Jump to content

polavaram


Recommended Posts

జల దీక్షకు జయం!
13-09-2018 02:49:26
 
636724037674774622.jpg
  • ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం: సీఎం
  • పట్టిన పట్టు వదలను.. ప్రజలూ సంకల్పం చెప్పుకోవాలి
  • పోలవరం నవ్యాంధ్రకు జీవనాడి..
  • పూర్తి చేయడం నా అదృష్టం.. గ్యాలరీ వాక్‌తో జన్మ చరితార్థం
  • 12 ప్రాజెక్టులు త్వరలో జాతికి అంకితం..
  • రేపటి నుంచి ‘జలసిరి’కి హారతి కార్యక్రమం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన..
  • అట్టహాసంగా పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ వాక్‌
నాది జల దీక్ష 
అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష..ఇలా అనేక రకాల దీక్షలు చేపడతారు. నేను రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు జలదీక్ష చేపట్టాను. -చంద్రబాబు 
 
ఏలూరు/పోలవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘రాయలసీమకు రత్నాభరణం, ఉత్తరాంధ్రకు ఆశాకిరణం, దక్షిణాంధ్రకు నవ్యా భరణం, రైతన్నకు సుజలాం సుఫలాం! మొత్తం నవ్యాంధ్రకే జీవనాడి పోలవరం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు పూర్తి చేసే అదృష్టం లభించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ‘‘పోలవరం 70 సంవత్సరాల కల! ఇది కలగానే ఉండేది. 2015లో ప్రాజెక్టు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే... పురోగతి మీకే తెలుస్తుంది’’ అని చంద్రబాబు తెలిపారు. 2019లో పోలవరం పూర్తి చేసి తీరుతామని... ఇదే తాను ఇస్తున్న హామీ అని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టమైన స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
 
Polavaram-project---Gallery.jpgకుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల మధ్య... పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తాను చేపట్టిన జలదీక్షకు అడ్డంకులు లేకుండా అందరు దేవుళ్ల ఆశీర్వాదం కావాలని ఆకాంక్షించారు. ‘‘శుక్రవారం నుంచి మూడు రోజులు జలసిరికి హారతి చేపడుతున్నాం. గణపతిని పూజించి... ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరుకుందాం. నాగార్జునసాగర్‌, శ్రీశైలం వెళ్తాను. 16న కొండవీటి వాగును ప్రారంభిస్తాం. ఈనెలలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేయబోతున్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. ఓటమి నా జీవితంలో లేనే లేదు. గ్యాలరీలో మొత్తం నడుస్తారా... కొద్దిదూరం వెళ్లి వస్తారా అని ఇంజనీర్లు అడిగారు. సందేహం వద్దు... మొత్తం నడుస్తానని చెప్పాను.
 
Polavaram-project---GalleAF.jpg15 అంతస్తులుకాదు.. 55 అంతస్తులున్నా నడుస్తానని, స్వయంగా పర్యవేక్షిస్తానని బదులిచ్చాను’’ అని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణా పుష్కరాల నాటికి గోదావరి జలాలను కృష్ణాకు తరలించగలిగానని తెలిపారు. ‘‘పోలవరంలో అనేక రికార్డులు సృష్టించాం. ఇంకా సృష్టిస్తాం. కాంట్రాక్టు ఏజెన్సీలు, సిబ్బంది, ఇంజనీర్ల పట్టుదల ఇది’’ అని తెలిపారు. ‘‘అందరూ ఏదో ఒక ఆలయానికి వెళతారు. సోమవారం శివుడి గుడికి, శనివారం వెంకన్న ఆలయానికి వెళుతుంటారు. నేను మాత్రం ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నాను. ఇప్పటికి 74సార్లు వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశా. మరో 26సార్లు చేసి సెంచరీ కొడతా. 27సార్లు ప్రాజెక్టుకు వచ్చి సమీక్షించాను. ఇంకో ఆరుసార్లు వస్తా. 2019నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం’’ అని ప్రకటించారు.
 
ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం 14,600 కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ హోదా ప్రకటించాక 9466 కోట్లు వెచ్చించామని... కేంద్రం నుంచి 2700 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వేశాం. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే ఇప్పుడు పనిచేస్తున్న విదేశీ కంపెనీలన్నీ ఏనాడో వెనక్కి పోయేవి’’ అని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో కాంక్రీట్‌ వర్కు వేగంగా ఉందని, మన దగ్గర 3 వేల క్యూబిక్‌ మీటర్లు కావడంలేదనే విమర్శపై స్పందిస్తూ... ‘‘జాతీయ స్థాయిలో నిర్మాణంలో ఉన్న 16 ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించండి. మీడియా సమక్షంలోనే తేల్చండి. పోలవరం పురోగతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది’’ అని ఒకింత తీవ్ర స్వరంతో అన్నారు.
 
 
అధికారులతో ఆనందంగా ...
పోలవరం గ్యాలరీ వాక్‌, సభలో ప్రసంగం తర్వాత... చంద్రబాబు స్పిల్‌వే కనిపించేలా భువనేశ్వరితో కలిసి ఫొటో దిగారు. వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకుని మరీ ఫొటో తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి అక్కడే భోజనం చేశారు. మంత్రి దేవినేని ఉమ భుజం తట్టి బాగా చేశావంటూ అభినందించారు. ఆయనతో కలసి ఫోటో దిగారు. తర్వాత .. కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావులను అభినందించారు. వారితోనూ సీఎం ఫొటోలు దిగారు.
 
 
నా జన్మ చరితార్థం..
‘‘పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. ఇప్పుడు... స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ను కూడా ప్రారంభించాను. దీంతో నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సహజంగా ప్రాజెక్టుల ప్రతిపాదన నుంచి నిర్మాణం పూర్తయ్యే సరికి తరాలు మారిపోతాయి. కానీ, పోలవరం శంకుస్థాపన నుంచి గ్యాలరీ నిర్మాణం మూడున్నరేళ్లలో పూర్తయింది. మిగిలిన పనులు మరో ఏడు నెలల్లో పూర్తి చేయగలమన్న ధీమా ఉంది. కేంద్రం సహకరించి ఉంటే పోలవరం పనులు మరింత జోరుగా సాగేవి. గతనెలలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మంత్రి దేవినేని ఉమా, సాగునీటి శాఖ అధికారులు ఢిల్లీకి షటిల్‌ సర్వీసు చేసినా డిజైన్లు, సవరించిన అంచనాల ఆమోదంపై నిర్ణయం వెలువడలేదు. కేంద్రం సహకరించకున్నా 2019 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.’’
 
మనవడితో ముసిముసిగా...
గ్యాలరీ వాక్‌ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌తో సరదాగా గడిపారు. వేదికపై తన పక్కనే మనవడిని కూర్చోబెట్టుకున్నారు. దేవాన్ష్‌తో ముచ్చటిస్తూ, అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ కనిపించారు.
 
గ్యాలరీ ఫెంటాస్టిక్‌...
పోలవరం గ్యాలరీ వాక్‌ను చేశాక .. సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి లోకేశ్‌ భార్య బ్రహ్మణి .. గ్యాలరీ, పోలవరం పనులు ‘ఫెంటాస్టిక్‌’ అని అన్నారు.
 
- ‘ఆంధ్రజ్యోతి’తో ముఖ్యమంత్రి చంద్రబాబు
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
చరిత్ర తిరగరాస్తా
పోలవరం పూర్తి చేస్తా
  ఓటమే ఎరుగను
  భాజపా నాయకులు  దిల్లీ వెళ్లి నిధులు తేవాలి
  జగన్‌కు అవగాహనే లేదు
  ముఖ్యమంత్రి స్పష్టీకరణ
  ఘనంగా గ్యాలరీ నడక
  హాజరైన కోడెల, మంత్రులు
  కిలోమీటరు నడిచిన సీఎం
  ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్‌
పోలవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి, ఈనాడు డిజిటల్‌ - ఏలూరు, పోలవరం - న్యూస్‌టుడే
12ap-main1a.jpg


నేను విఫలమైతే అది ప్రతిపక్ష విజయం కాదు. 5 కోట్ల ప్రజల అపజయం. ఓటమి నా జీవితంలోనే లేదు. సాధించి తీరతా. చరిత్రను తిరిగి రాయడానికే పని చేస్తున్నా.



ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అవగాహన లేని వ్యక్తి. దొంగ లెక్కలు రాసి దొరికిపోయి ఎవరు బెదిరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి హయాంలోనే డబ్బుల కోసం జలయజ్ఞంలో అనేక అవకతవకలు చేశారు. టెండర్లు కూడా రద్దు చేశారు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

కొందరు అయ్యప్ప దీక్ష చేస్తారు. మరికొందరు భవానీ దీక్ష చేస్తారు. రాష్ట్రంలో కరవు నివారణకు నేను జల దీక్ష చేస్తున్నా. కొందరు శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. సోమవారం శివాలయానికి వెళ్తారు. అలాగే సోమవారం నేను పోలవరం సందర్శిస్తా.’ 


12ap-main1b.jpg

అత్యంత ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. వేదమంత్రాల సాక్షిగా... స్పీకరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ జన సందోహం నడుమ సరిగ్గా ఉదయం 11.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యాలరీ నడకను ప్రారంభించారు. ఇరుకైన.. గాలి సరిగా రాని గ్యాలరీలో కుటుంబంతోసహా కార్యక్రమంలో పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. వేగంగా కిలోమీటరు నడిచి అందరికంటే ముందు పూర్తి చేశారు. ఆయన నడకను మంత్రులు, అధికారులు అందుకోలేకపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఐదు కోట్ల ప్రజల జలసౌధమైన పోలవరాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, సకాలంలో నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర నిధులతో ఈ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే ఇంకా వేగంగా పనులు జరిగేవని అభిప్రాయపడ్డారు. ‘పవిత్రమైన ఆశయాలు పెట్టుకుని అవి పూర్తి చేస్తే భావితరాలకు పెద్ద ఆస్తి ఇచ్చినట్లవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ ప్రాజెక్టు పనులు కావడం లేదని విమర్శించేవారు దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టులను చూసి వచ్చి మాట్లాడాలి. అవసరమైతే నేనే ఆ ఖర్చు భరిస్తా. భాజపా నాయకులు కంభంపాటి హరిబాబు, మాణిక్యాలరావు గతంలో పట్టిసీమ పనులు చూసి ప్రశంసించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తోంటే ఏం చెప్పాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అలసత్వంవల్లే పోలవరం ఆలస్యమవుతోందంటున్నారు. చేతనైతే దిల్లీ వెళ్లి నిధులు తీసుకురండి. అవనసర మాటలతో ప్రజల ముందు చులకన కావొద్దు. నేను ఇన్నిసార్లు పోలవరం రాకపోయి ఉంటే, ఇన్ని నిధులు ఇచ్చి ఉండకపోతే పోలవరం కల సాకారమయ్యేదా? 2014 తర్వాత పోలవరంపై మొత్తం 9,464 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఇంతవరకూ రూ.6724 కోట్లే ఇచ్చింది. మొత్తం పోలవరంపై 14,600 కోట్లు ఖర్చు చేశాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నేను సమన్వయకర్తనే. మంత్రి దేవినేని, అధికారులు శశిభూషణ్‌, వెంకటేశ్వరరావు, శ్రీధర్‌, రమేష్‌ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో  పోలవరంలో అన్నీ రికార్డులే సృష్టించబోతున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.



సీఎం కృషితోనే పోలవరం కల సాకారం
నిత్య కృషీవలుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువల్లే పోలవరం కల సాకారమవుతోంది. గ్యాలరీలో నడవటమనేది మధురమైన రోజుగా భావిస్తున్నా. 80ఏళ్ల నాటి ఆలోచన, 30 సంవత్సరాల ప్రయత్నాలు, మూడున్నరేళ్లలో జరుగుతున్నాయి.

       - శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌ 
నాలుగు తరాల ప్రాజెక్టు నాలుగేళ్లలో..
12ap-main1c.jpg

ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించాలంటే నాలుగు తరాలు పడుతుంది. కానీ 4 ఏళ్లలోనే నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి అవిశ్రాంత కృషితో కేవలం నాలుగేళ్లలోనే 58శాతం పనులు జరిగాయి. 77 సార్లు వర్చువల్‌ తనిఖీలు, 27 సార్లు స్వయంగా పరిశీలించారు. 68 సంవత్సరాల వయసులోనూ గ్యాలరీలో 1 కిలోమీటరు నడిచారు. 200 మెట్లు దిగి 200 మెట్లు ఎక్కారు. ఆయన వేగం అందుకోలేక మెల్లగా వెళ్లండని అడిగాం.

                    - మంత్రి లోకేష్‌

2019 నాటికి గ్రావిటీతో నీరు
పోలవరం 1941నాటి కల. ఎంతో మంది కలలు కన్నా సాకారంలోకి తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబే. 2019 మే నాటికి గ్రావిటీతో నీరు విడుదల చేస్తాం.

    - మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

80 ఏళ్ల నాటి కల: అయ్యన్న పాత్రుడు
మా చిన్నతనంలో మా తాత పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేవారు. 80 ఏళ్ల క్రితమే దీని గురించి చర్చ జరిగేది. 2019కి పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో చేస్తున్న పనులకు మనమంతా ప్రత్యక్ష సాక్షులం. ఇంత కష్టపడి ప్రాజెక్టు నిర్మిస్తుంటే డయాఫ్రమ్‌ వాల్‌ అంటే తెలియని వాళ్లు దీని గురించి విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టు అంటే ఏంటో తెలియదు. నిర్మాణం అంటే ఏంటో తెలియదు. ఆయనకు (జగన్‌కు) తెలిసిందల్లా జైలుకున్న ఊచలు మాత్రమే.

            - మంత్రి అయ్యన్న పాత్రుడు

మహా సంకల్పం
ప్రాజెక్టు ఒక చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. కృష్ణా డెల్టాకు భద్రత,  రాయలసీమకు భరోసా ఇది. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలనే సదాశయంతో నిర్మాణం జరుగుతోంది. ఇది మహా సంకల్పం.. మహాసమరం.. బృహత్తర యజ్ఞం.

          - మంత్రి కాలువ శ్రీనివాసులు

జగన్‌ కూడా ప్రాజెక్టును సందర్శించాలి
కేంద్రం సహకారం లేకపోయినా బ్రహ్మాండంగా నిర్మాణం  జరుగుతోంది. జగన్‌ పాదయాత్ర ముగించుకుని వచ్చి ప్రాజెక్టును సందర్శిస్తే అవగాహన వస్తుంది. చూడకుండా ఏవేవో విమర్శలు చేయడం సరికాదు.

            - మంత్రి ఆదినారాయణరెడ్డి 

సీఎంను అభినందించాల్సిందే
పోలవరం జాతీయ ప్రాజెక్టు. సీఎం నేతృత్వంలో త్వరితగతిన జరుగుతున్నందున అభినందించాల్సిందే. అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. ఊహించిన దానికి ముందుగా పూర్తిచేసి జాతికి అంకితం చేయడానికి చేస్తున్న కృషి అభినందనీయం.

 - విష్ణుకుమార్‌ రాజు (భాజపా)

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీఎం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట. ఎప్పట్నుంచో కలగా ఉండిపోయిన పోలవరాన్ని సాకారం చేయడంలో సీఎం కృషి అమోఘం.

         - మంత్రి పితాని సత్యనారాయణ

కేంద్రం సహకరించాలి
కేంద్రం సహకరించి ఉంటే ఈ పాటికే 80శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేది. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి చూసైనా కేంద్రం సహకరించాలి.

                   - మంత్రి జవహర్‌

దేశంలోనే వేగంగా...
దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టూ జరగనంత వేగంగా పోలవరం నిర్మాణం జరుగుతోంది. రెండు నెలల క్రితం రికార్డు స్థాయిలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం జరిగింది. ఆ తరువాత గ్యాలరీ మరో మైలురాయి. భవిష్యత్తులో ఇంత పెద్ద గ్యాలరీ ఇంకొకటి నిర్మించే అవకాశం ఇప్పట్లో లేదు.

- జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ 

పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాం
ముఖ్యమంత్రి మార్గదర్శకాలను అనుసరించి పనులు వేగంగా చేస్తున్నాం. ఒకానొక సమయంలో ఆగిపోతున్న స్థాయి నుంచి ఈ రోజు వేడుక నిర్వహించుకునే వరకూ రాయడం ఆనందంగా ఉంది. అక్టోబరు రెండో వారంలో మొదటి గేటు ఏర్పాటు చేస్తాం. 2019 జూన్‌ నాటికి కాఫర్‌డ్యాంను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వేకు మళ్లించి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తాం. ఈ కాలువల ద్వారా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లోని 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

             - ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు 

ఏప్రిల్‌ ఆఖరుకు స్పిల్‌ వే పూర్తి
ఏప్రిల్‌ నెలాఖరుకు స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. గ్రావిటీ ద్వారా నీరందిస్తాం. గ్యాలరీ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి దాదాపు 15 అంతస్తులు దిగి, ఎక్కడం ఆశ్చర్యం కలిగించింది.

         - నవయుగ సంస్థ ఎండీ శ్రీధర్‌ 

సంక్రాంతికి గేట్ల సందడి: దేవినేని ఉమా
దసరా నుంచి గేట్లు ఏర్పాటు చేయడం మొదలవుతుందని, సంక్రాంతికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభ కార్యక్రమం నిర్వహించుకుందామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు.


12ap-main1d.jpg

ఉత్సాహంగా నడిచిన ముఖ్యమంత్రి

సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ వెంట రాగా ముహూర్త సమయం సరిగ్గా బుధవారం ఉదయం 11.20 గంటలకు పోలవరం స్పిల్‌ వే గ్యాలరీలోకి చంద్రబాబు అడుగుపెట్టారు. గ్యాలరీ కేవలం 2 మీటర్ల ఎత్తు... 2.5 మీటర్ల వెడల్పే ఉంటుంది. గాలి సరిగా ఆడదు. వెలుతురు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. పైగా 26 నుంచి 31 వరకూ బ్లాకుల్లో పునాది బాగా లోతు నుంచి కొన్నిచోట్ల -18 మీటర్ల నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. ఈ కారణంగా అక్కడ దాదాపు 14 అంతస్తుల భవనం దిగి మళ్లీ అంతే స్థాయి భవనం ఎక్కే స్థాయిలో మెట్లు ఉంటాయి. అయినా ముఖ్యమంత్రి చాలా హుషారుగా నడుచుకుంటూ వెళ్లారు. ఆయన వెంట ఉన్న మంత్రులు, అధికారులు అదే వేగంతో నడవటానికి ఇబ్బందులు పడ్డారు. సీఎంను అందుకోవడం వారికి కష్టమైంది. పరిస్థితిని గమనించిన జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఒక్క నిమిషం ఆగుదాం సార్‌.. అని అడిగారు. ఏం నడవలేకపోతున్నారా? అని సీఎం ఆయనను ఎదురు ప్రశ్నించారు. మిగిలిన వాళ్లు వెనుకబడ్డారని కార్యదర్శి చెప్పడంతో సీఎం ఆగారు.
* గ్యాలరీలో కిలోమీటరు మేర భువనేశ్వరి, బ్రాహ్మణి సైతం నడిచారు.
* ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్‌ 600 మీటర్లు నడిచారు.
* ఉదయం 11.20కి లోపలికి ప్రవేశించగా దాదాపు 25 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి నడక పూర్తయింది. మధ్యలో అత్యంత లోతైన బ్లాకులోకి మెట్లు మీదుగా దిగి... మళ్లీ అదే స్థాయి ఎత్తుకు ఎక్కి మరీ బయటకు వచ్చారు.
* 48వ బ్లాకువద్ద ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించి లోపలికి ప్రవేశించారు. ఒకటో బ్లాకు నుంచి బయటకు వచ్చారు.
* మంత్రులు అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, ఆనందబాబు, జవహర్‌ కిలోమీటరు నడిచారు.
* ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాయిప్రసాద్‌, చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, నవయుగ ఎండీ శ్రీధర్‌, మరికొందరు ఎమ్మెల్యేలు గ్యాలరీలో నడిచారు. ఆ తర్వాత అందరితో ముఖ్యమంత్రి ఉల్లాసంగా ఫొటోలు దిగారు.
* స్పిల్‌ వే గ్యాలరీ పొడవునా నడుస్తారా? అని శశిభూషణ్‌ అడిగారని, కొంత దూరం నడిచి బయటకు వచ్చేసి మళ్లీ చివర్లో నడవొచ్చని చెప్పారని.. ‘మీకేం అనుమానం అక్కర్లేదు. ఎంత దూరమైనా నడుస్తా... 30 అంతస్తులైనా ఎక్కి దిగుతా... మొత్తం స్వయంగా పర్యవేక్షిస్తా’ అని తాను చెప్పినట్లు సభలో చంద్రబాబు వివరించారు.


Link to comment
Share on other sites

భద్రతకు దారి..
పోలవరం గ్యాలరీలో  ప్రధాన భూమిక 26వ బ్లాకుదే..
అత్యంత లోతులో నిర్మాణం
మూడు బ్లాకుల్లో ఆధునిక  సాంకేతిక పరికరాలు
మూడు చోట్ల లిప్టులు
పోలవరం నుంచి ఈనాడు ప్రతినిధి

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు... రాష్ట్రం యావత్తూ జలసిరులు కురిపించే జలసౌధం.. పనులు వేగంగా జరుగుతుండటంతో ఈ ప్రాజెక్టులో ఒక్కో కీలకఘట్టం పూర్తవుతోంది. డ్యాం భద్రతలో కీలక పాత్ర పోషించే స్పిల్‌ వే గ్యాలరీ వీటిలో అత్యంత కీలకమైంది. దానిని బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించి అందులో కిలోమీటరు నడిచి మొత్తం పరిశీలించారు. ఈ నేపథ్యంలో గ్యాలరీ అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? అనే వివరాలను తెలుసుకుందాం...

12ap-main6a.jpg

స్పిల్‌ వే అంటే...

అన్ని ప్రాజెక్టుల్లో మనకు గేట్లతో కనిపించే కట్టడమే స్పిల్‌ వే. జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత గేట్లు పైకెత్తి స్పిల్‌ వే మీదుగానే నీళ్లు దిగువకు వదులుతారు. ఈ స్పిల్‌ వేలోనే దిగువన మధ్యలో ఒక సొరంగంలా గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీ నిర్మాణం పూర్తయితే సగం స్పిల్‌ వే పూర్తయినట్లేనని చెబుతారు


.గ్యాలరీ ఏం చేస్తుంది?

రెండు మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పున స్పిల్‌ వే పొడవునా ఒక సొరంగంలా ఉండే ప్రాంతమే గ్యాలరీ. జలాశయం నుంచి స్పిల్‌ వేలోకి నీటి ఊట వచ్చినా, బొట్లు బొట్లుగా నీరు పడినా ఇందులోకి చేరుతుంది. ఆ నీటిని బయటకు పంపేందుకు ఇందులో డ్రైనేజీ తరహా ఏర్పాట్లుంటాయి. డ్యాంపై పడే నీటి ఒత్తిడిని ఇంజినీర్లు వెళ్లి తనిఖీ చేసేందుకూ ఇది ఉపయోగపడుతుంది.


1054 మీటర్ల గ్యాలరీ

పోలవరంలో స్పిల్‌ వే మొత్తం పొడవు  1118 మీటర్లు. 52 బ్లాకులు, 48 తలుపులు ఇందులో ఉన్నాయి. స్పిల్‌ వేలో 1054 మీటర్ల పొడవునా గ్యాలరీ ఉంటుంది. స్పిల్‌ వేలో 10 మీటర్ల ఎత్తు వరకూ సాధారణ పునాది ఉంటుంది. అయితే కొన్నిచోట్ల పునాది నిర్మించేందుకు బాగా లోతు వరకూ వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల -18 మీటర్ల లోతుకు వెళ్లి పునాది నిర్మించుకుంటూ రావాల్సి వచ్చింది. దీంతో గ్యాలరీ కొన్ని చోట్ల బాగా దిగువకు వెళ్లింది. అందుకే ముఖ్యమంత్రి గ్యాలరీలో నడిచినప్పుడు చాలా మెట్లు దిగి మళ్లీ పైకి రావాల్సి వచ్చింది.


పగుళ్ల కోసం గొట్టాలు

స్పిల్‌ వే పునాది పనులు చేపట్టినప్పుడే లోపలికి మొత్తం 48 బ్లాకుల్లో మూడు మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 250 పైపులు ఏర్పాటు చేశారు. స్పిల్‌ వే పునాదులు, కాంక్రీటు గోడల్లో చిన్నపాటి చీలికలను పూడ్చివేసేందుకు ఈ పైపులను వినియోగిస్తారు. పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత ఏమైనా చీలికలు ఉంటే గమనించి ఈ పైపుల ద్వారా సిమెంటు, నీరు కలిపి ఒత్తిడితో పంపి ఆ చీలికలు పూడిపోయేలా చేస్తారు. ఇలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా మూడు సార్లు చీలికలను పూడ్చేందుకు ఈ పైపులను వినియోగిస్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు జల వనరులశాఖ అధికారులకు మాత్రమే ఈ గ్యాలరీలోకి ప్రవేశం ఉంటుంది.


కంప్యూటర్లతో పర్యవేక్షణ

డ్యామ్‌ లోపలి భాగంలో జరిగే ప్రతి చర్యనూ కంట్రోల్‌ రూమ్‌లోని కంప్యూటర్ల ద్వారా అనుక్షణం పరిశీలిస్తుంటారు. ఎంత నీటి ప్రవాహం ఉందనేది అక్కడ నమోదవుతుంది. వరదల సమయంలో డ్యామ్‌పై నీటి ఒత్తిడి ఎంత ఉందో ఈ పరికరాల ద్వారా తెలుస్తుంది.


ఒక బ్లాకు వెడల్పు 12.4 మీటర్లు

స్పిల్‌వే మధ్యలో ఉన్న 26వ బ్లాకులో రెండు వైపుల నుంచి డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసేందుకు ఒక సంపు నిర్మించారు. సంపునకు సమీపంలోనే పైనుంచి కిందకు దిగడానికి మెట్ల మార్గం, దానికి ఆనుకునే లిప్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ డిజిటల్‌ పరికరాలుంటాయి. నీటి ఒత్తిడిని అంచనా వేస్తాయి. నీటి సంకోచ వ్యాకోచాల తీవ్రతను గుర్తిస్తాయి. భూకంపాలు వచ్చేటప్పుడు ఆ ప్రభావాన్ని నమోదు చేసే పరికరాలకు చెందిన కేబుళ్లను ఈ బ్లాకు నుంచే ఈ స్పిల్‌ వే పైన ఉండే కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తారు.

Link to comment
Share on other sites

పాత ధరలకే కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంలు
13-09-2018 02:54:52
 
  • నవయుగ అంగీకారం
  • ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి ఈ పనులూ అప్పగింత
  • జల వనరుల శాఖ కీలక నిర్ణయం
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి మరికొన్ని కీలక పనులను రాష్ట్రప్రభుత్వం తప్పించింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం పనులను నవయుగ ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి తప్పించిన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీటుపనులను నవయుగ శరవేగంగా పూర్తి చేస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. దీంతో జలవనరుల శాఖ నవయుగ సంస్థపైనే విశ్వాసం ఉంచింది.
 
ట్రాన్‌స్ట్రాయ్‌ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున కాఫర్‌, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులను సకాలంలో చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఈ పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న నవయుగ ఇన్‌ఫ్రాతో సంప్రదింపులు జరిపింది. పాత ధరలకే ఈ పనులు చేపట్టాలన్న షరతు విధించింది. ఇందుకు నవయుగ సమ్మతించడంతో దానికే పనుల అప్పగింతకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర జలవనరుల శాఖకు ఈ విషయం తెలియజేసి.. మరి కొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనుంది. గోదావరిలో వరద ఉధృతి తగ్గిన వెంటనే అక్టోబరు నుంచి కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించాలని నవయుగను కోరింది.
Link to comment
Share on other sites

45 minutes ago, NatuGadu said:

But still less compared to Sagar...

Lifting kooda vundhaa... Complete details please

Dam fill avvatam anedhi asalu issue ne kaadu. No need to lift water. RMC and LMC will carry water through gravity. We will be able to use more than 320 TMC every year.

Link to comment
Share on other sites

24 minutes ago, Dravidict said:

Dam fill avvatam anedhi asalu issue ne kaadu. No need to lift water. RMC and LMC will carry water through gravity. We will be able to use more than 320 TMC every year.

 

Bro 150 days minimum water to right canal krishna delta = 150 days * 1.5tmc/day = 225 tmc

Left canal 0.75 tmc * 100 days = 75 tmc

 

Idi kaka inko 200 tmc for godavari delta

 

total easy ga 500+ tmc use cheyochu 

 

 

Link to comment
Share on other sites

9 hours ago, swas said:

 

Bro 150 days minimum water to right canal krishna delta = 150 days * 1.5tmc/day = 225 tmc

Left canal 0.75 tmc * 100 days = 75 tmc

 

Idi kaka inko 200 tmc for godavari delta

 

total easy ga 500+ tmc use cheyochu 

 

 

Any chany to push water directly to Sagar canals? Edo rule vundhigaaa.. Sagar Loki vadilitheee food panda gallaki share ivvali

 

Link to comment
Share on other sites

13 minutes ago, NatuGadu said:

Any chany to push water directly to Sagar canals? Edo rule vundhigaaa.. Sagar Loki vadilitheee food panda gallaki share ivvali

 

Most of the Krishna Delta usage will be offset by diverting to alternative, eluru canal I think. That way it will not reach prakasham barrage and would not count towards Krishna usage. NS diversion will replace current Krishna Delta quota. The diversion is planned and pretty cheap. I will be complete by next season. 

Link to comment
Share on other sites

13 hours ago, ravindras said:

polavaram left main canal,right canal complete ayithene saripodhu . distribution canals( pedda kaluva, pilla kaluva, panta bodhe) koodaa tavvaali. 

distribution canals methodology kakunda anathapuram dist uravakonda lo 1 lac acres to dip irrigation to irrigate chesthunnaru. 
so same formula ikkada kooda follow chesthunnaru. most probably dist canals undavu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...