఆహ్వనించదగ్గ పరిణామమని చెప్పారు. ఇలాగే ముందుకెళితే, పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత సమయానికి పూర్తి కావడం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా .. భారీ స్థాయిలో కాంక్రీట్‌ను వేయాలని, రేడియల్‌ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిన దరిమిలా.. ఆ సమాచారం కేంద్రానికీ ఇవ్వాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని నవయుగ ఎండీ శ్రీధర్‌ ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

చంద్రబాబును కలిసిన నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు
07-12-2018 12:48:39
 
636797838755889578.jpg
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు రికార్డు స్థాయిలో వినియోగం కోసం రూపొందించిన ప్రణాళికను సీఎంకు కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు వివరించారు. కాగా... డిసెంబరు 17- 18 తేదీల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ప్రాజెక్టు స్పిల్ వేలో వినియోగించాలని నిర్ణయించారు. అలాగే అదేరోజు స్పిల్ వే గేట్ల బిగింపును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

దుబాయ్‌ రికార్డు బద్దలు కొడతాం!
08-12-2018 03:48:29
 
  • 24 గంటల్లో 28 వేల క్యూ.మీ. కాంక్రీటు
  • 16న గిన్ని్‌సకు ఎక్కాలని ‘నవయుగ’ లక్ష్యం
  • 17న పోలవరం రేడియల్‌ గేట్ల బిగింపు
  • హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను పరుగులు తీయిస్తున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ.. మరో కీలక లక్ష్యం పెట్టుకుంది. ఈ నెల 16న పనులు ప్రారంభించి 24 గంటల్లో 25 వేల నుంచి 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటిదాకా దుబాయ్‌ పేరిట ఉన్న గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టాలని సంకల్పించింది. 16న స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభించి 24 గంటల్లోనే 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేపడతామని ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశారు. అందుకోసం విదేశాల నుంచి భారీ యంత్ర సామగ్రిని దిగుమతి చేసుకున్నామన్నారు. గతంలో ఒకేరోజు 11,655 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేపట్టామని.. ఇప్పుడు దానిని అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
ఇప్పటిదాకా దుబాయ్‌ పనులే రికార్డు..
ఒకే రోజు అత్యధికంగా 21,850 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేపట్టి దుబాయ్‌ మున్సిపాలిటీ నిరుడు గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. 2017 సెప్టెంబరు 12న అక్కడి జెబెల్‌ అలీలో నివాస సముదాయాల కోసం ఇంత పెద్దఎత్తున కాంక్రీటు పనులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనూ 21,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేశారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో 25-28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేస్తామని నవయుగ సంస్థ చెబుతోంది. కాగా.. 17న పోలవరం రేడియల్‌ గేట్లను అమర్చేందుకు ప్రభుత్వం ముహూ ర్తం ఖరారు చేసింది. దీనికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఒకవైపు రికార్డు స్థాయిలో కాంక్రీటు చేపట్టడం.. గేట్ల బిగింపు మొదలవుతున్న నేపథ్యంలో 17న ప్రాజెక్టు పరిధిలో బహిరంగ సభ నిర్వహించాలనీ జల వనరుల శాఖ భావిస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...