Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
ముందు డిజైన్లకు ఆమోదం!
13-07-2018 03:16:49
 
  • చకచకా కాంక్రీటు పనుల పూర్తి
అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయం పెంపుపై కేంద్రం మళ్లీ కొర్రీలు వేసిన నేపథ్యంలో.. ఇందుకు కారణాలు వివరిస్తూ మరోసారి స్పష్టత ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇదేసమయంలో కీలకమైన ప్రధాన పనుల డిజైన్లకు తొలుత ఆమోదం తెచ్చుకోవాలని నిర్ణయించింది. కాంక్రీటు పనులను నిర్ణీత వ్యవధిలో వడివడిగా పూర్తిచేసి.. 2019 జూన్‌నాటికి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని నిశ్చయించింది. ఇందుకు తగిన కార్యాచరణకు సిద్ధమవుతోంది.
 
కాంక్రీటు పనులు పూర్తయ్యేందుకు తాను సంపూర్ణ సహకారం అందిస్తానని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం విస్పష్ట హామీ ఇచ్చారని జల వనరులశాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ప్రధాన పనులకు సంబంధించి సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్న డిజైన్లను ఆమోదింపజేసుకునేందుకు సోమవారం ఢిల్లీ రావాలని ఆయన సూచించారని, ఢిల్లీ యాత్రపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు సమీక్ష
16-07-2018 22:07:50
 
636673756713658367.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరానికి సంబంధించి పెండింగ్ డిజైన్లను సిద్ధం చేసి, తుది అనుమతుల కోసం ఆగస్టులోగా కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 56.53 శాతం పూర్త చేశామని, కుడి ప్రధాన కాలువ 90 శాతం... ఎడమ ప్రధాన కాలువ 62.15 శాతం పనులు పూర్తి అయ్యాయని చంద్రబాబు వివరించారు. నాగావళి-వంశధార అనుసంధానానికి అవసరమైన 320 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

క్క రోజు భారీ వర్షం పడి పోలవరం పని ఆగిపోతే, తరువాత రోజు నవయుగ ఏమి చేసిందో చూడండి...

Super User
17 July 2018
Hits: 2
 
poalvaram-17072018.jpg
share.png

రేయింబవళ్లు అన్నది చూడక పోలవరం పనులు సాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో తిరిగి సోమవారమే ప్రాజెక్టు పనుల్నిఆరంభించారు. ప్రతికూల పరిస్థితుల్నీ ఎంత మాత్రం లక్ష్య పెట్టడం లేదు. కేవలం కుంభ వర్షం కారణం గానే ఆదివారం తప్పని సరి పరిస్థితుల్లో పనులకు విరామం ఇచ్చారు. ఊహించని విధంగా కొంత మేర వాతావరణం సహకరించడంతో స్పిల్‌ వే పనుల్నీ మొదలెట్టారు. ఒక రోజు పని పోవడాన్ని కంపెనీ, అధికా రులు జీర్ణించుకున్నట్లు లేరు. బహుశా వీరు ఆదివారం రాత్రి నిద్రపోయినట్లు లేరేమో! అన్పిస్తోంది. నిర్దేశించిన సమయానికే ఎలాగైనా సరే పనుల్ని పూర్తి చేసేందుకు నవయుగ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఉందన్నది విస్పష్టం. పగేలే కాదు, రాత్రి వేళా పనుల్ని లైటింగ్‌లో చేసేందుకు మోపును పెట్టారు.

 

poalvaram 17072018 2

అసలే పైన కారు మబ్బులుతో ఆకాశం గర్జిస్తోంది. ఏ మాత్రం జంకు లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు కమిట్‌ మెంట్‌తో ఉన్నారు. సాయంత్రం సమయమే చిమ్మ చీకట్లను ఆ ప్రాంతం అల ముకుంది. చక్కటి లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో చూసేందుకు అదో అనుభూతన్నట్లు పనులు సాగుతు న్నాయి. బహుశా ఇందు కోసమే సిఎం చంద్రబాబు కంపెనీ హెడ్‌ శ్రీధర్‌ పై అపార నమ్మకాన్ని ఉంచారన్పి స్తోంది. రాష్ట్ర సర్కార్‌ నమ్మకాన్ని కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, ఇంజనీరింగ్‌ ఉన్నాతాధికారులు వమ్ము చేయకుంది. తమ లక్ష్యంలో ఓ రోజు అనుకోకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వెనక బడ్డ ఒక రోజు పనిని రికవరీ చేసేందుకు వీరంతా ఎంతో హైరానా పడుతున్నారు. నిజంగా ఇది అభినందనీయమే. మరో మారు శభాష్‌ అన్పించుకునేందుకు వీరంతా తాపత్రయ పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది.

poalvaram 17072018 3

ఏ కొద్ది పాటి వర్షాన్నీ లెక్క చేయడం లేదు. నిజంగా పని రాక్షసులు అనే పదం వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుందన్పి స్తోంది. ఒక రోజు విరామాన్ని తామెంత మాత్రం ఊహించలేదని ఈఎన్‌సి ఎం వెంకటేశ్వరావు ఆంధ్రప్రభ బ్యూరోతో అన్నారు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లుగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ నవయుగ , ఇంజనీరింగ్‌ అధికార యంత్రాంగం చిత్త శుద్దితో కన్పిస్తోంది. చుట్టూ ఆందోళన కరమైన గోదావరి పరవళ్లనూ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. విరామం లేకుండా సాగుతున్న పోలవరం పనులపై ప్రజానీకం హర్షామోదంతో ఉంది. రాజకీయ అవరోధాలే కాదు, ప్రకృతి ఆటంకాలనూ పోలవరం అధిగమిస్తుండటం అనిర్వచనీయమే అంటున్నారు. పోలవరం సాగుతున్న తీరును చూసి ప్రత్యర్థి వర్గాలు సైతం ఔరా ! అనక తప్పదన్నట్లుంది. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని అన్ని విధాలా అంతా స్వాగతిస్తున్నారు. (ఆంధ్రప్రభ సేకరణ)

Link to comment
Share on other sites

సుదీర్ఘ మేధోమథనం 
పోలవరంపై అంచనాలు ఎందుకు పెరిగాయో పెద్దలను ఒప్పించే యత్నం 
కూలంకషంగా, హేతుబద్ధంగా సమాధానాలు 
కేంద్ర జలసంఘం ఛైర్మన్‌కు సమగ్ర వివరణ, ఉన్నతాధికారులతోనూ మంతనాలు 
కార్యదర్శి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ల వరుస సమావేశాలు 
ఈనాడు - అమరావతి 
19ap-main3a.jpg

పోలవరం ప్రాజెక్టులో రూ.57,900 కోట్లకు అంచనాలు ఎందుకు సవరించాల్సి వచ్చిందో కేంద్ర పెద్దలకు సమగ్రంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించే పనిలో జలవనరుల శాఖ రాష్ట్ర అధికారులు తలమునకలయ్యారు. దిల్లీలో 3 రోజులుగా భేటీల పరంపర కొనసాగిస్తున్నారు. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావులు దిల్లీలో అన్ని కార్యాలయాలూ చుట్టేస్తూ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌తో నాలుగ్గంటలు, అంతకుముందు కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు స్థాయి అధికారి చంద్రకాంత్‌లాల్‌దాస్‌తో మూడు గంటలకు పైగా సమావేశమయ్యారు. వారి అనుమానాలు నివృత్తి చేసేలా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

1. పోలవరం ప్రాజెక్టులో పాత అంచనాల్లో సేకరించాల్సిన భూమి 57,000 ఎకరాలే. ఇపుడది సుమారు 1,09,000 ఎకరాలకు ఎందుకు పెరిగింది? 
అధికారుల సమాధానం: పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక అంశాల్లో గతానికి ఇప్పటికీ మార్పేం లేదు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ, ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం, పోలవరం రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యంలో మార్పు లేకుండా ముంపులో చిక్కుకునే భూమి పెరిగింది. శాస్త్రీయంగా సర్వే చేసి పక్కా లెక్కలు తేల్చడమే దీనికి నేపథ్యమైంది. 
* అప్పట్లో తొలి అంచనాలు అందుబాటులోని సమాచారం మేరకు సిద్ధం చేసినవే. సర్వే ఆఫ్‌ ఇండియా పటాన్ని ప్రాతిపదికగా తీసుకుని అందులోని కాంటూరు గుర్తింపు ఆధారంగా లెక్కలు తీశారు. రెవెన్యూ పటంలో సమగ్ర వివరాలు లేవు. అందులో వాగులు, వంకలు ఉన్నాయి. అంతేతప్ప నదీ గర్భం, గోదావరి హద్దులు సరిగా గుర్తించలేదు. కొన్ని గ్రామాలు, కొంత భూమి గోదావరి హద్దులో ఉన్నా.. నాటి పటాల ఆధారంగా సవ్యంగా లెక్కల్లోకి రాలేదు. అందుకే తాజా మార్పులు తప్పలేదు. 
* 2007 నుంచి 2009 వరకు సమగ్ర సర్వే చేశాం. పోలవరం పూర్తి జలాశయం స్థాయికి ఎక్కడెక్కడ ఏమేరకు ముంపులో చిక్కుకుంటుందో రాళ్లు పాతాం. క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పక్కా లెక్కలు తీశాం. ఇందుకు రెండున్నరేళ్లు పట్టింది. దాని ఆధారంగా ఎంత భూమి సేకరించాలో లెక్కించాం. ఇప్పటికే 74,000 ఎకరాల సేకరణా పూర్తిచేశాం. మిగిలిన భూసేకరణకు సర్వే నెంబరు ఆధారంగా గణాంకాలూ సమర్పించాం.

2. పునరావాసం కింద ఎందుకింత మొత్తం పెరిగింది, ఆవాసాలు- తరలించే కుటుంబాలు ఇంతగా పెరిగాయెందుకు? 
2005కు ముందు అసలు ముంపు ఎంతవరకు ఉంటుందో క్షేత్రస్థాయి లెక్కలతో తేల్చింది కాదు. 2005కు ముందున్న లెక్కలు ఉజ్జాయింపుగా అప్పటికున్న సమాచారంతో వేసినవే.  అందుకు అప్పట్లో అగ్రిఫైనాన్సు కార్పొరేషన్‌, బ్యాంకర్ల వద్ద ఉన్న సమాచారమే ఆధారమైంది. ఇంటింటి సర్వేతో ఇపుడు వాస్తవ సమాచారం వచ్చింది. ప్రస్తుతం పునరావాసం కల్పించే ప్రతి కుటుంబం/సభ్యుడి ఆధార్‌ నెంబరును అనుసంధానించే పరిహారం చెల్లించే ప్రక్రియ, పునరావాస ప్యాకేజీ అమలుచేస్తున్నాం. 2013లో భూసేకరణ చట్టానికి చేసిన మార్పుల వల్ల ప్రతి నిర్వాసితుడికి చెల్లించాల్సిన మొత్తమూ పెరిగింది.

3. కుడి, ఎడమ కాలువల్లో పని పరిమాణం భారీగా పెరగడానికి కారణం..? 
పాత టోపోగ్రాఫికల్‌ సర్వేకు...తాజా పరిస్థితులకు మధ్య మార్పులు- అనేక వాగులు, వంకల ప్రవాహాల ఆధారంగా కట్టడాల నిర్మాణంలో వచ్చిన మార్పులతోనే పని పరిమాణం పెరిగింది. 
దిల్లీ అధికారుల్లో ఇక్కడ మనం ఉపయోగించే భూముల పేర్లపై అవగాహన లేదు. డి.ఫాం భూములు, పట్టా, రెవెన్యూ, అస్సైన్డ్‌ భూములు...ఇలాంటి పదాలపైనా వారు ప్రశ్నలు వేయగా ఉత్తరాదితో పోల్చి వారికి అర్థమయ్యేలా వివరించి అధికారులు చెప్పారు.

కొత్త నమూనాల్లోకి సవరించిన అంచనాలు 
పోలవరం తాజా అంచనాలపై కేంద్ర జలసంఘం అధికారులు కొన్ని కొత్త ఫార్మాట్లు(నమూనాలు) ఇచ్చి ఆ ప్రకారం వివరాలు  కోరారు. ఇప్పటికే దిల్లీలో విడిది చేసిన సుమారు 12మంది పోలవరం ఇంజినీర్లు, అధికారులు ఇదే పనిలో ఉన్నారు. పని పరిమాణం పరంగా పాత-కొత్త అంచనాల మధ్య తేడా ఏమిటి? ధరల్లో మార్పుల వల్ల పెరిగిందేమిటి?..అన్న మరో నమూనా అడిగారు. అలాగే 2014కు ముందు.. తర్వాత ఎంత పని జరిగింది? ఎప్పుడు జరిగిన పనికి ఎంత మొత్తం పెరిగింది.. తదితర అంశాలన్నీ ఈ నమూనాల్లో పొందుపరచాలి. ఇప్పుడు ఆ వర్గీకరణ ఆధారంగా సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.

దిల్లీలోనే ఈఎన్‌సీ పోలవరం బృందం మకాం 
పోలవరం ప్రాజెక్టు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఇంకా దిల్లీలోనే మకాం చేశారు. ఆయనతో పాటు మరో 10 మంది ఇంజినీర్ల బృందమూ ఉంది. కార్యదర్శి శశిభూషణ్‌ వెనుదిరిగారు. తిరిగి సోమ, మంగళవారాల్లో దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు ఈ ప్రక్రియ  పూర్తయ్యేవరకు వీరంతా దిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర జలసంఘం ఈ అంచనాలు ఆమోదిస్తే తర్వాత సాంకేతిక సలహా కమిటీ ఆమోదానికే వెళ్తుంది.

Link to comment
Share on other sites

తక్షణావసరం 7 వేల కోట్లు
23-07-2018 02:30:10
 
636679098091721480.jpg
  • లేదంటే కాఫర్‌డ్యాం కష్టమే!..
  • పోలవరం తుది అంచనాలపై ఆగని కొర్రీలు
  • డిజైన్లకు ఇంకా దక్కని ఆమోదం
  •  కేంద్రంతో రాష్ట్రం నిరంతర చర్చలు
  • నేడు మళ్లీ ఢిల్లీకి శశిభూషణ్‌ బృందం
  • సీఎం సమీక్ష అనంతరం పయనం
  • సమగ్ర నోట్‌పై రేపు జలసంఘంతో భేటీ
 అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ రాజకీయాల్లో కూరుకుపోతోంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో అలవిమాలిన జాప్యం వల్ల 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాలన్న లక్ష్యం నెరవేరడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం తుది అంచనాలు, ప్రధాన పనుల డిజైన్లపై కేంద్రం వేసిన కొర్రీలే పదేపదే వేస్తుండడమే దీనికి కారణం. గత వారం ఢిల్లీలోనే మకాం వేసిన రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుల బృందం.. ఈ నెల 17న కేంద్ర మంత్రి గడ్కరీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ మసూద్‌లతో, ఇతర ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. సందేహాలను చాలావరకు నివృత్తి చేసింది. కానీ, అడిగేవారికి చెప్పేవారు లోకువ అన్నట్లుగా.. ఎగతెగని ప్రశ్నలు వేయడం మినహా.. ఇప్పటిదాకా డిజైన్లను ఆమోదించలేదు. తుది అంచనాలపై నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఈ నెల 18న జరిగిన భేటీలో వారం రోజుల్లో పోలవరం తుది అంచనాలు, హెడ్‌వర్క్స్‌ డిజైన్లపై నిర్ణయం తీసుకోవాలపి సీడబ్ల్యూసీ చైర్మన్‌ను గడ్కరీ ఆదేశించారు. ఇప్పటివరకూ ఆ దిశగా ఒక్క అడుగైనా పడిన దాఖలాల్లేవు. గోదావరి నదిలో వరద తగ్గుముఖం పడిన వెంటనే అక్టోబరు నుంచి కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, గేట్ల బిగింపు కార్యక్రమాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. నిర్వాసితులకు న్యాయం చేయకుండా.. ఈ పనులు సాగవు. ఇవి సాగకుంటే 2019 ఖరీ్‌ఫలో గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడం కష్టమవుతుందని జల వనరుల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
 
41.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యాం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాంలను నిర్మించాలంటే.. కేంద్రం రూ.10 వేల కోట్లయినా ఇవ్వాల్సి ఉంటుంది. తక్షణం ఎంతలేదన్నా రూ.7వేల కోట్లయినా మంజూరు చేస్తే తప్ప వీటి నిర్మాణం కుదరదని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరంపై వర్చువల్‌ సమీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై ఎలాంటి హామీని ఇవ్వకపోవడం.. గడ్కరీ, మసూద్‌, కేంద్ర జల వనరుల ఉన్నతాధికారులు, సీడబ్ల్యూసీ డైరెక్టర్లు లేవనెత్తిన సందేహాల గురించి శశిభూషణ్‌ ఈ సందర్భంగా సీఎంకు వివరిస్తారు. హెడ్‌వర్క్స్‌ కాంక్రీట్‌ పనులు, గేట్ల బిగింపు, ఇతర పనులు శరవేగంగా చేపడుతోంది. కానీ సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టకుండా కాఫర్‌ డ్యాం, రాక్‌ఫిల్‌ డ్యాంలు కట్టేందుకు పూనుకుంటే నిర్వాసితుల నుంచి ప్రతిఘటనలు ఎదురుకావచ్చని జలవనరుల శాఖ ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకురానుంది.
 
రేపు సమగ్ర నోట్‌పై చర్చలు
కాగా.. శశిభూషణ్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మళ్లీ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం పోలవరంపై సమీక్ష నిర్వహించిన అనంతరం వారు బయల్దేరతారు. డిజైన్లకు సంబంధించి సీడబ్ల్యూసీ కోరిన సమగ్ర నోట్‌ను శనివారమే పంపించారు. ఆదివారం సెలవు కావడంతో సీడబ్ల్యూసీ అధికారులు సోమవారం దానిని పరిశీలించే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో ప్రత్యక్షంగా ఈ నోట్‌పై చర్చించేందుకు రావాలని కేంద్రం నుంచి సమాచారం రావడంతో శశిభూషణ్‌ బృందం వెళ్తోంది.
 
 
పూర్తయిన పోలవరం పనులివీ..
  • ఇప్పటిదాకా 56.69 శాతం పనులు పూర్తయ్యాయి.
  •  స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌ పనుల కోసం 851.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. మొత్తం పనుల్లో ఇది 75.30 శాతం.
  • స్పిల్‌ చానల్‌, స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్లు (30.70 శాతం) పూర్తయ్యాయి.
  • రేడియల్‌ గేట్ల పనులు 61.55 శాతం పూర్తయ్యాయి.
  • జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 93 శాతంపూర్తయ్యాయి.
మరో క్రషర్‌ ప్లాంట్‌ ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో మరో క్రొత్త క్రషర్‌ ప్లాంటును ప్రారంభించారు. రోజూ వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేస్తుండడంతో దీనికి అవసరమైన మెటల్‌ తయారీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆరు క్రషర్‌ ప్లాంట్ల ద్వారా మెటల్‌ తయారుచేస్తున్నారు. ఆదివారం మరో కొత్త ప్లాంటును ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆరు ప్లాంట్ల ద్వారా రోజుకు పది వేల టన్నుల మెటల్‌ తయారవుతోందని.. కొత్త ప్లాంటుతో 3,600 టన్నులు సిద్ధమవుతుందని నవయుగ ప్లాంట్‌ ఎక్వి్‌పమెంట్‌ ఇన్‌చార్జి నరేంద్రకుమార్‌ తెలిపారు. మొత్తం ఏడు ప్లాంట్ల ద్వారా రోజుకు 13,600 టన్నుల మెటల్‌ తయారు చేస్తామన్నారు.
 
మళ్లీ మొదలైన స్పిల్‌ చానల్‌ పనులు
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ చానల్‌ కాంక్రీటు పనులు పునఃప్రారంభమయ్యాయి. పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో స్పిల్‌ చానల్‌లో వర్షపు నీరు అధికంగా చేరింది. దాంతో కాంక్రీటు పనులు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గడంతో వడివడిగా ఈ పనులు పూర్తిచేయడంపై కాంట్రాక్టు సంస్థ నవయుగ దృష్టిసారించింది. స్పిల్‌ చానల్‌లో నిలిచిన వర్షపు నీటిని 30 మోటార్ల ద్వారా బయటకు డీవాటరింగ్‌ చేసి ప్లాట్‌ఫాంను సిద్ధం చేశారు. తాజాగా స్పిల్‌ చానల్‌లో కాంక్రీటు పనులు ప్రారంభించి 2,200 క్యూబిక్‌ మీటర్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నవయుగ సీనియర్‌ మేనేజరు క్రాంతి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1,34,200 క్యూబిక్‌ మీటర్లు కాంక్రీటు వేశామన్నారు.
Link to comment
Share on other sites

వరదాయినిగా పోలవరం విద్యుత్‌!
23-07-2018 02:31:49
 
  • 2023 నాటికి అందుబాటులోకి
  • శ్రీశైలం తరహాలో సీలేరు హైడల్‌ ప్రాజెక్టు
  • యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి: సీఎం
 అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం రాష్ర్టానికి వరదాయినిగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2023 నాటికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రూ.5,339 కోట్లతో చేపడుతున్న పోలవరం జల విద్యుత్కేంద్రం అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన విద్యుత్‌శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక పోలవరం జలవిద్యుత్కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని సీఎం చెప్పారు. ప్రస్తుతం 2336 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న జల విద్యుదుత్పత్తి 2022 నాటికి 4,600 మిలియన్‌ యూనిట్లకు చేరనుందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ సామర్థ్యం 18,038 మెగావాట్లు ఉండగా, దీనిలో ఏపీ జెన్‌కో సామర్థ్యం 5 వేల మెగావాట్లు ఉంది. గత మూడేళ్లుగా రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధిస్తోందని, సగటున 10.96ు వృద్ధి నమోదవుతోందని వివరించారు. ఇది జాతీయ వృద్ధి 7.31ు కంటే ఎక్కువన్నారు. 2022 కల్లా రాష్ట్రం.. దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచే మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
 
2029 కల్లా ఉత్తమ రాష్ట్రంగా నిలవాలని, 2050 కల్లా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా మారాలని ఆకాంక్షించారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సుస్థిర విధానంలో పెంచాలని ఇంధనశాఖ మంత్రి కళా వెంకట్రావుకు సూచించారు. ఏపీ జెన్‌కోను దేశంలోనే నెంబర్‌ వన్‌ ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థగా తీర్చిదిద్దాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, జెన్‌కో ఏండీ విజయానంద్‌లను ఆదేశించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రాన్ని నిర్ణీత గడువులోపే పూర్తి చేసిన రికార్డు మనకుందన్నారు. రాష్ర్టానికి కేటాయించిన సింహాద్రి విద్యుత్కేంద్రాన్ని కూడా పూర్తి చేశామన్నారు. 900 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్కేంద్రం రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణకు వెళ్లిపోయినందున అలాంటి ప్రాజెక్టునే సీలేరులో అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...